సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
60వ సమావేశం –శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు
ఆహ్వానం
తేదీ సమయం –30 -3-2014—ఆదివారం –మధ్యాహ్నం 3-గం లకు
వేదిక – ఉయ్యూరు షుగర్ ఫాక్టరీ దగ్గర ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం
సరస భారతి 60 వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం మధ్యాహ్నం 3గం ల నుండి కె.సీ.పి. ,రోటరీ క్లబ్ వారి సౌజన్య సహాయ సహకారాలతో నిర్వహిస్తోంది .ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రపంచ ప్రసిద్ధ ‘’ఈల విద్వాంసులు ‘’శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు విచ్చేసి సరసభారతి ఉగాది పురస్కారాన్ని స్వీకరిస్తారు .తరువాత వారు ‘’ఈల కచేరి ‘’నిర్వహించి శ్రోతలను తన్మయులను చేస్తారు .
జర్న లిస్టు ఘనాపాఠీ,’’ఆంద్ర ప్రదేశ్ మాస పత్రిక ‘’సంపాదకులు శ్రీ జి.వల్లీశ్వర్ ,విజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకులు శ్రీమతి ముంజలూరి కృష్ణ కుమారి ,కే.సి.పి .సి ఒ.ఒ. శ్రీ జి వెంకటేశ్వర రావు ,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.కే శ్రీ విద్య(ఏం డి.) ఆత్మీయ అతిధులుగా విచ్చేసి ఉగాది ఆత్మీయ పురస్కారాలను అందుకొంటారు .
జిల్లా నలు మూలల నుండి యాభై మందికి పైగా కవులు ‘’ఉగాది కవి సమ్మేళనం’’ లో పాల్గొని ‘’వివాహం –దాంపత్యం ‘’అంశం పై తమ కవితలను వినిపించి అలరిస్తారు
.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది .
సంగీత సాహిత్యాభిమానులు కవులు ,కళా కారులు , అందరూ ఈ కార్య క్రమం లో పాల్గొని విజయ వంతం చేయ ప్రార్ధన .
అన్ని వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక త్వరలోనే అందజేస్తాం .
జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి
ఉయ్యూరు -24-2-14

