పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6
వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు
ఇంతకు ముందు తెలుసుకొన్న స్క్లెల్ టన్ ఆగామి కాలాన్ని ప్రభావితం చేయలేక పోయాడు .పదిహేను ,పదహారు శతాబ్దాలు మరికొంత స్తిర ,పాత ఆనవాయితీ కోసం ఎదురు చూస్తున్నాయి .ఇది ఇటలీ నుండి ఇంగ్లాండ్ చేరింది .ఇటాలియన్ పోయిట్రీ ని ఇంగ్లీష్ కవిత్వం గా మార్చారు .కీట్స్ ను షెల్లీ ని ఎలా విడదీసి చెప్పలేమో అలానే థామస్ వ్యాట్ ,హెన్రి హోవార్డ్ ,ఎరాల్ ఆఫ్ సర్రే లు 1557లో కవులుగా రంగ ప్రవేశం చేశారు .’’టాటిల్స్ సాంగ్స్ అండ్ సానేట్స్ అనే మొదటి ఆంగ్ల నీతి కదా కవిత వెలువడింది .తరువాత వ్యాట్ సర్రే లు వచ్చి సీను మార్చేశారు .వీరిద్దరూ రాసిన మొదటి సానేట్స్ మొట్ట మొదటి సారిగా ఆంగ్ల కవిత్వం లో అచ్చు అయ్యాయి .వీరి సాహస కృత్యం బ్రహ్మాండమైన విజయాన్నిచ్చింది .వీరి ప్రభావం తరువాత అర్ధ శతాబ్ది కాలం ఉంది .’’ది పారడైజ్ ఆఫ్ దైంటి డివైసెస్ ‘’,ఏ గార్జియాస్ గాలరి’’,ది ఫారెస్ట్ ఆఫ్ ఫాన్సీ ‘’మొదలైనవి సూపర్ డూపర్ హిట్స్ అయి శతాబ్దాల కాలం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
ఒక దశాబ్దం తేడాలో పుట్టినా వ్యాట్ సర్రే లు కొత్త యవనికను లేపారని మెచ్చారు .ఆంగ్ల కవిత్వాన్ని ఛందస్సును మార్చే ప్రయత్నాలు జరుగుతున్న సమయం లో వీరిద్దరి ఆవిర్భావం కొత్త శక్తిని సృష్టించింది .ఒకే అక్షరాన్ని అనేక రీతుల్లో పలకటం ఉచ్చారణ ,ఇంద్రియానుభవం లకు సరైన స్థానం లేక పోవటం తో కవిత్వ గమ్యం అగమ్య గోచరం గా ఉండి పోయింది .వీరిద్దరూ కలిసి కవిత్వానికి స్తిరత్వాన్ని కల్పించారు .ఛందస్సుకు రూప కల్పనా చేశారు .అదే అప్పటికి ‘’ఆధునిక కవిత్వం ‘’అయింది .దీనిపై జార్జి పుట్నహాం స్పందిస్తూ ‘’వీరిద్దరూ ఇటలీ అంతా పర్యటిస్తూ ఇటలీ భాష మాధుర్యాన్ని ఆస్వాదించి డాంటే ,అరిస్తో ,పెట్రార్క్ ల ధోరణులను జీర్ణం చేసుకొని ముతకగా ,నేల బారుగా ఉన్న ఆంగ్ల కవిత్వానికి వన్నె,చిన్నెలు తీర్చి దిద్దారు .అందుకనే వీరిద్దరిని ఆంగ్ల కవితా ఛందస్సును శైలిని మార్చిన ‘’ మొదటి కవితా సంస్కర్తలు’’ అన వచ్చు ‘’అన్నాడు .
ఆ రోజుల్లో ప్రతి వాడి కీ ఏదో ఒకా సంగీత వాయిద్యాన్ని వాయించే నేర్పు ఉండేది .తమ కవిత్వానికి మూడు వంతులు వాళ్ళే సంగీతాన్ని సమకూర్చుకొనే వారు ,నటించి మెప్పించేవారు .వచనం లో కాని కవిత్వం లో కాని ధారాళం గా సంభాషించే నేర్పుండేది .ఆ కాలం లో సంపన్న కుటుంబం లో పుట్టిన ప్రతి వాడూ కవిత్వాన్ని ఆదరించి పోషించే ‘’పాట్రన్ ‘’గా ఉండేవాడు .అవసరమైతే చేతి వ్రాత ప్రతులను రాయించి స్నేహితులకు అందించేవారు .ఈ సంపన్నుల నుండి దానం ఆశించటం ఆ నాడు నీచం అనే భావన ఉండేది .డబ్బు లేక ఇంకేదైనా వారి నుండి గ్రహించటం దిగ జారుడు తనం గా అని పించేది .కవిత్వం అందరిదీ అనే భావం లో ఉండేవారు .అందుకే వ్యాట్ సర్రే ల కవిత్వానికి అంత గుర్తింపు వచ్చింది .
