తొమ్మిదవ కధ –కీర్తి శేషుడు -1
దిగువతరగతి మనస్తత్వానికి అడ్డం పట్టే కధ ‘’కీర్తి శేషుడు ‘’చని పోయిన ఒక వ్యక్తీ గురించి వాళ్ళ దగ్గరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ,అందులోను వాళ్ళసామాజిక స్తితిని బట్టి ఎలా స్పందిస్తారో చూపుతాడు రచయిత .వాళ్ళ మీద మనకు సహ్రుదయతే కలుగు తుంది .ద్వేషం, ఏవ గింపూ రావు .అంత బాగా పరిశీలన తొ రాసిన కధ ఇది .ఇందులోనూ రచయితే కధ చెబుతాడు .అలా చెప్పటం మారుతీ రావు కు మహా ఇష్టం .కారులో ప్రయాణిస్తున్న రచయితకి ఓ కట్టెల లారీ పల్లం లోకి దొర్లి పల్టీలు కొట్టి ,దాని పై ప్రయాణించే వ్యక్తీ కింద పడిపోయి కట్టేల్లో కూరుకు పోయి అతని పై లారీ ఉండగా ‘’తెగిన తోక ‘’లా చేయి మాత్రమె బయటకు వచ్చి గలగలా కొట్టుకొని చని పోయి నట్లు దూరం నుండే చూశాడు .లారీ డ్రైవరు క్లీనరూ పరారీ .జనం పోగయ్యారు .ఇంతలో ఓ జీపు వచ్చి ,అందు లోంచి ఓ బుర్ర మీసాలయన దిగి చూసి ,జీపుని ముందుకు నడి పించేశాడు .పోలీసులూ చేరారు ఆక్సి డెంట్ ప్రదేశానికి .ఇన్స్పెక్టర్ దిగి ‘’పూర్ మాన్ –లారీ లెక్కి కూర్చుం టారీ రాస్కెల్స్ .యే చెట్టుకో గుద్దు కున్నా ముందు వీళ్ళే చస్తారు ‘’అన్నాడు తనకేం పట్టనట్లు.మృత్యువు ఒక జీవితానికి అతి ముఖ్య సంఘటన అయితే –అతినికి దైనందిన కార్య క్రమం .మృత్యువు కు దగ్గరగా వస్తు పలకరిస్తూ ,దాని పైశాచిక దృశ్యాన్ని తరచు చూస్తూ సాగి పోతుంటారు పోలీస్ వాళ్ళు ‘’అని ,వాళ్ళ నైజం పై సహజ సిద్ధ మైన వ్యాఖ్యానం చేస్తాడు గొల్లపూడి .
చని పోయిన వ్యక్తీ చేతి పై ‘’నాగులు ‘’అన్న పచ్చ బొట్టుంది .కొత్త బంగారపు ఉంగరం ఉండి .’’ఎక్కడో కొట్టేసి ఉంటాడు .దొంగ రాస్కెల్ .కూలీ వెధవకు బంగారున్గారమేమిటి ?అన్నాడు సబ్ .’’కలప కళాసీ కి ఉంగరం అర్హత లేని విలాసం స్తోమతు లేని సరదా .నలుగురి అపహాస్యానికి అవకాశం .కూలీ చచ్చినా ,అతని కళ్ళు ‘’చారెడు ‘’ఉండ టానికి వీల్లేదు‘’అని సామాన్యునికి ,మాన్యునికి భేదం కూడా చెప్పాడు .అదే మొట్ట లావోడు అయితే ‘’చచ్చిన బిడ్డ బారెడు ‘’సామెత వర్తిస్తుంది .పోలీసు జీబు లోంచి ‘’ఓ నల్ల శానం లాంటి శాల్తీ దిగింది .గ్లాస్కో లుంగి ,సిల్కు లాల్చీ ,బంగారున్గరాలు ,గార పళ్ళు ,యెర్ర బొట్టు .దిగుతూనే లబో దిబో మంటూ ‘’లారీని ‘’పరా మర్శించాడు .వేలకు వేలు నష్టం తెచ్చిన డ్రైవర్నిబండ బూతులు తిట్టి వాడిని ఎలా గైనా వెతికి పట్టుకొని ,నష్ట అరిహారం ఇప్పించాలని త్వరగా లారీని తీసుకు వెళ్ళే పర్మిషన్ ఇప్పించాలని గోల చేశాడు .అతడే ‘’ఓనరుడు ‘’లారీకి .లారీ కింద శవం ఉందన్నాడు సబ్ .’’ఉండకేం చేస్తుంది ?ఆ వెధవేప్పుడూ పైనే కూర్చుంటాడు .తప్ప తాగి బయల్దేరి ఉంటారు .ణా కొంప మీదకు తెచ్చారు .’’అని అందర్ని తిట్లతో లంకిన్చుకొన్నాడు .ఎన్నెల్ల బట్టి నాగులు పని చేస్తున్నాడని సబ్ అడిగిన దానికి తన కింద ఎంతో మంది ఉంటారని ఎవరేప్పుడు చేరారో చెప్పలేనని తప్పించుకొన్నాడు .ఎక్కడుంటాడో ఆ తాగు బోతూ వెధవ అని అడ్రెస్ కూడా చెప్పా లేదు .చావు లో కూడా సాను భూతి సహాయం ఆలోచించని శాల్తీ అది .ఎవరు అతనితో నిజం చెప్పలేరు .డబ్బుకు లోకం దాసోహం .
