ముగింపు ముక్తా ఇంపు
మారుతీ రావు భావాలను వెలికి దీసే దిట్ట .మృదువైన సంభాషణా చతురుడు .ఆశయాల ఊదర ఉండదు .ఆవిష్కరణ లో విలక్షణత ఉన్న వాడు .అందం గా చెప్పటం బాగా నేర్చిన వాడు .దాదాపు ఈ కధ లన్నిటికి తానే నాయకుడు .ఉత్తమ పురుష లో సాగే ఉత్తమ విధానం .ఆడ వాళ్ళ’’ వానిటి ‘’అతడిని ఆకర్షించి దాన్ని అనలైజ్ చేశాడు .వానిటి లో ఎదుటి వాడిని ధిక్కరించే స్వభావం ఉంటుంది .ఎదుటి వారికి విలువ నివ్వరు .మానవత్వం పై మారుతీ రావు కు అమితాను రాగం .పరోపకారం మరో గొప్ప సుగుణం .ఇవ్వడం మాత్రమె తెలుసుకొని ,సేవ చేసే బాధ్యత తెలుసు కోవాలనే ఉద్బోధ ఉంటుంది .ఇవ్వటం లో ఉన్న ఆనందం గొప్పది అనే తత్త్వం ఉన్న వాడు .అతని కధలు మనల్ని శాశిం చవు .నువ్వు ఇలా ఉంటె నువ్వు బాగుండవా అనే ఓ సూచన ఉంటుంది .జీవితం లో అన్ని దశల్లో స్త్రీ ప్రత్యేకత చూపిస్తుంది అనే భావం ఆయనకు ఉన్నది .ఆ ప్రత్యేకత కు పేరు పెట్టడు .ఆదివ్యక్తిత్వ వికసనమే .ఫెమినిజం ఆశించే వీలు ఉండదు .అయితే సత్యభామ విషయం లో అతను ప్రత్యేకత చూపాడు .
మట్టి లోంచే బంగారం వస్తుందని తెలిపే సత్యాలున్నాయి .అరవై నాలుగు కళల్లో దొంగ తనానికి ఒక ప్రత్యెక స్తానం ఉంది .దానిలో ఆరి తేరిన వాడి జీవితాన్నీ ఆవిష్కరించాడు .అయితే వాడూ లోకోప కార బుద్ధి ఉన్న వాడే .గుర్రబ్బడ్డీ వాడి జీవితానికి ఓ సార్ధకత ఉంటుంది .un heard melodies are sweeter than heard ones అనే భావాన్ని బాగా పోషించాడు .చైనా లో ఒక సామెత ఉంది ‘’ఆహారానికి ఇచ్చ్చే విలువ సౌందర్యానికీ ఇవ్వాలి ‘’మనదేశం లో అంతస్సౌన్దర్యానికి విలువ ఎక్కువ .Ethical beauty is being worshipped in this land అని మనకు గౌరవం ఆపాదిస్తారు .అందుకే అందమైన జీవితం పై కధ వచ్చింది .’’కల ను ఆనందించటం అంటే స్వీయ ఆత్మ ను సందర్శించటమే ‘’అన్న సూక్తి ని మారుతీ రావు బాగా ఉపయోగించాడు .అందుకే నాకు ఆ కధలు చాలా ఇష్టం అని పించాయి .అంతే కాదు యే రచన చేసినా ఎంతో తపన తొ, తపస్సు తొ ,లోక పరి శీలాన చేసి దాన్ని పూర్తిగా జీర్ణించుకొని ,,తనదైన భాషలో ,భావం తొ చెప్పాడు .అందుకే ముగ్ధ మనోహరం గా ఉంటాయి మారుతి కధలు .అంత ఓర్పు ,నేర్పు ఉన్న వాడు గొల్ల పూడి .Each man poet ,philosopher or writer inhales much before exhales ‘’ఆ పట్టూ తెలిసిన వాడు .అతను చూపించిన పాత్రలు ,స్వభావాలు ఫోటో చిత్రాలుగా ఉంటాయి .అయితే అదీ ఒక కళ అంటారు Good photograph is not to photograph a beautiful thing ,but to beautifully photograph a thing ‘’అని సంజీఎవ దేవ్ ఎక్కడో ఎప్పుడో అన్న మాట మారుతి రావు కు బాగా అన్వ యిస్తుంది .
