దర్శనీయ మతాలు –మతాచార్యులు -25

దర్శనీయ మతాలు –మతాచార్యులు -25

హేడేగ్గర్

జర్మనీ దేశానికి చెందినమార్టిన్ హేడే గ్గర్  దార్శనికుడు1889 లోసెప్టెంబర్ 26 న ‘’మెన్ కిర్ష్ ‘’అనే గ్రామం లో జన్మించాడు .ఆర్గ్ బర్గ్ ,ఫై బర్గ్ యూని వర్సిటీలలో దార్శనిక శాస్త్ర అధ్యాపకుడు గా పని చేశాడు .రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా ‘’బ్లాక్ ఫారెస్ట్ ‘’ఆనే నిర్మానుష్య ప్రదేశం లో నివాసం ఉన్నాడు

హేడేగ్గర్ ను అస్తవ వాది అని పిలిచినా ఆయనకు ఇష్టమైనది సత్య శాస్త్రమే .సామాన్య సత్యాన్ని పరిష్కరించాలి అంటే ముందు మానవ సత్యాన్ని విచారించాలి అంటాడు .మనిషి లోనే సత్యం తనను తానూ తెలుసుకొనే స్తితి లోకి వచ్చే సింది అని భావించాడు .మనిషికి సత్యం ఉందని అది తనలోనే ఉందని తెలుసు అంటాడు హేడేగ్గర్ .అతని సత్యం జ్ఞానం తో కలిసే ఉంటుంది .కనుక మిగిలిన సచేతన ,అచేతన వస్తువు ల సత్యం కంటే భిన్నమైనది .,విచక్షణ మైనది .ఈ సత్యాన్నే హేడేగ్గర్ అస్తిత్వ వాదం అన్నాడు .ఆటను రాసిన ”బీయింగ్ అండ్ టైం”గ్రంధం ఇరవయ్యవ శతాబ్దపు అపూర్వ గ్రంధం అని పించు కొంది   నాజీలతో సాన్నిహిత్యం ఎక్కువ దాన్ని తిరస్క రించలేదు తానూ హాగ స్వామి అయినందుకు చిన్తించలేదు క్ష్మాపణా  చెప్ప లేదు  అందుకే వివాదా స్పదుడు అ య్యాడు కాని ఆన్తరంగికులలతో ”అలా చేయటం తన అతి పెద్ద దోషం” అని అన్నా ట

Being and Time (1927)Poetry, language, thoughtAn Introduction to MetaphysicsPathmarks

‘’సత్యం కాలం’’ ,అనేది ఈయన ప్రధాన గ్రంధం . మానవ  అస్తిత్వ విషయం టో ప్రారంభించి ,సామాన్య అస్తిత్వానికి పరిష్కారం సాధించాడు .కాని ఆ పుస్తకాన్ని పూర్తీ చేయ లేక పోయాడు .మానవ అస్తిత్వాన్ని దాటి వెళ్ళ లేక పోయాడు .ఈ సత్యాన్ని ఒక ‘’ఆవేదన ‘’గా భావించాడు .ఆ ఆవేదన లో శక్యత ,భూత స్తితి ,పతనం అనే మూడు అంశాలున్నాయని చెప్పాడు .మానవుడు భవిష్యత్తు వైపు చూపు సారిస్తాడు .ఇతనికి అనేక మార్గాలు తెరచే ఉన్నాయి .దేన్ని  తీస్కొంటే ,జీవితం సార్ధకత చెందు తుందో తనకు తానె నిర్ణ యించు కోవాలి .ఈ నిర్ణయ సంభావ్యతనే ;’’శక్తత ‘’అన్నాడు .మానవుడు కోరుకొన్న సన్నీ వేశం ఇది కాదు .గతించిన దాని నుంచే భవిష్యత్తు నిర్ణ యించుకోవాలి .దీనికే ‘’భూత స్తితి ‘’అని పేరు పెట్టాడు .మానవ పతనం వర్తమానానికి సంబంధించిందే .రోజు కనీ పించే అవకాశాల రూపం లో అది ఉంటుంది .ఈ వర్త మాన అవస్తలో మానవుడు చిక్కు కొని ఉన్నాడు అని హేడేగ్గర్ అభి ప్రాయం .

అస్తిత్వాన్ని హేడేగ్గర్ సార్ధకతా సహితం సార్ధకతా రహితం అని రెండు రకాలుగా విభ జించాడు .జన సామాన్యం లో మనిషి ఉండి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు .అలాంటి స్తితిలో ఉత్తేజం పొంది తన అస్తిత్వాన్ని బాధ్యతా యుతం గా తీర్చి దిద్దు కొంటాడు .మృత్యు భీతి అతని ప్రవర్తనలో మార్పుకు కారణం అవుతుంది .జనాల నుండి అతను విడుదల పొందటం అనేది అస్తిత్వం యొక్క శూన్య స్వభావమును గుర్తించటం వల్ల కలిగినదే .

హేదేగ్గర్ ‘’అది భౌతిక శాస్త్రం అంటే ఏమిటి ?’’’’అతి భౌతిక శాస్త్ర ఉపోద్ఘాతం ‘’,’’దారువనం ( Holzwege)అనే గ్రంధాలు ఆ తర్వాతా రాశాడు .సత్య శాస్త్ర విషయాలను మరింత విపులం గా చర్చించి వీటిలో రాశాడు .అతని మనవ అస్తిత్వ విషయం శూన్యం దగ్గరకు చేరింది .అతని అతి భౌతిక శాస్త్రం లో ‘’ఏదైనా ఎందుకు ఇక్కడ ఉంది ?ఏమీ లేకుండా ఎందుకుండా కూడదు / అనేవి మూల ప్రశ్నలు అస్తిత్వం యొక్క ప్రతి ద్వందియే శూన్యం .ఈ రెండు పరస్పర విరుద్ధాలు .హేడేగ్గర్ ఆలోచనలు చివరికి ‘’అపరోక్ష అనుభవం ‘’వైపుకు సాగాయి .ఈ భావాన్ని జెన్ బౌద్ధం తో ,మాస్టర్ ఎకార్ట్ అపరోక్ష అను భావం తో పోలుస్తారు .ఇతని తార్కిక విశ్లేషణ సత్య సాక్షాత్కారానికి దారి తీసింది

జర్మనీ భాష లో పదాల వ్యుత్పత్తి అర్ధాలను హేడేగ్గర్ ఎక్కువ గా వాడుకొన్నాడు కనుక భాష అంత సరళం గా ఉండదు .సమకాలీన ఐరోపా ఆలోచనా పరులలలో హేడే గ్గర్ అత్యంత ప్రతిభా వంతుదని పించు కొన్నాడు జీన్ పాల్ సాత్రే పై, హేదేగ్గర్ ప్రభావం ఎక్కువ .ఈశ్వర శాస్త్రం ,మనస్తత్వ శాస్త్రాల పై కూడా హేడేగ్గర్ ప్రభావం ఎక్కు 1976 మే 26న ఎనభై ఏడేళ్ళ వయసులో మరణించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-13- ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to దర్శనీయ మతాలు –మతాచార్యులు -25

  1. sunna's avatar sunna says:

    darsanIya matAlu? Being an educator all your life, you should look for mistakes before you throw your posts on blog. Spelling mistakes are one too many too. Writing these is good but writing them in a good language without mistakes is better. Should be some sort of copy and paste mistake from earlier post of darsaniaya devalayalu 😦

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.