సీతమ్మ తలలో పేలు
ఉదయం కాఫీ టిఫిన్ అయింతర్వాత యదా ప్రకారం కంప్యుటర్ ముందు కూర్చుని కొట్టుకొంటు న్నాను ఇంతలో హడా విడి గా కుర్చీ తెచ్చు కొని నా పక్కన కూర్చుంది మా ఆవిడ .”ఏమండీ మీ గోల మీదేనా ఇంట్లో సంగతేమీ పట్టదా ?”అంది ఏదో జరిగి పోయినట్లు .”కూల్ ల్ బాబా కూ ల్ ..
అసలేం జరిగింది ?”అన్నాను .”ఏం జరగాలి ?మీ ”కంపూ ”మీ రాతలేనా ?ఏదో రాయటం ఆహా వాళ్ళు మెచ్చారు ఈహీ వీళ్ళు మెచ్చారు అని చంకలేగరేసుకొంటు అప్పుడప్పుడు మాకేదో కాస్త విని పిస్తూ, కని పిస్తూ బక ధ్యానం లా ” మౌసు రుద్దు కుంటూ” ఉంటారు .ఇంట్లో ఒక రచయిత్రి ఉంది .అదేమైనా రాసిందేమో దాన్ని నెట్లో పెడదాం అనే ధ్యాసే లేదు మీకు ”అంది మళ్ళీ .”నీలో రచయిత ఉందని నాకు ఇంత వరకు తెలీలేదు .ఎప్పుడ య్యావు మహా రచయిత్రివి ?”అని అడిగాను .”మహాను భావా అందరు మీలాగా ఎగరేసుకొని డప్పాలు కొట్టుకోరు .మాలో ను ఉంటారు రాసే వాళ్ళు .కాసింత మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి .”అన్నది . ఇప్పటి దాకా తాను వెనక దాచుకొన్న కాగితాలు ముందుకు లాక్కుంది .”ఏమిటి ఏదైనా రాశావా ?”అన్నాను .”అవును .మొన్న ఆంద్ర జ్యోతి లో వీరప్ప మొయిలి గారి రామాయణం లో” గని కార్మికుల సమ్మె ”చదివి నేనూ రామాయణం లో ఒక సంఘటన గురించి రాయాలను కొని ,కార్య రంగం లోకి దూకి ఒక గంటలో గీకి పారేశా .”నీకు స్పీడ్ గా రాయటం రాదు కదా?”అన్నాను .”నిన్న మన మనవడు చరణ్ తో రాయించా .మీకు చదివి విని పించేదాకా ఎవరికి చెప్పద్దని ఒట్టు వేయించా .మీకు చూపిద్దామంటే ,మీరో మొండి ఘటం .అది బాలేదు ఇది బాలేదని అందరికి వంకలు పెడతారు .ధైర్యం చాల లేదు చూపించటానికి .అయినా ఇవాళ ధైర్యం గా మీ ముందుకు వచ్చా.నేను రాసింది మీ బ్లాగ్ లో పెట్టక పోతే రేపటి నుంచి నేనే ఒక బ్లాగ్ పెట్టి నాకు తోచిందంతా రాసి ఎక్కిస్తాను .ఏదో తేల్చుకోండి .”అంది ఇక లాభం లేదని ఇంతకూ ఏం రాశావు ?అందులో కదా ఏమిటి విశేషమేమిటి ?”అని ప్రస్శ్నించా .”మీరు చదువుతారా ?నన్నే చదివి విని పించ మంటారా ?”అని అడిగింది ”నీ భావాలు నీ గొంతు లోనే వింటే పరి పక్వం గా ఉంటుంది కానీ ”అన్నాను .”సరే .అంతా చదవటం అయ్యే దాకా మీరు నోరు విప్ప రాదు .బాగున్నదాన్ని ”వహ్వా! భేష్ !ఆహా ఏమి రుచి ! /”అని గుటకలు మింగుతూ మెచ్చుకోవాలి .ఇవి కాక ఇంకే మాట మీ నోటంట వచ్చినా” కటీ ఫే ” అని బెదిరించి మొదలు పెట్టింది