మారుతీ రావు కధలను,ఆ సౌందర్యపు నిధుల్ని అందించే ప్రయత్నం చేశాను .నేనూ ఓ తపస్సులా ,ఓ సాధన లా ఎనిమిది రోజులు ఏక బిగిన వీటిని 27-2-1987 న ప్రారంభించి పూర్తీ చేశాను .ఆ ఎనిమిది రోజుల్లో నా మనసంతా అతనే ఆక్రమించుకొని కూచున్నాడు .ఆ కధలే కళ్ళు మూసినా తెరచినా నా ముందు ప్రత్యక్ష మయ్యాయి .నా చెప్పడం లో అతని కధా కధనం తొ మేళ వించాను .దాదాపు అతని భాషలోనే చెప్పాను .అతని హృదయం తేలియా లని .నా విశ్లేషణ అవసర మనుకొంటే జోడించాను .అంత అవసరం లేకుండానే అతని భావము, భాష between the lines చెప్పేస్తుంది .నా పరకాయ ప్రవేశమూ కొంత చేరింది .అతని రచనా ,నాపైత్యమూ పడుగు పెకల్లా అల్లుకు పోయాయి .కధ చెప్పటం తొ బాటు ,కదన సౌందర్యాన్ని విస్పష్టం చేశాను .అందుకే ఇంత లావైంది .అయితే ఇది వాపా ,బలుపా ?అనే సందేహమూ వచ్చింది .నాకు బలుపె అని పించింది .ఇంతగా ఆకర్షించిన కధలు నాకు అప్పుడు కని పించలేదు .ఆ ఒరవడిలో అలాఅలా కొట్టుకు పోతు ఒడ్డుకు ఇప్పుడు చేరా .ఆ మునక లో ఆనందం ఉంది.అందమైన అను భూతి ఉంది .రస రమ్యత ఉంది గొప్ప అనుభవమూ ఉంది .ఇది గొల్ల పూడి మారుతీ రావు కు చేసే ‘’ కధాక్షరాల ఏకాదశ రుద్రం ‘’—ఆనందో బ్రహ్మా .
గొల్ల పూడి తో పరిచయం
మారుతీ రావు లో ఏదో తెలీని ఆకర్షణ ఉంది .చాలా ఏళ్ళ క్రితమే ఆతని ప్రభావానిఆకర్షితుడనయ్యాను.అతని మాట ,నటన ,కధ నవల ,నాటకం డైలాగ్ డెలివరి నన్ను లాగేస్తుంది .ప్రతి దానిలో తనదైన ముద్ర వేస్తాడు .చాల పిన్న వయసులోనే కధా రచన చేసిన అతి కొద్ది మందిలో గొల్ల పూడి ఛిన్న వాడు ఒకడు .అవి జనం పై మంచి ప్రభావమే చూపాయి .అలాగే మంచి నాటకాలు ‘’రాగ రాగిణి ‘’వంటివి రాసి వస్తువులో ,ప్రదర్శనలో కొత్తదనాన్ని ప్రవేశ పెట్టాడు .ఆకాశ వాణి లో పని చేసిన కాలం లో ఎంతో లబ్ధ ప్రతిష్టత ఉన్న ఆ నాటి కవులను రచయితలను ,కళా కారులను ప్రోత్స హించి రాయించి ,ప్రసారం చేసి వారికీ, దానికీ కీర్తి తెచ్చాడు .ఆ నాటకాలలో తాను నటించి గొప్ప గుర్తింపు పొందాడు .ముఖ్యం గా అతని డైలాగ్ డెలివరి ఓ ప్రత్యేకత సంత రించు కొంది .మాటకు వేషం కట్టి మన్నింపు తెచ్చిన డెలివరి ఆది .