ఈ ఇద్దరు కవుల్లో వ్యాట్ కవి ‘’సానెట్ ‘’ను ఇంగ్లాండ్ కు తెచ్చిన ఘనత పొందాడు .వ్యాట్ 1503లో కెంట్ లోని అలింగ్ టన్ కాజిల్ లో పుట్టాడు .పదమూదేళ్ళాకే కేంబ్రిడ్జి లో సెయింట్ జాన్స్ కాలేజిలో దాని ప్రారంభ సంవత్సరం లోనే1516లో చేరాడు .డిగ్రీ లో ఉండగానే కవిత్వం రాశాడు .పదిహేడేళ్ళకే ఏం ఏ .డిగ్రీ పొందాడు .ఇరవై అయిదేళ్ళ వయసులో ఇటలీకి రాయబారి అయ్యాడు .అదుగో అప్పుడే పెట్రార్క్ కవిత్వం పై మోజు .డ్డాడు లార్డ్ కాభాం కుమార్తెను పద్ద్దేనిమిదేళ్ళ వయసులో అన్నే బియాన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెకు ఎనిమిదవ హెన్రి తో అంతకు ముందే పెళ్లి అయింది .ఆమె శృంగార చేష్టలు బయట పడి వ్యాట్ ను ‘’టవర్ ఆఫ్ లందన్ ‘’లో నిర్బంధించారు .విడుదల తర్వాత ఫ్రాన్స్ స్పెయిన్ లకు పని మీద పంపితే మళ్ళీ అరెస్ట్ అయ్యాడు .అతని మంచితనానికి రాజు విడిపించి మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు .అతనిపై మోప బడిన అన్ని అభియోగాలనుండి బయట పడ్డాడు .వయస్సు నలభై .
చేజారిన ప్రేమికురాలి కోసం వ్యధతో కవిత్వం రాశాడు .ఇటలీ భాషా సౌందర్యాన్ని ఆంగ్ల భాషకు అద్దటమే కాక వ్యాట్ లో గొప్ప చొరవ ఉండేది .ఇటలీ భాషలోని 14పంక్తుల సానెట్ ను ఇంగ్లీష్ లో ప్రవేశ పెట్టిన మొదటి వాడైనా మొదటి ఎనిమిది లైన్ (ఆక్టేవ్)లను యధా తదం గానే గ్రహించి చివరి ఆరులైన్లను (సేస్టెట్)లో అద్భుతమైన సమాప్తిని ,దానికి అనుబంధం గా రెండు లైన్ల ‘’కప్లేట్ ‘’ను చేర్చి చదివిన వారిపై గాఢ ముద్ర వేశాడు. దీన్ని షేక్స్ పియర్ అద్భుతం గా తన సానెట్ లలో ఉపయోగించుకొన్నాడు .పెట్రార్క్ సానెట్ లో రెండు భాగాలను రెండుగా భావిస్తే వ్యాట్ అందులో ఫ్యూజన్ చేసి అబ్బురపరచాడు .ఎనిమిదో లైన్ తొమ్మిదితో కలిసిపోయేట్లు, బ్రేక్ లేకుండా చేసి అందాన్ని సృష్టించాడు .దీనితో ‘’setting an example for the unified and integrated sonnets of Milton and Words Worth ‘’అని మెచ్చు కొన్నారు . ఆంగ్ల సాహిత్యం లో వ్యాట్ ‘’ఒక మైలు రాయి ‘’గా నిలిచాడు .
