పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15
పది హేడవ శాతాబ్డిద సాహితీ కారులు వస్తువులోను ,ఆంతర్యం లోను పెను మార్పులు తెచ్చారు .కాని ఒక తరం తర్వాత ఈ విధానం పై మక్కువ తీరిపోయింది .మూడు వందల ఏళ్ళు కనీ పించకుండా పోయిన ఈ కవిత్వం ఇరవయ్యవ శతాబ్దిలో నూతన పోకడలు పోయి విశేష ప్రాచుర్యం పొందింది .ఆ కవులలతో విభేదించిన ‘’డ్రైడేన్’’కవి ఈ గ్రూపు తో సంబంధం లేకుండా ‘’Donne affects the meta physics not only in his satires but in his amorous verses ‘’అని ధంకా బజాయించి ‘’జాన్ డోన్నే’’గురించి చెప్పాడు .
జాన్ డోన్నే
సామ్యుల్ జాన్సన్ ‘’మెటా ఫిజికల్ ‘’అనే అరువు మాటను తెచ్చుకొని డోన్నె తరువాతి కవులను పిలిచాడు .ఇది కొంచెం ముతకగా ఉన్నా’’the metaphysical poets were men of learning and to show their learning was their whole endevour ‘’అని కౌలీ మెచ్చుకొన్నాడు .ఈ కవులు అంత్య ప్రాసలకు ప్రాధాన్యం ఇచ్చి ,కవిత్వాన్ని రాయకుండా పదాల కూర్పు నే చేశారు అని అభి యోగం ఉంది .మెటా ఫిజికల్ కవులకు కవులు అని పించుకొనే అర్హత లేదన్నాడు జాన్సన్ .ప్రక్రుతి ని కాని జీవితాన్ని కాని దేన్నీ అనుకరించ లేదన్నాడు .కాని విమర్శకులు జాన్సన్ ను లెక్క పెట్టలేదు .ఎడ్మండ్ గూస్’’ దొన్నె ఆంగ్ల సాహిత్యంపై, రచయితలపై ప్రభావంఎక్కువే ‘’అన్నాడు .ఇరవయ్యవ శతాబ్ది దాకా దొన్నె ప్రభావాన్ని గుర్తించలేక పోయారు విమర్శకులు .మెటా ఫిజికల్ కవిత్వానికి డోన్నె గొప్ప ఉదాహరణ అని అప్పుడు నిర్ద్వందాం గా ప్రకటించాడు . టి ఎస్ ఇలియట్ ‘’ a mechanism of sensibility which could devour any kind of experience ‘’అని మెటా ఫిజి కల్ కవిత్వాన్ని అంచనా వేశాడు .
జాన్ డోన్నే శారీరక మానసికం గా ఎన్నో ఆటు పొట్లూ ఎదుర్కొన్నాడు .’’మానవ శరీరమే అతని పుస్తకం’’ .మనిషి ఆత్మ ఒక మిస్టరి అను కొన్నాడు .వయసు పెరిగిన కొద్దీ ఈ అంతర్యుద్ధం పెరుగుతూనే ఉంది .ప్రతి భావానికీ స్పందించాడు .సాహసికుడు గా యోధుడు గా మారి పోయి మత ప్రచారకుడయ్యాడు .డోన్నెరాసిన ‘’సేర్మాన్స్’’లో1640 లో విడుదల అయింది అందులో అతని అనుభూతులనుంచి ఆత్మ తత్వానికి ప్రయాణం లో అభి వృద్ధి కని పిస్తుంది .ముతక భావాలనుంది విశుద్ధ మానసిక పరిణామం గోచరిస్తుంది .ఇది ‘’పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ‘’కాక పోయినా ఆత్మోద్ధరణ .అతని ఆత్మ క్షోభ అసలు మరణానికన్నా ,ముందే చావును చూశాడు .అతని రచనలలో ఉన్న వైవిధ్యం అతని జీవితాన్ని తెలుసుకోవ టానికి బానే సహక రిస్తుంది ..
దొన్నె లండన్ లో 1573లో ఒకసంపన్న ఇనప వ్యాపారి కొడుకు గా జన్మించాడు .తండ్రి ధామస్ మోర్ బంధువు జాన్ హేవుడ్ కూతురను పెళ్లి చేసుకొన్నాడు .సామాజికం గా ఉన్నత స్తాయి లో ఉన్నాడు .దార్బారు లో ఉద్యోగం పొందాడు .కేధలిక్ కుటుంబం .తనలో అమర వీరుల రక్తం ప్రవ హిస్తోందని భావించే వాడు .తల్లి తరఫు బంధువులను గురించి ముప్ఫై వ ఏట రాశాడు. లాటిన్ ఫ్రెంచ్ లను ఇంటి వద్దే ట్యూటర్స్ బోధించారు .పదకొండవ ఏట ‘’ఆర్ట్ హాల్ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ‘’లో చేరాడు .మూడేళ్ళు చదివి కేంబ్రిడ్జి లో ట్రినిటి కాలేజి లో చేరాడు .యూక్లిడ్ లాజిక్ ను అధ్యయనం చేశాడు .స్పానిష్ మిష్టిక్స్ చదివాడు .విశుద్ధ రీజన్ కు నమ్మకానికి భేదం గ్రహించాడు .