నాటక రంగానుభవం తొ సినీ వినీ లా కాశం లోను ఉజ్వలం గా వెలిగాడు .మంచి రచయిత గా నిలబడి మంచి కేరక్టర్ నటుడయ్యాడు .సరసం గా సందర్భోచితం గా ,రాసి సన్నీ వేశాన్ని పండించే వాడు .పాటవ మైన మాటలకు అతను ప్రత్యేకం .కరుణ రసాన్ని అద్భుతం గా కురిపించ గల నేర్పరి .నటునిగా తనదైన బాణీకి రూపు కట్టాడు .శాడిస్ట్ భర్తగా ,బాధ్యత లేని భర్త గా తండ్రిగా ,మునిగి పోతున్నా తనదే విజయం అని పించే వాడిగా అతను నటించిన పాత్రలన్నీ చిరస్మరణీయాలే .అందుకే యే మూసలో పోసినా బయటికి వచ్చేది అద్భుత సౌందర్య ప్రతిమ .దానికి వగలు ,వయ్యారాలు ,దర్పం ,ఉద్రేకం మేళ వించి జనాన్ని ఆకర్షించేది అతని కలమైనా ,గళ మైనా ఆహార్య మైనా, దర్శకత్వమైనా ..అన్నిటా ప్రత్యేకతే .అదీ అతని విజయ రహస్యం .
ఒక సారి మా ఉయ్యురుకు లక్ష్మీ టాకీస్ వాళ్ళు తీసే సినిమాకు రచన చేయ టానికి 1970 లో వచ్చి అప్పటి శాసన సభ్యుడు శ్రీ వడ్డే శోభ నాద్రీశ్వర రావు గారింటికి వచ్చాడు .శోభ నాడ్రి హై స్కూల్ లో మాకు జూనియర్ .ఆయన మా అందరకు కబురు చేశాడు .నేను స్వర్గీయ కాంతా రావు ,ఆంజనేయ శాస్త్రి వగైరాలం కలిసి వెళ్ళాం .ఒక గంట సేపు చాల విషయాలు మాట్లాడాడు .ఎక్కడా భేషజం ,గర్వం ,చిన్న చూపు లేకుండా ఉండి మమ్మల్ని ఆకర్షించాడు .అదే మొదటి పరిచయం .నాటక సినీ రంగాల ను నిశితం గా పరిశీలించిన అనుభవం తొ voluminous మాట్లాడే నేర్పున్న వాడు.
వీటికి మించి అతని లోని సామాజిక స్పృహ నన్ను ముగ్దుడిని చేసింది ముఖ్యం గా ఆంద్ర జ్యోతి దిన పత్రిక లోప్రతి శని వరం రాసే ‘’జీవన కాలం ‘’నన్ను బాగా ఆకర్షించింది .అందులో అతను త్రవ్వి తీయని జీవన సత్యం లేదు అంటే అతిశయోక్తి కాదు .ఎవర్నైనా ,ఎంతటి వాడి నైనా సునిశితం గా ,వ్యంగ్యం గా చురక వేసే రచన చేసి తన శైలికి జీవం పోశాడు .ఒక రకం గా ఉతికి ఆరేశాడు .ఎందరో మహానుభావుల వ్యక్తిత్వాలను మహోన్నతం గా ఆవిష్కరించాడు .ముఖ్యం గా ఎన్టీఆర్ లోనీ విచక్షతను ,విలక్షణత ను ఎవ్వరు చెప్పా లేనంత గొప్పగా చెప్పాడు .అందుకే గొల్ల పూడి అయస్కాంతానికి ఆకర్షింప బడ్డ ఇనుప ముక్కను అయాను .నాటక రంగానికి ఇంకా సేవ ఎంతో చేయాలనే తపన ఉన్న వాడు చేయ లేక పోతున్నానే అనే బాధ ఉన్న వాడు .