సరస భారతి 55వ సమావేశం –సమీక్ష
24-12-13-మంగళ వారం సాయంత్రం ఆరున్నర గంటలకు సరస భారతి యాభై అయిదవ సమావేశాన్ని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మహిత మందిరం లో ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాముఖ్యం ‘’అనే అంశం పై నిర్వహించింది .ముందుగా స్తానిక వి.ఆర్ .కే.ఏం హైస్కూల్ విద్యార్ధినులు ఇద్దరు చక్కగా భగవద్ గీతా పతనం చేశారు .వారికిని సరసభారతి నగదు తో అభి నందిన్చింది .
సరసభారతి 55 వ సమావేశం – ధనుర్మాసం – తిరుప్పావై దృశ్య మాలిక
నేను అధ్యక్షత వహించిన ఈ సభలో వక్తలు గా స్రేఎ మాదిరాజు శ్రీనివాస శర్మ శివ లక్ష్మి దంపతులు విచ్చేశారు .ణా ప్రసంగం లో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించాను .’’సూర్యుడు దనూ రాశిలో ప్రవేశించినపుడు వచ్చేదే ధనుస్సంక్రమణం.సాధారణం గా డిసెంబర్ పదిహేడున వస్తుంది అప్పటి నుంచి నెల రోజులు ధనుస్సు ఉంటుంది దీనినే నెల పట్టటం అని ఆంద్ర దేశం లో పిలుస్తారు ఇంటి ముందు ఆవు పేద తో కల్లాపి జల్లి రంగ వల్లులు తీర్చి ఆవు పేద తో గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ముగ్గు మీద భక్తిగా అలంకరిస్తారు .దీనితో వాకిలికి లక్ష్మీ కల శోభ వస్తాయి ఆడపిల్లలే గొబ్బెమ్మలు పెడతారు మంచి భర్త రావాలని మొక్కుతారు ..వైష్ణవ దేవాలయాల్లో తెల్ల వారుజామున పూజ చేసి నైవేద్యం పెడతారు భజనలు చేసుకొంటూ ఇంటింటికి తిరుగుటు నగర సంకీర్తన చేస్తారు యదా శక్తిగా యజమానులు వారికి దానం తో బియ్యం తో సహకరిస్తారు నెల వగానే ఈ డబ్బు బియ్యం ద్ర్వవ్యాలతో అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు .హరిదాసులు గంగి రెడ్డు మేళాలు ఈ నెల ప్రత్యేకత కోడి పందాలు ,కొత్తా అల్లుడు ఇంటికి రావటం సంక్రాంతినాడు పితృదేవతలకు తర్పణాలు బ్రాహ్మణులకు గుమ్మడికాయ బంగారం దానాలు చేస్తారు .గొబ్బి పిడకల తో రాధా సప్తమి నాడు పరవాన్నం వండి సూర్యుదినికి నైఒవెద్యమ్ పెడతారు .కనుము నాడు గారెలు వండుతారు .ఇలా నెల అంటా శోభాయ మానం గా ఊరంతా దర్శన మిస్తుంది
ధనుర్మాసం లో పూజ ఎప్పుడు చేయాలి ?/ఎందుకు చేయాలి ?
సూర్యోదయానికి మున్డున్నకాలాన్ని ‘’అరుణోదయ కాలం ‘’అంటారు దీనికే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు .అప్పటికి ఇంకా ఆకాశం లో నక్షత్రాలు మినుకు మినుకు మంటూనే ఉంటాయి ఈ సమయం లో దైవ పూజ చేయాలి .దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి .మనకు ఒక నెల వారికి రెండు గంటలు మాత్రమె .దక్షిణాయనం చివరలో అంటే దేవతలా రాత్రికాలం చొ చివరి ఘడియల్లో దేవతలు విష్ణువు ను ఆరాధించి పూజిస్తారు .ఇదే మనం చెప్పుకొన్న అరుణోదయ కాలం .ఆ సమయం లో మానవులు కూడా పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది ఈ కాలం ధనుర్మాసం లోనే సాధ్యం అవుతుంది అందుకే ధనుస్సుకు అంట ప్రత్యేకత మార్గ శిర మాసం విష్ణువు కు ప్రీతికరం కూడా .ధనుస్సులో క రోజు పూక చేస్తే మిగితా వెయ్యి రోజుల పూజకు సమానం అని చెబుతారు .
