పెరల్ ఎస్.బక్-1
ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’ ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి ఉందని పించింది మట్టి మనిషి గా అనిపిస్తుంది .నేల విడిచి సాము చేయదు .చిన్న పిల్లలకు కూర్చో బెట్టి కధలు చెబుతున్నట్లు ఉంటుంది ఆమె రచన .అందుకే అందరికీ ఇష్టం .ఆమె జీవిత చరిత్రను పీటర్ కూన్ అనే రచయిత ‘’ఏ కల్చరల్ బయాగ్రఫి ‘’అన్న పేరు తో గొప్పగా రాశాడు అది చదివి ఏంతో ఆమెను గురించి తెలుసుకొన్నా .ఆ వివరాలే ఇప్పుడు అందిస్తున్నాను .
అమెరికా లో పుట్టిన బక్ ఎనభై ఏళ్ళు జీవించింది ఇందులో సగం కాలం ఆమె చైనా లోనే గడిపింది .అందువల్ల అమెరికా వారికీ చైనా వాళ్ళకూ కూడా ఆమె ‘’విదేశీ ‘’ఏ అయింది .చైనా పల్లెటూరి జీవితాన్ని నేపధ్యం గా ఆమె రాసిన నవలలు కధలు ఆమె అనుభవానికి అవగాహనా సామర్ధ్యానికి నిలు వెత్తు అద్దాలు గా కనీ పిస్తాయి .మానవ విలువల పై ఆమెకు అమిత మైన అభిమానం .కుటుంబ విలువల కోసం నిరంతరం పోరాడిన మహిళ బక్ .నల్ల జాతి ప్రజల హక్కుల పోరాటం లోను ముందు నిలిచింది .స్త్రీ లకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని ఏంతో శ్రమించింది .యుద్ద్ధం వల్ల దెబ్బ తిన్న దేశాలకు సహాయ సహకారాలన్దించింది .రెడ్ క్రాస్ ద్వారా ఆమె అనేక సేవా కార్యక్రమాలను చేబట్టి పూర్తీ చేసి అందరికి సంతృప్తి కల్గించింది .అమెరికా సైన్యం ఆసియా దేశాలలో చేసిన యుద్దాలలో అక్కడి ఆడవాళ్ళ తో పెంచుకొన్న సంబంధాల వల్ల పుట్టిన పిల్లలను ‘’అమెరికన్స్ ‘’అని పేరు పెట్టి ,వాళ్ళ జీవితాల కోసం వికలాంగుల కోసం ‘’వెల్ కం హోమ్ ‘’స్తాపించిన మాన వీయురాలు .మొదట్లో కమ్యూనిజాన్ని తిరస్కరించింది చివర్లో మేకార్దీ ఇజం కు లోనైంది .జీవిత్స కాలం లో సంపాదించిన సంపదను అంతటినీ రెండు ట్రస్ట్ లకు రాసిచ్చేసిన త్యాగ మూర్తి .
