అమెరికా లో ఆంద్ర తేజం కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  అమెరికా లో ఆంద్ర తేజం     
                                                      కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళు సీతా ,అనసూయ ల గురించి తెలియని ఆంధ్రులుండరు .జాన పద సంగీతాన్ని బంగారు పల్లకి లో దేశ విదేశాల్లో ఊరేగించిన సోదరీ మణులు .దేవుల పల్లి వారి గీతాలను దేశ మంతా పాడి తెలుగు జన హృదయాలను రస ప్లావితం చేసిన వారు .అలాంటి ఇద్దరి లో అనసూయ గారు వివాహం చేసుకొని అవసరాల అనసూయ అయారు .ఆమె పుత్రికా రత్నమే రత్న పాప .రత్న పాప ప్రసిద్ధ కూచి పూడి నృత్య దర్శకులు ,పద్మశ్రీ డాక్టర్ వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు .గురువు గారి వద్ద గొప్ప శిక్షణ పొంది ,ఆయనతో ను ,ఆమె ఇతర కళాకార సహాధ్యాయిను లతో ను ఆంద్ర దేశ మంతా పర్య టించి ,వందలాది ప్రదర్శన లిచ్చి పేరు తెచ్చు కొన్నారు .కుమార్ అనే వారిని వివాహం చేసుకొని ఇప్పుడు ”రత్న కుమార్ ”గా వ్యవహింప బడుతున్నారు .సుమారు25 ఏళ్ళు గా అమెరికా లో టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ నగరం లో ”అంజలి ”అనే నాట్య సంస్థ ను స్తాపించి నృత్య సేవ చేస్తున్నారు .అందులో కూచి పూడి తో బాటు భరత నాట్యం మొదలైన భారతీయ నృత్య రీతులను అన్నిటిని నేర్పు తున్నారు .వందలాది విద్యార్ధులకు ఆమె శిక్షణ నిచ్చి రంగ ప్రవేశం చేయించి ,వారి నాట్యాభి రుచికి దోహదం చేస్తున్న మహా కళా కారిణి రత్న పాప .ఆమె సంస్థ anjali -center for indian performance arts .

2002 లో మేము అమెరికా కు మొదటి సారిగా మా అమ్మాయి వాళ్ళు ఉన్న హోస్ట కు వచ్చాం .అక్కడ మా బంధువు వావిలాల లక్ష్మి గారు ఒక రోజు న మమ్మల్ని రైస్ యూని వేర్సిటి లో ఒక అమ్మాయి కూచి పూడి నేర్చి ,రంగ ప్రవేశం చేసే కార్య క్రమానికి తీసుకు వెళ్లారు .అప్పుడు రత్న పాప గారి దగ్గరకు నేను ,నా శ్రీ మతి వెళ్లి పలకరించాం .చాలా చక్కగా మాట్లాడారు .అక్కడే ఉన్న వారి తల్లి గారు అనసూయ గారిని పరిచయం చేశారు .ఆమె మా చిన్నప్పటి నుండి తెలిసిన ఆవిడే .కృష్ణ శాస్త్రి గారి తో మా పరిచయం గుర్తుకు తెచ్చు కున్నాం .ఆమె మేమెవరో తెలిసి ఆశ్చర్య పోయారు .దేవుల పల్లి వారిని ఆమె ”మామయ్యా ”అనే సంబోధిస్తారు మద్రాస్ లో ఉన్న మా పెద్దక్కయ్య లోపాముద్ర ,బావ క్రుపా నిది గార్లు అనసూయ గారికి బంధువులే . బాగా తెలుసు ,అవన్నీ గుర్తు చేసుకొన్నారు .శాస్త్రి గారి భార్య అంటే ఆమె అత్తయ్య చని పోయిందనీ చెప్పారు .వాళ్ళింటికి రమ్మన్నారు కాని ఎందుకో కుదర లేదు .ఆ తర్వాత మూడేళ్ళ క్రితం వెంపటి చిన సత్యం గారు కూచి పూడి లో జరిపిన సిద్ధేంద్ర ఆరాధనో త్స వాలకు రత్న పాప ఆయన ఆహ్వానం పై అమెరికా నుండి గురువు గారి మీది భక్తీ తో కూచి పూడి వచ్చి రెండు రోజుల కార్య క్రమం లో పాల్గొని వెళ్లారు .నేను ఒక రోజు కార్య క్రమం లో ఆమె ను చూసి హూస్టన్ పరిచయాన్ని జ్ఞాపకం చేశాను .ఆమె ఆనందించింది .ఆ వేదిక మీద lecture cum demonstration చేసింది రత్న పాప .నేను స్పందిస్తూ శ్రీ నాద మహా కవి భీమ ఖండం లో రాసిన పద్యం -వ్యాసునికి కాశి లో విశ్వనాధుడు విశాలాక్షీ కన్పించిన తీరు ను ఒకే పద్యం లో వర్ణించిన దాన్ని”చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి -నీల కుంతల ఫాల ,నీల గలుడు –ధవలాయ తెక్షణ ,ధవలాఖి లాంగుండు మదన సంజీవని మదన హరుడు -నాగేంద్ర నిభ యాన ,నాగ కుండల దారి ,భువన మోహన గాత్ర భువన కర్త ” చది వాను .ఆమె చిన్న పాప లా గా నా దగ్గరకు పరిగెత్తు కొని వచ్చి ”మేష్టారు మాస్టారు ఆ పద్యం చాలా అద్భుతం గా ఉంది .ఇదే నేను మొదటి సారి వినటం .అది నాకు కాగితం మీద రాసివ్వరా నేను నా శిష్యులకు దాన్ని నృత్య రూపం లో పెట్టి నేర్పిస్తాను ”అని కోరింది .ఆనందం గా అంగీక రించి రాసిచ్చాను .ఈమధ్య హూస్టన్ లో జరిగిన ”నాటా ”తెలుగు సభల వారు ప్రచురించిన సావనీర్ లో ఆమె తన గురువు గారిని గుర్తుకు తెచ్చు కుంటూ ,తన నృత్య ప్రస్థానాన్ని గొప్పగా ఆవిష్కరించారు .అందులోని కొన్ని ముఖ్య విషయాలు ,ఆ విదుషీ మణి సాధనను మీకు అండ జేస్తున్నాను .

