తిక్కన భారతం –1
సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన .
ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి .కనుక జ్ఞాన యజ్ఞం ద్వారా పరమ పురుషుని పొందటం జ్ఞాని చేయ వలసిన పని .పురుషుడే వేదం కనుక మళ్ళీ వేద ధర్మం ద్వారా కూడా సాధించ వచ్చు అని భావం .”వేద తాత్పర్య మారసి ,వేది తత్వ మెరుగు వారు వేదజ్నులు ”అన్నారు తిక్కన సోమయాజి .తాను ఆ స్తితి పొందాడు కనుక మహా భారతాన్ని అంత ఉదాత్తం గా తీర్చి దిద్దాడు కవి బ్రహ్మ .”self is poorna ,the absolute .Are you apart from poorna ?.if it is so will it be poornaa ? అన్నారు శ్రీ రమణులు .అంతటి ఉత్కృష్ట మైన తాదాత్మ్య స్తితి ని పొందితేనే ,తన కావ్యం ఆ వేద పరమార్ధాన్ని అందివ్వ గలదు అని తలచాడు తిక్క యజ్వ .”only one who can give every thing to the divine enjoys the all pervading divine ”అని శ్రీ అరవిన్డులంటారు .ఆ స్తితి ని సాధించి ,తన రచనకు పరమ మైన విలువను సంత రించి పెట్టాడు తిక్కన .అదొక మానసిక ఆరోహణ .కావ్యం లోనూ ,కావ్య నాయకత్వం లోను మానవ జీవితం లోను-అంతటా కలిసి .మనం సిద్ధం గా ఉంటె ,ఆ పరమాత్మ మనల్ని మారుస్తాడు .ఆ పని నిరంతరం జరిగేదే .మనం ఆ వేదిక ను నిర్మించు కోవాలి .అంతే -the divine is at work to transform you and you must open to iinorder to let it work freely ,in you ” అన్న శ్రీ అరవిందుల వాక్యం యదార్ధమే .అలాగే తన మానసిక స్తితి ని మార్పు చేసుకొన్నారు సోమయాజి .అందుకే ఆంద్ర భారత రచన అంతటి పవిత్ర యజ్ఞం గా భావించి పూర్తీ చేసి ,తాను ధన్యత చెంది ,లోకాన్ని ధన్యత చెందించి ,కావ్యానికి వేదత్వాన్ని కల్పించాడు .అనుక్షణం ఎదగటం ఎలాగో తాను ఆచరించి ”,ఆదర్శ కవి రుషి ”అయాడు ఉభయ కవి మిత్రుడు .ఆ విధానం ఏమిటో పరిశీలించి తెలుసు కొందాం .
భారత కదా సామాన్య మానవుని కధే .తండ్రిని పోగొట్టుకొని ,పిన తండ్రి పోషణ లో ఉన్న బాలుర జీవితమే కదా !దాయాదులు ,ఈరష్యా ,అసూయ ,దురాశాపరులు .వాళ్ళదే మొదట పై చేయిగా కన్పిస్తుంది .అంటే అధర్మం మొదట విజయం సాధించి నట్లు కానీ పిస్తుంది .పై చేయిగా ఉన్నట్లని పిస్తుంది .పాండవుల జీవితం కూడా అంతే కదా .అందుకే భారత కదా -మన జీవితాలకు దగ్గర గా ఉంటుంది .పాండవులకు ద్రౌపది థో వివాహం అయిన తర్వాతా కొంత సాంఘిక ఔన్నత్యం వారికి కలిగింది .బంధుత్వం బలపడి ,తమకు అండగా నిలబడే వారు దొరికారు .శక్తి యుక్తులు ,ధార్మిక జీవితం ,కొంత కాలం వారికి ఉన్నత స్తితి ని కల్పించాయి .ధర్మక్ విజయం ఇంకా ఒక స్తిర రూపం దాల్చ లేదు .దుర్యోధనాదుల అధర్మ ప్రవ్రుత్తి వలన తాత్కాలికం గా ,అధర్మానికి విజయం లభించి నట్లు కానీ పించి ,ధర్మ రాజాడులకు రాజ్య భ్రష్టత కలిగింది .దీనిలో ధర్మ రాజు దోషమూ కొంచే మైనా పాత్ర వహించింది .అదే ద్యూత వ్యసనం .దాని ఫలితమే రాజ్యం పోవటం ,అవమానం ,కష్ట నష్టాలు .మానవ జీవిత పరిణామం కూడా అంతే .ఏదో ఒకటో రెండో లోపాల వల్ల జీవితం అష్ట వ్యస్తమై పోవటం లోక సహజం .కష్టానుభావం వల్ల ఉత్తమ మైన ,సాత్విక ప్రవ్రుత్తి కల వారి లో హృదయ పరి వర్తన కలుగు టుంది .అలాగే అరణ్య ,అజ్ఞాత వాసాను భావం ధర్మజుని చిట్టా శుద్ధి కి మార్గాన్ని చూపించి ,లోక కళ్యాణం కోసం శాంతి ప్రయోగం చేసి విఫలుడైనాడు .క్షాత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయ వలసిన అత్యవసర పరిస్తితి కలిగింది .అయిష్టమైనా తప్పని చర్య.అది .తన పక్షాన ధర్మం ఉన్నా ,అధర్మ పక్షం థో పాటు తన వారూ యుద్ధం లో నశించారు .ఇదే ప్రకృతి స్వభావం .ఒక సంఘర్షణ ఏర్పడితే ,రెండు పక్షాలకు నాశనం తప్పదు .ఇది రాజు అయిన ధర్మ రాజు కు స్వయం గా తెలిసిన విషయం .తరువాత ఇదే వైరాగ్యానికి కారణం కూడా అయింది .
