సినీ గీతా మకరందం –3
ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’
వినాయక చవితి సినిమా లో పాటలూ ,మాటలూ రాయటమే కాదు దర్శక నిర్మాత కూడా అయ్యారుసీనియర్ సముద్రాల .అందులో ఘంట సాల తన సంగీత ప్రతిభను అణువు అణువునా ప్రదర్శించాడు .ప్రారంభం లోనే హంస ధ్వని రాగం లో ‘’వాతాపి గణ పతిం భజే ‘’ను అద్వితీయం గ గానం చేసి భక్తీ ని చిప్పిల జేశారు ఘంటసాల మాస్టారు .అంతేకాదు అంతకు ముందు కచేరీలలో దాన్ని ఎవరు ఎలా పాడే వారో తెలీదు కాని మన మాస్టారు దాన్ని జనరంజకం చేసి ,ప్రజా బాహుళ్యం లోకి ఆ పాట ను ఆపాత మధురం గా దివి నుండి భువికి తీసుకొచ్చారు .అది ఆయన చలువే .తెలుగు జాతి తీర్చుకో లేని ఋణం అది .ఇది ఇలా ఉంటె-
గుమ్మడి సత్రాజిత్తు పాత్రలో ఉదయాన సూర్య దేవుడికి అర్ఘ్యం ప్రదానం చేస్తూ పాడిన , పాడిన ఘంటసాల ,నటించిన గుమ్మడి దర్శకత్వం తో సంపూర్ణత తెచ్చిన సముద్రాల చిరస్మరణీయులయ్యారు .
ప్రభాత సమయం లో భాస్కర స్తుతి భూపాల రాగం విన్నంత హాయిగా ఉంది .మాస్టారి స్వరం ,గాత్రం భక్తిని సూర్య కిరణాల్లాగ వర్షించాయి .మనసుల్ని మహిమాన్వితం చేశాయి .భక్తీ భావం తో మనమూ ఆ సవిత్రు మండల సూర్య నారాయణ మూర్తి కి చేతులు అనుకో కందా నే జోడిస్తాం .భక్తిని ప్రదర్శిస్తాం. ఇంత అద్భుతాన్ని ఆ గీతం సాధించింది .అదిగో ఆ పాట.
‘’దినకరా !శుభకరా !దేవా !దీనాదారా తిమిర సంహార ‘’దినకరా—
పతిత పావనా ,మంగళదాతా ,పాప సంతాప లోక హితా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా !వివిధ వేద విజ్ఞానా వినుత పరిపాలిత భాస్కర ‘’దిన కరా శుభ కరా .
‘చీకటి ని నశింపజేసే వాడు ,దినాన్ని కలిగించే వాడుసూర్యనారాయణుడు .మనం చేసే పాపాలను పోగొట్టి పతిత జనోద్దరణ చేసే మహానుభావుడు .మంగళ కరుడు .లోకానికి తన కిరణ స్పర్శ చేత హితాన్ని చేకూర్చే వాడు .ఆయన ఎవరో కాదు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు .వారికీ ఆయనకూ భేదమే లేదు .సూర్యునికి నమస్కరిస్తే, అర్ఘ్యం ఇస్తే వారినీ పూజించి నట్లే .అనేక వేదాల విజ్ఞాన సారం సవిత్రుడు .విమతుల ను సరైన మార్గం లో పెట్టి పరిపాలించే వాడు భాస్కరుడు ‘’ఆదిత్యుడు .
ఇటు లౌకిక భావాలను ,అటు వేదాంత భావాలను మిశ్రితం చేసి భాస్కర ప్రభావాన్ని త్రిమూర్త్యాత్మకం గా నినదించిన స్తుతి సుప్రభాతం గా భావించాలి దీనిని .ఘంట సాల స్వర లాలిత్యం మధురిమ తార స్తాయి లో ఉన్నాయి .పవిత్రత పరమ ఉత్క్రుస్టం గా ఉంది భక్తీ జ్ఞానం వైరాగ్యాల సమ్మిశ్రితం ఈ గీతం .అందుకే ఇది నాకు ‘’గీతా మకరందం ‘’అని పించింది .గుమ్మడి హావభావ ప్రకటన కు గొప్ప అవకాశం. దాన్ని సంతృప్తిగా నేర వేర్చాడు మహా నటుడు కేరక్టర్ యాక్టర్ వెంకటేశ్వర రావు గుమ్మడి .ఉదయం వేళ ఈ గీతం వింటే పాపహరం, భవహరం, ముక్తి ప్రదం .అంతగొప్పగా ఉన్న గీతం .సినీ గీతమైనా గీత గోవిన్దమైంది మకరందమైంది .
మరో మకరందం లో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు

