‘పో”–పై చీకటి వెలుగులు
”అతను కవే కాని -తాగుబోతు ,జూదరి ,వ్యసన పరుడు ,గాంబ్లర్,దుఖం తో ఎప్పుడు కుంచించుకు పోతాడు ,మేలాంక లిస్టు ,భగ్న ప్రేమికుడు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య అకస్మాత్తు గా మరణం ,అప్పుల అప్పా రావు ,మాన్ ఆఫ్ మూడ్స్,నిరంతర చింతనా పరుడు ,ఉద్యోగాలలో స్తిరత్వం లేదు ,తండ్రి ఇద్దరు పిల్లల్ని కానీ పరారు ,తండ్రి ఆలనా పాలనా ఏమిటో తెలీని వాడు ,తల్లి విపరీతం గా కష్టపడి సంసారాన్ని ఈదేది అది చూసి విచలితుడుఅ యే వాడు ఆమె నే నిత్యం స్మరించే వాడు .ఎందుకూ కొరగాని వాడు అని ముద్ర పడిన వాడు.నిత్య దరిద్రుడు . ఒంటరి తనం తో బాధ పడే వాడు డిప్రెషన్ తో నిత్యం బాధ పడే వాడు ..’ప్రేమించిన ఆమె ను తర్వాతా ఎప్పుడో పెళ్లి చేసుకొని ,ఆమె అకాల మరణం తో తట్టుకో లేక పోయిన వాడు ,’ఇవీ అతని పై ఉన్న చీకటి కోణాలు –
”కవిత్వం లో అందం ,కొత్తదనం తెచ్చిన మొదటి తరం కవి .ఫాంటసి కి దారి చూపిన వాడు రొమాంటిక్ కవి ,కధకు చక్కని పునాదులు వేసిన వాడు కవిత్వం లో నాదాన్ని జత చేసి చెవులకు ఇంపు ,కవిత్వానికి సోంపు చేకూర్చిన వాడు ,మొదటి డిటెక్టివ్ కదరాసిన వాడు .కవిత్వం ఎలా ఉండాలో అతను రాసిన విధానం ఇంతవరకు అన్ని దేశాల్లోను ఆదర్శం గా ఉంది .దానికి మించి ఇంత వరకు ఎవ్వరు చెప్ప లేక పోయారు .పద బంధ ప్రహేలికలను తయారు చేసి న మొదటి వాడు .సైన్స్ విషయాల లోతులు తరచి ,ఆ నాడే బ్లాక్ హోల్స్ ను ఊహించిన వాడు ఎన్నో పత్రిక లకు సంపాదకుని గా పని చేసిన వాడు రచన లతో జీవించ వచ్చు అని రుజువు చేసిన మొదటి జర్నలిస్టు ,తన రచన లతో ,ప్ర పంచ దేశ సాహిత్యానికి మార్గ దర్శనం చేసిన వాడు ,స్వంతగా పత్రిక లను పెట్టి నిర్వహించి చెయ్యి కాల్చుకొన్న వాడు ,విమర్శ కు కొత్త పంధా ను నిర్దేశించిన వాడు,ఎందరో రచయితలకు ప్రేరణ గా నిలిచిన వాడు ,ముఖ్యం గా ప్రపంచానికి మార్గ దర్శనం చేసే కళల కాణాచి అయిన ఫ్రాన్సు దేశ కళా కారులకు ఆరాధ్య మైన వాడు ,మంచి కళా స్రష్ట ,జీనియస్ ,బ్రిటీష వాళ్ళ జీవిత విధానాల నుంచి ,అమెరికా రచనలకు స్వంత వ్యక్తిత్వాన్ని చూపించి మార్గ దర్శి అయిన వాడు,కల కల కోసమే నని చాటిన వాడు , — అన్నిటికి మించి గొప్ప స్వాప్నికుడు –ఇవీ అతని పై వెలుగులు -ఇలా చీకటి వెలుగుల అమెరికా రచయిత ”ఎడ్గార్ అల్లాన్ పో””.
పద్దెనిమిదేళ్ళ కే మొదటి కవితా సంకలనాన్ని ప్రచురించాడు పో.రొమాంటిక్ పంధాను వదిలి ,దాని అవతలి పార్శ్వాలను ,ఎవరూ చూడని భాగాలను చూసి స్పందించి రాసిన వాడు .ఎంతో విజ్ఞానాన్ని సంత రించుకొన్నాడు .తన దేశ బలహీనత లను గుర్తించి వాటి లో నుంచి బయట పడాలని అమెరికా కు ఇతర దేశాలకు తెలియ జేసిన వాడు .”నేను అనంత శోక భీకర లోకైక తిమిర పతిని ”అని కృష్ణ శాస్త్రి గారు అన్నారంటే పో మార్గ దర్శకత్వమే అది .కీట్స్ ,షెల్లీ ల వంటి వాడు .ఆనందం వచ్చినా ,దుఖం వచ్చినా ఆపుకోలేని వాడు .తాను పతనం కా కుండా ఉండ టానికి తాగుతున్నానని చెప్పుకొన్నాడు .ఒక సారివాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ tyler ను పరిచయం చేద్దామని స్నేహితులు ప్రయత్నించి తీసుకొని వెళ్తే, ఫుల్ గా మందుకొట్టి పడి పోతే ,ఇంటర్ వ్యూ ను కాన్సిల్ చేసి తీసుకొచ్చారు .అదీ అతని మానసిక స్తితి .ఇలా ద్వంద్వ ప్రక్రుతి లో జీవించాడు .తల్లి వీధి నాటకాలు వేసి కుటుంబాన్ని పోషిస్తూ అకస్మాత్తుగా మందూ మాకూ లేక చని పోతే ”even death might be ashamed ”అని రాసుకొన్నాడు .ఆమె త్యాగాన్ని చూసి విచాలితుడయ్యాడు .ఆమె ను గురించి మాట్లాడా లంటేనే భయ పడి పోయే వాడు .
