తెలుగు కవితా ”జాలం ”
సాహితీ బంధువులకు -తెలుగు తీపి శుభా కాంక్షలు -తిరుమలేశుని సన్నిధి లో జరుగుతున్న తెలుగు సభల సందర్భం గా మనం కూడా అంతర్జాలం లో”తెలుగు కవితా ”జాలం ”పేర కవి సమ్మేళనం నిర్వ హిద్దాం .ఉత్సాహ వంతులైన కవులు ,పండితులు తమ కలాలకు పదును పెట్టి ఈ శీర్షిక లో పాల్గొని మీ” మూషికానికి ”పని చెప్పండి .హృద్యమైన కవితలు పద్యమైనా వచన కవిత్వమైనా పాటైనా రాసి తెలుగు తల్లిని పూజించండి .తెలుగు భాషా వైభవం, సంస్కృతీ విలసనం చారిత్రిక మహౌన్నత్యం పై చక్కగా
స్పందించి వేదిక ను జయప్రదం చేయండి .నేను కొందరు మహాను భావుల కవిత లను ఇక్కడ ముందుగా ఉదహరిస్తున్నాను .
ఆరుద్ర
1- తేనె కన్నా మధురం రా తెలుగు ,ఆ –తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగు గడ్డ పోతు గడ్డ ఎంత పచ్చన ,మా –తెలుగు గుండెలో స్నేహము ఎంత వెచ్చన !
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన ,మన
తరతరాల కధను పాడు గుండె ఝల్లన –పాటు పడిన వాళ్ళకే లోటు లేదని
చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి -లలిత కళలు సంగీతం సాహిత్యం
తెలుగుతల్లి జీవితాన దిన క్రుత్యాలు
గత చక్రిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి !-గర్వించదగ్గ జాతి తెలుగు జాతి
అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం –ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం ”
2– నండూరి రామ కృష్ణ మాచార్యులు
తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగు -పునుగు జవ్వాజి ఆమని పూల వలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు -కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష
3– కుందుర్తి
తీరి బంగారు పందేడు తెలుగు నేల -తేట నీటితో ప్రవహించు తెలుగు నదులు
తెలుగు వాసిని ప్రకటించు తెలుగు గిరులు -తలచు కొన్నంత నా మేను పులకరించు
4– త్యాగ రాజు
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి ధర్మామ్బికే !
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి !ధర్మామ్బికే
కనకాంగి !రమా పతి సోదరి -కావవే నను కాత్యాయినీ !
నను గన్న తల్లి !నా భాగ్యమా -నారాయణి !ధర్మామ్బికే
కావు కావు మణి నే మొర బెట్టగా -కమల లోచన !కరగు చుండగా
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు ?స -దా వరం బోసగు త్యాగ రాజ నుతే
నన్ను గన్న తల్లి ! నా భాగ్యమా !నారాయణీ!-ధర్మామ్బికే
5– శ్రీ శ్రీ
పదవోయి తెలుగు వాడా –అదే నీతెలుగు మేడా –సంకెళ్ళు లేని నేల–సంతోష చంద్ర శాల
6– దాశరధి
తెలుగు పులుగు చేరని దేశం లేదు –తెలుగు వెలుగు దూర లేని కోశం లేదు
7— గురజాడ రాఘవ శర్మ
తెలుగు దేశమేనాయది ,తెలుగు వాడ –తెలుగు తల్లి యనుమ్గు చేతులను బెరిగి
తెలివి గొంటిని ,మంటని ,తెలుగు తల్లి –పేరు నిలుపుటే యాశ యూపిరి జెలంగ
8– రాయప్రోలు సుబ్బా రావు
పాల క్రోమ్మీగడల్ పచ్చి వెన్నయు నిచ్చి –తీయని నును పూసా లాయెనేమో
కమ్మని మకరంద కణములు స్నేహించి -చిన్నారి పలుకులి చిక్కే నేమో
పూల లావణ్యంబుపొంగి చక్కదనాల –పిందేలై రుచి లెక్కి పెరిగే నేమో
సెల ఏటి యుయ్యాల కులుకు టోయ్యారముల్ -ముద్దు ముచ్చట లయి
పాటకును ,పద్యమునకును నబ్రముగా నొదిగి -చవికి చాతుర్యమునకు ,సాజముగా సాగి
పోరునకు ,పోత్తు నకు జాతి పొంది పొసగు –మా తెలుగు తల్లి మెడ కిదే మల్లె దండ .
9– వేముల పల్లి శ్రీ కృష్ణ
చేయెత్తి జైకొట్టు తెలుగోడా -గత మెంతో ఘనకీర్తి కల వాడా
సాటి లేని జాతి -ఓట మెరుగని కోట -నివురు గప్పె నేడు –నిదుర పోతుం డాది-
-జే కొట్టి మేల్కొలుపు తెలుగోడా–గత మెంతో ఘన కీర్తి కల వాడా
10– త్రిపురనేని రామ స్వామి చౌదరి
తేట మాటల దెలియ జెప్పుము –దిక్కు లన్నియు మారు మ్రోగిన
తెలుగు వారల పేరు పెంపును -దెలియ కుండగ నుండ బోకుము
తెలుగు బాలుడ !ఇంపు నింపుము –తెలుగు బాలుడ !పేరు పెంపుము
శ్రీ ద్రోణ వల్లి రామ మోహన రావు (అమెరికా ) సంకలం చేసిన ”దేశ భాష లందు తెలుగు లెస్స ”నుండి సేకరణ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-12-12-ఉయ్యూరు

