వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం
ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రారంభమైంది .గంగప్ప గారి అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లున్నది .
ఇవాల్టి భాగం లో అన్ని రసాలు సమ పాళ్ళలో ఉన్నాయి .అరుంధతి ధర్మా రావు ల దాంపత్య మధురిమలు ఇంకో చిన్న ధర్మా రావు ఈ లోకం లోకి రావటం ఆనందదాయకం అయితే అరుంధతి అనారోగ్యం ఆందోళన కారి అయింది .పశుపతి అనసూయ ల వివాహం జరిగి వారికి పుట్టిన ఆడపిల్లకు అరుంధతి అని పేరు పెట్టటం చిన్న అరుంధతి రంగ ప్రవేశం చేసి నట్లు అయింది .కుమార స్వామి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాక పోవటం శ్యామలను ఆతను వివాహంచేసుకోవటానికి ఏర్పడ్డ ఇబ్బందులు దానికి ధర్మా రావు వేసిన ‘’ఠస్సా’’పని చేసి కొందరు పునరాలోచన లో పడటం కొంత వరకు కుమారస్వామికి లైన్ క్లియర్ అయినట్లు తోచింది .
హరప్ప నాయకుడు వివాహాలు చేయటం లో తాత గారి ఆంశ ను చూపించటం ,గిరిక భక్తీ ని అందరూ ప్రశంసించటం బాగుంది .వసిష్ట మహర్షి నూరుగురు పుత్రులను ముంచటానికి గంగానది నూరు చీలికలై ‘’శతద్రు ‘’పేరు తో వ్యవహరిమ్పబడం అందరికీ తెలిసి ఉండక పోవచ్చు .ఇలాంటివి విశ్వనాధ ఎన్నో చెప్పగల సమర్ధులు ఆయనే చెప్ప గల నేర్పరులు కూడా ..ధర్మం ,అగ్ని ,తస్కరుడు ,రాజు మనం చేసే తప్పులకు శిక్ష విదిస్తారన్నాడు..సుబ్బన్న పేట అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు తగల బడి పోవటం ,అందులో అతని ఇల్లూ ఉండటం అతని విచారకరం .చిన్న అరుంధతి ని తెచ్చి ఇక్కడ ఉంచుకోవాలన్న అరుంధతి కోర్కె ను సున్నితం గా వాయిదా వేసిన ధర్మా రావు చాతుర్యం బాగుంది .
సంఘం లో అందరూ అరుంధతి వంటి పతివ్రతలు ఉండరని అందరూ ధర్మా రావు లుగా ఉండలేరని ,కొందరు యేవో కారణాల వల్ల ధర్మానికి దూరం అవుతారని వారిని తేలిగ్గా చూడరాదని సానుభూతి వారిపై చూపటం మన ధర్మమని చెప్పిన ధర్మా రావు బోధ అందరికి అనుసరణీయం .ఇక్కడ మంగమ్మ అంటే పంతులు జోశ్యులు భార్య క్రమంగా సంఘం లో మంచి పేరు తెచ్చుకోవటం ఆమె సమాజ సేవలో తరించటానికి చేసే ప్రయత్నాలు సమాజ అన్యాయానికి స్వీయ అనాలోచిత నిర్ణయానికి బలి అయిన మహిళమళ్ళీ జన జీవన స్రవంతి లోకి రావటం అందరు హర్షించే విషయం పతిత అలానే ఉండి పోరాదు. .మారి సార్ధక జీవి కావాలన్న విశ్వనాధ సంస్కార హృదయం మనకు ఆవిష్కారం అవుతుంది .ఈ విధం గా ఈ రోజు ఎపిసోడ్ కధలోను , జీవితం లోను అనేక ‘’షేడ్స్’’. కనిపించి అన్నీ రసకందాయం లో పండాయని అని పించింది .
గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-13-ఉయ్యూరు

