నా దారి తీరు -51
సకుటుంబ తిరుపతి యాత్ర
బహుశా 1969 డిసెంబర్ లో మేము సకుటుంబం గా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాం. సకుటుంబం అంటే నేనూ మా ఆవిడా ,మా పెద్దబ్బాయి శాస్త్రి ,రెండో వాడు శర్మ ,మూడో వాడు మూర్తి .,మా బావమరిది ఆనంద్ .మూర్తి చిన్నప్పుడు అన్నమాట .వాడి పుట్టి వెంట్రుకలు తిరుమలలో తీయాలని మొక్కు .ఆ మొక్కు తీర్చటానికి బయల్దేరాం .అప్పటికి మాకు ఇంకా రైల్ రిజర్వేషన్ గురించి పెద్దగా తెలీదు ..
మచిలీ పట్నం నుంచి అప్పుడు రోజూ ఒక ఎక్స్ప్రెస్ బస్ తిరుపతికి ఉండేది .అది సాయంత్రం అయిదింటికి ఉయ్యూరు వస్తుంది .మర్నాడు తెల్ల వారుజ్హామున అయిదింటికి తిరుపతి చేరుతుంది .దానికప్పుడు రిజర్వేషన్ లేదు సరాసరి ఎక్కటమే .అలానే అన్నీ సర్దుకొని కావాల్సిన వన్నీ తీసుకొని సర్దుకొని దారిలో తిండి తోసహా రెడీ అయి బస్ ఎక్కాం .
దారిలో తెచ్చుకొన్న అన్నం ,పులిహోర మొదలైనవి తిన్నాం .చలికాలం .చలికి తట్టుకొవటానికి అప్పుడు మా దగ్గర అంత పకడ్బందీ సరుకేమీ లేవు ..స్వెట్టర్లు మాత్రం ఉన్నట్లు జ్ఞాపకం ఉంది .తిరుపతి లో బస్ స్టాండ్ లో దిగి తిరుమల బస్ ఎక్కి కొండపైకి వెళ్లాం అప్పుడు చాలా తక్కువ చార్జీ ఏ ఉండేది .సత్రం లో రూమ్ కూడా తీసుకోలేదు .డైరెక్ట్ గా మంగళ్లున్న చోటికి తీసుకొని వెళ్లాను .’’ఇది కాదను కొంటానండీ ‘’అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంది మా ఆవిడ .అక్కడే ఎక్కడో ఒక చోట స్నానాలు కూడా చేయించాను .ఇది అంతా నా స్వయం క్రుతాపరాధమే .అప్పుడు మా పక్కింటి బెల్లం కొండ సుబ్బయ్య గారి రెండో అబ్బాయి హనుమంతం కానీ పించాడు .ఆయన మమ్మల్ని చూసి ‘’ఏమిటీ /ఇక్కడ గుండు చేయిస్తున్నారు ?అక్కడ దేవస్తానం వారి కళ్యాణ కట్ట ఉండగా ?పుష్కరిణి ఉండగా? .తెలీక పొతే ఎవర్నయినా అడగాలి కాని మూసి వాయినం ముత్తైదు లాగా ?అన్నాడు .మాకు శ్రీనివాసుడు ఇక్కడే కనీ పించాడనుకోన్నాను .అప్పుడు ఆయన చెప్పిన దారిలో వెళ్లి కళ్యాణ కట్టలో మూర్తికి పుట్టు వెంట్రుకలు తీయించి నేనూ తిరు క్షౌరం చేయించుకొని పుష్కరిణి లో స్నానం చేశాము .
అప్పుడు రద్దీ తక్కువ గానే ఉంది .సరాసరి దేవాలయానికి వెళ్లి స్వామి దర్స్ద్ధనాన్ని తనివి తీరా చేసుకోన్నాం .అదొక మధురాను భూతి గా మిగిలింది .అప్పుడు టికెట్ల గొడవా లేదు క్యూలు లేవు .హాయిగా తనివి తీరా ఉచిత దర్శనమే ఉండేది .మా బావమరిది ఆనంద్ దేవుడిని చూసి పరవశం చెంది కళ్ళు మూసుకొని చాలా సేపు అలాగే నిల బడ్డాడు .అప్పుడు ప్రభావతి అడిగింది ‘’ఏమిట్రా తమ్ముడూ!ఇంత సేపు దేవుడిని చూస్తూ ఉన్నావు ?యేమని కోరుకోన్నావేమిటి ?అని అడిగింది దానికి వాడు ‘’అమ్మా ,నాన్న చాలా కాలం జీవించాలని కోరుకోన్నానక్కయ్యా ‘’అని చెప్పాడు .ఈవిడ ఆ మాటలకు ఏంతో పొంగిపోయింది తమ్ముడి ఆలోచనలకు .మాఅబ్బాయిలకు అంత సీన్ అప్పుడు లేదు .
