నాట్య కళా భూషణ -వెంపటి చిన సత్యం
ఆయన లో కళాభి లాష కూచి పూడి నుండి నెల్లూరు జిల్లా గూడూరు వరకు నాలుగు వందల కిలో మీటర్ల దూరం నడిపించింది .అక్క గారి దగ్గర రెండు రూపాయలు మాత్రమె అడిగి తీసుకొని ఇంటి నుండి బయల్దేరాడు .ఆయన ధ్యేయం కళలకు నెల వైన మద్రాస్ చేరి తన ప్రతిభను నిరూపించి ,తను జన్మించి ,నేర్చిన కూచి పూడి నాట్య కళ కు ప్రపంచ రంగస్థలం మీద వేదిక నిర్మించాలని .నడిచి ,నడిచి అలసి పోయి రైల్వే ప్లాట్ ఫాం మీద ఒళ్ళు తెలియ కుండా నిద్ర పోయాడు ..టికెట్ ఇన్స్పెక్టర్ అతన్ని చూసి ,ఆ కుర్రాడి తపన తెలుసు కొని ,ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టి డబ్బు ఇచ్చి మద్రాస్ పంపించాడు .ఆ మహానుభావుని ఆదరణ తో మద్రాస్ చేరి, తాను అనుకున్నది సాధించి కళా విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు .ఆ చిన వాడే వెంపటి చిన సత్యం .1929అక్టోబర్ ఇరవై అయిదవ తేదీన జన్మించాడు .వెంపటి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి వద్ద కూచి పూడి నాట్య శాస్త్రం నేర్చాడు .తాడే పల్లి పేరయ్య శాస్త్రి గారి వద్ద మెళకువలు గ్రహించాడు .అన్న గారు వెంపటి పేద సత్యం గారి వద్ద శిక్షణ పొందాడు .ఆ తర్వాత ఆయనే ఒక ఆచార్యుడై కూచి పూడి నృత్య కళా విభూషణు డైనాడు . అందరి చేత ”మాస్టారు ”అని పించుకొని ధన్య జీవి అయారు .
ఆయన్ను వరించని బిరుదులూ ,
పురస్కారాలు లేవు .భారత ప్రభుత్వం ”పద్మ భూషణ ”పురస్కారాన్నిచ్చి గౌర వించింది .తిరుపతి తిరుమల దేవస్థానం” ఆస్థాన నాట్యా చార్య” నిచ్చి సత్క రించింది .నాట్య కళాసాగర బిరుదు నందించారు .రాజ్య లక్ష్మీ ఫౌండేషణ్ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం ”కళా ప్రపూర్ణ ”నిచ్చి సత్కరించింది .నాట్య కళా భూషణ ,భారత కళా భూషణ బిరుదులూ పొందిన నాట్య గురువు .అమెరికా లో పిట్స్ బర్గు లో ని బాలాజీ దేవాలయం ”ఆస్థాన ఆచార్య ”బిరుద ప్రదానం చేసింది .కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్న పుణ్య మూర్తి .మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ”కాళిసన్మాన్ ”తో ఆయన కీర్తి కిరీటం లో మరో కలికి తురాయి ని చేర్చింది .తమిళ నాడు ప్రభుత్వం ”కలైమణి ”తో పూజించింది .ఇవన్నీ ఆయన ప్రతిభ కు లభించిన పురస్కారాలు గౌరవవిశేషాలు .నాట్యానికి ఆయన చేసిన సేవకు చిరు సత్కారాలు .
వెంపటి చిన సత్యం గారు తన కల ను నిజం చేయ టానికి మద్రాస్ లో 1963 లో ”కూచి పూడి ఆర్ట్ అకాడెమి ‘ని స్తాపించారు .అందులో ఈ నాడు లబ్ధ ప్రతిష్టులైన కళా కారు లేంద రెందరో శిక్షణ పొంది గురువుకు తగిన గౌరవాన్ని కల్గించారు .వారిలో మంజు భార్గవి, హేమా మాలిని, శోభా నాయుడు ,వైజయన్తీ మాల ,రేఖ ,వింజమూరి రత్న పాప వంటి వారు ఆయన వద్ద ప్రత్యక్ష శిక్షణ పొంది పేరు తెచ్చు కొన్నారు .అందులో రత్న పాప అమెరికా లో టెక్సాస్ రాష్ట్రం లో హూస్టన్ నగరం లో పాతికేళ్ళ క్రిందట ”అంజలి నాట్య అకాడెమి ”స్తాపించి నాట్య సేవ చేస్తున్నారు .మాస్టారు గారి గొప్పతనం ప్రతి ఒక్కరి పై ప్రత్యెక శిక్షణ .ఆయన అభి నయించి చూపిస్తుంటే ”సాక్షాత్తు ఆ పరమ శివుడే వచ్చి నేర్పు తున్నట్లుండేది ”అని ఈ మధ్య నే రత్న పాప తెలియ జేశారు .ఆ మూర్తి లో అంతటి గాంభీర్యం ,అంతటి కళా తృష్ణ ,అంతటి సంపూర్ణత్వం ఉండేవి .అందుకే ఆయన వద్ద శిక్షణ అంటే కళా ద్వారాలు తెరుచు కున్తాయనివిశ్వాసం,ఆనందం . .
