మెహర్బాణీ
”భౌతికత తో ఊగిపోతున్న మానవ జాతి ని ఆధ్యాత్మిక త వైపు కు జీసెస్ మరల్చి
నట్లు ,నేను మానవాళి ని ఉద్ధరించ టానికి వచ్చాను .అలాంటి పనికి కాలము
సమయము కలిసి వచ్చి నప్పుడే మహా పురుషులు మాన వాలిని ఉద్ధరించ టా నికి సంభ
విస్తారు .వారే అవతార పురుషులు .బుద్ధుడు ,మహమ్మద్ జొరాస్టర్ అందరు
అలాంటి వారే .వీరందరూ ఒకే భగ వంతుని నుండి వచ్చిన వారే .అది ఒక బంగారు
దారం .శారీరక ఆనందం ముఖ్య మైన సమయం లో మతానికి మనుగడ తగ్గి నప్పుడు ,ధనం
పై వ్యామోహం పెరిగి నప్పుడు భగ వంతుడు స్వయం గా వీరి ఆవిర్భావానికి దారి
చూపిస్తాడు .ఈ పరంపర లో నేనూ ఒక అవతార పురుషుడినే ”
మత సంస్థలు పాత బాణీ లో నె నడిచి ప్రజల ఆలోచనలను పట్టించు కోవటం లేదు
.ప్రవక్తల ఉపదేశ సారం ఒకటే .మాన వాలిని సంక్షోభం నుంచి బయట పడేయ్య టమే
.నేనేమీ కొత్త మతాన్ని స్తాపించటం లేదు .ప్రజలందరి మత భావాలను పునరుద్ద
రించి వాటికి కొత్త రూపు నివ్వటమేనాధ్యేయం .జీవితాన్ని గురించి వారికి
అవగాహన కల్గిస్తాను .ప్రవక్తల మరణం తర్వాతా వారి భావనలు పక్క దారి
పడుతున్నాయి .అసలు చెప్పినదానికి ,ఆచరించే దానికి సంబంధం లేకుండా పోయింది
.ప్రవక్త లందరూ భగ వంతుని నుండి వచ్చిన వారె .కనుక వారు చెప్పే దంతా ఒకటి
గానే ఉంటుంది .సంకుచిత భావాలను దూరం చేస్తాను .అసలు సత్యాలను
ఆవిష్కరిస్తాను .నా మౌనాన్ని త్వరలోనే వదిలి జనం ముందుకు వచ్చి నా
మనోభావాలను నా నోటి తో తెలియ జేస్తాను .దానికి తగిన సమయం ఇంకా రాలేదు
.వచ్చి నప్పుడు నేనే తెలియ జేస్తాను .”
”త్వరలో నే విశ్వ వ్యాప్త ఆధ్యాత్మికత ను నేను ప్రచారం చేస్తాను .ఇది
అన్ని దేశాల వారికి ,అన్ని మతాల వారికి అన్ని జాతుల వారికి సంబంధించింది
గా ఉంటుంది .భవిష్యత్తు పై నాకు అపార నమ్మకం ఉంది .పాశ్చాత్య దేశాలలో
యుద్ధ భయం ఉంది .అది తగ్గాలి .నేను ఎప్పుడు మౌనాన్ని వీడు తానో నేను
ముందుగా చెప్ప లేను .త్వరలో జరిగే ప్రపంచ యుద్ధం జరగ బోతోంది .అది చాలా
ప్రమాదం .నా భావ వ్యాప్తి ని ఒక ఉద్యమం గా చేస్తాను .ఈ భూమి లో శాంతి ని
స్తాపించాటానికి నేను చే బట్టే ఉద్యమం దోహదం చేస్తుంది .నేను ఒక అవతార
పురుషుడి ని గా అవతరించబోతున్నాను .యుద్ధం తర్వాతా అపూర్వ శాంతి
ఏర్పడుతుంది .నిరాయుధీ కరణ ఒక సమస్య గా ఉండదు .జాతి భేదాలు సమసి పోతాయి
.మత సంస్థల మధ్య విభేదాలు ఉండవు .నేను ప్రపంచం అంతటా పర్య టిస్తాను
.ప్రతి గ్రామం ,పట్టణం ,నగరం సందర్శిస్తాను .అంతర్జాతీయ సోదర భావాన్ని
,మనుష్యుల మధ్య శాంతిని ,బీదల యెడ ,నిర్లక్షానికి గురి అయిన వారి పట్ల
ప్రేమ ను కురిపిస్తాను .భగవంతుని ప్రేమ ను అందరికి అంద జేయట మే నా ముఖ్య
ధ్యేయం”
”భారత దేశం ప్రపంచ దేశాలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అనేక
లోపాలున్నా భారత దేశం ఆధ్యాత్మిక భావ లహరి ని వ్యాప్తి చేయటం లో ఎప్పుడూ
ముందు ఉంది. నైతిక నాయకత్వం భారత వల్లనే సాధ్యం .ప్రపంచానికి ఆధ్యాత్మిక
జ్యోతిని ఇవ్వగలిగేది మనమే .నాకు అతీత శక్తులు చాలా ఉన్నా వాటిని అనవసరం
గా వృధా చేయను .అవి మానవులకు ఉపయోగ పడు తాయి అన్నప్పుడే వాటిని వాడతాను
.నన్ను నేను ఆవిష్కరించు కొన్న రోజున నన్ను అడ్డ గించే శక్తి ఏదీ ఉండదు
.గుడ్డి వారికి చూపు ను కుంటి వారికి నడకను ,ఇవ్వగలను ముసలితనాన్ని దూరం
చేయ గలను .మరణించిన వారిని పునర్జ్జీవులను చేస్తాను .ఇవన్నీ నిజం గా
జిమ్మిక్కులే .వీటి తో నమ్మకం రావచ్చు కాని మనసు కుదుట బడదు” .
”నాకు పన్నెండు మంది శిష్య పరంపర ఉంది .ఇది ఒక వలయం .నా
తర్వాత వీరిలో ఒకర్ని నా స్తానం లో ప్రతిష్టిస్తాను .వారి కోసమే నేను
నిరాహార దీక్ష ,మౌనం పాటిస్తున్నాను .వారంతా నా పూర్వ జన్మ లో సహచరులే
.వారిని నేను ఆదుకోవాలి . వీరికి బయటి వలయం లో44 మంది ఉన్నారు .అందులో
ఆడవారు మగ వారూ కూడా ఉన్నారు .అయితే పైవారి కంటే వీరి స్తాయి తక్కువ
.వీరందరి ద్వారా కావలసిన పనులన్నీ జరిపిస్తాను .నా గరువు ”ఉపాసని మహా
రాజ్”.నాకు ఆధ్యాత్మిక భావన కలిగించిన వారు” హజరత్ బాబా జన్”అనే
సుమారు వందేల్లున్న ముస్లిం మహిళా ఫకీర్.”
ఇదీ అవతార్ మెహెర్ బాబా గారి వాణి,బాణీ .ఇదంతా ఆయన్ను ఇంగ్లండ్
కు చెందిన పత్రికా విలేఖరి భారతీయ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసు కోవా
టానికి భారత దేశం అంతటా పర్య టించిన paul brunton ఇంటర్వ్యూ చేసినప్పుడు
మౌనం గా ఉన్న బాబా తన వద్ద ఉన్న అక్షర మాల సహాయం తో రాసి చెప్పిన
విషయాలు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-12.-కాంప్ -అమెరికా
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


Dear sir, I Want telugu Version of ” Mehar baba speaks to GOD” . My Mobile no:9703510513
Nellore. AP
LikeLike