వర్జీఎనియా వర్సిటి లో చదివి నప్పుడు అందరిలోనూ చదువు లో ముందుండే వాడు .అక్కడ సరదాకి ”తాగుడు పోటీలు ”ఉండేవి .అందులో పాల్గొని విజేత అయ్యాడు .తాగు బోతూ కాదు .డబ్బు లేక జూదం ఆడే వాడు .దానికోసం అప్పులు చేసే వాడు .డబ్బు ఇవ్వక పోతే బెదిరించటం కోదా అలవాటైంది .పరిస్థితులు వాతా వరణం అతన్ని అలా చేశాయి .అత్యధిక ప్రతిభ తో పని చేస్తున్నప్పుడు ,ప్రముఖ రచయిత గా చేలా మని అయినప్పుడు రచన ”జీవిక ”అవు తుందని అతను భావించలేదు .కాని అదే అయింది .రచనలకు ప్రశంశ ళు ,బహుమతులు పొందాడు .the raven అనే రచన టో ఒక్క సారి గా మహా రచయిత అని పించు కొన్నాడు .ఎపత్రికా సంపాదకుని గా పని చేసినా పూర్తిగా అయిదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే జీతాలేమీ ఇవ్వ లేదు .ఉద్యోగ భద్రతా లేదు .ఆర్మీ లో పని చేసి అధికారుల మెప్పూ పొందాడు .మంచి కాన్దక్టు సర్టి ఫికేట్టూ సంపాదించాడు .సమర్ధుడని పేరు వచ్చింది .అయినా పతనం చెందిన విధి వంచితుడు .
ప్రపంచ ప్రసిద్ధ రచయిత లైన ఇలియట్ ,యేట్స్ ,రికీ అందరు పో వలన ప్రభావితు లైన వారే .ఫ్రెంచ్ రచయిత బాదర్లేన్ అతని దారి లోనే నది చాడు .the best of poe is very nearly beyond improve ment ”అని ప్రశంశలు పొందాడు .అతని ప్రభావం రష్యా ,కెనడా ,అర్జెంటీనా నుండి స్కాండినేవియా దేశాల వరకు ఉంది .సంగీతం ,సైన్స్ ,ఆర్ట్ ,సింబాలిజం లలో పో ప్రభావం పడనీ దేశమే లేదు .మాటర్ లింక్ ,దయోల్ ,జూల్స్ వేర్న్ ,స్విన్బర్న్ దాస్తో విస్కీ వంటి ప్రసిద్ధ రచయిత లంతా ”పో రచనా విస్కీ ”ని తాగిన వారే
.”a creative genius who falls just sort of the supreme masters ”–”poe is ajust judje some times the justest ever to pass a verdict on the writ to question ”–”his criticism is derogatory and just ”–‘tere is no other such critic al survey in our literature ”అని ఎడ్గార్ అల్లాన్ పో ను అత్యద్భుతం గా విశ్లేషించి అతని మేధావి తనాన్ని ప్రపంచానకి చాటారు విశ్లేషకులు .
poe రాసింది అంతా చదవ దగ్గట్టే రాశాడు .అతని మాటల్లో శక్తి ఉంది .తక్కువా మాటలలో ఎక్కువ అర్ధాన్ని భావాన్ని పొదగా గల మాటల పొదుపరి .హాస్యానికి ,హారర్ కు సమ ప్రాధాన్యమిచ్చి రచన చేశాడు .అతను యదార్ధ వాడి ,ప్రతీక వాది,సర్రియలిష్టు ఇన్ని గొప్ప లక్షణాలున్న పో రచనలను ఫ్రెంచ్ ఫాషన్ లో విశ్లేషించాలి అన్నాడు టి.ఎస్.ఇలియట్ .అందుకే ఫ్రెంచ్ వారికి పో ”క్లాస్సిక్ ”అన్నారు .బాల్జాక్ ,డికెన్స్ ,టాల్స్టాయ్ సరసన కూర్చో బెట్టారు .అతను చెప్పిన ”art is its own reward ”అన్న మాట ఫ్రెంచ్ వాళ్లకు బాగా నచ్చింది .అడుకే ఫ్రెంచ్ రచయితలు ,కవులు అందరు made of Poe ”అని పించుకొన్నారు .ఇంతకీ కల కల కోసమే నని ఘంటా పధం గా చెప్పిన వాడు పో ఒక్కడే ఆ నాడు .-ఇవీ పో మీద వెలుగు నీడలు .మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-7-12—కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

