మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22
బెనడేట్తో క్రోచ్
ఇటలీకి చెందిన బెనదడేట్తో క్రోచ్ 1966 ఫిబ్రవరి 25న పెస్కాస్సరోలి లో జన్మించాడు .గొప్ప చరిత్రకారుడు ,సాహితీ విమర్శకుడు .నేపిల్స్ లో కేధలిక్ బడి లో చదివాడు .1883 భూ కంపం లో అతని 17వ ఏట తలిదంద్రులిద్దరు మరణించారు .క్రోచ్ కూడా శిధిలాలలో చాలా రోజులు కప్పు బడి ఉన్నాడు .ఒళ్లంతా గాయాల తో చాలా కాలం ఇబ్బంది పడ్డాడు .
రోం నగరం చేరి బాబాయి దగ్గర కొంతకాలం ఉండి యూనివర్సిటి లో చేరాడు .కాని విద్య సాగలేదు .మళ్ళీ 1886 నేపిల్స్ కు చేరాడు .చరిత్ర పై చాలా పరిశోధనలు చేశాడు 1893 లో చరిత్ర తీరు ,సాహిత్య విమర్శల పై రెండు వ్యాసాలూ రాశాడు వీటి తో అతని పేరు మారు మోగింది .క్రమంగా మత సిద్ధాంతాల పై ద్రుష్టి పెట్టి రచనా వ్యాసంగం కోన సాగించాడు .1902 లో క్రోచ్ స్వంత భావాలకు ఆవిష్కరణ చేసి దర్శన శాస్త్రం లో అందరి దృష్టినీ ఆకర్షించాడు .సౌందర్యం ,తర్కం ,ప్రవర్తన ,చరిత్ర లేఖనం (హిస్టోరియోగ్రఫీ)అని నాలుగు భాగాలుగా తన దర్శన శాస్త్రాన్ని రాశాడు
1909 లో ‘’విమర్శ ‘’అనే పత్రిక స్తాపించి సాహిత్యం లో ,చరిత్రలో యాభై ఏళ్ళు గా ఇటలీ సాధించిన దాని పై సమీక్ష వ్యాసాలూ రాశాడు 1926 కే 20 గ్రంధాలు రాసి ప్రాముఖ స్తానాన్ని పొందాడు .అతని విద్వత్తు ను గుర్తిచి ఇటలీ రాజ్య సభకు సభ్యత్వాన్ని ప్రసాదించింది ప్రభుత్వం 1920-21 లో విద్యా మంత్రి గా కూడా పని చేశాడు క్రోచ్ దర్శనం ఫ్రాన్సేస్కో డే సాన్క్తిస్ట్ రాసిన సాహిత్య విమర్శ ,జియాం బాటిస్టా ఆలోచనల తో ను నిండి ఉంటుంది వీరి ప్రభావం ఆయన రాసిన సాహిత్యం ,చరిత్ర లో చేసిన పరిశోధనల లో కూడా కనీ పిస్తుంది .
క్రోచ్ చేసిన గొప్ప పని సౌందర్యానికి చరిత్రకు కొత్త అర్ధాలను చెప్పటం .అందుకే నూతన మత మార్గ దర్శి అని పించుకొన్నాడు .చరిత్ర నిజ స్తితి చూస్తె తనకు ఒక గట్టి సత్యం (కాంక్రీట్ రియాలిటి )కనీ పించింది అన్నాడు .దీన్ని ఆధారం గా చేసుకొనే తన నూతన చరిత్ర ను వ్యాఖ్యానిన్చానని తెలియ జేశాడు కనుక చరిత్ర మూర్త దర్శన శాస్త్రము (కాంక్రీట్ ఫిలాసఫీ )ఒకటే అని బలం గా చెప్పాడు .చరిత్రలో అంతర్గతం గా ఉన్న (ఇమ్మనేంట్ )పద్ధతిని కనుగొని దానికి ఒక రూపం ఇవ్వటమే దర్శన శాస్త్రం యొక్క పరమార్ధం అన్నాడు
అనుభవాతీత సత్యాలకు ,మూల తత్వాలకు ,చరమ లక్ష్యాలకు క్రోచ్ తన దర్శన శాస్త్రం లో చోటు కల్పించలేదు .కల్పనలను కూడా వదిలి పెట్టాడు .క్రోచ్ దర్శనాన్ని ‘’ఆత్మ దర్శనం ‘’(ఫిలాసఫీ ఆఫ్ స్పిరిట్ )అని పిలిచాడు .వాస్తవ సంఘటనలే చరిత్ర ,అలాంటి సంఘటనల ను వ్యాఖ్యానించే చరిత్ర ఒకే చైతన్యం యొక్క పని అని చెప్పాడు .చరిత్రలో ఆత్మ స్వయం గా వ్యక్తమవుతుందని ,చరిత్రనే శరీరం గా చేసుకొని చరిత్ర అన్ని భాగాలలలోను ఆత్మ సంపూర్ణం గా, అఖండం గా క్రియా రూపం లో ప్రత్యక్ష మై ఉంటుందని వివ రించాడు అలాంటి దాని ఉనికి ,ప్రవ్రుత్తి ,మానవ చరిత్రకే పరి మితం కాలేదు అనుభవాల యొక్క చివరి అవధులను కూడా దాటి ప్రవ్రుత్తి అన్ని వైపులా విస్తరిస్తుంది .