తాను చూసిన ఏడు పాశ్చాత్య నాటకాలను మంచి నేర్పుతో తెలుగు ప్రజలకు మంచి విశ్లేషణ తొ తెలియ జేసినమహా గొప్ప విమర్ద్షకుడు .తెలుగు నాటక రంగం కల కాలం జీవించా టానికి ప్రక్రియా పరం గానే కాకుండా ,ప్రదర్శన పరం గా కూడా చాలా మార్పులు రావాలని ఆశిస్తాడు .ఇంగ్లాడ్ లో లాగా ఇక్కడా నాటకాలు సంవత్స రాల తర బడి ఆడాలని,ప్రేక్షకాదరణ పొందాలని నిండుగా కోరుకొనే కలలు కనే వాడు .ఆ కల నిజం కావాలని ఆశిద్దాం .అందుకే అతనంటే నాకు వీరాభిమానం
ఆంద్ర విశ్వ విద్యా లయం లో చదివే రోజుల్లోనే ‘’చీకట్లో చీలికలు ‘’నవల రాశాడు .అప్పుడే దాన్ని చదివి ఇంత చిన్న వయసు లో ఇంతటి భావ పరి పక్వతా అని ఆశ్చర్య పోయాను .అక్కడ కత్తుల వెంకటేశ్వర రావు అనే నటుడు ,ప్రయోక్త కు శిష్యుడై నటనలోనూ గొప్ప స్తానం పొందాడు .తన డైలాగ్ డెలివరి ని ఆయన నేతృత్వం లో అద్భుతం గా మోల్ద్ చేసుకొన్నాడు .’’పెర్ఫెక్ట్ జెంటిల్మన్ ‘’గానే కాకుండా ,పెర్ఫెక్ట్ రోగ్ గా’’ డీసెంట్ విలన్ ‘’గా తడి గుడ్డలతో గొంతు కోసే కర్కోటకుడిగా అతని నటన పరాకాష్ట చెందటానికి ఈ అనుభవమే తోడ్పడింది .అందుకే మారుతీ రావు అంటే నాకు తెగని మోజు .
మనసు లోపలి అతి సున్నిత పు పొరలకు అతి సున్నితం గా తాకే మాటల నగిషీ చెక్క గలడు .సన్నీ వేశాలని చక్కగా అల్లగలడు .ఆ నాటి ప్రముఖ దర్శకులు అతనితో అంత గొప్ప పని చేయించారని ఆ దర్శకుల ప్రభావమే తనను ఇంతటి వాడిని చేసిందని వినయం గా చెప్పాడు .ఆ నాటి వారికి ఏం కావాలో తెలుసు నని ,ఎలా రా బట్టాలో పూర్తీ అవగాహన ఉన్న వారని అన్నాడు .చేంతాడు లాంటి భారీ డైలాగుల కంటే చిరు మాటలు హృదయాన్ని తాకి మార్పు తెప్పిస్తాయని అతని దృఢ విశ్వాసం .ఒక్క డైలాగు కూడా లేకుండా సన్నీ వేశాన్ని రక్తి కట్టిస్తే ఆడి ఉత్తమ ‘’స్క్రీన్ ప్లే‘’అవుతుంది అన్నాడు .మొత్తం మీద స్క్రీన్ ప్లే కి ప్లే చేయ వలసింది చాలా ఉందిఅని అభిప్రాయ పడ్డాడు . .ఇతర బాషా చిత్రాలలో స్క్రీన్ ప్లే రచయితలే ఉంటారు కాని డైలాగ్ రచయితలుండరు అని చెప్పాడు .ఏం చెప్పినా నిష్కర్ష గా కర్కశం గా చెబుతాడు .అందుకే అతనంటే నాకు’’ ఇది ‘’.
