విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం )
మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు
త్రిశత –క్రీ.పూ.పదవ శతాబ్ది వాడు .తండ్రి రెండవ వాగ్భటుడు .దీర్ఘ కాలిక వ్యాధులకు ‘’చికిత్సా కలిక ‘’అనే ఒక సిద్ధాంత గ్రంధం రాశాడు .అతిసార ,,మూత్ర పిండాల వ్యాధులను గురించి వివ రించాడు .మూత్ర పిండం లోరాళ్ళు ఫిస్త్యులా రక్త స్రావం వగైరాలపై ద్రుష్టి పెట్టాడు .
వంగ సేన –పదమూడవ శతాబ్ది బెంగాల్ వాడు తండ్రి దదాధర వద్దనే వైద్యం అభ్యసించాడు .’’చికిత్సా సార సంగ్రహ ‘’రచించాడు .వ్యాధి నిరూపణ అంటే నిదానం పై నూట తొంభై నాలుగుభాగాలు రాశాడు .
అమరసింహ –రోగ కారణ సంబంధ శాస్త్ర వేత్త (ఏటియాలజి ) లో నిధి .పద్నాలుగో శతాబ్ది వాడు .తండ్రి రాజ పుత్ర .కాశ్మీర్ భిషక్ వరుడు తోమార దేవ వర్మ నుండి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. వేదం, సాహిత్యం ,ధర్మ శాస్త్రం ,తంత్ర శాస్త్రాలను ‘’వీర సింహావ లోకన ‘’గ్రంధం లో వివరించాడు .
వర్ధ మాన –భౌతిక శాస్త్ర వేత్త .పద్నాలుగో శతాబ్దం వాడు .వైశేషిక ,న్యాయ శాస్త్రాలలో మహా పండితుడు .న్యాయ కుసుమావళి ,శ్రీ వల్లభ
న్యాయ లీలావతి ,ఖండన ఖండ ఖాద్య ప్రకాశిక ,తత్వ చింతామణి ,న్యాయ బిందు ప్రకాశిక ,న్యాయ పరిశిష్ట మొదలైన గ్రంధ కర్త.
ఉదయనా చార్య—పన్నెండవ శతాబ్దం కు చెందినా తార్కికుడు .తత్వ వేత్త .న్యాయ వైశేషిశికాలలో దిట్ట .వీటిపై అనేక గ్రంధాలు రాశాడు .ఆత్మ తత్వ వివేక ,కనద సూత్ర భాష్య ,జాతి నిగ్రహస్థాన వ్యాఖ్య ,న్యాయ కుసుమాంజలి ,న్యాయ పరిశిష్ట రాశాడు .
ఉగాదిత్య –ఎనిమిదో శతాబ్దికి చెందినాకర్నాటక శాస్త్రజ్ఞుడు .జైన మతం లో ప్రముఖుడు .రాష్ట్ర కోట రాజు నృప తుంగ ఈయన వైద్య శాస్త్ర పరి ణతికి ముగ్ధుడై తన ఆస్తానం లో రాజ వైద్యునిగా నియమించాడు .మాంసం ,మద్యాలను నిషేధించాడు ‘’కళ్యాణ కారక ‘’వైద్య గ్రంధం రాశాడు .జైన సాహిత్యం లో దీనికి ప్రాధాన్యత ఉంది .
వామ దేవ –ఖగోళ శాస్త్ర వేత్త ..గౌతమ మహర్షి కుమారుడు వేదకాలం వాడు .బృహస్పతి(జూపిటర్) గ్రహాన్ని మొదట గుర్తించిన వాడు .ఋగ్వేద అధర్వణ వేదాలలో ఈయన ప్రస్తావన ఉంది ..
వృంద—రసవాది .సిద్ధ వైద్యం లో గొప్ప వాడు .తొమ్మిదో శతాబ్ది వాడు ‘’సిద్ధ యోగ ‘’రచయిత .రాగి అభ్రకం ,గంధకం మొదలైన వాటిని మందులలో వాడే విధానం సూచించాడు .
వ్యాడి—రత్న పరిశోధకుడు .క్రీ పూ ఆరవ శతాబ్ది వాడు .వ్యాకరణ వేత్త కూడా .పాణిని తర్వాత అంతటి స్తానం పొందిన వాడు .
సర్సేన—క్రీ.శ.అయిదు వందల వాడు .ఖగోళ శాస్త్ర వేత్త .’’రోమక సిద్ధాంత ‘’గ్రంధం రాశాడు .చంద్ర గ్రహ ముడి (నోడ్)పరిభ్రమణ ఒడవు చంద్ర గ్రహ సంబంధ అతి గొప్ప ,వాస్తవ అక్షాంశ రేఖ గూర్చి వివరణ నిచ్చారు .