సత్యం గారు 180 సోలో ప్రదర్శనలు ,15డాన్సు డ్రామాలను తయారు చేశారు .నాట్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .దానిలో పరి పూర్ణత నిచ్చే ప్రతి విషయాన్ని తీసుకొని కూచి పూడి లో ఇమిడ్చి పరి పుష్టి చేశారు .కూచి పూడి మగాళ్ళకు మాత్రమె కాదని స్త్రీలు కూడా అభ్యశించి దానిలో నిష్ణాతులు కావచ్చు నని రుజువు చేశారు .అట్లా నేతర్ఫీదు నిచ్చి తయారు చేశారు .పైన పేర్కొన్న వారంతా అలా కళామణిభూషణాలైన వారే . వారు తయారు చేసిన సంగీత నాటకాల లో పద్మా వతీ శ్రీనివాసం ,విప్ర నారాయణ ,మేనకా విశ్వా మిత్ర ,కళ్యాణ శాకుంతలం ,భామా కలాపం ,రవీంద్ర నాధ టాగూర్ గారి చండాలిక ,రుక్మిణీ కళ్యాణం ,హర విలాసం ,శివ ధనుర్భంగం ,అర్ధ నారీశ్వరం -లు న భూతో న భవిష్యతి గా తీర్చి దిద్దారు .వారి నట్టు వామ్గం వన్నె తెచ్చేవి .పెర్ఫెక్షన్ కు మారు పేరు మాస్టారి నాటకాలు .ఒక్క క్షణం చూడక పోతే ఎంతో కోల్పోయామని పించేట్లున్డటం ఆయన ప్రత్యేకత .చిన సత్యం గారు, సంగీత రావు గారు, భుజంగ రాయ శర్మ గార్లు ఒక త్రయీ భావం తో వీటిని రూప కల్పన చేశారు ,మాస్టారికి సంగీత కల్పనలో సంగీత రావు గారు పాటలు ,మాటల రచనలో భుజంగ రాయ శర్మ గారు ఇచ్చిన తోడ్పాటు చిర స్మర ణీయం .రస గుళికలను ఆంద్ర దేశానికి అందించిన కారణ జన్ములు ఈ ముగ్గురు. .
కూచి పూడి నాట్యం పురా వైభవాన్ని కోల్పోతున్న సంధి కాలం లో సత్యం గారు దాన్ని సర్వాంగ సుందరం గా .ఆధునిక తకు దగ్గరగా మూల నిర్మాణం కోల్పో కుండా తీర్చి దిద్దారు .అందుకే వారి సంగీత రూప కాలకు అంతటి ఆకర్షణ .కొత్త విషయాలను చేర్చి ప్రచారం చేయటం సత్యం గారికి ఇష్టం .”చారి ”(పాద విన్యాసం )అనే దాన్ని నాట్య శాస్త్ర సంప్రదాయానికి అనుగుణం గా పరమ లలితం గా చేశారని పెద్దలు అంటారు .ఆయన ”క్షీర సాగర మధనం ”లో శివుని పాత్ర ధరిస్తూ నట్టు వాంగం నిర్వ హిస్తు రంగ స్థలాన్ని విశ్వ రంగ స్థలం గా (కాస్మిక్ )మార్చేసే వారు .ఆ ప్రతిభా మూర్తికి జోహార్లు .ఖండాంత రాలలో అనేక వందల ప్రదర్శన లిస్తూ ఆ కళామ తల్లికి నీరాజనాలందించిన మహా నాట్యా రాధకులు మహోన్నత మూర్తి .స్పురద్రూపం పచ్చని రంగు ,కోటేరు లాంటి ముక్కు ,విశాల వదనం ,తెల్లటి వస్త్రాలు చిరు నవ్వు ఆయన ఆభరణాలు .
