పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21

చీకటి తో (లో)వెలుగు

జాన్ మిల్టన్

‘’ఎల్ అలిగ్రో ‘’,పెంసేరోసో 2’’రాసిన కవి ఒకడే అంటే ఆశ్చర్య మేస్తుంది .కళ్ళు లేని కబోదిగా గాజా లో బానిసల మధ్య సామ్సన్ ను దుఖితుడిని చేసిన కవి .దుర్మార్గాన్ని క్రూరత్వాన్ని ఎదిరించిన కుటుంబ రక్తం ప్రవహించిన వాడు. తండ్రి నిర్బంధ పాపిజం కు దూరమై ,కొడుకు మిల్టన్ కు ఆదర్శం గా ఉన్నాడు .

జాన్ మిల్టన్  లండన్ లోని చీప్ సైడ్ సైన్ ఆఫ్ దిస్ప్రెడ్ ఈగిల్ లో 9-12-1608లో జన్మించాడు .ప్రేమను ,స్వాతంత్ర పిపాసను తండ్రి నుండి  వారసత్వం గాపొందాడు .తండ్రి చేసిన సంగీత కృతులు ఇప్పటికీ ప్రొటెస్టెంట్ హైం బుక్స్ లో ఉన్నాయి .అన్నే అక్క .ఎడ్వర్డ్ జాన్ ఫిలిప్ లు తమ్ముళ్ళు .వీరిద్దరూ అన్నకు శిష్యులే కాక అతని చరిత్రను రాసిన వాళ్ళు కూడా .క్రిస్టఫర్ అనే తమ్ముడు ఏడేళ్ళు చిన్న మిల్టన్ కు పూర్తీ వ్యతిరేకి అయి, కేధలిక్ గా ,రాయలిస్ట్ గా ,అవకాశ వాదలాయర్ గా ఉండి ,రాజు కోర్టులోని జడ్జీలను నియమించే స్థాయికి ఎదిగాడు .

మిల్టన్ చిన్న పిల్లాడుగా చీప్ సైడ్ జిల్లా లో ఆడుకొనే వయసులో షేక్స్పియర్ ఇంకా బతికే ఉన్నాడు .ఆ మహా నాటక రచయిత లండన్ కు చివరి సారి వచ్చినప్పుడు మేర్మిడ్ లో స్నేహితులను కలిసే ప్రయత్నం లో  బెన్ జాన్సన్ తో కలిసి వెళ్ళిన సాయం సంధ్యలో బ్రెడ్ స్ట్రీట్ లో ఆరేళ్ళ ‘’కుర్ర మిల్టన్ ‘’ఇంటివద్ద ఆటలాడటం తేరిపార జూసి చూసి  స్త్రాఫార్డ్ చర్చ యార్డ్ లో తనకొక చిన్న సమాధి కావాలని అనుకోని ఉండవచ్చు నని డేవిడ్ మేసన్ రాశాడు .మిల్టన్ తండ్రి వద్దే ఎక్కువ గా విద్య నేర్చాడ. తండ్రి స్తేష నరీ వ్యాపారం చేస్తూ నోటరీ గా ఉండేవాడు .సెయింట్ పాల్ చర్చికి చెందిన రివరెండ్ థామస్ యంగ్ వంటి ట్యూటర్స్ వలన చార్లెస్ ది ఒడ్ వంటి వారి స్నేహం లభించింది .తండ్రియే మిల్టన్ ‘’మెంటార్’’.మానవత్వ విలువలున్న వాటిని చదవ మని తండ్రి చెప్పేవాడని మిల్టన్ చెప్పుకొన్నాడు .బాల్యం నుండి తన ప్రతి కదలిక తండ్రి కను సంనల్లోనే జరిగిందన్నాడు .సైన్స్ మీద అభిరుచికీ ఆయనే కారణం .