కాత్యాయని వ్రతం – శ్రీ నోము
ద్వాపర యుగం లో నంద గోప కన్నెలు కాత్యాయని వ్రతం చేశారు .అప్పుడొక సారి వర్షాలు లేక పంటలు లేక వారు ఇబ్బంది పడుతుంటే గోప వృద్ధులు వారిని శ్రీ కృష్ణుని గూర్చి కాత్యాయని వ్రతం ను నిష్టగా చేయమని దాని వల్ల వర్షాలు బాగా కురిసి భూమి సస్య శ్యామల మవుతుందని చెప్పి గోప కన్యలను శ్రీ కృష్ణుని వశం చేశారు .ఆయన వాళ్ళతో తనను అపరాత్రి వేళ స్నానానికి, వ్రతానికి సరైన సమయం లో నిద్ర లేప మని చెప్పి నీలా దేవి గృహానికి వెళ్లి పోయాడు .వీరందరూ మిగిలిన గోపికలను నిద్రలేపి కృష్ణుని మేలు కొలిపి నెల రోజులు దీక్షగా కాత్యాయని వ్రతం చేశారు వారి కోరికలన్నీ కృష్ణుడు తీర్చాడు.అది గొప్ప ప్రేరణ గా నిలిచింది
ఆండాళ్ –తిరుప్పావై
కలియుగం ప్రారంభమైన 98ఏళ్ళకు అంటే ఇప్పటికి .5,017సంవత్సరాల క్రితం నల నామ సంవత్సర ఆశాఢ శుద్ధ చతుర్దశి మంగళ వారం నాడు పూర్వ ఫల్గునీ నక్షత్రం లో పెరియాళ్వార నే విష్ణు చిత్తుడు అనే పరమ భాగవతోత్తమునికి ఆయన తులసీ వనమైన బృందావనం లో గోదా దేవి అయోనిజ గా ఉద్భవించి దొరికింది .ఆయన అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు .ఆమె శ్రీ రంగానాదునికి పుష్ప హారాలు కడుతూ అవి బాగున్నాయో లేవో నని తలలో ముడుచుకొని చూసుకొని అప్పుడు వాటిని రంగనాధ స్వామి కోవెలకు తండ్రితో పంపేది .స్వామి ఏంతో సంతోషం తో వాటిని .గ్రహించే వాడు అందువల్ల గోదా దేవిని ‘’చూడి కొడు త్త నాచ్చియార్ ‘’లేక ‘’ఆముక్త మాల్యద ‘’అన్నారు అంటే తానూ ధరించిన హారాలను ఇచ్చిన కన్నె పిల్ల అని అర్ధం . .ఒక రోజు తండ్రి ఇది చూసి ఆ మాల ను తీసుకు వెళ్ళకుండా వేరే మాల ను స్వామికి సమర్పిస్తే ఆయన స్వీకరించకుండా గోదా ధరించి ఇచ్చిన మాలయే కావాలన్నాడు .అప్పటి నుంచీ మళ్ళీ యధావిధి గా అలానే చేసేది .రంగని వలచిన ఈ చిన్నది తన కోరిక తీరటానికి గోపికలు లాగా ‘’మేలి నోము ‘’నోచి రోజుకొక పాశురం రంగని పై చెప్పింది అవే ‘’తిరుప్పావై ‘’అని పిలువా బడ్డాయి ఆమెను ఆయన స్వీకరించి వివాహం చేసుకొని తనలో ఐక్యం చేసుకొన్నాడు .అప్పటి నుంచి ఆలయాలలో రోజుకొక పాశురం చదవటం అలవాటైంది .
మొదటి తొమ్మిది పాశురాలలో శ్రీ నోము ప్రాముఖ్యత ,ఆడంబరాల విసర్జన ,వర్షం వస్తే సంపద పెరిగే తీరు ప్రస్తావన ఉంది .తరువాతి పదింటిలో ఈ నోములో సమాజం పాల్గోనేట్లు చేయటం ,స్నేహితురాళ్ళతో పూలు సేకరించటం ,ప్రక్రుతి అందాలు పులకరింత ,,ప్రతి ఇంటికి వెళ్లి కన్నెలను నిద్ర లేపటం స్నానం ,దేవాలయ సందర్శనం .సుప్రభాత సేవ ,శ్రీ కృష్ణ బల రాముల శౌర్య పటిమ ఉంటాయి .చివరి తొమ్మిది పాశురాలలో దైవ ప్రభావం చెప్ప బడింది .పూజకు కావలసిన వస్తు సంబారాలైన పాలు ,శంఖం ,అలంకరాన నైవేద్యం ,నెయ్యి ,వెన్న మొదలైన వాటి
