వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –8
తండ్రీ కొడుకులకు గుడులున్న ”భైరవ కొండ ”
బ్రహ్మకు ఆలయాలు ఉండటమే వింత అయితె ,ఆయన తండ్రి విష్ణువు తో కూడిన ఆలయం వుండటం మరీ వింత .ఆ విచిత్రానికి నిలయమే నెల్లూరు జిల్లా లోని ఉదయగిరికి దగ్గర లో ఉన్న భైరవ కొండ గ్రామం .ఒకే రాతి తో చేసిన ఎనిమిది గుహాలయాల సముదాయం లో శివ లింగాలున్డటం ఇక్కడ మరో విశేషం .ముందు ముఖ మండపం ,తర్వాత గర్భ గుడి ఉంటాయి .ఈ గుహలన్నీ తూర్పు ముఖం గా ఉంటె ,ఒక్కటి మాత్రం ఉత్తర ముఖం గా ఉంటుంది .గుహల ముందు చిన్న సెలయేరు ఉంటుంది .దక్షిణాన వైపు బ్రహ్మ విగ్రహం ,ఉత్తరం వైపు విష్ణు విగ్రహం ఉంటాయి .అంటే బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను అంటే త్రిమూర్తులను ఒక్క చోటే దర్శించే మహద్భాగ్యం కలుగు తుందన్న మాట .
బొట్టు పెట్టు కోని లచ్చి
నెల్లూరు జిల్లా పెంచల కోన గ్రామం లో నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది .స్వామిని ”పెంచలయ్య ”అని భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .ఆ పేరునే పిల్లలకు పెట్టు కొంటారు భక్తిగా .ఆ స్వామికి నిత్య పూజ ఉండదు .ఇదే ఇక్కడి వింత .ఒక్క శని వారమే పూజాదికాలు నిర్వ హిస్తారు .
మూల విరాట్టు అయిన నరసింహ స్వామి రెండు రాళ్ళు పెన వేసుకోన్నట్లు ఉండే శిలా ప్రతిమ .ఆయనకు లచ్చి (లక్ష్మి ),చెంచీత అనే ఇద్దరు భార్యలున్నారని మనకు తెలుసు .చెంచీతను పెండ్లాడాడని లచ్చి కి కోపం వచ్చింది .ఇంకేముంది -అలిగి బొట్టు చెరుపు కోని ,చీకట్లో ఒక మూల కూర్చుందట .అందుకే లచ్చి విగ్రహానికి భక్తులు ఎన్ని సార్లు కుంకుమ అద్ద టానికి ప్రయత్నం చేసినా అతకదట .జారి పోతుందట .తమాషా గా ఉంది కదా !అదీ ఆడ వారి ప్రతిజ్ఞా ,సాధింపూ.
ఒంటి పాదం పై లక్ష్మీ నృసింహులు
అంత పురం జిల్లా లో అనంత పురానికి దగ్గరలో ”పెన్న అహోబిల క్షేత్రం ”ఉంది .సముద్ర మట్టానికి 1360 అడుగుల ఎత్తున శ్రీ లక్ష్మీ నర సింహ ఆలయం ఉంది .అయితె వింత ఏమిటంటే విగ్రహం లేని ఆలయం ఇది .నల్ల రాతి మీద లక్ష్మీ నార సిమ్హుని పాదం ఒక్కటి మాత్రమే కన్పిస్తుంది .హిరణ్య కశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడికి వచ్చి ,ఒంటి పాదం పై నిల బడ్డాడని ఐతిహ్యం .పాదం కింద ఒక బిలం ఉంది .ఎన్ని బిందెల నీరు స్వామి పాదానికి అభిషేకం చేసినా ఆ నీరు ఆ బిలం లోకి జారి పోతుందట .ఆ బిలం ఎప్పుడూ నిండదు .ఇదీ విచిత్రం .కొండ కింద లక్ష్మీ దేవి ఆలయం ఉంది .ఇక్కడా అమ్మ వారి విగ్రహం లేదు .ఒక్క శిల మాత్రమే ఉంది .గుడికి కొద్ది దూరం లో ఒక రాతి మీద వరాహ పాద చిహ్నాలు కన్పిస్తాయి .కనుక స్వామి వరాహాన్ని వేట ఆడాడని భక్తుల విశ్వాసం .
రంగులు మారే కోనేరు
అనంత పురం జిల్లా లోని ”హేమా వతి ”అతి ప్రాచీన చోళ రాజ దాని .ఇక్కడ గొప్ప విశ్వ విద్యాలయం ఉందట .దానికి అనంత శివ దేవుడు అది పతి అని చరిత్ర .ఇక్కడే సిద్దేశ్వర ,మల్లేశ్వర ఆలయాలున్నాయి .ఆలయం లోని కోనేరు లో ని నీరు ఉదయం ఎరుపు రంగులో మధ్యాహ్నం ఆకుపచ్చగా ,సాయంత్రం పసుపు రంగు లోను కన్పించి చిత్రాతి చిత్రం అని పిస్తుంది .ఈ విచిత్రానికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరూ కని పెట్ట లేక పోయారు .
నారాయణ పాద పూజ చేసే సూర్య నారాయణుడు
చిత్తూరు జిల్లా తిరుపతి కి దగ్గరలో ”నాగలా పురం ”లో శ్రీ కృష్ణ దేవ రాయల చే నిర్మింప బడిన ”వేద నారాయణ స్వామి ”ఆలయం ఉంది .సూర్య కిరణాలు వేద నారాయణ స్వామి పాదాలపై పడిన సమయం లోనే ,ఇక్కడి నారాయణ స్వామికి పూజ జరగటం ప్రారంభమవుతుంది అదీ విశేషం .
తాత్కాలిక విరామం —మళ్ళీ ఈ విశేషాలను మరి కొన్ని రోజుల తారు వాత కొన సాగిస్తాను .ఇప్పటకి ఈ దర్శనాలు చాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -04 -12 .
కాంప్ –అమెరికా
వీక్షకులు
- 978,572 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
దుర్గాప్రసాద్ గారూ, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. బాగా రాస్తున్నారు. మీలాంటి వారు నూరేళ్లు కాదు నూటయాభై సంవత్సరాలు జీవించాలని, మరింత వెలుగుల్ని పంచాలని గుండెనిండుగా కోరుకుంటున్నాను. అమ్మో అనుకోకండి. నేను నూట పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా జీవిస్తున్నఆయనని చూసి, మనిషి తలుచుకుంటే మంచి క్రమశిక్షణతో నడుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ నిరూపిస్తున్న పండిత్ సుధాకర చతుర్వేది గారిని చూసిన తరువాత, మానవాళికి ఆయన చేస్తున్న సేవలు ఈనాడు కూడా ఇంకా చూస్తూ వున్న మనిషిగా నేను ఇలా కోరుకోవడం అతి శయోక్తి కాదు. _ శ్రీధర్ కుమార్ కావూరి.