వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం
సుబ్బన్న పేట కు పురావైభావం
ఈ రోజుఉదయం (21-12-13 న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత లక్ష్మి గారి అభి భాషణం కొత్తదనం గా ఉంది .విశ్వ నాద సాహితీ మూర్తిని పూజించటానికి పూసిన కల్ప వృక్షం ఆయన రాసిన రామాయణం అన్నారామె .మార్పు రావాల్సిందే కాని అది మంచికి దోహదం చేసేది అవ్వాలి ధర్మ చ్యుతికి సహకరించ రాదనీ విశ్వనాధ చెప్పారన్నారు .ఆయన సృష్టించిన పాత్రలన్నీ ఆ నాటి కాలం వారేనని ఎంకి పాటల ప్రాచుర్యాన్ని చెప్పారంటే సాటి రచయితల పట్ల ఆయనకున్న గౌరవం తెలుస్తుందని తెలుగు నాట వచ్చిన అన్ని ఉద్యమాలను స్ప్రుశిం చారని ,లెద్ , బీటర్ అనీబి సెంట్ జిడ్డు కృష్ణ మూర్తి గార్ల భావాలను కూడా పొందు పరచారని కీర్తించారు .
రంగా రావు జబ్బుకు ఆయుర్వేద వైద్యం చేయించటం లో హరప్పా చొరవ,అందుకు తండ్రిని ఒప్పించటం దివాణం మళ్ళీ గాడిలో పడుతున్నట్లు తెలుస్తుంది .పసరిక ను గార్డేనర్ దొర కొనటానికి బేరానికి ధర్మా రావు దగ్గరకు పంపటం ,వింత అయిన ప్రతి దాన్ని జంతు ప్రదర్శన శాలలో పెట్టెడబ్బు చేసుకోవటం అన్న విధానం పై ఏవగింపు కనిపిస్తుంది .వ్యాధి ఏమిటో తెలీని అరుంధతి రోజు రోజుకూ చిక్కి పోతూ రాజశేఖర శాస్త్రి కోసం కబురు పంపమంటే చేతిలో చిల్లి గవ్వలేదని ధర్మా రావు బాధ పడటం తనకొత్త చీర నగా రంగా పురం నుంచి తెమ్మని ఆమె చెప్పి తన పరిస్తితి’’ గంగి రెద్దు మీది బొంత’’ లాఉందని అనటం కన్నీరు తెప్పించే మాటలు .అలాగే సుబ్బన్న పేట లో తాము ఉండటం ఎంత అదృష్టమో అని పొంగిపోయినపుడు ఆనందమూ కలుగుతుంది
హరప్ప గురువుగారైన ధర్మా రావు తో శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసి పలికిన ప్రతిమాటా అనుభూతికి పరాకాష్ట గా కన్పిస్తుంది .తల్లి మరణం వల్ల వచ్చిన అశౌచం అయి పోయి మొదటి సారి దేవాలయానికి వచ్చాడు ఏడాది కాలం పాటు వీటికి దూరమై తాను ఏమి కోల్పోయాడో తెలుసుకొని బాధపడటం అతని సంస్కారానికి వన్నె తెచ్చింది ,గోవిందుని మనసారా స్మరించిన తీరు భక్తీ పులకాం కితం గా ఉంది
వైద్యుడు రాజశేఖర శాస్త్రి అరుంధతి నాడి చూసి ఆమెకు ‘’రాజ యక్ష్మ ‘’జబ్బు వచ్చిందని అది మహా రాజులకు రాణులకు రావాల్సిన జబ్బని ఆమె మంచం మీదే విశ్రాంతి తీసుకోవాలని మడి,దడిఅని తడి గుడ్డలతో ఉండరాదని బరువు మోయరాదని చెబుతున్నప్పుడు అయ్యో పాపం అని పించింది . డబ్బేమీ ఇవ్వక్కర్లేదని ,రంగా రావుఇచ్చిన డబ్బుతో నే ఈమెకూ వైద్యం సాగిస్తానని చెప్పి ఇద్దరికీ ఊరట కల్గించాడు .గోవులలో ప్రాణం పరమాత్మ కు దగ్గర లో ఉంటుందని ధర్మ తో విశ్వ నాద చెప్పించాడు .హరప్ప గాంభీర్యం ఏ భావాన్ని బయట పెట్టడన్నాడు .తల్లిపై అతనికున్న ఆరాధన మాటలకందనిదని చెప్పాడు ఆస్తాన దివాన్ రాజీనామా చేయగా ఆ పదవినిని ధర్మ ను తీసుకోమంటాడు హరప్ప ‘’నేను మీ చిన్నప్పటి నుంచీ ‘’ మీ దివానునే ‘’అని చమత్కారం గా అన్నాడు . స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు పూర్ణమి నుండి ప్రారంభ మయ్యాయి కూచి పూడి వారి కలాపాలు గిరిక భక్తీ భావం తో అంకిత భావం తో చేసిన మాట్శ్యావతార నృత్యం రసో వై సహః అన్నట్లు ఉంది .మర్నాడు కూర్మావతార నృత్యాన్ని చేయటానికి మనసంతా కూర్మ నాదునిపై లగ్నం చేయమని ధర్మ గిరికకు బోధించి కర్తవ్య పరాయణురాలీని గా చేయటం అతాని పెద్దరికాన్ని తెలియ జేస్తుంది .రంగా రావు కు చిన్న రామేశ్వర శాస్త్రి కనిపిస్తే అతనిలో పెద్దాయన కనీ పించి తాను యా కుటుంబాన్ని దూరం చేసుకొన్నందుకు పశ్చాత్తాప పడ్డాడు .కోప్పదతాదనుకొన్న రంగారావు బాగా మాట్లాడటం చూసి చిన్న శాస్త్రి కూడా సంతోషించటం అతని ప్రవర్తన ,ఆలోచనలలో మార్పుకు మరో ఆకు తొడిగి నట్లే .ఇదీ పునర్వైభావానికి మరొక ఆకు ..స్వామి కల్యాణాని కి బంధుజనం అంతా ధర్మా రావు ఇంటికి వస్తే ఇదే పెళ్లి ఇల్లుగా అని పించి ఏంతో మురిసిపోయారు భార్య భర్తలు ..ఆ రోజుల్లో దేవుడి పెళ్ళికి ఊరంతా వైభోగం అన్నా మాట రుజువైంది అరుంధతి తెమ్మన్న చీర గొప్పతనాన్ని ఆమె వర్ణిస్తున్నప్పుడు ఆమె కూడా కావ్య సృష్టి చేసే సత్తా కలిగి ఉందని ప్రసంషించాడుభర్త . .కుమారస్వామి ధర్మ తో సలిపిన సంభాషణం సందర్భోచితం రంగారావు లేవలేక పోయినా కల్యాణానికి ఇస్తున్న చేయూతను ధర్మ కొని యాడిఅతనిలో ధర్మం మళ్ళీ పాదుకొంటున్నందుకు అందరం ఆనందిస్తాం .ఈ మార్పే విశ్వనాధ కోరింది అందుకే ఈ నవల రాసింది కూడా .మరో సారి హైదరాబాద్ ఆకాశ వాణి. వారిని ,ఈ నాటకం ఇంత రసవత్తరం గా తీర్చి దిద్దిన వారందరినీ మనసారా అభినందిస్తున్నాను
గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-13-ఉయ్యూరు