‘’లా’’చదివి పాసై ప్రాక్టిస్ చేశాడు .కేధలిక్ గా ఉన్నా చాందసానికి దూరం అయ్యాడు .తిరుగు లేని కవి అని పించుకొన్నాడు .సగం విషయేచ్చ సగం మానవ ద్వేషం తో రగిలి పోతున్నాడు .వీటినే ‘’సాంగ్స్ అండ్ సానేట్స్ ‘’లో ప్రతిఫలింప జేశాడు .సెటైర్స్ ,ఎలిజీలతో దూసుకు పోయాడు .స్పెయిన్ ఇటలీ లు చూశాడు .తిరిగి రాగానే లార్డ్ కీపర్ సర్ ధామస్ ఈగర్ట న్ కు ప్రైవేట్ సెక్రెటరి అయాడు .ఈ పదవే అతని కొంప ముంచింది .ఆ ఇంట్లో సన్నిహితం గా మెలిగాడు ఈగర్టాన్న్ బంధువు ‘’అన్నే మోర్’’ తో ప్రేమ లో పడ్డాడు .ఆమె తో లేచి పోయి పెళ్లి చేస్సుకొన్నాడు .దీనికి ఈగర్ టాన్ కోపానికి బలి అయ్యాడు ఉద్యోగం ఊడ గొట్టి ,జైల్లో పెట్టించాడు .ఒక ఏడాదికి పెళ్లి చట్ట బద్ధమై విడుదల అయ్యాడు. తన పరిస్తితిని తల్లికి ‘’Ane done –undone ‘’అని రాసుకొని వాపోయాడు .
తరువాత భార్యా భర్తల జీవితం ఒడి దుడుకులతో నడిచింది.పేదరికం. చేతిలో చిల్లి గవ్వ లేక పోవటం అప్పుల బాధ వలన రోమన్ కేధలిక్ ను వదిలేసి మతాధికారులను దూషిస్తూ అనేక కరపత్రలురాసి విడుదల చేశాడు .చివరికి ఈగర్ టన్ దొన్నె ను క్షమించాడు .కుటుంబ పోషణకు ధన సాయం చేశాడు .గొప్ప పదవి జారి పోయి రాజు దయా దాక్షిణ్యాల మీద బతకటం వలన డిప్రెషన్ కు లోనయ్యాడు .రాజు ఇస్తున్న డబ్బు దేనికీ చాలటం లేదు .ఆత్మ హత్య కు పాల్పడ్డాడు .తీవ్ర మైన జబ్బు ఏర్పడి జీవితాంతం బాధించింది .దీనిపై ‘’me thinks I have the keys of myprison in my own hand ,and no remedy presents itself so soon to my heart as mine own sword ‘’అని రాసుకొన్నాడు ‘
దొన్నె బీదగా ,విచార గ్రస్తుడిగా చావు కోసం ఎదురు చూస్తూ గడిపాడు .ఇలా పదమూడేళ్ళు బాధ పడ్డాడు .సెక్రెటరి ఉద్యోగం వస్తుందని ఆశించి భంగ పడ్డాడు .ఎందరినొ సహాయం కోసం అర్ధించాడు .ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .ప్రయాణాలు చేశాడు .వాగ్దానాలు చేసిన వారే కాని చేతల్లో ఎవరూ ఆదుకో లేదు .’’సాంగ్స్ అండ్ సాట్స్త్స్’అనే మత సంబంధ కవితలు ’రాస్తూనే ఉన్నాడు .42వ ఏట ధ్యానం ,చాలా కాలంగా దేనిపై ధ్యాస లేక పోవటం వలన విసిగి వేసారి తండ్రి లాగా ఆంగ్లికన్ చర్చి భావాలకు దగ్గరయ్యాడు .మొదటి జేమ్స్ రాజు సంతోషించి దొన్నె ను ‘’చాప్లాన్ ‘’ ను చేశాడు .లింకన్స్ ఇన్ అతన్ని మత ప్రచారకునిగా అంగీకరించి తీసుకోంది .తర్వాత ‘’డీన్ ఆఫ్ సెయింట్ పాల్ ‘’అయ్యాడు .
