కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)
సీతా సాధ్వి –
యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. శ్రీ రామునికి ఏమీ కాదు అనే ధైర్యం లోనే ఉంది .ఆమె విశ్వాసానికి రావణుడు ఆశ్చర్య పోతాడు .
‘’అతని యందీమెకు గల ప్రత్యయంబు లోతునకు ,సముద్రములు చాలవు ..ఎత్తు న కు పర్వతములు చాలవు .వేగమున నదులు చాలవు .ఇంత ప్రశ్రయము విస్హ్లాదీకరింప శివుడో క్కడే దయ చూడ వలె ‘’అను కొంటాడు . రాముని క్షేమాన్ని స్వయం గా చూసిన సీత ,లోకం లోని స్త్రీలు సహజం గా ,ఆపద సమయం లో మొక్కే మొక్కులను మొక్కు కుంది నాధుని క్షేమం కోరి .
‘’రాఘవుండు ఆపద దాటినం ,త్రిదశ వంద్యున కాహుతి యౌదు నగ్నికిన్ ‘’.అని తనకు ఆ ఊహ కల్గించిన రావణుని గురువు గా స్వీకరించి ,ఆతనికి నమస్కారం చేస్తాను అంటుంది .దీనికి రావణుని స్పందన కూడా తమాషా గా ఉంటుంది .’’సుదతీ ఇంక నతండు నీకు బతి యంచు గూరు చుంటే ని ,దాన ది యుండెం గద, వాని వంటి పతి చే నగ్ని ప్రవేశం బు తప్పదు ‘’ .ఇద్ద్దరి మాటల్లో ను భవిష్యత్’’ చితి ప్రవేశం’’ కన్పిస్తుంది .ఆయన మాటల ఈటెల కైనా నీకు అగ్ని ప్రవేశం తప్పదు అని రావణుని భావం .ఆమెది మొక్కు .దీన్ని ఇతని మాటలతో తమాషాగా కలిపాడు కవి .
అగ్ని ప్రవేశం చేయ బోతూ సీత నాదునితో ‘’ఇరువురము నొక్క వెలుగున –చెరి సగమును ,దీని నెరుగు శివుడోకరుండే-పురుషుడ వైతివి –నే గరిత ను గా నైతి ‘’అని అంటుంది .అదే ఆమె చెప్పిన చివరి రహస్యం .ఆ రహస్యం విప్పట మే రామాయణ కల్ప వృక్ష శాఖా చంక్రమణం .అదే సాధించి చూపించాడు విశ్వ నాద .రసజ్ఞాతకు ,భావుకత కు ,అలంకార ప్రశస్తి కి ,వివిధ సందర్భోచిత వృత్త ప్రయోగ చాతుర్యానికి ,,భావా విష్కరణకు ,శిల్ప మర్మజ్నత కు ,ఊహా వైభవానికి ,,దివి ,భువుల సంగమానికి ,కల్ప వృక్షం సాక్షీ భూతం .ఎంత చివరికి ఎక్కితే అంత అమృత ఫల సిద్ధి .అక్కడ నుండే ఊర్ధ్వమూలం ,అధశ్శ ఖా తత్వ విచారణ .సీతా రాముల దాంపత్యం అనంతం .వారి ప్రేమా అనంతమే .ఆది దంపతు లైన లక్ష్మీ నారాయణులే వారిద్దరూ .చివరగా విశ్వ నాద మాటలతోనే నమస్కారం –
‘’సీతయు ,రామ చంద్రుడును ,జేతము లందు యుగాలు గల్పము
నాతియు ,బూరుషుండు గ ,ననంతర దంపతి భావ,యాపనా
వ్యాతత ,సంస్కృతి ప్రధము లైన టు లాత్మ దలంచు చుందు ,రా
సీతకు ,రామ చంద్రునకు ,జేతము లంద లి ప్రేమ ఎట్టిదో ?’’
సమాప్తం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-5-12.—కాంప్—అమెరికా .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


మంచి పరంపర. మరింత విపులంగా విస్తృతంగా ఉంటే బాగుంటుందనిపించింది. కల్పవృక్ష రసపానం ఎంతయినా తనివి తీరదుగా.
LikeLike