గొల్లపూడి కదా మారుతం –18
ఎనిమిదవ కధ – ఊర్వశీ –పురూరవ – 1
ఒక్కో మనిషికి ఒక్కో రక మైన ప్రవర్తన ఉంటుంది .తమలోని గొప్పను ప్రదర్శించుకోవాలనే తపన ఉంటుంది అవతల వాడిని గేలి చేస్తూ హాయిఅనుభావిస్తారు ఆ మనస్తత్వ పరి శీలన ,విశ్లేషణమే ‘’ఊర్వశీ –పురూరవ ‘’కధ .రచయిత కిటికీ దగ్గర నుంచో గానే ,అవతలి ఇంట్లో అంటే ఎదు రింట్లో ఎదురుగా ఊర్వశీ –పురూరవా కాలెండర్ ,అద్దమూ కని పించేవి .ఓ రోజు యధా లాపం గా చూస్తె ,ఆ కిటికీ దగ్గర రెండు కళ్ళు కని పించాయి .’’హృదయాన్ని కాల్చే వెన్నెల –అనుభవాలకు ఆతృత పడెట్టు చూసే వెన్నెలా ,తియ్యటి సుఖాలకీ మధుర క్షణాలకీ తపన పరచే వెన్నెల ,ఊరించి మండించే వెన్నె లంతటి ‘’వాడి ‘’కళ్ళు .’’అవి .ఎవరి కైనా కుతూహలం ఉత్సాహం ఎవరివా అని ఊహకు రాకుఉండా ఉండదు అలంటి కళ్ళ ను చూస్తె .ఏ కవీ వర్ణించ నంత గొప్పగా వర్ణించాడు మారుతీ రావు ఆ కళ్ళ ఛందాన్ని అందాన్ని .ఆహ్వానిస్తున్నట్లున్నాయి .అద్దం లో ముఖం చూసుకొని తల దువ్వు కొంటున్నది ఆ కళ్ళ ‘’లేడి ‘’తన అందాన్ని ఊర్వశి తొ పోల్చు కొంటోందేమో నని పించింది .ఆమె అటూ ఇటూ ఎవరి కోసమో వెతుకు తోంది .తనని చూసి పారిపోలేదు .ఎందుకు పారి పోలేదో నని అనుమానించాడు .స్త్రీ మనస్తత్వాన్ని ‘’psycho analyst ‘’లా గా ఇలా అంటాడు ‘’స్త్రీ లో తిరస్కారానికి అర్ధ సంశయం ,సంశయానికి అర్ధాంగీకారం ,అంగీకారానికి అర్ధ హేళన ‘’ఉంటాయట .అద్భుత మైన ఎస్టి మేషన్ .ఆ కాలెండర్లో ఊర్వశి కోసం కోరికతో తపన తొ బాధ తొ నిరీక్షనతొ నీర సిస్తున్న పురూరవుడు ఉన్నాడు .ఇలా రచయిత రోజంతా ఆ కళ్ళ మీద ‘’మూజింగ్స్ ‘’తొ ఖర్చయి పోతుండేది .మగాడు ఓ పది రాత్రులు ఆడదాన్ని గురించి ఆలో చిస్తే మతి పోతుంది .ఆడది పదిగంటలు ఆలోచిస్తే మతి పోగొట్టు కొంటుంది అందుకని ఆ ఆలోచనలలోను స్త్రీ పై చెయ్యి గా ఉంటుంది .ఆమె కళ్ళను తాను అర్ధం చేసు కొనే లోపు ,ఆమె ఇతని మనసు అర్ధం చేసుకోన్నదిట .
ఇప్పుడు తను కిటికీ దగ్గర నుంచుంటే ఆమె నవ్వు తోంది .యేవో రహస్యాలు తెలిసి నట్లు కళ్ళు ఆడిస్తోంది .ఇతను తెల్ల బోతే నవ్వు ఆపు కోలేక కొంగు అడ్డం పెట్టుకొంటోంది .ఆమె ప్రవర్తన ఈయనకు అర్ధం కావటం లేదు .ఒక రోజు రోజూ లానే ఇదే సీన్ జరుగు తుండగా ,ఆమె కొంచెం పక్కకు తప్పుకొంటే ,ఎవరో ఓ వృద్దు రాలు అక్కడ నుంచొని ఇతన్ని చూసింది .సిగ్గు పడి తలుపేశాడు .గుండెల్లో వణుకు ఏం జరుగుతుందో నని .ఆ తర్వాత చాలా రోజులు ఆమె కిటికీ దగ్గరకు రావటం ,ఇతను చూడటం ,ఆమె తప్పుకో గానే ఎవరో ఒకరు తనని చూడటం జరిగాయి .భయం తోఅక్కడ నిల బడటం తగ్గించేశాడు .ఆమెకి ఇదేమీ పట్టి నట్లు లేదు .రోజూ అలాగే నిల బడు తోంది .ఎవరో ఆమె ప్రక్కగా కని పించ గానే తాను తప్పుకొనే వాడు .ఆ తర్వాతరచయిత పెళ్లి అయి ,భార్య మాలతి కాపురానికి వచ్చింది .భార్య ఒక నాడు ఎదురింటి ఆవిడ పేరు కమల అని ,భర్త మిలిటరి వాడని ,తల్లీ చెల్లీ తాను మాత్రమె ఇంట్లో ఉంటున్నామని సమాచారం సేకరించి ఇతనికి చెప్పింది .ఆ ఇంట్లో చాలా మంది కని పిస్తున్నారే అని సందేహం వెలి బుచ్చాడు .’’ముగ్గురే ఉన్నారు .మిగతా వాళ్ళు పక్క వాళ్లేమో ?’’అంది .ఒక రోజు భార్య ఎవరింటికో వెళ్తే కిటికీ తెరిచి చూశాడు .’’జీవితం లో హఠాత్తు గా ప్రవేశించిన సుఖాన్ని శాశ్వతం చేసుకో వాలన్న పిచ్చి మారాజు ,ఆతని ఆరాటం లో ఆనందాన్ని వెతుక్కొంటూ కలలో అనుభవం లాగ చేజిక్కి,జారి పోయే ఊర్వశి ‘’గా అని పించింది .తన పరిస్తితి తొ చక్కని సమన్వయము చేసు కొన్నాడు .ఇంతలో కిటికీ సుందరి కమల కన్పించింది .తాను చూస్తున్నాడా లేదా అని తీవ్రం గా పరి కిస్తోంది .ఎంతో ఉత్సాహం గా ఏదో చెప్పాలను కొన్నాడు .ఇంతలో పక్కకు తప్పు కుంది .తన భార్య అక్కడ ప్రత్యక్షం .తెల్ల బోయాడు .ఆమె పకాలున నవ్వటం ప్రారంభించింది .సిగ్గు తొ కుంచించుకు పోయాడు .తల పట్టుక్కూర్చున్నాడు .ఆ ఘాతం ఎలా తట్టు కోవాలో తెలీడం లేదు .పిచ్చెక్కి నంత పని .ఏం సంజాయిషీ ఇస్తాడు భార్యకు ?సంజాయిషీ లతో కాపురాలు నిలుస్తాయా ?అన్నీ సందేహాలే .
‘’ఆమె కన్ను లలో అనంతాంబరంపు నీలి నీడలు కలవు ‘’అన్నాడు కృష్ణ శాస్త్రి –ఆ కళ్ళ వైభోగం ఏమిటో తర్వాత చూద్దాం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-12-12-ఉయ్యూరు