![]()
![]()
అన్నే బోలాన్
ఈ జంట కవులలో రెండవ వాడు ‘’హెన్రి హోవార్డ్ ఎరల్ ఆఫ్ సర్రే’’ ‘వ్యాట్ కంటే పద్నాలుగేళ్ళ పిన్న వాడు .తక్కువ కాలమే జీవించినా తన ముద్ర వేశాడు .1517లో రాయల్ వంశం లో పుట్టాడు .తండ్రి ఎడ్వర్డ్ రాజు బంధువు .తల్లి ఎనిమిదవ ఎడ్వర్డ్ చుట్టం .కనుక ఇతని జీవితం రాజ్జాన్తః పురం లోనే గడిం చింది .యువరాజులే స్నేహితులు .డ్యూక్ ఆఫ్ రిచ్ మాండ్ అంటే ఎనిమిదవ హెన్రి అక్రమ సంతానం ఇతని ముఖ్య స్నేహితుడు .సర్రెకు పదిహేనేళ్ళప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఫ్రాన్స్ వెళ్ళారు .ఏడాది తర్వాత ఇంగ్లాండ్ కు వచ్చెయ్యమని కబురు .రిచ్ మాండ్ సర్రే సోదరిని పెళ్ళాడాడు .
మరో పన్నెండేళ్ళు సర్రే రాజ దర్బారుల్లో హాయిగా జీవితం గడిపాడు కొత్త బంధుత్వం వలన .ఒక తిరుగు బాటును అణచి వేశాడు .ఫ్రాన్స్ కు వ్యతిరేకం గా నౌకా ప్రచారం కోసం వెళ్ళాడు .యుద్ధం లో తీవ్రం గా పాల్గొన్నాడు .వీలు దొరికి నప్పుడు కవిత్వం రాశాడు .1539లో ‘’the most foolish and proud boy that is in England ‘’అని ఇరవై రెండేళ్ళ వయసులో ముద్ర వేయిన్చుకొన్నాడు .అతని గర్వం ఏమిటీ అంటే ఏపనీ చేయక పోవటమే .’’ఎడ్వర్డ్ దికన్ఫేసర్ ‘వంశ చిహ్నం పై చేసిన ఒక పనికి ఎనిమిదవ హెన్రి ‘ని రాజ్య భ్రస్టూడిని చేసే కుట్రలో పాల్గోన్నాడని నేరా రోపణ చేశారు .అయితే సర్రే అతితెలివి తేటలు కష్టాల్ని మరింత పెంచాయి .శిక్ష పడింది .అందర్నీ అంటకాగి ఉరి తప్పించు కోవాలని అన్ని ప్రయత్నాలూ చేశాడు .జ్వరం వలన కొద్దికాలం ఆగినా ముప్ఫై మూడవ ఏట ‘’టవర్ హిల్ ‘’మీద తల తీసేశారు .
గురువు వ్యాట్ కు ఉన్న డేరింగ్ నేచర్ లేకపోయినా సర్రే కవిత్వానికి నగిషీలు చెక్కాడు .వ్యాట్ కంటే అందమైన సరళమైన శైలి తో సానేట్లు రాశాడు .చాలా పకడ్బందీ గ ,స్వయం నియంత్రణ తో రాశాడు .సంక్షిప్తతకు ప్రాదాన్యమిచ్చాడు . ‘’Surrre invented a new poetic speech ,he made all succeeding poets his debtors when he translated two books of the “Aneid ‘’into iambic pentameters and fashioned the decasyllabic line now known as ‘’blank verse ‘’ అంటే బ్లాంక్ వేర్స్ కు ఆద్యుడు సర్రే ..సర్రే సమకాలీనులేవ్వరూ ఆంగ్ల కవిత్వం లో ఒక ‘’విప్లవం ‘’వచ్చిందని భావించ లేదు.యాభై ఏళ్ళ తర్వాత ఎలిజబెతేన్ డ్రామా లలో ‘’అని బద్ధ కవిత్వం అంటే బ్లాంక్ వేర్స్ ఒక గొప్ప మాధ్యమం అయింది . ‘’its potency grew until the steady beat of its ten pulsing syllables became the normal measure of English diction ,a measure that grew into the natural language of Marlowe and Shakespear and Milton ‘’
![]()
సర్రే రాజ చిహ్నాలు
సర్రే సమాధి
![]()
ఇటలీ సానెట్ ను ఇంగ్లీష్ భాషలోకి తెచ్చి ప్రాణ ప్రతిష్ట చేసి దానికి ఇంపు సొంపులు కూర్చి దాని వైభవాన్ని పెంచి ఆ తర్వాత బ్లాంక్ వేర్స్ కు ప్రాణ ప్రతిష్ట చేసి ,ఆంగ్ల కవిత్వాన్ని రెండు గొప్ప మలుపులు తిప్పిన కవులే వ్యాట్ మరియు సర్రే కవులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-14-ఉయ్యూరు