నేను రాసిన దానికి పేరు ”సీతమ్మ తలలో పేలు ”.రామ రావణ యుద్ధం అయిన తర్వాత లంక నుంచి సీతా రాముల తో సహా వానర ,రాక్షస సమూహమంతా భార్యా పిల్లలతో సహా అయోధ్యకు పుష్పక విమానం లో వచ్చారు .ఇంకో రెండు రోజుల్లో శ్రీ రాముని పట్టాభిషేకం జరుగ బోతోంది .అయోధ్య అంతా హడా విడి గా ఉంది .రాముడి ని చూడ టానికి ఎన్నో దేశాల నుంచి రాజులు ,రాజ ప్రముఖులు వచ్చి మాట్లాడటం తో ఆయనకు ఒక్క క్షణం కూడా తీఎరు బాటు లేకుండా పోయింది .రోజుకు రెండు సార్లయినా సీతమ్మ వారిని చూడ టానికి వచ్చె వాడు అసలు రావటానికే వీలు కుదరటం లేదు .సంబరాలతో వీధి వీధి అదిరి పోతోంది .అలంకారాలతో అయోధ్య మరో స్వర్గం లా భాసిస్తోంది .ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తెలు తున్నారు .కాని సీతమ్మ వాకిలి మాత్రం బోసి పోతోంది .సీత గది దాటి బయటికి రావటం లేదు .ఎవరికి దర్శనం కూడా ఇవ్వటం లేదు .ఇది రహస్యం గా ఉంచారు అందరు .దీనికి పరిష్కారం ఏదో ఆలోచించే పనిని బాధ్యతను తారా ,రుమ ,విభీషణుడి భార్య మాత్రమె స్వీకరించారు .ఇంకెవ్వరికీ ఇది తెలియదు అయితే ఆంజనేయుడిని మాత్రం లోనికి రాని స్తూ అసలు విషయం బయట పెట్ట నని ప్రతిజ్ఞ చేయించారు అతడి నోటిలో మాట దాగదన్న భయం వాళ్ళది
ఈ ముగ్గురు స్త్రీలు సీతా దేవి రహస్య మందిరం లోనే ఉంటున్నారు .సమస్య బుర్ర బద్దలు చేస్తోంది .సీతమ్మ మహా చికాకుగా ఉంది .చేతులేప్పుడు తల మీదే ఉంటున్నాయి బరికి బరికి పెడుతోంది జుట్టును .కాని ఏమీ లాభం కని పించటం లేదు .మహా విచారం గా ఉంది .అర గంట కోసారి తలా రా స్నానం చేయించి వీరు ఆమె కురులను దువ్వి జడ వేస్తున్నారు .దాసీలను కూడా లోపలి రానివ్వటం లేదు .దువ్వెన ల తో సీత తల దువ్వు తుంటే వేలాది పేలు రాలి కింద పడుతున్నాయి .వాటిని గోళ్ళమధ్య పెట్టి చంపేస్తున్నారు .కారిన పేలు గుట్టలు గుట్టలు గా ఉన్నాయి . వాటిని కాల్చి పారేస్తున్నారు .అయినా ప్రయోజనం కనీ పించలేదు .మళ్ళీ పది నిమిషాలలో జుట్టంతా పేలతో అట్ట కడుతోంది . చేతులు నొప్పి పెడుతున్నాయి వీళ్ళకి .దిక్కు తోచటం లేదు .
ఈ కమిటీ కి పెద్ద తార .రుమ , విభీషణుడి భార్య సహాయకులు .తార ఆన్జనేయుడిని పిలి పించింది .”హనుమా !వెంటనే కిష్కింధకు వెళ్లి ఎవరికి ఏమీ చెప్పకుండా మా పరి చారకులను అడిగి మేము తల దువ్వుకొనే కొమ్ము దువ్వెనలు అత్యవసరం గా తీసుకొని రావాలి .ఇక్కడున్నట్లు రావాలి ”అని చెప్పింది .ఆఘ మేఘాల మీద హనుమ వెళ్లి కొమ్ము దువ్వెనలు తెచ్చి ఇచ్చాడు .ముగ్గురు కూర్చుని సీత జుట్టు దువ్వారు .పేలు రాలి పడి పోయాయి .సంతోషం ఎక్కువ సేపు నిలవ లేదు .మళ్ళీ జుట్టు అంతా పెలతో జడ కట్టింది .వీళ్ళు తల పట్టు కు కూర్చున్నారు విచారం గా. తలంటి పోసినా పరిస్తితి లో మార్పు లేదు .ఒక అరగంట తర్వాతా మళ్ళీ ఆంజ నేయుడికి కబురు వెళ్ళింది .ఏమి కొంప మునిగిందో నని పరుగున వచ్చాడు .ఈ సారి విభీ ష నుడి భార్య హనుమ చెవిలో ”లంకకు వెళ్లి బావ గారు రావణా సురులు సముద్రం నుంచి తీయించి పుష్పకాని కి వాడే ”రాతి నూనె ”ఒక డబ్బాతో తీసుకొని రా వాలి .నీకోసం వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తుంటాము .