వివరణ ఉంది చివరి పాశురం లో శ్రీ కృష్ణునితో తాదాత్మ్యం చెందటం ఉంది .దక్షిణ దేశం లో తిరుప్పావైకి ఉన్న ప్రాధాన్యత దేనికీ లేదు అదొక పారాయణ గ్రంధమే విశిస్టాద్వైతులకు . .జయ దేవుని గీత గోవిందం తో సమానమని అంటారు
విశిష్టాద్వైత మత స్తాపకులు భగవద్ రామానుజా చార్యులు .ముప్ఫై మూడవ ఏట ఆత్మ జ్ఞానం పొంది ఈ మతాన్ని స్తాపించి నూట ఇరవై సంవత్సరాలు సార్ధక జీవితం గడిపిన మహాత్ముడు .అద్వైత మార్గం లో నేతి నేతి తో బుర్రలు పగల కొట్టుకున్న వేదాన్తులకు వారు కోల్పోయిన ఆత్మను వెదికి ఇచ్చిన వాడు ఈ ఆచార్యుల వారుఅని చమత్కారం గా అంటారు .అందుకే ‘’బ్రహ్మం ‘’శంకరు డి నుంచి రామానుజులకు సూక్షం నుంచి స్తూలం లోకి పరిణతి చెందింది అన్నారు .ప్రేమ తత్వాన్ని చెప్పిన వాడు .శరణాగతి ప్రేమ లతోనే భగవంతుని చేరగలం అన్నాడు .భక్తికి తరించటానికి కుల మత ,తర తమ భేదాలు లేవని ఎలుగెత్తి చాటాడు .మంత్రాలను సమాజ పరం చేసి అందరికి ముక్తి మార్గాన్ని అందించాడు .శంకరుడు రామానుజుడు ఇద్దరూ వైశాఖ మాసం లో ఒకే నక్షత్రమా లో జన్మించటం విశేషం
రామానుజ పరంపర లో వారే ఆళ్వారులు .వీరు పన్నెండు మంది వీరినే ‘’పన్నిద్దరాళ్వారులు ‘’అన్నారు కృష్ణ దేవరాయలు ‘’పన్నిద్దరు సూరులు ‘’అన్నాడు ద్వాదశాదిత్యుల్లాంటి వారు సూరి అంటే పండితుడని సూర్యుడని అర్ధం .వీరు ద్రావిడ భాషా సాహిత్య మతాలను సుసంపన్నం చేసిన మహాను భావులు .ఆళ్వారు అంటే భక్తీ తన్మయత్వం ఉన్న వారు అని అర్ధం .వీరుప్రపంచానికి నాగరకత ను నేర్పారు.సర్వ మానవాళికి చెందిన రుషి తుల్యులు .వీరి పేర్లు ‘’సారో భూత ,భక్తీ సార ,మధుర కవి ,శఠ కోప ,కుల శేఖర ,విష్ణు చిత్త,గోదా దేవి ,భక్తాంఘ్రి రేణు ,ప్రాణనాధ ,పరకాల యోగి ‘’.ఇందులో విష్ణు చిత్తుల వారిని ‘’పెరియాళ్వార్ ‘’అనీ ఆయన కుమార్తె గోదా దేవిని ‘’ఆండాళ్ ‘’అనీ అంటారు .కుల శేఖరులు కేరళలో జన్మించి ‘’ముకుంద మాల ‘’రాశారు .పాదాన్ఘ్రి రేణువు అంటే విప్రనారాయణ .ఈయన్నే ద్రవిదభాషలో ‘’తొందరప్పోడి రాల్వార్ ‘’అంటారు .ఆల్వారుల హృదయం లో నారాయణ మూర్తి సదా ఉంటాడని వీరంతా మోక్ష సామ్రాజ్యాన్ని సాధించారని అర్ధం చేసుకోవాలి ఆండాళ్ అనబడే గోదా దేవి ప్రపత్తి మార్గానికి మార్గ దర్శి భక్తికి పరాకాష్ట .ఆమె నోచిన మేలి నోము లేక శ్రీ నోము బాపు- రమణ భాషలో ‘’సిరి నోము ‘’.తానూ ఒక గొల్లెత గా భావించి కాత్యాయని వ్రత దీక్ష చేబట్టింది గొల్లతనం అంటే అజ్ఞానం అంటారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్ని పొందటమే గోదా దేవి తిరుప్పావై లో అంత రార్ధం అదే .పవిత్రమైన పాట.’’అని ధనుర్మాసం, తిరుప్పావై ల ప్రాముఖ్యతను చెప్పాను .
శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి మాట్లాడుతూ రాయలు రాసిన ఆముక్త మాల్యద ప్రబంధం కు నాంది కృష్ణా జిల్లా శ్రీ కాకుళం లోనే జరిగిందని ఆంద్ర మహా విష్ణువు ఆలయం లో నిద్రించిన రాయలకు కలలో కనిపించి తన్ను ప్రేమించి
పెళ్లి చేసుకొన్న ఆకన్య అంటే గోదా దేవి చరిత్రను కావ్యం గా రాయమని ఆదేశించాడని ,అక్కడే ఆ కావ్యానికి శ్రీకారం చుట్టాడని చెప్పింది .అక్కడ శ్రీ కృష్ణ దేవరాలు నిద్రించిన మందిరం ఇప్పటికి ఉందని రాయల విగ్రహాన్ని మండలి బుద్ధ ప్రసాద్ అందరి సహకారం తో అక్కడ ఏర్పాటు చేశారని అదొక దర్శనీయ క్షేత్రం అని చెప్పింది .రాయలు ఆముక్తమాల్యద లో గోదా దేవి అందాన్ని గొప్పగా వర్ణించాడని చెబుతూ ఆమె ముఖం చంద్ర బింబమే నని కళ్ళు లేడి కళ్ళు అని ఆ కనుల చేత ముఖం కస్తూరి మృగాన్ని జయిన్చిందని ,అందుకని అది ఆమె ముఖాన్ని ఎలాగై నా గెలవాలనే ఉద్దేశ్యం తో చంద్రుడి సాయం కోరిందని ఆతను అందం లో ఆమె కు సరి సమానం అయినా ఆమెలో సహజ పరిమళం ఉంది కనుక పోటీ చేయ లేనని చెప్పగా తానె చంద్రుని లో చేరి చంద్రుడికి మ్రుగాన్కుడిని చేసిందని రాయలు తమాషాగా చెప్పాడు. కాని ఇది తెలిసిన గోదా దేవి కస్తూరి మృగం తన తో పోటీకి వచ్చి నందుకు దాని నెత్తురు అయిన పచ్చి కస్తూరిని తన నుదుట బొట్టు గా ధరించిందని అందుకే ఆమెకు సహజ కస్తూరి పరిమళం అబ్బిందని చమత్కారం గా రాయలు ఊహించి అద్భుత వర్ణన చేశాడని చెప్పింది దీన్ని ఇంకొంచెం వివరిస్తూ కస్తూరి మృగానికి అండ కోశం లో కస్తూరి పుడుతుందని ,అందుకే కస్తూరికి ‘’నాభిజం ‘’అని పేరుందని వేట గాళ్ళు దాన్ని చంపి కస్తూరిని తీస్తారని ,పచ్చి కస్తూరికి సువాసన ఎక్కువ అని అందుకే నుదుట కస్తూరి బొట్టు ధరిస్తారని చెప్పింది సహజం గా లోకం లో ఏ రాజైన శత్రు రాజును యుద్ధం లో చంపి వాడి నెత్తురును తన నుదుట బొట్టుగా ధరించటం ఉందని ఈ విషయాన్ని కస్తూరి మృగాన్ని చంపి కస్తూరిని నుదుట బొట్టుగా పెట్టుకొన్నది గోదా దేవి అని రాయలు మహా బాగా సమర్దిన్చాడని వివరించి అందరి హర్ష ద్వానాలను అందుకొన్నది .
శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ కార్తీకం శివునికి ప్రీతి అని మార్గశిరం విష్ణువుకు ప్రీతి అని శివుడు అభిషేక ప్రియుడని విష్ణువు అలంకారప్రియుడని చెప్పారు .వైష్ణవాలయాలలో ధనుర్మాసాన్ని అత్యంత వైభవం గా నిర్వహించట చూస్తుంటే నేత్ర పర్వం గా ఉంటుందని .చలికి బద్ధ కిన్చేవారికి ఈ కాలం లో లేచి నదీ స్నానం చేస్తే శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుందని ,పెసలు అన్నం కలిపి వండిన న నైవేద్యాన్ని ముద్గలం అంటారని దాన్ని ధనుర్మాసం లో నైవేద్యం పెట్టి ప్రసాదం గా ఇస్తారని ఇది ఒంటికి వేడి కలిగిస్తుందని చెప్పారు భోగి నాడు గోదా కల్యాణం లోకానికి శుభం కోసం చేస్తారని గోదా దేవి లాగా వ్యక్తిత్వాన్ని ప్రతి ఆడపిల్లా కలిగి ఉండాలని రంగనాధుడు ఆమె తండ్రితో గోదా దేవిని శ్రీరంగం తీసుకొచ్చి తనతో వివాహం చేయమనికోరితే ఆమె ఒప్పుకోలేదని రంగడి నే విల్లి పుత్తూరు వచ్చి మామ గారింట సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని తన్ను స్వీకరించమని చెప్పిన వ్యక్తిత్వం గోదా దేవిది అని వివరించారు
అనంతరం శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా భక్తులు భజన కార్యక్రమం చేశారు ఆ తర్వాతమంగళ హారతి నైవేద్యం తీర్ధ ప్రసాద వినియోగం జరిగి కార్యక్రమం సమాప్తమైంది ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-13-ఉయ్యూరు
.
..

