సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి

 

ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, హైదరాబాద్‌పై సైనికచర్య చేసి, ముస్లింలను ఊచకోత కోయించాడు. నెహ్రూ లౌకికవాది; 1956లో హైదరాబాద్ సంస్కృతిని పునఃప్రతిష్ఠించ తలచినా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయలేకపోయాడు. భారతదేశంలోని 560 పైచిలుకు సంస్థానాల విలీనం చేసింది; పటేల్ కాదు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్’. వాస్తవాలను తెలుసుకుందాం.

నైజాం రాజధాని హైదరాబాద్ సంస్కృతి ఏమిటి? కేవలం పదిశాతం ఉన్న ముస్లింల ఉర్దూ రాజ భాష; 90 శాతం ప్రభుత్వోద్యోగాలు ముస్లింలకు; ప్రాథమిక స్థాయి నుంచి, విశ్వవిద్యాలయంలో కూడా విద్యాబోధనా మాధ్యమం ఉర్దూ; న్యాయస్థానాల్లోని భాష ఉర్దూ; హిందువులు వెట్టిచాకిరీ చేయాలి; ప్రజాప్రాతినిధ్యం, ఎన్నికలు, గ్రామం నుంచి; శాసనపరిషత్ వరకూ లేవు; ప్రజల భాషలైన తెలుగు, మరాఠీ, కన్నడాలకు ఆదరణ లేదు; ఈ మాధ్యమాలలో బోధించే ప్రభుత్వ పాశాలలు లేవు. మాన్యత పొందిన భాష, వేషం; భూషణాలు విదేశీయాలు. ముస్లింల పండుగల సమయాల్లో హిందువులు సామూహికంగా గానీ, బహిరంగంగా గానీ వేడుకలు జరుపుకోకూడదు. ఇదీ నైజాం రాజధాని హైదరాబాదీ సంస్కృతి.
ఇక రాజకీయంగా; నిజాం నవాబ్, తన సంస్థానాన్ని సార్వభౌమత్వంగల, స్వతంత్ర, ఇస్లామిక్ దేశంగా ఉంచదలచాడు; పాకిస్థాన్‌కు రూ.20 కోట్లు ఇచ్చాడు. రజాకార్లనే రౌడీ మూకలు విలీనం కోరుతున్న హిందువులపై అమానుష చర్యలు చేస్తున్నారు; భారతదేశం తన దేశంపై దురాక్రమణ చర్యలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి, నిజాం ఫిర్యాదు చేసి, ఇండియాపై ఆంక్షలు విధించాలని కోరుతూ ఒక ఫిర్యాదు, ప్రతినిధి మండలిని పంపాడు.

మౌంట్ బాటెన్ నిజాంకు, అనుకూలమైన సంధికై ప్రయత్నించినా, రజాకార్ల ఒత్తిడితో నిజాం ఏ శాశ్వత సంధికీ ఒప్పుకోవడం లేదు. ఎంతోమంది హిందువులు మానప్రాణ రక్షణకు సంస్థానం వదలి విజయవాడ, నాగపూర్ లాంటి ప్రదేశాలకు పోతున్నారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి, ముస్లింలను రప్పించి, ఆ జనాభాను పెంచుతున్నాడు. 1948, మార్చిలో కమ్యూనిస్టులు భారత్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ, నైజాం స్వతంత్ర దేశంగా ఉండాలనడంతో, నైజాం ఆ పార్టీపైన ఆంక్షను ఎత్తివేశాడు. రజాకార్లూ, కమ్యూనిస్టులూ, భారత్‌తో విలీనాన్ని వ్యతిరేకిస్తూ, సాయుధ దళాలను పెంచుతున్నారు. 1948 జూన్‌లో మౌంట్ బాటెన్ వెళ్లిపోయాడు. రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యారు. రజాకార్ల, కమ్యూనిస్టుల ఆగడాలు, నైజాం ధిక్కారం; హిందూ ప్రజల గోడూ ఎక్కువవడంతో, సైనిక చర్య తీసుకునే అంశం కేంద్ర మంత్రి వర్గం చర్చించసాగింది. సైనిక చర్య భారత్ శాంతికాముకతకు భిన్నం; తన ప్రతిష్ఠకు భంగం అని నెహ్రూ వాదన; గత్యంతరం లేదని వల్లభాయ్ పట్టు; ‘నీవు మతతత్వ వాది’వని నెహ్రూ పటేల్‌ను అనడం, పటేల్ కాగితాలు తీసుకొని వెళ్ళిపోవడం గమనించిన రాజాజీ, నెహ్రూ పటేల్ గార్లను తన కార్యాలయానికి పిలిచారు.

