తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16
    యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4
ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ వర్షాన్ని కురిపించాడు క్రీడి .చేతుల్ని వాచీ పోయాయి .ఎంత క్లిష్ట పరి స్తితి లో నైనా యుద్ధం చేయ గలనని నిరూపించాడు సవ్య సాచి .సైన్ధవుడిని చంపి ,శిరస్సు కింద నెల మీద పడకుండా ,ఆకాశం లోనే తిప్పుతూ ,అర్జునుడు చేసిన విధానం పరమాస్చర్యం గా ఉంది .అందరు నిశ్చేష్టులై చోద్యం చూశారు .దివ్యామ్ష సంభూతుడు కనుక అతనికి అది సాధ్యమైంది .అవలీల గా చేయ గలిగాడు .–”పటు శరముల మీదికి డా –పటికిన్ వలపటికి ,నపర భాగమునకు ,-ముందటికి ,జదల నడపె సము -త్కట రయమున శిరము  గందుక క్రీడ గతిన్ ”  బంతిని ఆడు కొన్నట్లు ఆకాశం లో కిందికీ ,మీ దికీ ప్రక్కలకు బాణా లతో సైంధవుడు తల కాయను తిప్పుతూ పగ తీర్చుకొంటు అనడ్రికి వినోదాన్ని ,భయాన్నీ కూడా కలిగిస్తున్నాడు .వ్యవ సాయ దారులకు ఎడ్లను ఎలా కట్టాలో తెలుసు .దాపటి ఎద్దు ,వలపటిఎద్దు అని అంతం వింటాం .ఆ పదాలనే ఇక్కడ తిక్కన ప్రయోగించి అచ్చ తెనుగు రుచి కూడా చూపించాడు .
రక్తం తో తడిసి ,ఆభరణాలతో ,కూడిన శరీర భాగాలతో ,శస్త్రాస్త్ర ఖండాలతో ,చెల్లా చేద రైనా అనేక ఆభరణాలతో ,మ్మ్సపు ముద్దలతో ,పీనుగుల సమూహం తో జుగుప్సా కరం గా యుద్ధ భూమి ఉంది .అయితే తిక్కన దాన్ని ”కాశ్మీర రాగ రంజితం ,వివిధ ఆభరణాలు ధరించిన సుందర స్త్రీ దేహం ”లా గా ఉంది అన్నాడు .ఆ  భయంకర దృశ్యాన్ని సుందరం గా చెప్పాడు .భీకర ,పౌరుష ప్రధానం గా ఉన్న యుద్ధ రంగాన్ని కోమలత కు ,లాలిత్యానికి నిలయ మైన స్త్రీ విలాసాన్ని ఆపాదించటం కొత్త విశేషం .సమరంగానాన్ని రమణీయం గా ,అవసర మైన చోట్ల భీషణం గా చిత్రించి యుద్ధ వర్ణన కు కొత్త అందాన్ని సంత రించాడు .ఈ విధానం తిక్కన, మహా కవి కాళిదాసుకు నిజమైన  వారసుడు అని రుజువు చేస్తోంది . దుశ్శాసనుడు అమానుష యుద్ధం చేశాడు భీముడి తో .కర్ణుడు శక్తి నంతటినీ ధారా పోసి యుద్ధం చేసి అతన్ని రక్షించే సకల ప్రయత్నాలు చేశాడు .చివరికి భీముని  చేతి లో చని పోయాడు దుశ్శాస  నుడు అన్న వార్తను సంజయుడు పెద్ద రాజుకు వివరించి చెప్పాడు .ముసలి రాజు హృదయ ఆవేదనను తిక్కన మహాద్భుత పద్యం లో తెలియ జేస్తాడు –”పడుచు లీక లూడ్చి ,పట్టి యాడెడు నట్టి -పులుగు చంద మయ్యే దలప ,నా ,య-వస్త ,ఎందు జొచ్చు వాడ ,నీ యలమట –దీర్ప నెవ్వ రింక దిక్కగుదురు ?”–చిన్న పిల్లల చేతి లో చిక్కి ,వాళ్ళు ఈకలు ఒక్కొక్కటి గాపీకి రాల్చి పారేస్తుంటే ,బాధ పడే పక్షి లాగా తాను అవస్థ పడుతున్నాను అన్నాడు .ఈకలు దేహం తోనే పుట్టేవి .సహజ మైనవి .అలాగే అతని పుత్ర ,పౌత్రులు కూడా తనూజులే అంటే తన శరీరం నుండి జన్మించిన వారే .వారంతా ,కళ్ళ ఎదుటే హతమై పోతుంటే ,మర్మ భేద మైన వేదన ను అనుభ విస్తున్నాడు .ఆయన పరిస్తితి ఇప్పుడు ఈకలు తెగిన పక్షిలా ఉంది .విల విల లాడి పోతున్నాడు ఈకలు తెగిన పక్షి కి మరణం ఖాయం .అలాగే తనకూ చావు తప్పదు అనే నిర్ణయానికి వచ్చాడు .జీవచ్చవం అయిపోయానని దుఃఖించాడు .దీనినే ”సంపూర్నార్ధ స్పోరకం ”అంటారు ..
