శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –రచన –వ్రుషాద్రిపతి కవి
నిన్న శ్రీ హనుమద్ వ్రతం సందర్భం గా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సాయంత్రం’’ శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా సోదరీమణులు అద్భుతం గా ,పరవశం గా కర్ణ పర్వం గా,భక్తీ భావ బంధురం గా గానం చేసిన భజన లో ఈ కీర్తన ఏంతో బాగుందని అని పించి మీ అందరికి విష్ణు నామం రుచిని అందజేస్తున్నాను .
1-విష్ణునామము ,విష్ణు నామము –విశ్వ శుభదము -విష్ణు నామము
వైష్ణవాళికి ప్రాణమీ నామం –శ్రీ విష్ణు నామం
2-యతి రాజ చంద్రుడు భూతలంబున వ్యాప్తి చేసిన -విష్ణు నామము
అతులితంబగు మోక్ష రాజ్యము నొసగు నీ నామం –శ్రీ విష్ణు నామం .
3-వ్యాస శుక వాల్మీక భవులకు హర్షదంబగు- విష్ణు నామము
భాసురంబై పరగు ఓంకారమీ నామం –శ్రీ విష్ణు నామం
4-దేవముని యగు నారడునికిట తియ్యమొసగిన– విష్ణు నామము
సవ్య సాచికి రధము ద్రోలగ దలచే నీ నామం –శ్రీ విష్ణు నామం .
5-ఆంజనేయున కండ యయ్యని వెన్ను గాచిన –విష్ణు నామము
అన్జలించిన యంతుకీడుల నార్పు నీ నామం –శ్రీ విష్ణు నామం ..
6- సోమశేఖర శక్ర వందిత శోభదంబగు –విష్ణు నామము
నామ మాత్రము చేత వైరుల నణచె నీ నామం – విష్ణు నామము
7- భోగి భోగమణి విభూషిత పూజ నీయము -విష్ణు నామము
యోగ నిద్రా పరవశంబు నొప్పు నీ నామం –శ్రీ విష్ణు నామం
8-పాప పర్వత పాలి గూల్పగ వజ్ర నిభమగు –విష్ణు నామము
శ్రీ పురంద్రికి స్థానమై చెలువొందు నీ నామం-శ్రీ విష్ణు నామం
9- అఖిల జగముల బోజ్జయందున నమర దాల్చిన –విష్ణు నామము
శుభకరంబగు శోభనములకు మూల మీ నామం –శ్రీ విష్ణు నామం
-10- కఠిన రాక్షస కోటి గుండెల గాలమైనది –విష్ణు నామము
.- శఠ సమాజము గూల్చి జగముల సాకే నీనామం –శ్రీ విష్ణు నామం .
11-ప్రళయ సాగరమందు ఆకున పవ్వలించిన –విష్ణు నామము
జలజ గర్భు నివాసమై యలరారే నీనామం –శ్రీ విష్ణు నామం .
12-వేద తస్కరుడైన సోమకు వెదకి చంపిన –విష్ణు నామము
మోదమున గిరి మూపు నిడి మోచె నీనామం –శ్రీ విష్ణు నామం
13-క్రోధ రూపము దాల్చి భూమిని కోర నిల్పిన –విష్ణు నామము
వేడు రక్కసి పాపనిం గాపాడే నీ నామం –శ్రీ విష్ణు నామం
14-పొట్టి రూపము దాల్చి దైవత కులము బ్రోచిన –విష్ణు నామము
పట్టి మానస పతి సమాజము వ్రచ్చె నీనామం –శ్రీ విష్ణు నామం .
15-పాద రజమున రాతి నాతిగ ప్రబల జేసిన –విష్ణు నామము
వేదం విదులగు మౌని వరులకు వేద్యమీ నామం –శ్రీ విష్ణు నామం
16-ద్వాపరంబున కృష్ణు రూపము దాల్చి యొప్పిన –విష్ణు నామము
స్వాప రాధము లన్ని బాప సమర్ధ మీ నామం –శ్రీ విష్ణు నామం .
17-భక్తీ యోగి హ్రుదయాన్తరాంతర స్తానమైనది –విష్ణు నామము
భక్త మానస సారసాంతర భ్రమర మీ నామం –శ్రీ విష్ణు నామం
18 మంజులంబగు పుష్పకుంజము లందుమసలిన –విష్ణు నామము
సంజ వేళల రాధ యొడి సల్లాప మీ నామం –శ్రీ విష్ణు నామం . –
19-ఇవ్వసుంధర వూరు వాడను నింపు గొల్పెడు –విష్ణు నామము
మొవ్వ వెంకట దాసు ముందుగ నిల్పే నీ నామం –శ్రీ విష్ణు నామం
20- కృష్ణ దాసు ముదంబు మీరగ పలుకు చున్నది –విష్ణు నామము
చిత్ర భంగుల నెల్ల లోకములేలు నీ. నామం –శ్రీ విష్ణు నామం .
21-విష్ణు దాస బుదోత్తములు నోరార చాటిన –విష్ణు నామము
విశ్వాంత రాళములందు నిండిన దివ్య మీ నామం –శ్రీ విష్ణు నామం
22-కృష్ణ దాసు ముదంబు మీరగ పలుకుచున్నది –విష్ణు నామము
కెరలి మొవ్వ కుటుంబ మెల్లను అలమె నీ నామం –శ్రీ విష్ణు నామం ‘
23-సతతంబు ‘’వృషాద్రి పతి’’నిల సాకు చుండెడి-విష్ణు నామము
చింత లెల్లను బాపి సంరక్షించు నీనామం –శ్రీ విష్ణు నామం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-13-ఉయ్యూరు

