సినీ గీతా మకరందం -6
ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ
1964లో విడుదలైన దేశ ద్రోహులు చిత్రం లో నాయికా నాయకులు దేవిక ,రామా రావు ల యుగళ గీతమే ఇది.స్వర రసాలూరు రాజేశ్వర రావు కమనీయ బాణీ లో విరిసిన మధుర మంజుల గీతం .దీనికి అభినయాన్ని మహా సోకుగా జోడించారు అందరూ .గీతాలలో తనదైన ముద్ర వేసిన ఆరుద్ర రచించిన పాట ఇది రాజేశ్వర రావు రాగం అంటేనే పూల మీద తెలియాడుతున్నట్లున్తుంది .సువాసనలు వెదజల్లుతున్నట్లున్తుంది .అంత లలితం గా ,శ్రావ్యం గా కమనీయం గా గీతానికి అన్ని హంగులూ అద్ది మనసుల్ని పరవషింప జేయటం రాజేశ్వర రావు ప్రత్యేకత .అది ఈ గీతం లో ప్రతి అంగుళం లోనూ దర్శన మిస్తుంది ఆరుద్ర భావ గీతం ఆహ్లాదాన్ని కలిగించి నిజం గానే ఈ జగం అంతా మారిందా అన్న తృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది .బోళ్ళ సుబ్బా రావు దర్శకత్వం తో వచ్చిన చిత్రం ఇది .ఈ గీతాన్ని ఘంటసాలసోలో గా గొప్ప అను భూతితో పాడారు .ఈ సినిమాలో అందాల నటుడు శోభన్ బాబు అదనపు ఆకర్షణ .
పల్లవి –జగమే మారి నది మధురాముగా ఈవేళ –కలలూ కోరికలూ తీరినవీ మనసారా
చరణం –మనసాడెనే మయూరమయి –పావురములూ పాడే ,ఎలా పావురాములూ పాడే
అదే చేరెను గోరు వంక రామ చిలుక చెంత అది అందాలా జంట
నేనరూ కూరిమి ఈ నాడే పండెను –జీవితమంతా చిత్రామైన పులా కింత —జగమే
చరణం –విరజాజుల సువాసన –స్వాగతములు పలుక ,సుస్వాగతములు పలుక –ఆ ఆ ఆ
తిరుగాడును తేనే టీగ- తీయదనము కోరి ,అనురాగాలా తేలి
కమ్మని భావమే కన్నీరై చిందెను –ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి –జగమే
ఏంతో కాలం గా ప్రేమించుకొన్న ప్రేమ జంట మనసులోని కోరికలూ ఎన్నో ఏళ్ళుగా దాగి ఉన్న కోరికలూ ఈ రోజే తీరాయట .అది ఊరికే కాదు మనసారా తీరటం ,మరీ మధురం గా తీరటం ఆ జంట ఆనందానికి అవధులు లేవని పిస్తున్నాయి .అతడు తన మనసు మయూరం అయి ఆడిందని పొంగిపోతున్నాడు మగ నెమలె నాట్యం చేస్తుంది కనుక అతని భావం పక్వం గా పండి నిండింది .మరి పావురాలు పాడుతున్నాయి అవీ తమ లాగా లేత పావురాలు .పావురపు కూత లో మన్మధ బాధ బాగా ధ్వనిస్తుంది.వెంటనే దృశ్యం మారింది అందాల చిలుక చెంతకు గోరు వంక చేరుతోంది ఇది సహజమే .చిలుకా గోరు వంకలది ఆదర్శ దాంపత్యం గా మన కవులు అనాదిగా చెబుతున్న విషయం దాన్ని దృశ్యమానం చేసి తమకూ అన్వయించు కొన్నాడు హీరో .అందుకే అది ఉత్త జంట కాదు అందాల జంట .ఆ రోజే వాళ్ళ ప్రేమ ,సఖ్యం పండాయి ఆనందం పరవళ్ళు తొక్కుతోంది .అప్పుడు జీవితం అంతా ఒక పులకింత అని పిస్తుంది మామూలు పులకింత కాదు అది చిత్రమైన పులకింత అన్నాడు మాటల నేర్పరి, కూర్పరి ఆరుద్ర .
మళ్ళీ సీను మార్చాడు .విరజాజులంటే ప్రేమకు గొప్ప సాంకేతికాలు. అవి సువాసనలను వెద జల్లుతున్నాయి .ఊరికే విరబోస్తే వాటి గొప్ప తనం ఏముంది?/ ఇలాంటి చక్కని చిత్రమైన జంటకు స్వాగతాలు పలుకుతున్నాయి జన్మ సాఫల్యం చేసుకోమ్మంటున్నాయి .పూలు వికసించి సువాసనలు విరజిమ్ముతుంటే గండు తుమ్మెదలు ఊరికే ఉంటాయా ?/వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మకరందాన్ని తనివి తీరా జుర్రుకొంటున్నాయి .అమితా నందాన్నీ, సంతృప్తిని పొందుతున్నాయి .ఇక్కడ ఈ జంటకూ ఒక హెచ్చరిక .అలానే తామూ తమిదీర్చుకొని ఆనంద రసాస్వాదన చేసుకొని జీవిత పరి పూర్ణతను సాధించాలీ అని నాయకుడి గాఢ మైన కోరిక ..యవ్వనాన్ని సఫలీ కృతం చేసుకావాలన్న ఆరాటం. మధురసాస్వాదన తో, మై మరచిపోవాలని సఖి కి అన్యాప దేశం గా తెలియ జేస్తున్నాడు జాజులూ భ్రమరాలూ ఈ బోధనే చేస్తున్నాయని వివరించాడు ప్రేయసికి ..భ్రమరానికి తియ్యదనం కావాలి అది పూల లోనే దొరుకుతుంది .అతడికీ తీయదనం కావాలంటే ఆమె దగ్గరే లభిస్తుంది ఈ తీపి హాయి ని ఇద్దరం కలిసి అనుభ విస్తేనే మజా అని అతడి మధురోహ .
మరి ఈ భావం మదించిన దేమీ కాదు అదొక కమ్మని భావం .ఆ భావాన్ని తలచుకొంటే పులకింత తో ఆనంద బాష్పాలు జారి పోతుంటాయి .అది బాధ తో కాదు మాధుర్యం తో వచ్చే కన్నీరు .దానికి వెల కట్ట లేం .వారి ప్రేమప్రియమైన చెలిమి .ఆ చెలిమి ఎలాంటిది ?సాటి లేని కలిమి లాంటిది .చెలిమి కలిమి మాటలను అత్యంత సమయోచితం గా సందర్భ శుద్ధిగా వాడి ప్రయోజనాన్ని రా బట్టాడు కవి ఆరుద్ర . ఆ కలిమి అంటే అదృష్టం, సౌభాగ్యం ,సంపద దేనికీ సాటి రానిది అని, ఉదాత్తమైనదని నాయకుడు కమకమ్మగా చక చక్కగా ఆలపించి చెప్పాడు
మయూరాలు ఆడటం పావురాలు పాడటం లో రెట్టించి ఆ స్వరాలను ఆల పింప జేయటం రాజేశ్వర రావు సాధించిన ఘన విజయం మాధుర్యం. లాలిత్యం కలబోసి పండిన గీతం ఇది .అందుకో ఈ గీతం గీతా మకరందం అని పిస్తుంది
మరో గీతం లో మాధుర్యం జుర్రుకుందాం
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-13-ఉయ్యూరు