భీముడు దుస్శాసనుడిని చంపినా విధానం అతి భీకరం గా ఉంది .”లీల గేల నమర్చి ,మత్త గజ కేళీ సుందరోల్లాస మా –భీలత్వంబలరింప ,ద్రిప్పు జదలం బ్రుద్వీస్తలిన్,వైచు ,ముం –గాలం ద్రోచు మొగంబు వ్రేయు దేశలు,గ్ర స్పూర్తి వీక్షించు మొ –కాలూడంబయి ,గ్రమ్మ రండ మెడ చిక్కం ద్రొక్కి ,నిల్చున్ ,నగున్ ”ఇతను తమ్ముడి లాగే బంతాట ఆడాడు .ఆకాశం లోకి విసిరేశాడు .కింద పడేశాడు .ఇటు అటు దొర్లించాడు .కాళ్ళ తో తోక్కేశాడు .పాత పగ అంతా తీర్చుకొన్నాడు .పైగా నవ్వాడు .”నీ గుండె చీల్చి నెత్తురు తాగుతా .నీకు దిక్కున్న చోట చెప్పుకో ”అన్నాడు దుస్స సేనుడి తో భీముడు .భీముడు అపర నరసిమ్హావతారమే ఎత్తాడు .పూర్వం పొందిన పరాభవానికి ప్రతీకారం సంపూర్ణంగా తీర్చుకొన్నాడు .–ఆ భీభత్సం ఎలా ఉందొ చూడండి -”నరసిమ్హుమ్దసురేందృ వ్రచ్చు కరణిన్ ,రౌద్ర ముదగ్రంబుగా ,–నుర మత్యుగ్రత ,జీరి ,క్రమ్మరు రుదిరంముల్లాసియై ,దోసిటన్ –వెర వారం గొని ,త్రావు మెచ్చు జవికిన్ ,మేనున్ ,మొగంబున్ ,భయం -కర రేఖంబోరయంగా ,జల్లి కొను ,నక్కౌరవ్యు జూచున్ బొరిన్ ‘ఈ విషయాన్ని వర్ణించే ముందు తిక్కన భీముడిని ”మహా బల నందనుడు ”అన్నాడు .మహా బలుడు అంటే వాయువు అని అర్ధం .గాలి శక్తి మనకు తెలిసిందే .అన్నిట్నీ ఎగరేసుకు పోతుంది ,పీకి పారేస్తుంది .దానికి అసాధ్యం ఏదీ లేదు .గాలి ప్రవాహం ముందు ఏదీ నిలబడ లేదు .ఇంత అర్ధం ఉంది ఆ మాట లో .అది ప్రళయ కాల ఝన్జ్హ.ప్రతిజ్ఞా నిర్వహణ కోసం భీముడు రాక్షస రూపాన్నే పూనాడు .కాని రాక్షసుడు కాలేదు .రక్తాన్ని పెదవి కి చేర్చాడే కాని ,తాగ లేదు .సుక్షత్రియ వీరుడు కనుక అధర్మం గా ప్రవర్తించ లేదు .