చర్చలు సాగుతుండగా, ’70 సంవత్సరాల క్రిస్టియన్ ూఠnట (పుణ్యస్త్రీలు) సామూహికంగా రజాకార్లచే అత్యాచారానికి గురయ్యారు. ఈ అమానుష చర్యపై మీ ప్రభుత్వం చర్య తీసుకోవాలని’ డిమాండ్ చేసిన బ్రిటిష్ హై కమిషనర్ పత్రాన్ని రాజాజీ, నెహ్రూ ముందుంచారు. దాంతో నెహ్రూ అగ్రహోదగ్రుడై, చర్చను ముగించి, తక్షణ సైనిక చర్య చేపట్టమన్నారు. భారతదేశపు సర్వ సైన్యాధ్యక్షుడు, జనరల్ బూకర్ బ్రిటిష్ వాడు. ‘మనం కాశ్మీర్‌లో చిక్కుకున్నాం, నిజాం వాయుసేనలు బొంబాయి, అహ్మదాబాద్‌లపై బాంబులు వేయడానికి సిద్ధంగా ఉన్నయ్. కనుక యుద్ధ చర్యను ఆపుదాం’ అన్నాడు పటేల్ గారితో. ‘లండన్ మీద బాంబులు వేసి జర్మన్లు ఆ పట్నాన్ని ధ్వంసం చేస్తుంటే మీ బ్రిటిష్ వాళ్లు భయపడి లొంగిపోయారా?’ అని పటేల్ బూకర్‌ను నోరు మూయించాడు. తిరిగి ‘జిన్నాగారు చనిపోయారు; పాకిస్థాన్ శోకంతో ఉంది.

హైదరాబాద్ మీద మనం యుద్ధం చేస్తే, పాకిస్థాన్, ముస్లింలూ బాధపడతారు’ అని బూకర్ అన్నాడు. ‘చాలు చాలు, మా ఆజ్ఞ ప్రకారం, సెప్టెంబర్ 12, ప్రాతఃకాలంలో భారత సైన్యం హైదరాబాద్‌లో ప్రవేశించాలి’ అని పటేల్ బూకర్‌ను శాసించారు. దరిమిలా ఏం జరిగిందో అందరికీ తెలుసుకానీ హైదరాబాద్‌పై సైనిక చర్య, ఆ సంస్థాన విలీనం తన ఘనకార్యాలన్నట్లు నెహ్రూ ముఖ్యమంత్రులందరికీ రాసిన లేఖలో పేర్కొన్నారు.
కొంతమంది ముస్లిం పెద్దలు భారత సైన్యం, నిర్హేతుకంగా లక్షల మంది నిరాయుధ, సామాన్య ముస్లింలను ఊచకోత చేసి చంపిందని నెహ్రూకు ఫిర్యాదు చేస్తే, ఆయన పండిత్ సుందర్‌లాల్ అనే కమ్యూనిస్టు సహచర ‘మేధావి’ని దర్యాప్తు చేయమన్నారు. అతగాడు రజాకార్ల దౌష్ట్యాల ఊసెత్తకుండా, సైన్యమూ, కాంగ్రెస్ హిందువులూ నిరపరాధులైన వేలమంది ముస్లింలను (ఎక్కువగా మరఠ్వాడ ప్రాంతంలో) చంపారని నివేదన ఇచ్చాడు. భారత ప్రభుత్వం, ఈ నివేదిక పక్షపాతంగా, ఆధార రహితంగా, నిరధికారంగా, స్వంత ఆలోచనలతో కూడిందని ప్రక్కన పెట్టేసింది.