గుడిలోంచి బయటికి రాగానే కాసేపు ఎక్కడో చెట్టు నీడలో కూర్చుని ఆ తర్వాత కిందికి తిరుపతి కి బస్ లో వచ్చి సత్రం లో రూమ్ తీసుకొన్నాం .అక్కడ నుంచి అలి వేలు మంగా పురానికి జట్కా బండీ లో వెళ్లాం .అప్పుడు రోడ్డు చాలా దారుణం గా ఉండేది ఎగుడూ దిగుడూ రోడ్లు .జట్కాలో కూసాలు కదిలేవి కూర్చున్న వాళ్లకు జట్కా వాడు చెప్పినట్లు వెనక్కీ ముందుకూ సర్దు కొంటూ వెళ్ళాల్సి వచ్చేది .పద్మావతీ అమ్మ వారి దర్శనమూ బానే జరిగింది .అక్కడి నుంచి శ్రీ కాళహస్తి వెళ్లాం..శ్రీ కాళ హస్తీశ్వర స్వామిని కనులారా దర్శించుకోన్నాం . అక్కడే కన్నప్ప స్వామిని దర్శించాడని చదువుకొన్నాం విన్నాం సినిమాలూ చూశాం కన్నప్ప కొండ ,ద్రౌపది గుడి మొదలైన వన్నీ చూశాం .ప్రసాదాలు ఇస్తే తిన్నాం .ఈ విధంగా మా తిరుపతి యాత్ర ఒక ప్రహసనమే అయింది .. మా ఆవిడ ఎప్పుడూ దీన్ని దెప్పుతూ ఉంటుంది .వెల్లతమె కాని తీసుకొని వెళ్ళటం చేతకాకపోవటం వలన వచ్చిన ఇబ్బంది ఇది . v.
కా ళహస్తి లో బస్ ఎక్కి మద్రాస్ కు వెళ్లాలని ప్లాన్ .బస్ ఎక్కడ ఆగుతుందో తెలీదు పిల్లల్ని ఆవిడనూ ఇటూ అటూ తిప్పి ఆవిడ సనుగుల్లు భరిస్తూ మొత్తం మీద ప్రైవేట్ బస్ ఎక్కం .మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎదురు చూస్తె సాయంత్రం అయిదింటికి వచ్చింది బస్సు .అదేక్కి నాలుగు గంటల తర్వాత తొమ్మిదింటికి మద్రాస్ చేరాం ..అప్పుడు బస్సులు పారిస్ లో ఆగేవి .అక్కడే ఎక్కాలి ఎక్కడికి వెళ్ళాలన్నా .. 15నంబర్ సిటీ బస్ ఎక్కిపూన మల్లి హై రోడ్ లో ,అంజి కరై మీదుగా షినాయ్ నగర్ లో మా అక్కయ్యా వాళ్ళింటి దగ్గర దిగాం ..ముందుగా మేము మా అక్కయ్యా వాళ్లకు చెప్పామో లేదో జ్ఞాపకం లేదు .మాకు అందరికి వంట చేసి భోజనాలు పెట్టింది అక్కయ్య .అలసట లో నిద్ర బానే పోయాం .
మా బావ గారు గాడేపల్లి కృపానిధి గారు .మద్రాస్ కార్పోరేషన్ లో హెల్త్ డిపార్ట్ మెంట్ లో యు.డి.సి .ఉద్యోగి .కార్పోరేషన్ వారు ఇచ్చిన ఉచిత మేడ మా వాళ్ళది. మా వాళ్ళు పై అంతస్తులో ఉండేవారు కిందిది అద్దేకిచ్చారు బోలెడు స్తలం .కాని అక్కడి బోరింగ్ పంపుల్లో నీళ్ళు రావటం కష్టం .ఏంతో సేపు గట్టిగా కొడితేనే నీరు వచ్చేది .నీరు కూడా అంత బాగుండేది కాదు .నీళ్ళ తో చాలా ఇబ్బంది గా ఉండేది ఒక కిచెన్ హాలు ,బెడ్ రూమ్ .కొద్దిగా వరండా ఉండేది ఎదురుగా కార్పోరేషన్ పార్కు .అన్నా నగర్ చాలా దగ్గర .బస్ ఇంటి దగ్గరే ఆగుతుంది అక్కడే ఎక్కచ్చు కార్పోరేషన్ వారి ప్రాధమిక విద్యాలయం ఇంటికి దగ్గరే ఉంది తెలుగు చదువుకొనే వారి స్కూలు కూడా దగ్గరే .మంచి సెంటర్ లో ఉన్న బిల్డింగ్ .సౌకర్యం గా ఉంది అప్పుడు పాలు ఒక కేంద్రం నుంచి తెచ్చుకొనే వాళ్ళు చిన్న సీసాలలో పట్టి ఇచ్చే వాళ్ళు ఆ తర్వాత పాకెట్ పాలు వచ్చాయి .సిటీ బస్ సౌకర్యం బాగా ఉండేది .మా అక్కయ్య బావా పెద్ద మేనకోడలు సత్యకళ,చిన్నమేనకోడలు జయా మేనల్లుడు శ్రీనివాస్ .అందరూ మేము వచ్చి నందుకు ఏంతో సంతోషించారు .మిగిలిన విషయాలు తర్వాత
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-13-ఉయ్యూరు

