కల్ప వృక్షపు స్త్రీలు –3
సీతా సాధ్వి
రామాయణం అంటే రామ ఆయనమే కాదు ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా గొప్పవి ,ఉత్తమోత్తమ మైనవి అని ఫణి హారం ‘’వల్లభా చార్య ‘’అనే ప్రముఖ విమర్శకుడు ,రచయిత అన్నారు .అందులో ఒకటి విశ్వనాధ అద్భుత జ్ఞాన జ్యోతి –
‘’నిగమ నిగమార్ధముల్ జగము నిండెను ,తన్నిగమాంత వైఖరుల్
నిగమ చయమ్ము కన్నహవళించెను,తన్నిగమాంత చూడమై
తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము ,బ్రహ్మము మౌళి ,సీత ,కేం
జిగురు గోటి రుచి కే రుచిమంత మదెంత చిత్రమో /’’
రెండవ పద్యం అనుభూతి కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ రాసిన ‘’అద్వైత మాన్మదం’’ లోనిది .
‘’ఏ శరదిందు రేఖ స్ప్రుశియిం పగనవ్వినా సన్న జాజి ,ఆ
శా శికతా తలాల ,చిరు సవ్వడి ,దొర్లేడి పాల నూర్వు ,,యే
మూసినకొండ కొన కోన మ్రోగిన వేకువ వెల్గు మువ్వ ,నీ
తో సరి రావుగా ,వికసితోత్పల నేత్ర మైధిలీ ‘’
అలాంటి ముని అయిన రామునితో సీత అను బంధం అద్వైత మాన్మధమే .ఆడి దంపతులే కదా వారిద్దరూ .రామత్వం మూర్తీ భావించిన సీత ను సుందర కాండలో విశ్వనాధ ‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రుతి ‘’అని వర్ణించే పద్యం నభూతో నభవిష్యతి .ఆ దర్శనం ఆత్మా యోగి అయిన విశ్వ నాధకే సాదయం .అంతటి ఆత్మా యోగి ,మనస్స న్యాసి విశ్వనాధ .
అత్రి మహర్షి బార్య అనసూయా దేవి సీత ను కన్నా బిడ్డ లా చూస్తుంది .లంకలో తనను రాముడు అన్న మాటలను ఆమె తో చెబుతుంది సీతా దేవి .ఆమెకు కోపం వచ్చి రామున్ని కోపం తో నిండిన కాళ్ళ తో చూస్తుంది .ముని పత్ని శ్రీ రాముడిని శాపిస్తుందేమో నని సీత అంతలోనే భయ పడి పోతుంది ..మళ్ళీ అందరు పుష్పక విమానం ఎక్కి వెళ్లి పోతున్నప్పుడు అనసూయ చేతి లో’’ రెండు ఫలాలు’’ ఉంచి ఆశ్రమం లోనికి వెళ్లి పోతుంది .సీతకు అభయం –భర్త రాముడు చూప లేని అనురాగం మాత్రు భక్తితో బిడ్డలు తీరుస్తారని అభయం .కవలలు జన్మిస్తారని సూచనా .సుకుమార సన్నీ వేశం .పరమ సూ క్ష్మ మైన శిల్పం .విశ్వనాధ
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