శివ దాస సేన –పదిహేనవ శతాబ్ది వాడు .వైద్య వేత్త .బెంగాల్ రాజు ఆస్తాన వైద్యుడు .చక్ర పాణిదత్తా ‘’ద్రవ్య గుణ సంగ్రహ ‘’మీద ,చరక సంహిత మీద విపులమైన వ్యాఖ్య రాశాడు .నాడి ద్వారా శరీర తత్వాన్ని తెలుసుకొనే విధం రాశాడు
శౌనక –మహా ముని. విష శాస్త్రం మీద అధారిటి ఉన్న వాడు .’’శౌనక తంత్ర ‘’రాశాడు ఇందులో ప్రక్రుతి లో ఉన్న అన్ని విషాలను, వాటి విరుగుడు లను గురించి రాశాడు .
శివ దత్త మిశ్ర –ఔషధ నిర్మాణ శాస్త్ర వేత్త .పదిహేడవ శతాబ్ది వాడు .ఔషధ కర్త ,ప్రయోగ శాలి .ఔషధ విజ్ఞాన శాస్త్రానికి పదకోశాన్ని సంస్కృత అక్షర మాల గా రాశాడు .540శ్లోకాలున్న గ్రంధం ఇది .వ్యాధి విభజన (నోసాలజి )మీద ‘’సమాజ సముచ్చయ ‘’గ్రంధం రాశాడు .480శ్లోకాలతో మూలికా నిఘంటువు (మెటీరియా మెడిక )రాశాడు చికిత్సా శాస్త్రం (ధేరాప్యూటిక్స్ )ను అందులో ఇమిడ్చాడు .రెండర్దాలిచ్చే శబ్దాలతో ఒక డిక్షనరీ రాశాడు. ఔషధ మొక్కలు మూలికా వైద్యం గురించి అందరికి తెలియ కుండా ఇలా కట్టు దిట్టం చేశాడు .వివరాలన్నీ కోడ్ భాష లో ఉన్నాయి .
ఇలా ఎంద రెందరో అలనాటి మన శాస్త్రజ్ఞులు న్నారు .వారి ని గురించి రేఖా మాత్రం గానే పరిచయం చేశాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఈ అదృష్టాన్ని నాతొ బాటు మీకూ అందించాలనే తపనే మీకు ఈ వివరాలను అందజేసింది .ఈ వ్యాస పరంపరకు ముఖ్య ఆధారం శ్రీ వాసవ్య రచించిన ‘’ప్రాచీన భారతీయ శాస్త్ర వేత్తలు ‘’అని మొదటి ఎపిసోడ్ లోనే తెలియ జేశాను .మళ్ళీ ఒక సారి చెబుతున్నాను అంతే.
మన కుతుబ్ మీనార్
మన ప్రాచీన ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణ ధిల్లీ లో మేహ్రోలి వద్ద ఉన్న ‘’కుతుబ్ మీనార్ ‘’. ప్రతి ఏడాది జూన్ 22 న దీని నీడ భూమి మీద పడక పోవటం అద్భుతం .28.5డిగ్రీల ఉత్తర అక్షాంశాం మీద ఇది ఉంది .ఈ నిర్మాణం 5డిగ్రీలు వాలి ఉండటం వల్ల భూ మధ్య రేఖ కు అటూ ఇటూ గా సూర్యుడి చలనం వల్లదీని నీడ భూమి మీద పడదు .
అలాగే కన్యా కుమారి వద్ద నిర్మించిన గాంధీ స్మారక కట్టడం లో ఏడాది లో అక్టోబర్ రెండవ తేది అంటే మహాత్ముడి గారి పుట్టిన రోజు న కట్టడం లోపల ప్రతిష్టింప బడిన గాంధి విగ్రహం మీద సూర్య కరణాలు ప్రసరిస్తాయి .
తమిళ నాడు లో ‘’అడుతురై ‘’అనే చిన్న ఊరిలో ‘’సూర్య నార్ కోవిల్ ‘’అంటే సూర్య దేవాలయం’’ మన ప్రాచీన నిర్మాణ చాతుర్యానికి నిదర్శన గా ఉంది .ఇలాంటివి శ్రీ కాళ హస్తి ,శ్రీ రంగం దేవాలయాలు మరెన్నో దేవాలయాలలో కూడా ఉన్నాయి .అబ్బుర పరుస్తాయి
మన ద్రుష్టి అభ్యుదయం వైపు ప్రసరించాలి .అందుకే కణాద మహర్షి .’’ద్రుస్టానాం దృస్ట ప్రయోజనానాం –దృష్టా భావే ప్రయోగో భ్యుదయాయ ‘’అని చెప్పాడు .దీని భావం –మనకు తెలిసిన విజ్ఞానం అందరికి పంచె లక్ష్యం తో ,మరింత స్వంత జ్ఞానాభివృద్ధి కోసం ,తెలిసిన విజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి ,ప్రయోగాత్మకం గా పరిశీలించి నిగ్గు తెల్చటమే అభ్యుదయ మార్గం అవుతుంది .
‘’discover the inspiring you –discover the empowered you –discover the winner in you –discover the real you ‘’
అనేది మనందరి ఆదర్శం కావాలి..
‘’ విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు’’ సర్వం సంపూర్ణం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు
‘’

