సఫల జీవి ‘’సేలేస్టీ’’-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -డిసెంబర్ -లో నా వ్యాసం

సఫల జీవి ‘’సేలేస్టీ’’

 ’చురుకైన యువతి గా సేలేస్టీ కి మంచి పేరుంది .1986లో స్కూల్ చదువు పూర్తీ చేసి స్కాలర్ షిప్  ల సాయం తో కాలేజి లోకి అడుగు పెట్టటానికి సిద్ధం గా ఉంది .తల్లికి గారాబు కూతురు గా,చేదోడు వాదోడు గా తెలివైన విద్యార్ధి గా ఆమె రుజువు చేసుకోంది . సమాజం కోసం ఏదో చేయాలనే తపన ఆమె లో ఉంది .ముఖ్యం గా రక్త సేకరణ ను ధ్యేయం గా ఆలోచించింది .కొన్ని నెలల లో ఆమె హెచ్ ఐ.వి.బాదితురాలిగా ఉన్నట్లు ఒక కాగితం పోస్ట్ లో అందింది .ఒక్క సారిగా షాకయ్యింది .సేలేస్టీ.

    తనకు ఈ జబ్బు ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల  వచ్చిందని ఆమె తెలుసు కొంది .ఇద్దరూ టీనేజెర్స్.అతనితో చాలా సన్నిహితం గా మెలిగేది .ఇద్దరు టెస్ట్ చేయిన్చుకొన్నారు .ద్రువీకరించుకొన్నారు .ఆ రోజుల్లో ఆ జబ్బు సోకితే మరణమే .దీన్ని అధిగమించటం యెట్లా అని ఆలోచించి ఇద్దరు .ఆమె  కాలేజి మానేసింది .బాయ్ ఫ్రెండ్ కు సపర్యలు చేసింది ..అతని ఆరోగ్యం రోజు రోజుకీ దెబ్బ తింటోందని గ్రహించింది .వెంటనే అతన్ని రక్షించుకోవాలనే బలీయ మైన కోరిక తో అతడిని 1987  జూలై

ఇరవై ఒకటిన పెళ్లి చేసుకోంది..దీని వల్ల  తనకున్న ‘’హెల్త్ ఇన్సూరెన్స్’’ అతనికి కూడా వర్తిస్తుందనే  ముందు చూపు ఆమెది .దురదృష్ట వశాత్తు ఆమె భర్త వెంటనే మరణించాడు .అప్పుడు సేలేస్టే వయసు కేవలం 19ఏళ్ళు మాత్రమే .

  సేలేస్టే స్నేహితురాళ్ళలో సగం ఆమె నుండి ఈ జబ్బు కారణం గా  ఆమెకు దూరమై పోయారు .కనీసం ఆమె స్నేహాన్ని కోల్పోతున్నామన్న బాధ కూడా వాళ్ళలో లేక పోవటం చూసి వ్యధ చెందింది . తన ఆశా సౌధం కూలి పోయిందని, దయనీయ పరిస్తితుల్లో తానున్నానని ఆమె చెప్పింది .ఇక తన చావు రోజుల్లోనే ఉందని నిశ్చయం చేసుకోంది.తనను గురించి ఆలోచించ నే లేదు  .కొన్నేళ్ళు ఇలా బాధ వ్యధలతో కుమిలి పోతూ ఉంది .తను తన కుటుంబం కోసం బతకటం లేదని ,ఆ మహమ్మారి వ్యాధికి వ్యతిరేకం గా పోరాడుతూ జీవిం చానని చెప్పుకొన్నది .

    నాలుగేళ్ళు ఇలా ఎదిరించి ,పోరాడి చివరికి తన జీవితం లో తప్పకుండా మార్పు రావాలని ,వచ్చేట్లు చేసుకోవాలని నిర్ణయించు కొంది.ఆమె  గాధ విన్న ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో మళ్ళీ చదువు ప్రారంభించింది.అంతేకాక ఎయిడ్స్ నిరోధం గురించి అన్ని సూచనలను

 పాటించింది .కొన్నేళ్ళు తను  ఏ డాక్టర్ దగ్గరకూ వెళ్లలేదని తన జబ్బు గురించి ఏ డాక్టర్ ని సంప్రదించలేదని ఎయిడ్స్ మందులువేసుకోవటానికి తాను  వ్యతి రికి నని అన్నదామె .డాక్టర్లన్నా నర్సులన్నా వాళ్ళ చికిత్సా విదానమన్నా తనకు ఏహ్య భావం అని చెప్పింది ..కాని 1994 లో తన CD4-కౌంట్ 500కు పడిపోయింది .అప్పుడు డాక్టర్ ఆమెను AZTట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తే ,అయిష్టం గా నే అంగీకరించింది .ఆ ట్రీట్ మెంట్ చేయించు కొంది.అది మంచి ఫలితాన్నిచ్చి ఆమె జీవితం లో ఆశా రేఖలు గోచరించాయి .