పదహారేళ్ళ వయసులో కేంబ్రిడ్జి లో క్రైస్ట్ కాలేజి లో చేరి ఏడేళ్ళు ఉన్నాడు .అక్కడి ప్రతి విషయాన్నీ ఏవ గిన్చుకొన్నాడు .కర్రిక్యులం లోని సబ్జెక్టులు స్ట్రిక్ట్ విధానాలు ఏ వీ నచ్చలేదు .ఆక్స్ ఫర్డ్ కు వెళ్ళిన మిత్రుడు దియోది రాసిన గ్రీక్ఉత్తరం  లోని  తప్పులు సవరించాడు .ఆక్సఫర్డ్ వచ్చేసి హాయిగా స్వేచ్చ గా చదువుకోమని సలహా కూడా ఇచ్చాడు .’’my books are my whole life ‘’ అని మిల్టన్ సమాధానం రాశాడు .అంటే తను ఎమికాబోతున్నాడో అతనికి అవగతమైంది .కవికావాలనే కోరిక బలమైనది .కవి అనుభూతి చెందటమే కాక సంఘానికి తగిన సూచనలూ చేయాలని ,బ్యూటీ తోను దేవునితోను సంబంధం కలిగి ఉండాలని భావించాడు .23వయసులో గొప్ప సానెట్ రాశాడు .అసందిగ్ధం గా మొదలు పెట్టి ప్యూరిటన్ సమర్ధన తో ముగించాడు

ఈకవిత రాసే సమయం లో తోటివిద్యార్దుల ,కాలేజి యాజమాన్యం వల్లా ఇబ్బందులు పడ్డాడు .అతని అందాన్ని ,పట్న జీవితాన్ని హేళన చేసే వారు ‘’లేడీ ఆఫ్ క్రైస్ట్స్ట్ ‘’అని మారు పేరు పెట్టారు .అన్నిటిలో అతని ఆధిక్యతకు అసూయ పడ్డారు కూడా .దీనికి దీటుగానే సామాధానం చెప్పేవాడు. దేన్నీ దాచుకోలేదు .టీచర్ల తో గొడవ పడ్డాడు .ఇంటికి పంపింది యాజమాన్యం .పనీ పాటా లేక రోడ్లమ్మట తిరిగాడు .అప్పుడే తానెప్పుడూ వినని ,కనని గొప్ప పుస్తకాలను చూశాడు .కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్కూల్లో చేర్చుకొన్నారు .కేంబ్రిడ్జి కి వెళ్లి లాటిన్ భాషలో ఉన్న అనేక మైన వాటిని లాటిన్ భాషలో కవితలుగా రాశాడు .లాటిన్ లో ఉన్న చాలా ‘’సామ్స్’’ను కవితలుగా రాశాడు .వీటిలో ఇంగ్లీష్ భాష ఉబికి వచ్చి వాటిని సుందర మయం చేసింది .కేంబ్రిడ్జి లో రాసిన ‘’ఒడ్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ క్రైస్త్స్ నేటివిటి ‘’కవిత తిరుగు లేని ‘’మాస్టర్ పీస్ ‘’ దీన్ని ఇరవై  ఒక్క వయసులో రాశాడు  ఇమాజేరి లో స్పెన్సర్ గుర్తొస్తాడు. కొన్నిటిలో   మెటా ఫిజికల్ కవులు కని  పిస్తారు .మొత్తం మీద సర్వాంగ సుందరామైన కవిత .భావానికి పద విన్యాసానికి గొప్ప ఉదాహరణ .కవిత చివరికొచ్చేసరికి కవిత్వం శిఖరారోహణమే చేస్తుంది .గోల్డెన్ ఏజ్ లో సంగీతం తోడై ఉయ్యాల లూగిస్తుంది .

ఈ కవిత రాసిన తర్వాత కేంబ్రిడ్జి వదిలి తండ్రి ఎస్టేట్ ఉన్న హార్తాన్ వెళ్ళాడు .అక్కడి ప్రశాంత వాతావరణం లో గ్రీక్ ,లాటిన్ రచయితల గ్రంధాలను చదివి జీర్ణించుకొన్నాడు .సంగీతం లెక్కల మీదా దృష్టిపెట్టాడు .ఆరేళ్ళు ఇక్కడే గడిపాడు ప్రీస్ట్ కావాలన్న కోరికను తున్చేసుకొన్నాడు .తను ఏదైనా బోధిస్తే కవిత్వం ద్వారానే చేయాలనే నిర్ణయానికి వచ్చాడు .ప్రక్రుతి ఏ నిర్బంధం నియమాలు  లేకుండా చదువు నేర్పుతుంది అని గ్రహించాడు .క్రిస్టియన్ బోధకుల  , ఇటలీ రచయితల పుస్తకాలూ చదివాడు .గ్రీకు రోమన్ వెనిస్ చరిత్రలను చదివి మననం చేసుకొన్నాడు .హార్తాన్ లో ఉండగానే మిల్టన్ చిరస్మరణీయ కవితా ఝరిని ప్రవహింప జేశాడు .  బైబిల్ ను మాత్రం వదల కుండా చదువుతూనే ఉండేవాడు .’’ఎల్ ఆలిగ్రో పెంసేరోసో లు చాలా ప్రాచుర్యం పొందాయి .మధుర మైన కాలాన్ని ఇక్కడే గడిపి అంతకంటే మధురకవిత్వం రాశాడు .’’అర్కాదేస్ ‘’ఇక్కడే రాశాడు .ఎరల్ ముగ్గురు పిల్లలు ఇందులో నటించారు కూడా .’’కొమాస్ ‘’లో మేధో మార్గం ఉంది .కేంబ్రిడ్జి వదిలేశాక మిత్రులను దాదాపు మరిచాడు .

కాని తన కంటే చిన్న వాడైన’’ ఎడ్వర్డ్ కింగ్ ‘’అనే వాడిని మర్చిపోలేదు .అతని చావుకు  ఒక కవిత లో అమరత్వం కల్గించాడు .ఇది గొప్ప ఎలిజీ గా గుర్తింపు పొందింది .29లో ప్యూరిటన్ కవి అయి ఎలిజీలు మానేశాడు సంఘానికి పనికొచ్చేవే రాశాడు ‘’లిసిదాస్ ‘’లో పాగాన్ మైతాలజు క్రిస్తియాన్ తియాలజి లను మిశ్రమం చేసి రాశాడు .దీనిని సామ్యుల్ జాన్సన్ అంగీకరించలేదు ఎద్దేవా చేశాడుకూడా .మిల్టన్ క్లాసికల్ ,క్రిస్టియన్ ప్రపంచాలను కలిపాడన్న విషయాన్ని జాన్సన్ విస్మరించాడని విమర్శకాభిప్రాయం .తాను ప్రజలలో ఒకడిని అని రుజువు చేశాడు .తన అసమాన ప్రతిభను ప్రదర్శించాడు .అతాని మేదోజనితమైనదే ఈ కవిత .