ఆశ్వతామ విషయం లో చాలా తేడా ఉంది .దుర్యోధనుని దుస్తితి ,తన తండ్రి ద్రోణుని మరణం అతన్ని కలచి వేశాయి .క్రోధం పెరిగి పోయింది .అయితే దానితో పాటు వివేకం కోల్పోయాడు .పూర్వం కర్ణుడు ,దుర్యోధనుడు చేసిన పాపపు పను లన్నిటిని ,వాళ్ళ ఎదుటే చెప్పిన ద్రోణ సుతుడు ,ఎప్పుడూ నైతిక స్తైర్యం తో ఉండే వాడు ,తండ్రిని మించిన వీరుడు ,పైగా బ్రాహ్మణుడు -అయి ఉండి కూడా ,క్రోధం తో వివశుడై ,రాక్షసుడిగా ప్రవర్తించాడు .తాను ద్రుష్టద్యుమ్నుని ఎలా చంప బోతున్నాడో ,కృప ,కృత వర్మ లకు వివరిస్తాడు .ఆ విధానం పరమ భీషణం గా ఉంటుంది —
”ద్రుష్ట ద్యుమ్ను ని,ముట్టి పట్టుదు ,మదోద్రేకంబడంగింతు ,ను -త్కృష్టాస్త్రంబుల ,జంప నల్క ,పశు భంగిమ్జంపినం గాని ,పో–దిష్టా వ్యాప్తి యనగ నా కిదియే ,భూ ఇష్టంబు ,గౌంతేయులన్ –గష్ట స్వైర విదాభి యోగ మృతులం గావింతు నుగ్రాకృతిన్ ”
పశువులను చంపి నట్లు చంపుతానని స్వయం గా ప్రకటించాడు .అప్పుడు కాని కోపం తీరాడట .ఉత్తమాస్త్రాలతో చంపాడట .ఎంతటి ఉన్మాద స్తితి లో ఉన్నాడో ద్రోణ సుతుడు మనకు అర్ధమవుతుంది .అందుకే నిద్రావాస్త లో ఉన్న ద్రుష్ట ద్యుమ్నుని తల పట్టు కొని –”నెల పయిం బాదాం దిగిచి ,నుర స్తలంబు ,మ్రో–కాల నొగిల్చి ,యేపున మొగంబతి దారుణ ముష్టి నొంచే ,ని –ద్రాలస వ్రుత్తి ,నంగముల యందు ,బలంబును ,బుద్ధి ,నేర్పు నం –జాలని యవ్విరోది ,వివశత్వము బొందగ జేసే వ్రేల్మిడిన్ ”
కాళ్ళతో ,చేతులతో పొడిచి తన్నాడు .పసువు ను సింహం చంపి నట్లు చంపేశాడు .వేదన తో రోజుతూ ,పోర్లాడుతూ ,నెత్తురు కక్కు కుంటూ ,ద్రుష్ట ద్యుమ్నుడు దుష్ట మరణం పొందాడు .ఇక్కడే భీమ ,ఆశ్వతామ ళ క్రోధాగ్ని లో ఎంత తేడా ఉందొ తెలుస్తోంది .నిద్ర లో ఉన్న ఉప పాండవులను చంపినా కసి తీర లేదు .ద్రుష్ట ద్యుమ్నుని వధ తోనూ తీర లేదు .ఆ క్రౌర్యం తో ఏనుగులను ,,గుర్రాలను ఇష్టం వచ్చి నట్లు చంపి పారేశాడు .పీనుగుల పెంట చేసే శాడు .వాటి పాదాలు కోశాడు కొన్నిటి మోరలు చేక్కేశాడు .కొన్నిటి గొంతులు తెమ్పేశాడు .కొన్నిటి వీపులను నొక్కేశాడు .ఇలా పిచ్చి ఎక్కిన వాడిలా అతి ఉన్మాదా వస్త లో రాక్షం గా ప్రవర్తించాడు . .అన్ని అవయవాలను ”క్రూర విచేష్ట త ,విభ్రమం గా ”దారుణం గా హింసించి చంపాడు .కిరాతకుడి లా ప్రవర్తించాడు .ఇంత రాక్షసా వేశం తో పైశాచికం గా ప్రవర్తించి మానవీయత కే మచ్చ తెచ్చాడు .ప్రతీకారేచ్చ ఉండ వచ్చు కాని ధర్మాధర్మ వివేకం ఉండాలి .ఉచితానుచితాలతో ప్రవర్తించాలి .దయా దాక్షిన్యాలకు నీళ్ళు వదిలి అతి అమానుషం గా ప్రవర్తించాడు ద్రోణ సుతుడు .యుద్ధ నియమాలకే వ్యతి రేకం గా ప్రవర్తించి తండ్రికి తల వంపులు తెచ్చాడు .రౌద్రాన్ని ,భీభాత్చాన్ని ఇంత తేలిక మాటల్లో చెప్పిన ,వర్ణించిన కవి ఇంత వరకు లేడు .భీముడి క్రోధం దుశ్శాసన వధ తో ఉపశమించింది .కాని ఆశ్వతామ కు అట్లా కాలేదు .ఈ విధం గా ఒకే రక మైన సన్నీ వేశాలలో ,భిన్న వ్యక్తుల ప్రవర్తన లలో తేడా ,వారి శీల స్వభావాలలో భేదాలను స్పష్టం గా వ్యక్తీకరించాడు మహా శిల్పి తిక్కన కవీశ్వరుడు .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –26-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  1. Venu Ch's avatar Venu Ch says:

    దుర్గాప్రసాద్ గారూ, చాలా బాగా రాశారు. తిక్కన కవిత్వంలోని విశేషాలను విశదంగా మీ పోస్టుల ద్వారా తెలుసుకుంటున్నాం.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.