అనుభం లో వ్యాపించి ఉండే ఆత్మ ఏకం ,అఖండం అంటే కాక ఆత్మ ఏకం ,చతుర్ముఖం కూడా అంటాడు బెనదేట్తో .దీనికి స్పష్టం ,నిత్యం ,విభిన్నం ప్రయోజనం ,అనే దశలుంటాయి.వీటి మధ్య ఆత్మా నిరంతరం ఉండి ముందుకు పోతుంది .ఈ ప్రయాణం లో అది తన అనుభవం తో తనకు తాను పూరించు కొంటుంది .తన అస్తిత్వాన్ని సాఫల్యం చేసు కొంటుంది .ఈ నాలుగు వృత్తులు అనుభవ విషయాలను సృస్టిస్తాయి .ఇవి సౌందర్యం ,తర్కం ,అర్ధ,నీతిశాస్త్రాలకు చెంది ఉంటాయి .ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ దర్శన శాస్త్రం అని పించు కొంటుంది .
అందరు చెప్పే సత్యం శివం సుందరం లకు ప్రయోజనం అనే నాలుగవ దానిని కొత్తగా క్రోచ్ చేర్చడన్న మాట .జ్ఞానం లో ఆత్మ కళ గా వ్యక్తమవుతుంది .ఇలా తనను తానూ ఆవిష్కరించు కోవటం లోనే దానికి సృజనాత్మకత ఉందని తెలుస్తోంది .జ్ఞానం యొక్క మొదటి దశనే కళ అంటారు ఈ దశ లో అది ఆక్రుతులలో (ఏమ్బాడి మెంట్స్ ) లో వ్యక్తమవుతుంది .ఆత్మ జ్ఞానం విషయం సౌందర్య విషయం కూడా దాని ప్రవ్రుత్తి ఫలితమే . విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ప్రతి విషయం లోను ఆత్మ ఆకారాన్ని పొందుతుంది .కనుక అలాంటి విషయం సౌందర్యం అని పించుకొంటుంది .
కళఅంటే భావం లేక రూపం లేక అనుభావాంశం ను అనుసంధానం చేయటమే అని నిర్వచించాడు .అలాంటి అనుసందానాన్నే రూపాభి వ్యక్తీ అని ,భావాల్ని బహిర్గతం చేయటం కేవలం యాంత్రిక శిల్పం అని ఆయన అభిప్రాయ పడ్డాడు .కళా ఖండాలలో ఆవిష్కరింప బడిన భావాలను మళ్ళీ భావన చేయటం వలన మూల భావం మళ్ళీ ఆవిష్కారమవుతుందని క్రోచ్ చెప్పాడు జ్ఞానం యొక్క రెండవ దశ అయిన తర్కం లేక కేవల అమూర్త దర్శన శాస్త్రం .ఇందులో జ్ఞానం అన్ని విషయాలలోనూ అభి వ్యక్తం అవుతుంది .ఈ సామాన్య విషయాలను అస్తిత్వం లోకి తెచ్చి జ్ఞానం తన దృష్టికి విషయం గా మార్చు కొంటుంది .ఆత్మ యొక్క పై రెండు స్తితులు చరిత్రను వాస్తవ మార్గం లో రూపొందిస్తుంది అని బెనడేట్తో క్రోచ్ ప్రగాఢ విశ్వాసం .86 ఏళ్ళు నిండుగా జీవించి క్రోచ్ 1952 నవంబర్ ఇరవై న చని పోయాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-13- ఉయ్యూరు
.