రత్న పాప తన తల్లి అనసూయ గారి వల్ల కూచి పూడి నాట్య ప్రాభవాన్ని తెలుసు కొన్నారు .అందులో ప్రవేశించే సంకల్పం కలిగి దాన్ని అభయ సించి ప్రపంచానికి కూచి పూడిని పరిచయం చేసే గొప్ప అదృష్టాన్ని పొందింది .అప్పుడే ఆమె కు నట రాజ రామ కృష్ణ ,కోరాడ నరసింహా రావు ,బందా కనక లింగేశ్వర రావు లాంటి మహా ను భావాలతో పరిచయం కలిగింది .ఇదంతా ఆమె మద్రాస్ లో తల్లి గారింట ఉన్నప్పటి సంగతులు .అలానే నరసింహా చారి గారి బంధువు రామాచారి గారి తోను పరిచయం .కూచి పూడి నాట్య గురువులు వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారిని ”తాతయ్య గారూ ”అని పిలిచేది .ఆయనే తనను మూడేళ్ళ వయసు లో ఒడి లో కూర్చో బెట్టుకొని హస్తముద్ర లను నేర్పించారట .ఆయన గానం చేసే ”వసంత స్వర వల్లరి ”ణి ఇప్పటికి మరిచి పోలేనంటారు .అనుభూతి తో పాడి కాళ్ళ వెంట ఆనాడ భాష్పాలు కార్చే వారట .అందరికి అదే అనుభూతి కలిగేది .అప్పటి నుంచే తనకు కూచి పూడి మీద అభి రుచి కలిగిందని చెప్పింది రత్న పాప .

తల్లి అనసూయా దేవి వెంపటి చిన సత్యం గారిని రత్న పాప రంగ ప్రవేశానిని నాట్యాన్ని సమ కూర్చమని కోరారట .అలానే ఆయన ఆనందం గా అంగీకా రించి కోరియాగ్రఫీ చేశారు .ఈ నాటి వరకు ఆ పాటను పూర్తిగా సాహిత్యం తో తాను తప్ప ఇంకెవరూ రంగం మీద నటించ లేదని ఆనందం గా గర్వం గా తెలియ జేశారు .దీనికి తన నాట్య గురువు సత్యం గారికి జీవితాంతం కృతజ్ఞు రాలీని అంటారు వినమ్రం గా .