ఆత్మాన్వేషణ ఫలించి దొన్నె గొప్ప ప్రచారకుడు గా పేరు తెచ్చుకొన్నాడు .డబ్బు కూడా బాగా అందుతోంది .అయినా సుఖం ,సంతోషం లేదు అతనికి .అమితం గా ప్రేమించిన భార్య చని పోయింది .జీవితం నుంచి దూరమై మత బోధనకే ప్రాధాన్యం ఇచ్చి గడిపాడు .ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం చెందాడు .జీవిత నుండి విముక్తి చెందాలనే కోరిక బలీయం అయింది .ఎక్కడా సుఖం ఉండదు అని గ్రహించాడు .ఆరోగ్యం బాగా దెబ్బతిని పోయింది .జీవితం లో దెబ్బతిన్నాననే భావం అతన్ని పీడిస్తోంది . అంతకు ముందు దాకా మనిషి అమరుడు అనుకొన్నాడు .ఇప్పుడు మనిషి జీవితం శాశ్వతం కాదని గ్రహించాడు .
‘’ డివో షన్స్’’లో కూరుకు పోయి ఎనిమిదేళ్ళు బతికాడు .అతనిలో జీవం క్షీణించి పోతూనే ఉంది ,’’to pay a fever every half year as a rent for my life ‘’అని వాపోయాడు .బిషప్ గా ప్రమోషన్ పొందిన కొద్ది కాలానికే 57వ ఏట తీవ్ర అనారోగ్యాం అతన్ని కుంగ దీసింది .చనిపోతున్నానని గ్రహించాడు.’’ఫనరెల్ స్టాట్యూ’’ ను తయారు చేయించాడు .దాన్ని రంగులతో తీర్చి దిద్దాడు .అది పూర్తీ అయిన వెంటనే తన పక్కనే ఉంచుకొన్నాడు .చివరికి 31-3-1631లోకేన్సర్ తో చని పోయాడు .దొన్నె బతికి ఉన్నకాలం లోనే అతని కవితలు బాగా ప్రచారంయ్యాయి. రెండు మాత్రామే అతని జీవిత కాలం లో ముద్రణ పొందాయి .అతని ‘’యనాటమి ఆఫ్ ది వరల్డ్ ,’’ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిసోల్ ‘’బాగా ప్రసిద్ధి చెందాయి .బతికి ఉండగానే పొగడ్తలు తెగడ్తలు అనుభ వించాడు .’’Donne;s continual conflict between anxious hope and worldly disollusionment made him as characteristic of our age as of his ‘’.మూడు శతాబ్దాల తర్వాతా ప్రఖ్యాత అమెరికా నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే దొన్నె రాసి ఎవరికీ తెలియని ‘’డివోషన్స్ ‘’నుంచి ఒక దానిని ఎన్నుకొని ‘’ఫర్ హూం ది బెల్ రింగ్స్ ‘’రాశాడు .అందులో ‘’any man;s death diminishes me ,because I am involved in man kind .And therefore never send to know for whom the bell tolls .it tolls for thee ‘’అన్నాడు .
మెటా ఫిజిక ల్ అంటే- భౌతికానికి అతీతమైనది .అది ఆలోచన ను భావాలను ఏకీ కృతం చేస్తుంది .విరుద్ధాలను జత కలుపుతుంది .భావ చిత్రాలనేర్పరుస్తుంది .మీరు మిట్లు గొలిపే వెలుగును దర్శింప జేస్తుంది .donne showed his followers a new way of fusing sense and sensibility .he bought together pieces of a disordered universe and arranged them in a world of clear vision .he united complexity of thought and simplicity of language.’’దొన్నె గొప్ప సృజన శీలి .దాదాపుగా అతని అన్ని కవితల్లోనూ మరణమే వస్తువు .’’death had no horror for the sensual curiosity seeker ,the exhilarated being who shrank from no excess of impulse or devotion ‘’తన మనసును బయట పెడుతూ ‘’I have not the righteousness of job ,but I have the desire of jon –I would speak to the Almighty ,and I would reason with God ‘’అన్నాడు .
‘’thou art slave to fate ,chance ,kings and desperate men –and dost with poison ,warand sickness dwell-one short sleep ,past we wake eternally –and death shall be no more –death thou shall die ‘’అని చాలెంజ్ చేసిన కవి దొన్నె .ఇలాంటి కవితలు ‘’well serve as epitaph for one who ,predestined to a fearce singularity ,united the ecstatic and the austere in vehement of intellectual play and spiritual discipline ‘’అని ఏఎ కవిని అంచనా వేశారు .
![]()
![]()
దొన్నె నివసించిన ఇల్లు చని పోయే ముందు వేయించుకొన్న చిత్రం
సశేషం
శ్రీ నృసింహ జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-14-ఉయ్యూరు