మధ్యలో ఎక్కడా కోతి పనులు చెయ్యకుండా ఇక్కడున్నట్లు రావాలి ”అంది ఇప్పుడే కిష్కింధకు వెళ్లి వచ్చాడు .కాళ్ళు పీకుతున్నాయి వెళ్ళనంటే ఏం కొంప మునుగుతుందో నని కిక్కురు మనకుండా కాళ్ళు పిసుక్కొంటూ గాలిలో ఎగిరాడు .అన్నట్లే వెంటనే తెచ్చాడు .రాతి నూనెను సీత తలకు పట్టించి అరగంట ఆగి తలంటి పోసి జడే శారు .రాలిన పపేలను చూసి మురిసి పోయారు .కాని అయిదు నిమిషాలలో జడంతా పేల మయం .సమయం దగ్గర పడుతోంది పట్టాభి షే కానికి .అసలు సీతకు పేలు ఎందుకు పడ్డాయి అని వితర్కించు కొన్నారు .తమతో విమానం లో సీత ప్రయాణం చేయటం వల్ల లంకలో జుట్టు దువ్వుకోక పోయినందు వల్లా , జడలు కట్టటం వల్లా, పేలు చెలరేగి పోయాయని తమ తలలలో పేలే సీత తలలో చేరాయని తప్పంతా తమదే నని బాధ పడ్డారు .ఇక ఆలసించిన ఆశా భంగం .ఎలా గై నా దీన్ని శ్రీ రాముడికే నివేదించాలని నిర్ణయించి హనుమను రాముడి దగ్గరికి వెళ్లి వెంటనే రామనమని కబురు పంపారు .
తిరుగు టపాలో రాముడు పరిగెత్తుకొచ్చాడు సీతమ్మ రహస్య మందిరం లోకి .సీత కనీ పించక దిగులు చెందాడు .ఈ ముగ్గురు స్త్రీలు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు .అప్పుడు నెమ్మదిగా తార రాముడిని సమీపించి ”స్వామీ !సీతమ్మ తలలో విపరీతం గా పేలు చేరాయి .మేము ఆమెతో లంక నుంచి రావటం వల్ల ఈ మహాపచారం జరిగింది .మా తలలలో ఒక్క పేను కూడా లేదు అన్నీ ఆమె తలలోనే ఉన్నాయి. ఎన్ని రకాలుగానో పేలు విరగడ అవటానికి ప్రయత్నించాం .అరగంట కో సారి తలంటి పోస్తు ,దువ్వుతూ పేలు తీసేస్తున్నా మళ్ళీ వచ్చి పాతుకు పోతున్నాయి. కొయ్య దువ్వేనల్తో దువ్వాము . లంక నుంచి రాతి తైలం కూడా తెప్పించి తలకు పట్టించాం .గుణం కని పించలేదు స్వామీ .సీతమ్మ గది దాటి బయటికి రాలేక పోతోంది .దిక్కు తోచక ఇక నీవె దిక్కు అని కబురు చేశాం .ఈ ఆపద నువ్వే బాపాలి పట్టాభి షే కానికి సీత ముఖం లో చిరు నవ్వు చూడాలి .”అని విన్న వించారు .రాముడు తాను సీత తో మా టలాడ వచ్చా అని అడిగితే ,ఆమె గది లో నుండే సమాధానం ఇస్తుందన్నారు .కారణమేమిటి అని అడిగాడు సీతను .ఆమె ముక్కు చీదు కొంటు, దగ్గుతూ, తుమ్ముతు రుద్ధ స్వరం తో తానీ బాధ భరించ లేకున్నానని , వెంటనే ఉపశమనం కలిగించే ఉపాయం ఆలోచించ మని చెప్పింది
శ్రీ రాముడు రుమ తో ”సీతమ్మ వాకిట్లో సిరి మల్లె పూస్తోందా ? /”అని అడిగాడు ”పూస్తోంది స్వామీ ! సీతమ్మ వచ్చినదగ్గర నుంచి ప్రత్యెక శ్రద్ధ తీసుకొని పాదు చేయించి ,నీరు పోస్తు కంటికి రెప్పలా చూస్తోంది అందుకని విరగ పూసింది చెట్టు ”అంది ”అయినా పే లకూ సిరి మల్లెకూ సంబంధమేమిటి స్వామీ ?/మోకాలికి బట్ట తలకు ముడి పెట్టి నట్లు “‘అని అందామను కొని మాటల్ని గొంతులోనే నోక్కేసు కొంది .’మల్లె ప్పోలతో పేలు పెరుగుతాయని వింది ఇదేమి చోద్యం అను కొంది .”