పేరొచ్చింది, ప్రతిష్ట పెరిగింది ,డబ్బు వచ్చింది .కొడుకు లిద్దరూ కోడలు కూడా తన సంప్రదాయం లో ముందుకు దూసుకొని వెళ్తున్నారు .హాయిగా మద్రాస్ లో కాలి మీద కాలు వేసుకొని కూర్చో వచ్చు .అలా చేస్తే ఆయన వెంపటి చిన సత్యం ఎందు కవుతారు? తను పుట్టిన కూచి పూడి లో ”సిదేంద్ర యోగి ఆరాధన ఉత్స వాలు ”ను దగ్గరుండి జరిపిస్తూ ఆ వారం పది రోజులు కూచి పూడి లోనే ఉంటూ ,అ భారతీయ నృత్య రీతులలలో నిష్ణాతు లైన కళా కారులన్దర్నీ ఆహ్వానించి వారితో ఉదాహరోపన్యాసాలను ఆ కాయా కళ పై ఉదయం పూట ఇప్పిస్తూ, సెమినార్లు నిర్వ హిస్తు, సాయంత్రం ఆ కళా కారుల చేత నాట్య ప్రదర్శన నేర్పరస్తూ ,కూచి పూడి లో విశ్వ నృత్య కళా వేదిక ను నిర్మించిన ఘనత పొందారు .ప్రతి దానికి దగ్గరుండి పర్య వెక్షిస్తూ సూచన లిస్టు వసతి సౌకర్యాలు కల్పిస్తూ విందు లాంటి భోజనాలందిస్తూ స్వంత ధనాన్ని ఖర్చు చేసి తన కూచి పూడి కి ,ఆ కళ కు కొత్త జవ జీవాలన్దిస్తున్నారు .ప్రతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వారిచేత ప్రదర్శన లిప్పి స్తూ సత్యం గారు చేసిన కృషి చిరస్తాయి గా నిలిచి పోతుంది .చాలా సంవత్స రాలుగా వీటిని నిర్వ హిస్తు ,ఏడాది కేదాది కొత్త ను ప్రోత్స హి స్తూ సంగీతానికి కూడా ప్రోత్సాహం ఇస్తూ నిర్వ హిస్తున్నారు .ప్రభుత్వం చేయాల్సిన పని నితానే అందరి సహకారం తో నిర్వ హిస్తున్నారు జన్మ భూమి రుణం తీర్చు కొన్నారు .వారికి, వారి కుమారులు, కోడళ్ళు అద్భుత సహకారాన్ని అందిస్తూ తండ్రికి తగ్గ కుమారులని పించు కొంటున్నారు .స్థానికం గా ఉన్న పద్మశ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారి సహకారం తీసుకొంటూ పసు మార్తి కేశవ శర్మ గారిని ముందుంచి నడిపిస్తూ కళ కు ప్రతి ఏడు పట్టాభి షేకం చేస్తున్నారు .అలాంటి సత్యం గారు రెండేళ్ళ క్రితం పక్షవాతానికి గురై వీల్ చైర్ కే పరిమితమై ,మాట స్పష్టం గా రాక పోతున్నా తన కళా రాదనను విడిచి పెట్ట లేదు .ఆయన అక్కడ ఉంటె చాలు అన్నీ వాటం తటికవే జరిగి పోతాయి .ఇక్కడ కూడా మాస్టారి క్రమశిక్షణ ,సమయ పాలన స్పష్టం గా కనీ పించేవి. చాలా ఏళ్ళు నేను వెళ్లి ప్రత్యక్షం గా పాల్గొని ఆ ఆనందాన్ని అనుభ వించాను. సత్యం గారిని మద్రాస్, లో హైదరాబాద్ లో సంగీత రూపకాలు నిర్వహిస్తుండగా చూశాను .ఆ కళా మూర్తి నిన్న అంటే జూలై ఇరవైతొమ్మిది ఆది వారం 84 ఏళ్ళ వయసు లో పరామ పదిన్చారని తెలిసి బాధ తో, వారి పై ఆరాధనా భావం తో రాస్తున్న నాకు తెలిసిన విషయాలు ఇవి .సుమారు రెండేళ్ళ క్రితం ఆంద్ర నాట్యాన్ని పునసృష్టి చేసిన నట రాజ రామ కృష్ణ గారు మరణించారు ఇప్పుడు ఈ కూచిపూడి నాట్య కళా పుంభావ సరస్వతి అస్తమయం .కళా కారులకు తీరని మనో వ్యధ కల్గించాయి .వెంపటి చిన సత్యం గారు కూచి పూడి నృత్య కళ కు పెద్ద దిక్కు అన్నది నిజం గా పెద్ద సత్యమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-7-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,458 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

