ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసులో (1948-49)అనంత పురం జిల్లా హిందూ పూర్ లో మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు అక్కడి ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా పని చేస్తున్న కాలం లో మొదటి సారిగా ఆ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సభలో నీలం సంజీవ రెడ్డిని ,బాబూ రాజేంద్ర ప్రసాద్ ను చూశాను ..రెడ్డి మాట తీరు నాకు ఎందుకో మహా నచ్చింది .ఆయన పై వీరాభిమానం మనసులో ఏర్పడి పోయింది .అలాగే రాజెన్ బాబు అన్నా ఆరాధనా భావం మనసంతా నిండి ఉంది అప్పటికీ ఇప్పటికీ . ఆ తర్వాత నా చదువు ,ఉద్యోగం లో రెడ్డిపై గాఢ మైన అభిమానం పెరిగింది .ఆయన పదవిలో ఉన్నాలేక  పోయినా పదవులను తృణ ప్రాయం గా వదిలేసినా ఉన్నత శిఖరాలు అధిస్టించినా ఇది పెరిగిందే కాని తగ్గలేదు .నాకు తోడూ నాతొ పని చేసిన నాసహా ఉపాధ్యాయ్డు పసుమర్తి ఆంజనేయ శాస్త్రి కీ స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు కూ కూడా రెడ్డిపై నాలానే అభిమానం ఉండేది మేము రెడ్డిని ‘’మన గురువు గారు లేక మన గురువు ‘’అని మా సంభాషణల్లో అనుకొనే వాళ్ళం. అందుకే ఆయన్ను గురువు సంజీవ రెడ్డి అన్నాను .మరి ఆయన శీలం నీలమణి కనుక ఘన నీలం అన్నాను

Inline image 2  Inline image 4Inline image 5

.

బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ (ఓల్డ్ కాంగ్రెస్) పార్టీ తరఫున ప్రచారం చేస్తూ శిష్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య తో పర్యటన చేస్తూ ఉయ్యూరు కు వచ్చినప్పుడు చూశాను అప్పటికే పెండేకంటి గురువుకు పంగనామాలు పెట్టి బాక్ టు పెవిలియన్ అయ్యాడు .రెడ్డిఒక్కడే ఉయ్యూరు వచ్చాడు .రహదారి బంగళాలో ఉన్నాడు .అప్పుడు ఇంకా మీటింగ్ మొదలు కాలేదు .జనమూ పెద్దగా లేరు .లోపల వాలు కుర్చీలో  తెల్లటి ఖద్దరు పంచ ,ఖద్దరు లాల్చీ నెత్తిన గాంధీ టోపీ తో కూర్చుని ఉన్నాడు .అప్పుడు ధైర్యం గా నేను ఆయన దగ్గరకు వెళ్లి పలకరించి నమస్కారం చేశాను .షేక్ హాండ్ ఇచ్చాను సంతోషం గా స్వీకరించాడు .కాని జన ప్రభావం లేనందున మనసులో కొంచెం కలవరం గా ఉన్నట్లు అని పించింది .ఆ తర్వాత మీటింగ్ ప్రారంభామవటం ఆయన మాట్లాడి వెళ్లి పోవటం జరిగింది .కనుక  ‘’నా అభిమాన హీరో’’ ను కలిసి ,తాకి ,మాట్లాడిన అను భూతి నాకెంతో గర్వం గా ఉండేది .ఇది అందరికి చెప్పి పులకరించి పోయే వాడిని అంతటి అదృస్టం  నన్ను వరించిందని పొంగిపోతానేప్పుడూ .

సంజీవ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రెసిడెంట్ పదవికి కాంగ్రెస్ అధికార కమిటి ఇందిరా గాంధి నాయకత్వం లో ఆమోదించి డిక్లేర్ చేసింది . ఇది ఆ తర్వాత ఇందిరకు ఇష్టం కాక గిరి ని బరిలో దింపింది ,అంతరాత్మ ప్రబోధం అంది .పార్టీ కాండిడేట్ రెడ్డి ఓడిపోయాడు చెంచాఅని పిలువ బడ్డ  ‘’గిరి ‘ప్రెసిడెంట్ అయ్యాడు హోరా హరీ జరిగిన ఈ పోరాటం లో నేను రెడ్డి నే సమర్ధించా .రెడ్డి గెలవాలని అందరితో చెప్పేవాడిని మా ఆంజనేయ శాస్త్రి కూడా అలానే కలలు కన్నాడు .కాని ఓడిపోయాడు. ఓడినా హుందాగా వెళ్లి పోయి తన పుట్టిన ఊరిలో జామ తోటలో కూర్చున్నాడు

