చివరి ( 11)కధ –నేను
పెద్ద మేడ ముందు వీళ్ళ కుటుంబం .మేడ లోనీ కుటుంబం వీళ్ళకు ఆశ్రయం ,ఆధారం .నిజం చెప్పా లంటే వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించుకొనే ఆ మేడ కుటుంబం ఉంది ‘’ఆశ్రయం కంటే ఆత్మీయత ఎక్కువ ‘’అంటే బాగుంటుంది .తర తరాల స్నేహం అది .తరగనిది గని లాంటిది .మేడ వారింట్లో ప్రతి పండక్కీ వీల్లకూ పండగే .వీరి ఆనందమే మేడ కుటుంబం వారి ఆనందం .యే పండగ వచ్చినా వాళ్ళూ వీళ్ళూ కలిసి మెలిసి ఉంటారు .అన్ని తరాల్లోను ఆ సఖ్యత రెండు కుటుంబాలు పాటించాయి .ఆ ఇంట్లో పెళ్లి ముచ్చట్లు ,బదిలీలు చదువు సంధ్యలు అన్నీ వీళ్ళ ఎదుట మాట్లాదాల్సిందే .అంత చల్లని మనసు వీళ్ళది .మేడ ఇంటి వారి పెద్దబ్బాయి పెళ్ళిజరిగి కుందనపు బొమ్మ లాంటి పిల్ల కోడలుగా ఇక్కడికి వచ్చింది ఉగాదినాడే దిగారు కొత్త దంపతులు .వీళ్ళ అమ్మ అన్నీ చూడ మంటుంది ఏదీ చెప్పదు .తెలుసుకోవటమే తమ పని అంటుంది .ఏదైనా ఆడిగితే అన్నిటికీ ముభావమే .ఇవ్వడమే కాని పుచ్చుకోడం తెలీని కుటుంబం వీళ్ళది .తల్లి ఔన్నత్యమే పిల్లల్ని అంత వాళ్ళను చేసింది .
వేసవిలో సందడే సందడి .రెండిళ్ళకు హడావిడే .మేడ కుటుమ్బం పిల్లలు .ఈ పిల్లలపై ఓ కన్నేసి ఉంటారేప్పుడూ .వీళ్ళు చిరు నవ్వుతో ఆహ్వానిస్తారు .ఇంటిల్లి పాదికి తియ్యని మామిడి పళ్ళు ఇస్తుంది వీళ్ళమ్మ .అప్పుడామే ముఖం లో ఎంతో గర్వం తొంగి చూస్తుంది .ఈ ఉగాదికి ఆ మేడ కుటుంబం వాళ్ళ పిల్ల లంతా ఓ ఇంటి వారయ్యారు .వీళ్ళమ్మకు ఆనంద పారవశ్యం కలిగింది .ఆ ఆప్యాయతా అను భూతి ఎక్కడివా అని ఆశ్చర్య పోయింది ఈమె కూడా పెద్ద దైపోయింది .ఆ ఇంట్లోకి వెళ్లాలని ఉబలాటం వాళ్ళు పిలిస్తేనే లోపలి వెళ్లాలని తల్లి హిత బోధ .ఆ ఇంటి అమ్మగారు ఆప్యాయం గా ఈపిల్లను లోనికి తీసికెళ్ళి అలంకరించింది .ఆ ఇంట్లో ఈమె కూడా ఒకటైంది .ఆ ఇంటి వైభోగం కళ్ళారా చూసింది సాయంకాలానికి సోమ్మసిల్లింది ఆ ఉత్సాహం లో ఎండకి ఒడిలి పోయింది అమ్మ వెన్ను తట్టింది .తమ కక్కడ స్తానం కల్పించిన వారికి అలా చేయటం తమ ధర్మ మన్నది .ఇవ్వగలగడమే తమ శక్తి అని తమకు బాధ్యతలే ఉంటాయని తెలియ జెప్పింది .ఇవ్వడం లో ఉన్న హాయి ,ఆనందం గోప్పవి అని హితవు చెప్పింది .ఆ మాటకు పిల్ల పులకించింది .ఆ మాతృత్వపు పరి పూర్నతకు ఉద్వేగం తొ చలించి పోయింది తాను చేసిన మంచి పని కి తృప్తి పొందింది పిల్ల .ఆ ముఖం లో వెలుగు చూసింది తల్లి .అమ్మ ఒడిలో ప్రతి ఫలం అశించ కుండా నిద్ర పోయింది .మేలు కొనే దృష్టీ, కోరికా లేవు.
