ప్రపంచ తెలుగు మహా సభలు-కొన్ని ఆలోచనలు
తిరుపతి లో ఈ నెల ఇర్వి ఏడు నుండి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనే వారి
వారికి ప్రతి నిది రుసుము ను అయిదు వందల రూపాయలు గా నిర్ణ యించి వసూలు చేశారు .నాలుగు వేల మంది ప్రతినిధులకు గాను ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇరవై లక్షలు మాత్రమె .ఒక రకం గా సముద్రం లో కాకి రెట్ట .ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయల్లో ఇది ఏమూలకూ ఖాతరు చేయాల్సినది కాదు .అదే విదేశాల నుండి వచ్చే ప్రతి నిధులకు, అతిధులకు ప్రభుత్వం విమాన చార్జీలు ,ఫైవ్ స్టార్ బస సౌకర్యం ,కారు ఖర్చులు కలిపి ఒక్కో ప్రతి నిది పై లక్ష రూపాయల పైనే ఖర్చు చేస్తుంది .ఈ ఖర్చుతో లెక్కిస్తే దేశం లోనీ ప్రతి నిధుల పై వసూలు చేసేది ఏమాత్రం లెక్క లోకి రాదు .అంతే కాదు దేశం లోనీ ప్రతి నిధులు ఒక్కొక్కరు అయిదు వందలు రుసుము చెల్లించి, దూ రాభారం నుండి రైలు లేక బస్ చార్జీలు సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు చేసుకొంటే గాని సభల ను చూడలేరు .వీరికి కనీస బస సౌకర్యం ఉన్నట్లు ఎక్కడా ప్రభుత్వం చెప్పటం లేదు .ఏ హోటల్ లో నో ఉండాల్సి వస్తే ఇంకో వెయ్యి రూపాయలు అదనపు ఖర్చు .ఇవన్నీ ప్రభుత్వం పరి గణించాలి .ఇంకో విషయం ప్రతి నిధులకు ఒక పూట మాత్రమె భోజనం టిఫిన్ కాఫీ సదు పాయం ఉంటుందని చెబుతున్నారని అంటున్నారు .ఇందులో నిజమెంతో తెలియదు .రెండో పూట వీరి భోజనం టిఫిన్ ఖర్చు కూడా భరించి హాజరవ్వాల్సి ఉంటుంది .
తిరుపతి దేవస్థానం రోజు ఉచితం గా పది వేల మందికి పైగా భోజనం పేడు తోంది .కనుక ఈ నాలుగైదు వేల మందికి రెండు పూటలా భోజనం టిఫిన్ ఖర్చు ఎంత ఎక్కువ గా లెక్క వేసినా రోజుకు ఒక కోటి రూపాయల కంటే కాదు .మూడు రోజులకు కలిపి గరిష్టం గా మూడు కోట్లు .దేవస్థానం ఆదాయం లో ఇది అసలు లెక్కింప దగిన సొమ్మే కాదు .అదీ స్వామి పాదాల చెంత ,తెలుగు భాషా సంస్కృతీ పరి రక్షణకు జరుగు తున్న సభలు కనుక దేవస్థానం వారి సౌజన్యం తొ ఉచిత భోజన ,వసతి సౌకర్యాలు కలి పిస్తే ఎంతో హుందా గా ఉంటుంది .పూర్వం భూమన కరుణా కర రెడ్డి తిరుపతిలో ఎంతో వైభవం గా తెలుగు సభలు నిర్వహించి వచ్చిన వారికందరికీ ఉచిత ప్రయాణ ,భోజన వసతి సౌకర్యాలు కల్పించారని అందరు ఘనం గా చెప్పుకొన్నారు .నగదు పారితోషికమూ అందజేసి పంపారని విన్నాం .అటు వంటిది ప్రభుత్వం ఈ పని చేయలేదా పూనుకొంటే ?చేయాలని కోరుతున్నారు తెలుగు పై అభి మానం ఉన్న తెలుగు బిడ్డలు .ఈ విషయమై ప్రభుత్వం పునరాలో చించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరటం సమంజస మైన విషయమే నని భావిస్తున్నాను
గ్రామ స్తాయి నుండి జిల్లా స్తాయి వరకు దాదాపు ఇరవై రోజులు గా కార్య క్రమాలు నిర్వహించి సభల పై అవగాహన కల్గింప జేయ మని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది . ఎన్ని జిల్లాలు దీన్ని స్పూర్తి గా తీసుకొని నిర్వ హించాయో తెలియటం లేదు .అధికార భాషా సంఘ అధ్యక్షులు గా కృష్ణా జిల్లా నుండి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని నియమించటం ప్రభుత్వం చేసినమంచి గొప్ప నిర్ణయం .దానికి ప్రభుత్వాన్ని అందరు అభి నందిస్తున్నారు .కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ బుద్ధ ప్రకాష్ గారు గొప్ప కార్య శీలురుఅవటం, బుద్ధ ప్రసాద్ గారి స్వంత జిల్లా అవటం, ఆయన ఎన్నో ఏళ్లుగా భాషా సంస్కృతి ల విషయమై అవిశ్రాంతం గా కృషి చేయటం ,ఆయన ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా రచయితల సంఘం రెండు సార్లు ప్రపంచ తెలుగు రచయితల సభలను విజయ వాడ లో దిగ్విజయం గా జరపటం దానికి అధ్యక్ష కార్య దర్శు లైన శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణచంద్ గార్ల నిర్దుష్ట ప్రణాళిక ,దాన్ని అమలు జేసే విధానం వల్ల ప్రభుత్వం చే బట్టిన ఇప్పటి కార్య క్రమం కూడా మంచి అవగాహన కల్పించింది .ప్రక్క జిల్లాల లో కాని ఇతర జిలా ల లో కాని ఇంత చైతన్యం కని పించక పోవటం ఆశ్చర్యమే .అయితే ఇక్కడ కూడా మొక్కు బడి గా నే చాలా చోట్ల జరిగాయని పించింది .ప్రజల్లో, భాషాభి మానుల్లో స్పందన కలిగించటం లో ఎక్కడో లోపం ఉందని పించింది .మండల స్తాయి రేవిన్యు స్తాయి ,జిల్లాలో విజయ వాడ ,మచిలీ పట్నం లలో భాషా సంస్కృతి లకు సేవ లందించిన వారికి తగిన సన్మానం జరగటం జిల్లా మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకొని విజయ వాడ లో ప్రతిభా పురస్కారాలన్దించటం లో కృష్ణా జిల్లా అందరి కంటే ముందుంది అని నిర్ద్వంద్వం గా నిరూపించింది .దీనికి అందరు అభి నందనీయులే .
ముప్ఫై ఏడేళ్ళ క్రితం నాటి ముఖ్యమంత్రిశ్రీ జలగం వెంగళ రావు గారి సమర్ధ నాయకత్వం లో ,నిస్వార్ధ ప్రజాసేవకులు ఆ నాటి విద్యా మంత్రి స్వర్గీయ శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి ఆధ్వర్యం లో మొదటి ప్రపంచ సభలు హైదరా బాద్ లో అద్వితీయం గా జరిగి అందరి ప్రశంసలు అందుకొన్నాయి .ఆనాడు సమర్ధ మైన నాయకత్వం ఉంది నిజాయితీ ఉంది .తెలుగు జాతి సమైక్యత ఉంది .అందుకే విజయ వంతం అయ్యాయి ఇవాళ భౌగోళికం గా తెలుగు వారుప్రస్తుతానికి కలిసి ఉన్నా మనస్సులో విశాల దృక్పధంలేక పోవటం ,నిర్వహించే ప్రభుత్వ మంత్రి వర్గం లో గ్రూపు భేదాలు ”గుడ్ విల్ ”కన్నా ”ఇల్ విల్ ”ఎక్కువవటం ,ప్రాంతీయ భేదం, భాషా సంస్కృతులపై సందేహాల నేపధ్యం లో మళ్ళీ నాలుగవ సభలు తిరు పతి లో జరుగు తున్నాయి ప్రాంతీయ భేదాలను అదిగా మించి సర్వ సమర్ధులను గుర్తించి సంమానించాలి .ఇక్కడ ఏ మాత్రం ఏమరు పాటు జరిగినా ప్రమాదం అని గుర్తించాలి . ఆ తండ్రి కుమారుడు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరగటం ఒక చారిత్రాత్మక సంఘటన .ఎన్ని భేదాలు ఉన్నా మనం అందరం తెలుగు తల్లి బిడ్డలం .ఇది మన తెలుగు పండుగ .మన సంస్కృతీ వైభవానికి ఎత్తు తున్న విజయ పతాక అని అందరు గుర్తించి ,పాల్గొని దిగ్విజం చేయాలి .ఇది ఎవరి విజయం అని లెక్కలు కాదు కావలసింది .ఇది తెలుగు వాడి విజయం అని ఆలో చిద్దాం .
నేను మొదట సూచించిన సూచనలను ప్రభత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసు కొంటుందని ఆశిస్తూ .సభలు జయప్రదం కావాలని కోరుతున్నాను
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-11-12- ఉయ్యూరు


Without implementing official language in government offices and in courts, what is the use of spending 25 crores of public money. instead it can be used to develop new and correct terminology by appointing some committees and entrusting this work. many more translations from Indian languages and world languages are to be done into telugu.
This conference is mere waste of public money.
There will be a great pandemonium in the conference.
LikeLike