రచయితే నాగులు అడ్రెస్ కోసం వాకబు చేసి గూడెం లో నాగుల ఇల్లు పట్టుకొన్నాడు .ఓ ముసల్డీ ,ఓ యువకుడూ ఉన్నారింట్లో .నాగులు చచ్చిన వార్త వాళ్లకు చెప్పాడు .’’ఆడిగురించి మాకేటీ సేప్పోద్దు .ఆఎదవ గురించి మేం ఇన దలచుకో లేదు ‘’అంది ముసల్ది .’’సత్తే సచ్చాడు లంజ నాకొడుకు ‘’అన్నాడు పక్క నున్న వాడు .వాళ్ళిద్దరూ నాగులు అత్తా బామ్మర్ది అని అర్ధ మైంది .తన కూతురు మనువు పాడు చేశాడని ముసల్ది ఏడిస్తే బావ మీద కోపం ఎందుకో అర్ధం కాలేదు ‘’’’ఆడు సావక పోతే నేను సంపెద్దును ‘’అన్నాడు వాడు మళ్ళీ .అంటే వాడు ఎలా ఎందుకు చని పోయాడో ఎవరికి అక్కర్లేదు .చేతికి ఉంగరం ఉందని చెప్పాడు రచయిత .పోలీసోడు దొబ్బెస్తాడేమో నని తొందర్లో తానే కొట్టేయ టానికి బామ్మర్ది ‘’పారందు ‘’కొన్నాడు .వాడక్కర్లేదు వాడి వస్తువు పై అంత మోజు .వాడు ఎట్టాగో తిరిగి రాడు .దాన్నైనా దక్కించుకొందామని ఆరాటం .ముత్తమ్మ నాగులు ‘’లంజ ‘’అని తెలుసు కొన్నాడు .పెళ్ళాం రాజమ్మ పుల్లలు యేరు కోటానికి వెళ్ళిందని తెలిసింది .మొత్తం మీద ముత్తమ్మ ,ఓ బడ్డీ కొట్టు ఆసామి తొ మాట్లాడుతుండటం చూశాడు .ఆమె చూపుల్లో ఆహ్వానం, వాడి చూపుల్లో ‘’ఆకలి ‘’ఉన్నట్లు గుర్తించాడు .అందం గా తెల్లగా ఉండది రాణీలా చిలకలా ఉంది .ఆకర్షణ ఉండి మత్తు ఉంది..బిగువైన ఒళ్ళు ఉంది ..నాగులు చచ్చి పోయాడని చెప్పాడు .నిర్లక్ష్యం గా ‘’యే నాగులూ‘’అంది .రచయితకీమీ తెలియ దనుకొని ‘’ఆడో పొగరు బోతూ ‘’అంది .నాగులు మంచి వాడు కాడా అని అడిగితే‘’కట్టుకొన్న పెళ్ళాన్ని కాదన్న ఓడు ఆడూ మనిషేనా ?ఇంటిని కట్టుకో లేని వాడు ఊరి నేలు కుంతాదంటే ఎవర్నమ్ముతారు తారు బాబూ ‘’అంది .కట్టుకొన్న పెళ్ళాన్నె కాకుండా చేసిన ముత్తమ్మే ఈ మాట అన్నందుకు నవ్వోచింది .’’సానిది కూడా తన బతుకు లో ఒక విచిత్ర మైన నీతి ని సృష్టించు కొంటుంది .అవి నీతి లోను నీతిని చూప లేని నాగులు సుఖం గా బతకటం ముత్తమ్మ ఉద్దేశం కాదు ‘’అంటాడు అవి నీతి లో నీతిని ఆమె కన్నీటి చుక్క కు నోచుకో లేదంటాడు .అద్భుత విశ్లేషణ .అందరి గుండెల లోతులు తరచ గల మహా రచయిత చేసే విధానం ఇదే .గిరజాల జుట్టు బడ్డీ వాడి పెదవుల పై మంద హాసాన్ని రచయిత చూశాడు .
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –18-12-12- ఉయ్యూరు