అయితే బాగా విచ్చిన సిరి మల్లె పూలతో మంచి అందమైన దండ గుచ్చి అత్యవసరం గా తీసుకొని రండి ”అని ఆజ్ఞా పించారు ముగ్గురు గబ గబా వెళ్లి మంచి పూలు కోసి గొప్ప దండను గుచ్చి రాముడి కి ఇచ్చారు ”’ఇప్పుడు సీతను నా దగ్గరకు రమ్మనమని చెప్పండి ”అన్నాడు .వెంటనే ముఖం చెంగుతో కప్పుకొని సీత వచ్చ్చింది వెనక అడుగులు వేసుకొంటూ .రాముడు సీతా దేవి దగ్గరకు వెళ్లి ఆమె కొప్పులో ”సిరి మల్లె పూల చెండు తురిమాడు.అంతే క్షణాల మీద ఆమె తలలోని పే లన్నీరాలి నేల మీద పడి ఒక కుప్ప గా మారి దండు లాగా ఆకాశం లోకి యెగిరి పోయాయి .మళ్ళీ ఒక్క పే ను అంటే ఒక్క పేను సీతమ్మ తల లో కనీ పించలేదు అందరు ఊపిరి పీల్చుకొన్నారు .రాముడు మాత్రం నెత్తిన ఉత్తరీయం కప్పుకొని ఆ పేలు ఏమైనా తన తలకు ఎక్కు తా ఏమో నని అక్కడి నుండి జారుకొన్నాడు .ఇదంతా సిరి మల్లె పూవు మహాత్మ్యం అని అందరు సంతోషించారు సీతమ్మ ముఖం లో చిరు నవ్వు వెలిగింది .ముఖం చంద్ర బింబమే అయింది ఆమె ఆనంద తాండవమే చేసింది పట్టాభి షే కానికి గంట కొట్టారు అందరు కదిలి వెళ్ళారు ”
చదవటం ఆపింది మా ఆవిడ .”ఏమిటి స్వామీ మీ భాష్యం ?”ఇది నేను నెట్ లో పెడితే నెట్టును ,నా జుట్టును పీకేస్తారు నెటిజన్లు .ఆ సాహసం నేను చెయ్య లేను”అన్నాను ”మీకేమీ ఇబ్బంది ఉండదు -అందుకే నేను దీనికి తోక గా”నా రామాయణం -నా ఇష్టం ”అని కేప్షన్ పెట్టాను .మీరు” రచయిత్రి ఇది స్వంత అభి ప్రాయం సంపాదకుడికి కాని,బ్లాగు కు కాని సంబంధం లేదు” .అనిరాసి బ్లాగ్ లో దూర్చండి ”అని ఓ సలహా పారేసి వంటింట్లోకి దూరింది .”హా 1 హత విధీ !”అను కొంటు నా బుర్రలో చేరిన పేలను పీక్కుంటున్నాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-13-ఉయ్యూరు .

హి హ్హి హ్హీ! 🙂
LikeLike
ఎంధుకు సార్, ఇలా మీలాంటి పెద్దలు కూడ మన దేవుల్లని కించపరుస్తూ హాస్యం పండించాలని అనుకుంటారు…
మీరు పెద్దవాల్లు మాలంటి పిల్లలకి ఆదర్సం గా ఉండవలసిన వాల్లు.. దయచేసి ఇలంటి పిచ్చి హాస్యపు వ్రాతలని ప్రచురించకండి ప్లీజ్..
ప్లీజ్..
ప్లీజ్..
LikeLike
‘పేలిందండీ ‘ కథ !
ఇంత కిటుకు ఉందన్న మాట మల్లె పూల ‘గుభాళింపు’ లో !
జిలేబి.
LikeLike
just అద్భుతః
విస్సెం గారికి కోప్మొచ్చింది ……….
విశ్వం గారూ ! హాస్యాన్ని హాస్యంగా తీసుకోవాలి కాని మరీ సిరియస్సైతే ఎలా ఎలా బ్రదరూ….!
– నరసింహ రావు
LikeLike
.విశ్వం గారికి ఒక సజెషన్
బ్రదరూ !
‘ఓమైగాడ్’ పరేష్ రావాల్ హిందీ సినిమా ఒక సారి చూడండి
నరసింహ రావు
LikeLike
బాగుంది గురువు గారూ… అందరూ మెచ్చుకున్నారు.
విశ్వరూపం సినిమానీ, కడలి సినిమానీ ముస్లింలు, క్రిస్టియన్లు ఆపేస్తున్నారు. అసలు అందులో నిజంగా వారి దేవుళ్ళని కించపరిచారో లేదో తెలియకుండా.
మనం మాత్రం మన సీతమ్మ ని తలలో పేలు, చెవిలో పువ్వు అని హాస్యం చేసుకుందాం.
LikeLike