  సేలేస్టీ ఆరోగ్యం నెమ్మదిగా బాగు పడింది .ఉద్యోగం చేయాలనే సంకల్పమూ కలిగింది ,అవకాశమూ వచ్చింది .ఆమె ‘’ఎడ్మినిస్త్రేటివ్ అసిస్టంట్  ‘’గా ఉద్యోగం లో చేరి తనకున్న బుద్ధి బలం తో కార్య దీక్షతో సహనం తో మంచి స్వభావం తో కొద్దికాలం లోనే అందరి మన్ననలను అందు కొంది .

  తొమ్మిదేళ్ళ క్రితం సేలేస్టే ‘’సాశాఫ్రాన్సిస్కో’’ లోని ‘’ఎయిడ్స్ ఫౌండేషన్ సంస్థ ‘’లో వాలంటీర్ ఆ పని చేయాలని అనుకోని వారికి తెలియ జేసింది ఆమెను ఆ సంస్థ సాదరం గా ఆహ్వానించింది .తను గడిపిన చీకటి

రోజులుఆమెకు గుర్తున్నాయి .అలా ఎవరూ ఉండకూడదని భావించి కార్య రంగం లోకి దిగింది .అప్పటి దాకా తానూ ఏ సంస్తలో ను ఇమడలేక పోయానని ,కాని ఈ  సంస్థ తనకు ఆసరాగా నిలబడి తనలాంటి ఎయిడ్స్ బాధితులకు తన వంతుసహకారం అందించి వారి జీవితేచ్చను తీర్చటానికి తోడ్పడుతున్నందున తనకు ఏంతో సంతృప్తిగా ఉందని ఆనందం గా సేలేస్టే చెప్పు కొంది.తన లాంటి హెచ్ ఐ వి బాధితులకు ఈ సంస్థ’’ సంజీవిని’’ లాఉపయోగ పడుతోందని తన ఆరోగ్యం బాగు పడటమే కాక ఏంతో మందికి పునరారోగ్యం ఇచ్చే ఈ సంస్థ తన మాతృ సంస్థ అని, ఆ సంస్థతో తనజీవితం పెన వేసుకొని పోయిందని ఆ సంస్థే ఇప్పుడు తన కుటుంబం అని ,తన సమాజం అని, తన సర్వస్వం అని గర్వం గా చెప్పింది .ఈ మధ్యనే సేలేస్టే తన జీవిత రహస్యాలను బహిరంగ పరచటానికి ఒప్పుకొని అంతా చెప్పేసింది .తన లాగే ఈ వ్యాధి  బాధితులైన మహిళలు సిగ్గు పడకుండా ముందుకు వచ్చి మార్గ దర్శనం చేయాలని కోరింది . .

   ‘’ హెచ్ ఐ వి ఉందని తెలిశాక నా లాగా ఎవరూ దాచి పెట్టుకో కండి .ఇది దాచాల్సిన విషయం కాదు .పరీక్షలు చేయించుకొని పాజిటివ్ అని తేలితే చికిత్స ప్రారంభించండి .ఈ సంస్థ నన్ను భయపడకుండా చేసింది జీవించటం నేర్పింది మీరూ నాలాగానే లబ్ది పొందండి ‘’అని హితవు చెప్పింది .మూడు నెలలో కో సారి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించు కొంతున్నది . .హెచ్ ఐ వి ట్రీట్ మెంట్ లో లేటెస్ట్ గా వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చదివి కొత్తమార్గాలను అధ్యయనం చేస్తోంది .హెచ్ ఐ వి బాధిత మహిళల తో, గ్రూపులతో మాటలాడి వారికి ధైర్యాన్ని కల్గిస్తోంది .

   అక్రమ ద్విలింగ సంపర్కం వల్ల సంక్రమించే ఈ వ్యాధి దాచుకోవటం ప్రమాదకరమని దాని వల్ల  సమాజం లో అందర్నీ బాధితుల్ని చేస్తారని కనుక నిస్సంకోచం గా వ్యాధిని గురించి బహిరంగ పరచి చికిత్స చేసుకోవాలని సేలేస్టే  అందరికి చెబుతోంది .మహిళలు ముఖ్యం గా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరని ఇతరుల ఆరోగ్యాన్ని గురించే ఆలోచిస్తారని ఈ విధానం మంచిది కాదని ‘’ముందుగా  నీఆరోగ్యం, నీసెక్స్ హెల్త్ ‘’గురించి ఆలోచించు ‘’అని ఆమె మహిళలకు ఇచ్చిన ముఖ్య సందేశం .

   ఇప్పటికే సేలేస్టే జీవితం లో సగం హెచ్ ఐ వి తో నే గడచి పోయింది .ఇరవై ఆరేళ్ళ క్రితం ఈ వ్యాధిని గుర్తించి ,జాగ్రత్తలు తీసుకొంటూ ఆమె జీవిస్తూ ఉండటం అందరికి గర్వకారణం .తాను పొందిన జాగృతిని మిగిలిన వ్యాధి గ్రస్తులకూ కలిగిస్తూ ప్రజలలో మమైకం అవుతూ సఫల జీవితాన్ని సేలేస్టే గడుపుతూ మార్గ దర్శి గా నిలుస్తోంది .

  – గబ్బిట దుర్గా ప్రసాద్ 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.