సింహ బల శూరుడు బీ ఉల్ఫు

   సింహ బల శూరుడు బీ ఉల్ఫు

బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు .

అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర .

పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి 

,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది .

దీని వ్రాత ప్రతి క్రీ..వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన  తో పాటు ఉంది .

అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన

 మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది 

. పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం 

ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి  రచన బాగా ఉపకరిస్తుందని పునాది

అని సాహిత్యకారులు చెబుతున్నారు .

మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం 

కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు ..

”the poem is a widow on midieval culture an old english document of the first order

and a deeply felt study of man;s fate in an uncertain world ” అని విశ్లేషకుల భావన .

 పద్య కావ్యం లో గతించిన రాజుల ,సాహస వంతుల ,భూతాలు ,దేయ్యాలవిషయాలు ,సంపద ,ద్వంద్వ యుద్ధాలు ,అతీత శక్తులుఒకటేమిటి లేనిది లేదు . నాటి ప్రజల జీవన విధానం ,

ఉంది .అందుకే అది లెజెండ్ గా జనం నోళ్ళ నాని ఉంది .దీన్ని ”ఓల్డ్ డేనిష్ ”కవితగా భావిస్తారు .

క్రీ..నాలుగు లేక అయిదు శతాబ్దపు ఆంగ్లో సాక్సన్ సామ్రాజ్య కద .

దీన్ని పాటల రూపం గా పండుగపబ్బాలలోవేడుకలలో పాడు కొనే వారు .రాజాస్తానాల్లో 

రాజ కుటుంబానికి వినోదం కోసం జాన పదులు పాడి ఆనందం కల్గించే వారు .

ఆంగ్లో సాక్సన్ కు డెన్మార్క్ దేశం స్థానం .పూర్వ రాజుల ,వీరగాదా కావ్యమే బీ ఉల్ఫు కద.

రాజు కోసం ,దేశం కోసం సాహసాలు చేసే వీరుడేబీ ఉల్ఫు . కాలం లో మూడు తెగలు ఉండేవి .

అవి -geats, swedes ,scandinavianలు .వాళ్ళల్లో వాళ్ళ కు పోరాటాలు .

ఆది పత్యపోరాటాలే అవి .స్కాండినేవియన్ కవిత్వం లో seyld scefing అనే డేనిష్ రాజు గురించి కదఉంది .

అతనే scyld రాజ్య స్తాపకుడు .పేరుకు అర్ధం ”రక్షకుడు ”.ఇతని తర్వాతhrothgar రాజు అయ్యాడు .

అతనికి royal mead hall అనే విశాల భవనం ఉంది .అక్కడే రాజుఅది కారులతో వింతలు ,

వినోదాలు చూసే వాడు . భవనం రాజు గారి శక్తికి చిహ్నం .విందులు ,వినోదాలు ,వేడుకలు అన్నీ ఇక్కడే .

 సందడి  హాలుకు కొద్ది దూరం లో ఉన్న grendelఅనే రాక్షసుడికి అసూయ కోపం కలిగించాయి 

అక్కడ విని పించే వీనుల విందుఅయిన harp సంగీతం వీడికి కర్ణ కథోరం గా ఉండేది .

ఒక రోజు రాత్రి హ్రోత్ గార రాజు గారి వీర సైనికులు అంటే నైట్స్ ”హీర్రోట్ ‘అనేహాలులో నిద్ర పోతున్నారు 

గ్రెందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి సమయం లో హతాట్టు గా వచ్చి మీద పడి ముప్ఫై మంది 

యోధులనుఎత్తుకొని పోయి ఎత్తుకు పోతుంటే అలజడి కి అంతా నిద్ర లేచారు 

.మర్నాడు కూడా అలానే అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డాడు యోధుల్నిచంపి తినే వాడు .

రాజు బంధువులు చాలా మంది ఇలా చని పోయారు 

..రాజు మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని సురక్షిత ప్రదేశం చేరుకొన్నాడు .ఈహింస తగ్గించ మని 

pagan దేవుళ్ళ ను రాజు వేడు కొన్నాడు .వారికి కానుకలు అంద జేసినా ఫలితం లేక పోయింది .ఇలాపన్నెండేళ్ళు గడిచి పోయింది .నిత్యం రాత్రి ఇదే హింస కోన సాగింది .

 రాజ్యానికి దగ్గర రాజ్యమైన geatsరాజ్య యువ రాజు బీ ఉల్ఫు ఆరాక్షసుడి ఆగడాలు విన్నా

డు .అతడు” పాతాల భైరవి ”సినిమా లోరామా రావు ళా శక్తి బలం ,బుద్ధి వివేచనా ఉన్న యువకుడు 

.అతని తండ్రి hygelac రాజ్యానికి రాజు .తండ్రి అనుమతి తీసుకొని బీఉల్ఫు పద్నాలుగు మంది 

తన లాంటి బలిష్టులైన యువకుల్ని వెంట బెట్టు కొని డెన్మార్క్ చేరాడు .రాజు స్వాగతించి కానుకలుసమర్పించాడు .