ఎప్పుడో అంటే 1995లో అతని ‘’రోమన్ హాలిడే ‘’కధా సంపుటి చదివాను .రెండు మూడు సార్లు ఏకాగ్రత తొ చదివాను .అందులో అతడు కదలని చాలా గొప్ప గా చెప్పాడని పించింది .దాన్ని బయటికి లాగి, జనానికి తెలియ జేయాలని పించింది ఆనాడే .కాని చేయ లేక పోయాను .అయితే రాయాలనే కాంక్ష బలీయం గా నాలో ఉంది.ఎన్నో ఇతర పుస్తకాలు చాలా చదివినా ఒక మూల ఆ కధలు మనసు పొరల్లో దాగే ఉన్నాయి .ఆ రెండేళ్లలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలూ చదివాను .ఆ పోకడ లో వ్యాసాలూ రాశాను .వేదిక ల పై మ్ట్లాడాను కూడా .సాహితీ పరం గా చాలానే చదివాను .,వ్రాశాను .,ప్రసంగించాను .మధురాంతకం రాజా రం గారంటే నాకు వల్ల మాలిన అభిమానం .ఆయన కధా విశ్లేషణ చేసి మాట్లాడాను .అయినా గొల్ల పూడికి అన్యాయం చేస్తున్నానేమో అనే భావం మనసు లో గూడు కట్టుకు పోయింది .అందుకని మళ్ళీ ఒక సారి ఆ కధలు చదివాను .ప్రతి కధను ఆకలింపు చేసుకోవ టానికి ప్రయత్నించాను .గొల్ల పూడి లోనీ కధా రచయిత ను ఆవిష్క రించాలనే నిశ్చయానికి వచ్చాను .ఆ కార్య క్రమానికి శ్రీకారం చుట్టి ఎనిమిది రోజులు రాశాను .న్యాయం చేయగలనని నమ్మకం కలిగింది .ఆ కధ లన్నీ వివిధ పత్రిక లలో ప్రచురింప బడినవే .అయితే ఈకాలం వారికి వాటి సొగసు తెలియ జేయాలని తీవ్రం గా తపించాను .ఇందులోని ప్రతి కధా ప్రత్యేకత సంత రించు కొన్నదే .ప్రతి కధ లో మారుతీ రావు లోనీ ప్రఖ్యాత కధకుడు కన్పిస్తాడు .రచనలో అద్భుత మైన లోక పరిశీలన ఉంది.చెప్పేది సూటిగా గుండెకు తాకెట్లు చెప్ప గల నేర్పున్న కధకుడు మారుతీ రావు..యాభై రెండు పేజీలలో ఈ కధా కదన విశ్లేషణ చేశాను .ఆది నా దగ్గరే నిక్షేపం గా ఇంత కాలం ఉంది .