1938లో పెరల్స్ బక్ కు సాహిత్యం లో నోబుల్ పురస్కారం లభించింది .ఆమె కు వచ్చిన 70,000డాలర్ల బహుమతి డబ్బులో నలభై వేల డాలర్ల తో ఒక స్కూల్ కు సకల సదుపాయాలను కలుగ జేసిన సాంఘిక సేవా పరాయణు రాలు బక్ .భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రధానిపై ఒత్తిడి తేవాల్సిందిగా ఆ నాటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ పై తీవ్ర మైన ఒత్తిడి తెచ్చిన స్వాతంట్ర్య ప్రియురాలు .బక్ ..రెండు సార్లు వివాహం చేస్సుకోన్నది .ఆమె రచనల్లో తండ్రి మొండితనం తల్లి అనారోగ్యం మనకు కనీ పిస్తాయి .అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో చిక్కు కొని విల విల లాడుతున్నప్పుడు కూడా పెరల్స్ బక్ పుస్తకాలు బాగా అమ్ముడయ్యాయి .అదీ ఆమె గొప్ప తనం .ఆమె రాసిన కధకు
ఆ రోజుల్లో కనీసం 1500డాలర్లు పారితోషికం గా ఇచ్చేవారు .ఆమె రచనలు లక్షలాది కాపీలు అమ్ముడు పోయాయి .వాటిపై రాయల్టీ కూడా ఎక్కువ మొత్తం లో లభించేది .నోబుల్ ప్రైజ్ వచ్చిన ముగ్గ్గురిలో ఈమె మూడవ అమెరికన్ .మొదటి సారి సింక్లైర్ లూయీస్ కు రెండవ సారి ప్రఖ్యాత నాటక రచయిత వొ నీల్ కు వచ్చింది .మూడవ వారు బక్ .అప్పటికి అయిదుగురికి వస్తే ఈమె మొదటి మహిళ గా నోబుల్ ను అందుకొని అమెరికాకు కీర్తిని తెచ్చింది మహిళా లోకానికి గుర్తింపు తీసుకొచ్చింది .అమెరికా చేసిన వియత్నాం యుద్ధాన్నిపూర్తిగా వ్యతిరేకించింది .భారత దేశం లో పర్యటించింది .భారత్ లో ఉన్న బీదరికాన్ని ,కుల పోరాటాలను పోగొట్టాలని సూచించింది . కొరియా యుద్ధానికీ ఆమె వ్యతిరేకమే .ఆమె రచనలు 69 ఒకే సంవత్సరం లో ప్రపంచం మొత్తం మీద వివిధ భాషలలోని అనువదింప బడ్డాయి .ఎర్నెస్ట్ హెమింగ్ వే అనేప్రముఖ ఆమెరికా నవలా కారుని రచనలు 64,మరో ప్రసిద్ధ నవలా రచయిత స్టెయిన్ బెక్ రచనలు48 మాత్రమె అనువదింప బడ్డాయి ఇది ఆమె కు దక్కిన ప్రపంచ వ్యాప్త గౌరవం అభిమానం ఆదరణ .అందుకే బక్ ను ‘’money machine ‘’((ధన యంత్రం ) అన్నారు .తన కార్యక్రమాలకు ఇంచార్జ్ గా ‘’టెడ్ ‘’అనే వాడిని నియమిస్తే వాడు నమ్మకం గా ‘’తెడ్డు ‘’చూపించాడు .చివరికి కేసులు ,విచారణలు ,గొడవల్లో పడింది .అయినా వాడినే నమ్మింది బక్ చని పోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కోర్టుకు వెడితే వారికి అయిదు నిమిషాల్లో వారిపక్షాన కోర్టు తీర్పు నిచ్చి ఆమె ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడింది
.’’The Kennedy women ‘’అనే పుస్తకాన్ని బక్ రాసింది .స్టాలిన్ ను ‘’రాక్షసుడు ‘(మాన్ స్ట)ర్ అంది నిర్భయం గా .సివిల్ లిబర్టీస్ కోసం పరితపించింది ఆమె ఎప్పుడూ ‘’be careful when you become famous ‘’అని హితవు చెప్పేది .ఆమెను కద చెప్పే దానిగా తప్ప ఆర్టిస్ట్ గా గుర్తించలేదుకొందరు .రూజ్ వెల్ట్వె భార్య ఎల్నార్ ‘’’’if we older people have the courage that miss Buck has had .perhaps the next generation ill haave the courage to make this country a real democracy ‘’అని పెరల్స్ బక్ ను మనసారా కొని యాడినది .ఆమె రాసిన ‘’డ్రాగన్ సీడ్ ‘’నవల 1991లో మూడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి .దీన్ని ఏం జి.ఏం సంస్థ సినిమా గా తీయటానికి ఒక లక్షా అయిదు వేల డాలర్లు ఈమెకు చెల్లించి రైట్స్ కొనుక్కున్నారు .ఏదైనా ఒక మంచి పని కోసం శ్రమించినప్పుడల్లా తన శక్తి పెరుగుతుందని బక్ అనేది. చాన్కై షేక్ ప్రభుత్వ విధానాలను దుయ్య బట్టింది సన్యట్ సేన్ మీద కొంత సాను భూతి చూపించింది
మిగిలిన బక్ విశేషాలు మరో సారి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-13-ఉయ్యూరు