పటేల్ సైనిక చర్య నిర్ణయం లేకపోయినట్లయితే, నెహ్రూ పుణ్యమా అని భారతదేశపు నడిబొడ్డున నిజాం రాజ్యాం, మూడవ పాకిస్థాన్‌గా తయారయ్యేది. అలా చేయనీయనందుకు వల్లభాయ్ పటేల్ మతతత్వవాదనీ, ముస్లిం ద్వేషి అని, ముస్లిం రచయితలు, వారి చిరకాల బంధువులైన కమ్యూనిస్టులూ; ముస్లిం ఓట్లకు గాలం వేసే ‘సెక్యులర్’ పార్టీలూ ప్రచారం చేస్తున్నాయి.
1947, డిసెంబర్ అనగా భారత విభజన, పాకిస్థాన్ సృష్టి తర్వాత లక్నోలో 70,000 మంది ముస్లింలు, మౌలానా ఆజాద్ సమక్షంలో ఒక సభ జరిపి, భయంకరమైన విభాజక, మతోన్మాద జనక ప్రసంగాలు చేశారు. నెహ్రూ ఆనుంగు మిత్రుడు, నేషనలిస్ట్ ముస్లిం నేత, డా. సయ్యద్ మహమ్మద్ (బీహార్) ‘హిందువులూ, సిక్కులూ వినండి! ఇండియాలో ముస్లింలు అంతమవవచ్చు. అలా అయితే, ఒక్క హిందువూ, ఒక్క సిక్కు కూడా బ్రతికి ఉండలేరు’. ఇలా అంటూ నెహ్రూను ప్రశంసించారు. ఆజాద్‌ను ఆకాశానికెత్తారు.

చివరిగా నూరానీ వంటి వారు ఎంత చరిత్ర హననం చేస్తున్నారు. 564 సంస్థానాల విలీనం మౌంట్ బాటెన్ చేయించాడా? చరిత్ర చదవని, ప్రచారకులు వ్రాసే మాటలివి. ఈ విషయంలో పటేల్ కృషిని, చాతుర్యాన్ని దృఢ సంకల్పాన్ని మౌంట్ బాటెనే కాదు; బ్రిటన్ ప్రధానమంత్రులు, విదేశీ చరిత్రకారులూ ప్రశంసించారు. రాజా, మహారాజా, నవాబుల సంస్థానాలను భారత్‌కు సంక్రమింపజేయడమే కాదు; పలు సంస్థానాలను రాష్ట్రాల్లో విలీనం చేసి; మరికొన్నింటిని సమాఖ్యలుగా చేసి ఆ అధిపతులకు కేవలం భరణాలను, బిరుదులను మాత్రమే ఇచ్చి; వాటన్నింటిని భారత భూభాగంలో సమ్మిళతం జేసి; దేశమంతా ఒకే శాసనాలతో పాలించిన ఘనత అల అశోకునికి గానీ, సముద్ర గుప్తునకుగానీ, అక్బరుకు గానీ, బ్రిటిష్ చక్రవర్తికి గానీ కలుగలేదు.

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కే దక్కింది. జమ్మూకాశ్మీర్ రావణకాష్టంగా ఉండటానికి, దాని వ్యవహారాన్ని, నెహ్రూ తన గుప్పెట్లో పెట్టుకోవడం వలనే. ఈ విషయంలో ఆశ్చర్య చకితుడైన సోవియట్ నాయకుడు నికిటా కృశ్చేవ్ ఇలా అన్నాడు : ‘మీ భారతీయులు అద్భుతమైన ప్రజలు, రాజులను హతమార్చకుండా రాజరికాన్ని ఎలా మాయం చేశారు?’ ఆ లీలను (ఆ నిరుపమాన) మహాద్భుతాన్ని నెరపిన మహావ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.

జవహర్‌లాల్ నెహ్రూకు పటేల్ అంటే గౌరవం, భయం కన్నా అసూయ ఎక్కువ. 1950 డిసెంబర్‌లో పటేల్ చనిపోయారు. 1954 వరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ పటేల్ ఫోటో లేదు. ఆ సంవత్సరం 1958లో మౌలానా ఆజాద్ చనిపోగానే, నెహ్రూ ఆజాద్ ఫోటోకై పార్లమెంట్ సభ్యులకు చందా కోసం రాయించారు. గ్వాలియర్ మహారాజా సింథియా నెహ్రూ ముస్లిం ప్రేమనూ, హిందువుల పట్ల నిర్లక్ష్య భావాన్ని గుర్తించి, తన సొంత ఖర్చుతో పటేల్ తైల చిత్రాన్ని తయారు చేయించి పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజేంద్రప్రసాద్ గారితో ఆవిష్కరింజేసారు.
– డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.