ఇక్కడ మళ్ళీ మనం మానవ జీవితం తో పోల్చు కొనదగిన విషయం ఒకటి ఉంది .ఉత్సాహ వంత మైన యవ్వనం దాటగానే ,కష్ట సుఖానుభావం ద్వారా పరిణామం వచ్చి ,శాంతి కోరటం సహజ లక్షణం .అంతవరకు ఐహికం పైనే కేంద్రీకరించిన దృష్టి ,ఆముష్మికం వై పు కు మరలు తుంది .అలాగే పాండవుల జీవిత చరిత్ర కూడా .భారతం లోని వివిధ ఘట్టాలు ఈ పరిణామ క్రమాన్ని సూచిస్తాయి .నాయకుడైన ధర్మ రాజు మానసిక స్తితి కూడా అలాగే మారింది .ఇతి వృత్తం తో,నాయకుని జీవితం క్రమ పరిణామం పొంది ,మానవ జీవిత చరిత్ర కు సంపూర్ణ మైన వ్యాఖ్య గా మహా భారతం నిలిచి పోయింది .
ఈ పరిణామం ఉన్నతం గా ,ఉదాత్తమం గా తీర్చి దిద్దాలి అంటే కవి లోనూ ఆ పరిణామం క్రమం గా రావాలి .దానిని అనుసరించి రావాలి .యుద్ధ పర్వం వరకు రచించిన రచనా విధానం వేరు ,-అదంతా లౌకిక పరం గా సాగింది .ఆ తర్వాతరచన లో అలౌకిక విధానం ప్రవేశించింది .ధర్మజుని ,జీవితం ఎలా పరిణితి చెంది క్రమంగా అంతర్ముఖ మై ప్రశాంతత పొందిందో ,తిక్కన సోమయాజి రచన కూడా క్రమ క్రమం గా పరిణామం చెందింది .అలోకిక కావ్య లక్షణాలైన ధ్వని ,అలంకారం ,చమత్కారం ,లను వదిలి ,మానసికం గా హాయిని ఇచ్చే అర్ధ పోషణ కే అధిక ప్రాధాన్యత వచ్చింది .ఆ ధ్యేయం గా ,నే రచన సాగి ,ప్రశాంత తేజో మూర్తిగా రచన మార్పు పొందింది .ఉత్కృష్ట పరిణామ స్థితి ని చేరింది .అనుభవసారమైంది .ఆదర్శ ప్రాయమైనది .ఆర్ష పద్ధతికి అద్దం పట్టింది .వేద ,వేదంగ ,ఉపనిషత్ రహస్యాలన్నీ ,జీర్నింప జేసుకొని ,ప్రాచీన సంస్కృతి కి వారసుని గా రూపొందటం చేతనే మహా భారత రచన చేయ గల్గె అర్హత పొందాడు తిక్కన మహా మంత్రి ,సోమయాజులు, కవి బ్రహ్మ ,ఉభయ కవి మిత్రుడు తిక్కన .గురూప దేశమే కాక ప్రత్యక్షాను భావం పొందితేనే ఇది సాధ్యం .విద్యకు అధీతి ,బోధ ,ఆచరణ ,ప్రచారం అనే నాలుగు దశ లు ఉంటాయి .భారత రచన లో తాను పొందిన విద్యకు చక్కని ప్రచారాన్ని సాధించి పెట్టి ధన్యడు ,చరితార్ధుడు అయ్యాడు తిక్కన .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13-7-12.–కాంప్