రెండేళ్ళ క్రితం అంటే 2010 లో మా రెండో కోడలు అంటే మా శర్మ భార్య శ్రీమతి ఇందిర చిన్న తాత గారు శ్రీ నోరి రామకృష్ణయ్య గారు ఏదో సందర్భం లో ఫోన్ లో మాట్లాడుతూ మారుతీ రావు తమ ఇంటికి దగ్గరే చెన్నై లో ఉంటున్నారని రోజు తామిద్దరం మార్నింగ్ వాక్ లో కలుస్తూ ఉంటామని చెప్పారు .అప్పుడు నాకు నేను రాసినది మారుతీ రావు కు పంపితే ఎలా ఉంటుంది /?అని పించింది .దాన్ని ఫోటోస్టాట్ తీసి రామ క్రిష్నయ్య గారికి కొరియర్ చేస్తూ అందులో ఇది చదివి తమకు బాగుంది అని పిస్తే మారుతీ రావు గారికి ఇవ్వమని ,నచ్చక పోతే తమ వద్దే చెత్త బుట్టలో వేసేసుకోమని రాశాను .ఆయనకు అంది చదివి నాకు వెంటనే ఫోన్ చేశారు .చాలా బాగుందని మారుతీ రావు గారికి అందజేశానని ,ఆయన చదివి ఫోన్ స్వయం గా చేస్తారని చెప్పారు .ఆనందించాను ..ఆది మరువక ముందే ఒక రోజు ఉదయం మారుతీ రావు ఫోన్ చేసి నాతో మాట్లాడారు .నేనిది ఊహించలేదు .చాలా బాగా ఉందని చెప్పి, నా వివరాలు అడిగి తెలుసుకొన్నారు .నా భార్య ప్రభావతి నా ప్రక్కనే ఉన్నారా అని అడిగి ఆమె తొ మాట్లాడుతానంటే ఫోన్ ఆమె కు ఇచ్చాను /’’.అమ్మా ‘’అని సంబోధించి కుటుంబ నేపధ్యం, పిల్లల వివరాలు అన్నీ అడిగి తెలుసుకొని సంతోషించారు .తన సెల్ నంబర్ అదే నని అప్పుడప్పుడు మాట్లాడు కుందామని అన్నారు .ఆమె తనకు మారుతీ రావు నటన, సంభాషణా శైలి చాలా ఇష్టం అని చెప్పింది .ఇదీ ఫోన్ పరిచయం .నేనెప్పుడు చొరవ తీసుకొని ఫోన్ చేయలేదు ఆయనా అంతే .
కృష్ణా జిల్లా రచయితల సంఘం రెండవ ప్రపంచ రచయితల సభలు విజయ వాడలో నిర్వ హించి నపుడు మారుతీ రావు గారు వచ్చి మాట్లాడారు .నేను ఆయన ప్రక్కనే కూర్చుండి నా పేరు చెప్పాను .’’అలానా ‘’అని అన్నారు కాని ప్రాధాన్యత ఆమాటలో కని పించలేదు ..విజయ వాడ ఆకాశ వాణిసంచాలకులు ఆ మూడు రోజుల కార్య క్రమాలను నన్ను సమీక్ష గా రాయ మణి చెప్పి దానిని రేడియో లో నాతోనే చది వించారు .దాన్ని పూర్తీ వ్యాసాలుగా రాసి శ్రీ రామ క్రిష్నయ్య గారి కోరిక పై పంపాను .ఆయన చదివి మారుతీ రావు గారికి అందించారట .దాన్ని చదివి మారుతీ రావు ఒక మెయిల్ రాశారు .అందులో తన ప్రసంగం ను సి.డి.ని పంపమని కోరారు .దురదృష్ట వశాత్తు ఆయన మాట్లాడి నప్పుడు నా వాయిస్ రికార్డర్ చార్జి అయి పోయి రికార్డు కాలేదు మిగిలిన వన్నీ రికార్డయ్యాయి ఆ సంగతి వారికి తెలియ జేశాను మెయిల్.లో .
ఇప్పుడు సాహితీ బంధువుఅల కోసం ‘’గొల్ల పూడి కధా మారుతం ‘’మొదలు పెట్టి మొదటి రెండు ఎపి సోడులులు మారుతీ రావు గారికి మెయిల్ చేశాను .వెంటనే ఆయన ఆంగ్లంలో ‘’thanks for your clinical analysis ‘’అని రాశారు .మళ్ళీ రెండు ఎపిసోడ్లను పంపాను .దానికి ఆయన బదులుగా మెయిల్ రాస్తూ ‘’very interesting .please continue .after finishing your reviews please make a c.d of it and send it to me as I am not well versed in telugu coputer knowledge అని రాశారు .ఇదీ గొల్ల పూడి తొ నాకున్న పరిచయం .అదే మీకు తెలియ జేశాను .స్వస్తి
సంపూర్ణం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –22-12-12- ఉయ్యూరు