అందరు  రాత్రి herorot భవనం లో నిద్రించారు .గ్రెందేల్ రాక్షసుడు అర్ధ రాత్రి వచ్చి మీద పడ్డాడు .

బీ ఉల్ఫు వాడితోపోరాడి ఒళ్లంతా గాయాలు చేశాడు .వాడు ప్రాణ భయం తో గుహ లోకి పారి పోయాడు .అక్కడ గాయాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తోచచ్చాడు .

గ్రెందేల్ చావు చూసి వాడి తల్లి అందర్ని చంపుతానని శపథం చేసింది .బీ ఉల్ఫు ఆమె గుహ చేరి పోరాడి 

ఆమె ను చంపేశాడు .రాజు దగ్గరవీడ్కోలు తీసుకొని సన్మానాలు కానుకలు పొంది స్వరాజ్యం చేరాడు .

తండ్రి చని పోయిన తర్వాతా బీ ఉల్ఫు రాజు అయ్యాడు .యాభై ఏళ్ళుపాలించాడు .యుద్ధాలు అనేవి 

లేకుండా పాలించి ,ప్రజలకు శాంతి సౌఖ్యాలను కలుగజేశాడు .అతనికి ముసలి తనం వచ్చింది 

.అయితేఒక డ్రాగన్ అతని పై పగ బట్టింది .డెన్మార్కు రాణి బీ ఉల్ఫు ను డెన్మార్క్ కు రాజు గా ఉండమని 

కబురు పంపింది భర్త మరణం తర్వాతఅతను తిరస్కరించాడు .కాని తప్పని పరిస్థితుల్లో రాజు అయాడు

 .పద కొండు మంది యోదు లతో డ్రాగన్ ను చంపి ,దాని దగ్గర ఉన్నసంపద ను అంతటినీ తెచ్చాడు 

.రాజ్యం సుభిక్షం గా వైభవం గా పరి పాలించి సాహస వీరుడు అని చిరస్తాయి కీర్తి ని పొందాడు బీ ఉల్ఫు .

బీ ఉల్ఫు డి జెర్మని కి చెందినా geat తెగ .దక్షిణ స్వీడెన్ లో ఉండే వాడు .తండ్రి మహా యోధుడైన ecgtheow.గెట్ రాజు హైజేలాక్సమర్ధుడు .మంచి పాలన అందించాడు .బీ ఉల్ఫు కు ముప్ఫై మంది 

యోధుల బలం ఉండేది మన భీముడి లాంటి వాడు .ద్వంద్వయుద్ధాలలో మొన గాడు .

 కధలో తెలిసిన్దేమిటి ?కొత్త నాగరకత ను రుద్ద టానికి ప్రయత్నిస్తే ,పాత నాగరకత వారు తిరస్కరిస్తారు 

.సాంఘిక అరాచకాన్ని అంతంచేసిన యోదుడే మన హీరో .మధ్య యుగ ప్రజలకు ప్రకృతి శక్తులు అంటే 

భయం .కొత్త వారికి రోత .పాతదే ముద్దు .కొత్త మార్గం లోనడవాలంటేనే భయం .పగలే ప్రయాణం చేసే 

వారు .అందులోను ఒంటరి ప్రయాణాలే .ప్రకృతిని శాంతింప జేయటానికి బలులు ఇచ్చేవారు .

ఇందులోని ఎలిజీ –గ్రెందేల్ అనే రాక్షసుడు ,వాడి తల్లి ప్ర కృతి కి ప్రతి నిధులు .అవి తండ్రి లేని జీవులు .

వాటి చరిత్ర అంతా గతం లో దాగిఉంది 

.అవన్నీ తోడేళ్ళు ,నక్కలు మొదలైన వాటి తో తిరిగేవి .ప్రకృతి అలజడి ని సృస్తించి చంపేస్తుంది .

దాని నుంచి కాపాడు కోవా టానికిఆయుధాలు సమ కూర్చు కోవాలి .దీనితో నాగరకత ప్రారంభమై ,

అడవులను నరికి వ్యవ సాయం చేశారు .తరువాత సమూహాలు గాజీవించటం ప్రారంభించారు .గానా బజానా ,లతో వినోదం తో సుఖ జీవనం చేయటం ప్రారంభించారు 

.heorot అనే హాల్ దీనికి అంతటికిప్రతి బిమ్బమే .అంటే నాగరకత కు ప్రతి బిమ్బమే .అందుకే 

నాగరకత ను సహించ లేని రాక్షసుడికి అసూయ అని విశ్లేషకులువివరించారు 

. కవిత లో ప్రకృతి శక్తులకు వ్యతి రేకం గా మానవ పోరాటం ఉంది ఇంటా బయటా ,సమాజం లో ఉన్న

 అలజడి కి రూపం.ఎవరూ ఇతరుల సహాయం లేకుండా జీవించే లేరు అనే జీవిత సత్యాని వ్యంగ్యాత్మకం గా ,ప్రతీకాత్మకం గా చెప్పటం మనం అందరంరాజ్యానికి ,దేశానికి రక్ష గా ఉండాలన్న సందేశమూ ఉంది .

మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –12-7-12.–కాంప్అమెరికా


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.