అవసరమైతేనే మాట్లాడేవాడు .కాని దేశం క్లిష్ట పరిస్తితుల్లో ఉంటె తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పే నైజం ఖలేజా ఉన్న మొనగాడు రెడ్డి .సంకోచం నదురూ బెదురూ ఉండేది కాదు అందుకే నాకు అభిమానం పెరుగుతూ వచ్చింది  జనతాపార్టీ ఏర్పడటంలోక నాయక ,జయప్రకాష నారాయణ  నాయకత్వం లో రెడ్డి పని చేసి ఆంద్ర ప్రదేశ లో జనతా పార్టీ వారంతా పార్ల మెంటు ఎన్నికలలో ఒడి పొతే తానొక్కడే గెలిచి రెండో సారి స్పీకర్ అయి మొరార్జీ ప్రధాని అయి రెడ్డినే ఏకగ్రీవం గా ప్రెసిడెంట్ ను చేయటం చారిత్రాత్మక విషయం .బంతి కింద పడినా మళ్ళీ పైకి ఎగురుతుందని తెలియ జెప్పిన పరమ సత్యం .అందుకే ఆయనపై నా ఆరాధనా భావం పెరుగుతూనే ఉంది .ఒక మట్టి మనిస్ది గ్రామ స్తాయి నుండి దేశ స్తాయిలో ప్రధమ పౌరుదు అవటం ,ఈ మధ్యలో స్పీకర్ కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి పదవుల్ని అలంకరించటం పార్టీ పదవులకు శోభ తేవటం అసాధారణమైన విషయం అందుకే రెడ్డి అంటే అంతటి అభిమానం

Inline image 3   

.’

భారత  దేశానికి సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్ర పతి 1977 నుంచి 82వరకు పదవిలో ఉన్నాడు దానికి వన్నె తెచ్చాడు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ బసప్ప దానప్ప జెట్టి  హిదయతుల్లాలు రెడ్డి తర్వాత జెట్టి ఆక్టింగ్ ప్రెసిడెంట్ అవగా జైలు సింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు .అంతకు ముందు సంజీవ రెడ్డి రెండవ సారి నాల్గవ లోక్ సభ స్పీకర్ అయ్యాడు .మార్చ్77 నుంచి జులై పదిహేడు వరకు చేశాడు అంతకు ముందు బలీరాం భగత్ ఉండేవాడు రెడ్డి తర్వాత కే.ఎస్.హెగ్డే అయ్యాడు ఆంద్ర ప్రదేశ్  ముఖ్య మంత్రిగా సంజీవ రెడ్డి1962 నుంచి 64 వరకు పని చేశాడు అప్పుడు గవర్నర్ భీమ సేన్ సచార్ రెడ్డికి ముందు దామోదరం సంజీవయ్య తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి అయ్యారు ఇలా కీలక పదవుల్లో ఉన్నాడు

సంజీవ రెడ్డి పుట్టిన ఊరు అనంతాపురం జిల్లాలోని ‘’ఇల్లూరు ‘’అనే పల్లె టూరు ప్రాధమిక విద్య ఇక్కడే చదివి తర్వాత మద్రాస్  అడయార్ లోని దియాసఫికల్ స్కూల్ లో చేరి,అనంతపురం లో డిగ్రీ పూర్తీ చేశాడు . నాగరత్నమ్మ ను వివాహమాడాడు వీరికి ఒక కొడుకుముగ్గురు  కూతుర్లు .గాంధీజీ పిలుపు విని స్వాతంత్ర సమరం లో పాల్గొన్నాడు యూత్ లీగ్ కు నాయకుడయ్యాడు .ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరి గా  పదేళ్లున్నాడు  క్విట్ ఇండియా ఉద్యమలో చేరి అరెస్ట్ అయి 1940 -45కాలం లో జైలు లో ఉన్నాడు 1942లో విడుదల అయినా మళ్ళీ ఖైదీ అయి అమరావతి జైలు కు పంప బడ్డాడు అక్కడే ప్రముఖ స్వాతంత్ర సమారయోధులు ప్రకాశం పంతులు కామ రాజు సత్య మూర్తి వి వి.గిరి లతో శిక్ష అనుభ వించాడు .

1946లో సంజీవ రెడ్డి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికై ,లెజిస్లేటివ్ పార్టీ కి సెక్రటరి అయ్యాడు భారత రాజ్యంగా రచనా సంఘం లో సభ్యుడయ్యాడు మద్రాస్ ప్రభుత్వ ప్రొహిబిషన్ అడవులు గృహ మంత్రిగా పని చేశాడు 1951లో ఆంద్ర