1961లో హై స్కూల్ చదువు పూర్తీ అయింది .కాలేజి లో చేరటానికి కొన్న్ని నెలల వ్యవధి ఉంది .అందుకని ఈ లోగా నాట్యం నేర్చు కోవాలని కోరిక కలిగింది .తల్లి గారు వెంపటి సిన సత్యం గారి వద్ద చేర్చారు .అప్పటికే సత్యం గారు నాట్య వ్ద్యాలయం స్తాపించి కూచి పూడి నాట్యాన్ని మద్రాస్ నుండి వ్యాప్తి చేస్తున్నారు .ఆంద్ర మహిళా సభ స్తాపించిన దుర్గా బాయ్ దేశముఖ్ ,వగైరాలు సత్యం గారి కౌశలానికి ముగ్దులయారు .లజ్ చర్చ రోడ్ లో నాగేశ్వర రావు పార్క్ దగ్గర వెంపటి వారి విద్యాలయం ఉండేది .ఆంద్ర మహిళా సభ రజతోత్స వాలకు సత్యం గారిని తెలుగు లో ఒక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించ మని అనసూయ గారికి చెప్పారు .అనసూయ గారు వెంటనే భుజంగ రాయ శర్మ గారు రాసిన ”శ్రీ కృష్ణ పారిజాతం ”నృత్య రూపకం ను ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పారు .రత్న పాప సత్యభామ గా ,రమా రమణ రుక్మిణిగా ,కుచల కుమారి కృష్ణుడిగా సుకుమారి నారడుగా పాత్రలతో సత్యం గారి ఆధ్వర్యం లో ప్రదర్శన జరిగి బ్రహ్మాండ మైన విజయం సాధించింది .దానితో రత్న పాప కు కూచి పూడి మీద ఆసక్తి విపరీతం గా పెరిగింది .

సత్యం గారు ఇంటికి వచ్చి నాట్య శిక్షణ నిచ్చే వారు .దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి గొప్ప రచన ”కొలువైతివా రంగ సామి ”కి సత్యం గారు నృత్య రీతులు నేర్పారు ..అ తరువాత ‘విప్రనారాయణ ”నాటకం మొత్తం నేర్పారు అందులో రత్న పాప దేవ దేవి గా ,ఈ నాటి సినీ నటుడు చంద్ర మోహన్ ఆల్వార్ గా ,పద్మ విభూషణ్ డాక్టర్ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మొత్తం అందు లోని పాటలన్నీస్టేజి మీద పాడిన గాయకుడి గా దాన్ని నిర్వహించారు .ఇది రత్న పాప జీవితం లో మరపు రాణి ఘట్టం గా అభి వర్ణించారు .

రత్న పాప సోదరి సీతా రత్న కుమార్ ,మద్రాస్ దూర దర్శన కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ .ఆమె ఈమెకన్న ముందే కూచి పూడి నృత్య అకాడెమి లో చేరింది .తనకంటే ముందే చాలా నృత్యాలు అభ్యసించింది .1967 లో ఆమె తో కలిసి కూచి పూడి రంగ ప్రవేశం చేశారు .1968 లో రత్న పాప కు కూచి పూడి నృత్యానికి సంగీత నాటక అకాడెమి నుండి మొదటి స్కాలర్షిప్పొందింది .దీన్ని పొందిన తోలి విద్యార్ధిరత్న పాపే .ఇదంతా మాస్టరు గారి కృపా కటాక్ష వీక్షణమే అని సంబర పడుతుంది .

