సినీ గీతా మకరందం -7
‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం
ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది .నాగేశ్వర రావు సావిత్రి ,కృష్ణ కుమారి ,రేలంగి గుమ్మడి తారలు తళుకు లీనారు .నేత్ర పర్వం గా సినిమా నడిచి ఆనందాన్నిస్తుంది .’’విని పించని రాగాలే ‘’అన్న పాట అందరూ మెచ్చుకోన్నదే .మిగిలిన గీతాలు హాయి చేకూర్చేవే .అయినా నాకు బాగా నచ్చిన గీతం ‘’కిల కిల నవ్వులు చిలికిన ‘’.ఆ గీత సౌభాగ్యం ఇదుగో –
‘’కిలకిల నవ్వులు చిలికిన –పలుకును నాలో బంగారు వీణ
కరిగిన కలలే నిలిచిన –నింపెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవళులు పిలిచే –ఆణువణువూ బృందావని లో నిలిచే
తళతళ లాడే తరగల పైన –ఆందీ అందని అందాలు మెరిసే
నీ ఉన్న వేరే సింగారములేల? –మమతలు నీ పాద ధూళి సిందూరము కాదా ?
మమతలు చూసి ,మాయలు చేసి-గళమున నిలిచిన కళ్యాణి నీవే
నీ కురులే నను సోకిన వేళ –హాయిగా రగిలెను తీయని జ్వాల
గలగల పారే వలపుల లోన –సాగెను జీవన రాగాల నావ
ఇద్దరు –కిల కిల నవ్వులు చిలికిన –పలుకును నాలో అన్గారు వీణ
అతడు నవ్వుల్నీ కిల కిలా చిలికిస్తే – ఆమే మదిలో బంగారు వీణ పలుకుతుందిట కిలకిల అన్న మాటల్లో నవ్వును అద్భుతం గా పలికించాడు సినారె .ఆ నవ్వుల్నీ అంత అందం గానూ చిలికించాడు రస బ్రహ్మ సాలూరి .ఇద్దరి కలయికతో మహా ఆనంద మందిరం వెలసిన్దిక్కడ .కలలు కరిగి నిలిచాయట .అప్పుడామే కు మందారా మాల మేడలో నిమ్పినట్లయింది .మందార మాల అనటం లో వివాహం అవబోతుందనే చక్కని ధ్వని ఉంది మందార మాల వివాహ
చిహ్నం గా కవులు భావించారు రాశారు .రారమ్మని మురళీ స్వనాలు పిలిస్తే శరీరం లోని ప్రతి అణువు బృందావనం లో నిలిచినట్లు ఉందట .బృందావనం రాస క్రీడకు బహు చక్కని ప్రదేశం .రాదా మాధవ దివ్య ప్రేమకువిహార భూమి అదే .అలాంటి ప్రేమనే వారిద్దరూ కోరుకున్నారు .నీటి తరగలు తళ తళ లాడుతుంటే అంది నట్లు కనీ పించి అందకుండా పోతున్న అందాలు మేరిశాయట.ఆమె మరీ మురిపెం గా ఆతను ఉంటె వేరే నుదుట సిందూరం ఎండుకన్నది .ఆతని పాద ధూళే సిందూరం అవుతుందని ఏంతో సంతృప్తి గా సంతోషం గా అన్నది .పాద ధూళి సిందూరం గా భావించటం ఈ నాటి ఆడపిల్లలకు రుచిన్చాదేమో కాని 1963 లో వచ్చిన ఆ కాలం లో ఇంకా ఆభావం పూర్తిగా స్త్రీలలో ఉంది .
మమతలు చూసి మాయలు చేసి ఆమె తన గళం లో కల్యాణి గా నిలిచింది .కల్యాణి రాగం గా మారిందని భావ గర్భితమైన మాటను నారాయణ రెడ్డి అనటం ఆయన పాండిత్య ప్రకర్ష కు గీటు రాయి గా నిలిచింది .ఆమె కురులు అతన్ని తాకినసమయం లో ఆతనిలో తీయని జ్వాల రగిలింది .ప్రేమ జ్వాల గావర్ణించటం మాత్రమే కాదు దాన్ని తీయని జ్వాల అనటం సి నా రే ప్రత్యేకం జ్వాలకు తియ్యదనం ఆపాదించటం ఆయన గొప్ప పలుకు బడి వంపుల్లో గల గలా సాగుతుంటే జీవన రాగాల వాన విరుస్తోంది .ఇద్దరూ కలిసి హాయిగా ఆనందం గా నవ్వులు చిలికారు .వలపు బంగారు వీణ ను మీటుకొని మురిశారు .మై మరచారు .హద్దులు దాటని ఆత్మీయత .చదువుకొన్న అమ్మాయి మనసులో పలికిన భావ వీణ ,అతని ముందు కరిగిన ఆమె హృదయ వీణ .
ఘంట సాలమేస్టారు సుశీల పాడిన అతి కమ్మని పాట.అధిక చక్కని తెలుగుదనం ,హృదయాలను కరిగించే రాగాలు .సు స్వరాలు . అందమైనబృందావనం లో విహరించిన అను భూతి ,సెలయేటి అందాల గలగలలు ,కలబోసి పండించిన ఆదుర్తి దార్శనికత కు జేజేలు పలకాలని పిస్తుంది . వీణ సొగసులు ఏటి గలగలలు ,తరంగాలపై తళుకులు సావిత్రీ అక్కినేని లు అందాలు ఆరబోశారు అన్నీ అనుభవైక వేద్యం చేసిన అన్న పూర్నా బృందం అభి నంద నీయం .అందుకే గీతా మకరందం అయింది .
మరో మకరంద బిందువు ను తర్వాత ఆస్వాదిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-13-ఉయ్యూరు