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రెసిడెంట్ గా ఉన్నాడు 1952లోఆంద్ర రాష్ట్రానికి  టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్య మంత్రి సంజీవ రెడ్డి ఉప ముఖ్య మంత్రి గా పని చేశారు తెలంగాణా తో కలిసి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంద్ర ప్రదేశ్ కు మొదటి ముఖ్య మంత్రి 1956-60లో సంజీవ రెడ్డి అయ్యాడు రెండవసారి ముఖ్య మంత్రిగా 62-64 ఉన్నాడు మొత్తం మీద అయిదేళ్ళు ముఖ్య మంత్రిగా చేశాడు .శ్రీ కాళ హస్తి నుంచి ద్రోణా చలం నుంచి శాసన సభకు ఎన్నికయ్యే వాడు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం రెడ్డి హయాం లోనే ప్రారంభమయ్యాయి శ్రీశైలం ప్రాజెక్ట్ నుముఖ్యమంత్రి  చంద్ర బాబు నాయుడు ‘’నీలం సంజీవ రెడ్డి  సాగర్ ‘’ ‘’అనిమార్చి  గౌరవమ్ కల్గించాడు  రెడ్డి గ్రామీణాభి వృద్ధి వ్యవసాయం లకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు 1964లో అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షుడైనప్పుడు సంజీవ రెడ్డి ముఖ్య మంత్రి పదవికి రాజీ నామా చేశాడు .బస్సుల జాతీయీకరణ లో సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యానానికి స్పందించి 1964 లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నాడు .

కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బెంగుళూర్ భావనగర్ పాట్నా లలో భారీ సదస్సులు నిర్వహించాడు నీలం .1962 గోవా కాంగ్రెస్ సభలో గోవా విముక్తి ని చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టటానికి చేసిన ప్రసంగం ఏంతో స్పూర్తి నిచ్చి రెడ్డి నాయకత్వానికి యేన లేని కీర్తిని తెచ్చింది .లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు సంజీవ రెడ్డి కేంద్ర మంత్రి వర్గం లో ఉక్కు గనుల శాఖా మంత్రిగాఇందిరా ప్రభుత్వం లో  సివిల్ ఏవియేషన్ షిప్పింగ్ శాఖా మంత్రిగా సమర్ధం గ 1967 వరకు పని చేశాడు పని చేశాడు అప్పుడే విమాన ప్రమాదం లో హోమీ జహంగీర భాభా అనే అను శాస్త్ర వేత్త మరణించాడు 1969లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసమయం లో స్పీకర్ పదవికి రాజీ నామ చేశాడు గిరి చేతిలో స్వల్ప మెజారిటి తో ఇందిరా కుతంత్రం తో ఓడిపోయినా తర్వాత అనంత పురం వెళ్లి పోయి వ్యవసాయం చేసుకొంటూ కాలం గడిపాడు .

జనతా పార్టీ చేతిలో ఇందిరా ఓడిపోయినప్పుడు రెడ్డి లోక్ సభకు ఎన్నికై రెండో సారి స్పీకర్ అయి ఏకగ్రీవం గా1977 లో రాష్ట్ర పతి అయ్యాడు ఓడి మళ్ళీ ఆ పదవిని దక్కించుకొన్న వాడుగా చరిత్ర పుటల్లో నిలిచి పోయాడు రెడ్డి ఇలా ఏక గ్రీవం గా అయిన మొదటి వాడని పించుకొన్నాడు నీలం .మొరార్జీ చరణ్ సింగ్ మళ్ళీ ఇందిరా ప్రభుత్వాలలున్నప్పుడు నీలమే ప్రెసిడెంట్ ..తన జీవిత చరిత్రను ‘’reminiscences and reflections of a president ‘’గా రాసుకొన్నాడు .అంతకు  ముందు ‘’వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ‘’పుస్తకం రాశాడు పి.వి.నరసింహా రావు ఆత్మ కదా లో మహేంద్ర నాద కేరక్టర్ సంజీవ రెడ్దియే ఆయనకు ఆయన శిష్యుడైన బ్రాహ్మానంద రెడ్డి కి జరిగిన రాజ కీయ పోరు నరసింహా రావు చిత్రించాడు .1996లో ఎనభై మూడేళ్ళ వయసులో సంజీవ రెడ్డి నీలం అమరుడైనాడు. విలువలకు నిర్భీతికి నిజాయితీకి పట్టుదలకు రాజకీయ చాణక్యానికి ,పెద్దమన్సిషి తత్వానికి హుందా తనానికి,ఆత్మా గౌరవానికి ,నిబద్ధతకు,అంకిత   భావానికి మీదు మిక్కిలిమహా దేశ భక్తికి జాతీయతకు  నీలం సంజీవ రెడ్డి గొప్ప ఉదాహరణ అందుకే ఆయన అంటే అంత ప్రేమాభిమానాలు నాకు

నీలం వారి శత జయంతికి రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ రావటం అయన పై ప్రశంసలు కురిపించటం అటు  కేంద్రం ఇటు  రాష్ట్ర ప్రభుత్వం .చేసిన ఘన మైన ఏర్పాటు లు అభినంద నీయం .కాని మాజీ ప్రధాని బహు భాషా కోవిదుడు ప్రధాని అయిన మొదటి ఆంధ్రుడు  పాముల పర్తి వెంకట నరసింహా రావు గారి వర్ధంతిని ప్రభుత్వ కార్య క్రమంగా చెయ్యక పోవటం క్షమించా రాని నేరమే .

నీలం సంజీవ రెడ్డి శత జయంతి సందర్భం గా –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.