మద్రాస్ లో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారింటికి దగ్గర లో చిన్న గది లో ఉన్న ఆకాడేమి తర్వాతా పానగల్ పార్క్ దగ్గర పెద్ద ప్రాంగణం లోకి మారింది .క్రమంగా నేర్చే వారి సంఖ్య కూడా పెరిగింది .మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి .మాస్టర్ సత్యం గారి వద్ద వైజయంతి మాల ,రేఖా ,హి మా మాలిని ,చంద్ర కళా ,చంద్ర మోహన్ ,లక్ష్మీ విశ్వనాధన్ ,రాదా ,జ్యోతి రాఘవన్ ,క్షేమావతి ,రేఖ కజిన్స్ ప్రతిభ సుధా ( వేదాంతం రాఘవయ్య గారి కూతుళ్ళు )మొదలైన హేమా హేమీ లంతా నృత్యం నేర్చారు .సాయంత్రం పూట శిక్షణా తరగతు లు జరిగేవి .అందరికి శ్రద్ధతో విద్య నేర్పే వారు సత్యం గారు .అలసట అంటే ఏమిటో వారికి తెలీదట .కూచి పూడి గ్రామాన్ని గురించి అక్కడ నేర్పే విధానాన్ని గురించి తమతో ముచ్చటించే వారట.కూచి పూడిడి ”విశ్వ వేదిక ”కు పరిచయం చెయ్యాలి అ నేదే సత్యం గారి కల అని రత్న పాప అంటారు .దేశమంతా తన సోదరి తో కలిసి ప్రదర్శన లిచ్చింది రత్న పాప .వెంపటి చిన సత్యం గారి ట్రూప్ లో తానూ మిగిలిన కళా కారినులు కలిసి ట్రైన్ లో వివిధ పట్టణాలకు ,నగరాలకు వెళ్లి ప్రదర్శించిన అనుభవాలు మరచి పోలేనివి అంటుందామె .మజ్జిగ రసం తాగుతూ ,పులిహోర తింటూ గడిపిన రోజులు మధురాలని అన్నది .శోభానాయుడు కృష్ణుడిగా ,పద్మిని రుక్మిణిగా ,తాన సత్య భామ గా శ్రీ కృష్ణ పారిజాతాన్ని సింహాచలం లో ప్రదర్శిస్తు ఉంటె వేదిక ఒరిగి పోయినా దాన్ని అలానే కోన సాగించి అదీ దానిలో భాగమే ననే అనుభూతిని ప్రేక్షకులకు కల్గించిన సంఘటన చిర స్మరణీయం అన్నారు .అంతా అయిన తర్వాత మాస్టర్ గారు నవ్వుతు దాన్ని జ్ఞాపకం చేసుకోవటం భలేగా ఉందట .

చా లా కాలం తర్వాత్ గురువు గారి కల సాకారమైంది .గ్రీన్వే రోడ్డు లో కొత్త అకాడెమి సర్వాంగ సుందరం గా రూపు దాల్చింది .అన్ని సౌకర్యాలలతో అలరారింది .అందరి దృష్టి లో పడి దేశ విదేశీయులు వచ్చి శిక్షణ పొందటం మొదలెట్టారు అందులో మాస్టారు రాజసం గా మహా రాజు లాగా ఠీవి గా కూర్చుని తమ కందరికీ కన్నుల పండువ చేశారని సంబర పడి పోయారు రత్న పాప .అన్ని క్లాసులను సత్యం గారే నిర్వహించే వారట .విద్యార్దు లతో సంస్కృతం ,నాట్యం గురించి అధ్యయనం చేయించే వారట .సంపూర్ణ కళా స్వరూపం గా నృత్యాన్ని ప్రదర్శించాలని మాస్టారు గారి ఆకాంక్ష .ఆయనకు అభినయ దర్పణం ,నాట్య శాస్త్రం కరతలా మలకం .ఆయన లేచి నిలబడి ఒక భంగిమ ను అభినయించి చూపు తుంటే సాక్షాత్తు ఆ శివుడే దిగి వచ్చి ప్రదర్శిస్తున్నాడు అనే భావం తామందరికీ కలిగేదని ఆమె మురిసి పోయారు .అంత నిర్దుష్టం గా ఆయన శిక్షణ ఉండేది .

రత్న పాప ఒక సారి దేవుల పల్లి వారి ”క్షీర సాగర మధనం ”నృత్య రూపకం లో మోహిని గా మాస్టర్ గారు శివుని గా వేశామని అది తాను జీవితాంతం గుర్తుంచు కో దాగిన మహాద్ఘటన అని అన్నారు .ఆహార్యం తో నే సత్యం గారు నట్టువాంగం చేస్తూ అభినయిస్తూ ద్విపాత్రాభినయం చేయటం చిరస్మరణీయం అంటారు .గురువు గారితో కలిసి నటించే మహా భాగ్యం తనకు కల్గి నందుకు ఆమె పొంగి పోతున్నారు .అది ఎవరికీ లభించని మహదవకాశం .

వింజమూరి రత్న పాప అనే రత్నకుమార్ తన నాట్య విద్యా నుభావానికి ,కూచి పూడి నృత్య వ్యాప్తికి భారత ప్రభుత్వం నుండి సంగీత నాటక అకాడెమి అవార్డ్ ను పొందిన ఏకైక N.R.I.-ఇంకేవరికిఅలాంటి పురస్కారం ఇంత వరకు దక్కలేదు .ఆంధ్రులు గా ఇది మనందరికి గర్వ కారణం .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12-7-12.–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.