ఇంతకీ ఈమె ఎవరు ?’’మామిడి కొమ్మ ‘’పరహితమే ఊపిరిగా పెంచిన ఆ పెద్ద ముత్తైదువ అంటే ఆ పూచిన మామిడి చెట్టే మా అమ్మ.ఆమె శరీరం లో అంతర్భాగమే ,ఆమె ఒడిలో అందం గా పెరిగి న మామిడి కొమ్మను అదే‘’నేను ‘’ .అని కధను ముగిస్తాడు మారుతీ రావు .ఇదంతా మామిడి కొమ్మ స్వగతం .అందం గా సస్పెన్సు తొ చిత్రించాడు .దాని ఆంతర్యాన్ని ,మాతృత్వపు మహిమను మనుషుల్లోనే కాకుండా మానుల్లో కూడా చూప గలగటం, ఆరి తేరిన రచయిత చేసే పని అదే గొల్ల పూడి చేసి ,చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడుమారుతీ రావు
ఈ విధం గా పదకొండు కధల్లో కధకుని మార్కు స్పష్టం గా కన బడుతుంది .వస్తువు ఏదైనా వినూత్నం గా చెప్పే విధానం గోచరిస్తుంది .ఆ భాషే వేరు .అదంతా జీవితాన్ని కాచి వడ బోసిన చిక్కని భాష .అందమైన పదాలతో’’ కోటబుల్ కోట్స్’’ .చెక్కటం అతనికే సరి .’’ఇజం ‘’మత్తు ఉండదు .నిజం మాత్రమే ఉంటుంది .అంతా ఆయన భావ జాలమే .ఆ పాత్ర లన్ని ఈ నేల మీద తిరుగుతూ మన మధ్య నివ సిం చే వే .ఈ గాలీ ఈ నీరు ఈ వెలుతురు పీల్చినవే .ఆకాశం లోంచి హఠాత్తుగా ఊడిపదినవికావు .యే పాత్రకాపాత్రే ప్రత్యేకత .ఓ నిండుదనం ,పరి పూర్ణత్వ ప్రతి పాత్ర లోను ఒక వెలుగు నింపటం గొల్ల పొడి ప్రత్యేకత .పాత్రల నిజాలను బాగా విశ్లేషించి చెప్పే నేర్పున్నవాడు .అవి సజీవం గా చైతన్యం తొ తిరిగేవే .ఈ మట్టి కున్న ప్రత్యేకతను సంత రించు కొన్న పాత్రలే అవి .యే విదేశీ దిగు మతికాదు .కాలం విసిరే సవాళ్ళను ఎదుర్కొని ఎదురు నిల్చేవి కొన్ని ,ఓటమి పాలైనా పిరికి తనం లేకుండా యే అఘాయిత్యం చేయకుండా ఎదిగే పాత్రలు కొన్ని .త్రీ డై మెన్షన్ ల లోను స్పుటంగా కన్పిస్తాయి ఈ పదకొండు కధలు మారుతీ రావు ‘’రోమన్ హాలిడే ‘’పేరిట వెలువరించాడు .
ముగింపు ఈ సారి
‘’ఇవాళే యుగాంతం అని భయ పడుతున్న వేళ మారుతీ రావు కధలే మనకు యే భయం లేకుండా అభయం ఇస్తాయి ‘’అని తెలియ జేస్తూ
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –21-12-12- –ఉయ్యూరు .