ముప్ఫై వ ఏట ఇంకా విస్తృత ప్రపంచాన్ని చూడాలని అందులో గడపాలని నిర్ణయించుకొని ఇంక కొత్త లోకాలను చూడాలని కోరుకొన్నాడు .ఆ  ఊరు వదిలి వెడుతూ ‘’at last he rose and twitched his mantle blue-tomorrow to fresh woods and pastures new’’అని రాసుకొన్నాడు .ప్యూరిటన్ అయినా  ఇంకా  పాత దేవుళ్ళూ,దయ్యాలు గుర్తుకొస్తూనే ఉన్నారు .ఫ్రాన్స్ లో కొంతకాలం ఉండిద డచ్ హ్యూమనిస్ట్ ,స్వీడన్ రాయబారి అయిన   గ్రోతియస్ తో మాట్లాడి ఇటలీ గమ్యం చేసుకొన్నాడు .జేనోవాకు బయల్దేరి లెగ్ హారన్, పీసా లను సందర్శించి ఫ్లారెన్స్ కు 1638సెప్టెంబర్ లో చేరాడు .అక్కడి సాహిత్య కారులందరూ మిల్టన్ కు అపూర్వ స్వాగతం ఇచ్చి తమ రచనలు అంకితం చేశారు .మిల్టన్ రాసిన లాటిన్ వెర్సెస్ లను  విపరీతం గా మెచ్చారు .ఇటాలియన్ మేధావులు మిల్టన్  అంటే వీరాభిమానం చూపారు .అక్కడి కళా కారులతో ,నోబుల్స్ తో ,విద్యా వేత్తలతో తత్వ వేత్తలతో సమా వేశాలు జరిపి విందు వినోదాల్లో పాల్గొన్నాడు .74 ఏళ్ళ గెలీలియోను కలిసి ఆయన చెప్పింది విన్నాడు .సీనా, రోమ్ నేపుల్స్ తిరిగి పుస్తకాలు, వ్రాత ప్రతులు కొనుక్కున్నాడు .సిసిలీ, గ్రీస్ వెళ్ళాలను కొన్నాడు .కాని ఇంగ్లాండ్ లో సివిల్ కమిషన్ వార్త తెలిసి తన దేశస్తులు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటె తాను వృధాగా దేశ యాత్రలు చేయటం భావ్యం కాదని భావించి లండన్ కు తిరిగి వెళ్ళాడు .

లండన్ చేరిన తర్వాత తన ఒక ఏడాది బయటి జీవితం లో ఇక్కడ జరిగిన విషయాలు అవగతం చేసుకొన్నాడు .అనిశ్చిత అస్తవ్యస్త పరిస్తితులలో తనకోసం తగిన ప్రదేశం కోసం చూస్తున్నాడు .అప్పటికి ఇంకా రాజకీయాలల్ జోలికి వెళ్ళలేదు .ఆ అవగాహనా లేదు .ముందుగా పార్ట్ టైం టీచర్ అయ్యాడు .అతని విధవ సోదరి అన్నే మళ్ళీ  పెళ్లి చేసుకోవటం తో ఆమె ఇద్దరి సంతానాన్ని ఎడ్వర్డ్ ,జాన్ లను చూసుకొంటున్నాడు .ఇంకొందరు ఇంట్లో చేరారు .ఇల్లు ఒక చిన్న బోర్డింగ్ స్కూల్ అయింది .తానే ఒక టీచర్ అయి సిలబస్ తయారు చేసి తన ఆశయాలకు అనుగుణం గా వారికి బోధించాడు .గ్రీక్ టెస్టమెంట్ లో ఒక చాప్టర్ చదివి విని పిపించే వాడు .లెక్కలు నేర్పాడు. యంత్రం పని ,సాహిత్యం ఖగోళం ,వ్యవసాయం సైనిక వ్యవస్థలను గురించి బోధించాడు .ఇటలీ భాషలో చరిత్ర ,ఫ్రెంచ్ భాషలో జాగ్రఫీ చదవాలనే వాడు .ముప్ఫై మూడవ ఏట ఈ ప్రైవేట్ టీచర్ ఉద్యోగం కొంప ముంచింది .చార్లెస్ రాజు పార్ల మెంట్ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలనే ఒత్తిడి వచ్చింది .బిషప్పులు తిరుగు బాటు చేశారు .అన్ని శాసనాలు రద్దు చేయాలని కోరారు .బిషప్పుల సర్వాదికారాలను కూకటి వ్రేళ్ళతో పీకేయ్యాలని ఆందోళన వచ్చింది .కొత్త ఆలోచనకూ పాత ప్యూరిటన్ భావాలకు మధ్య మిల్టన్ నలిగి పోయాడు .చివరికి నిర్ణయానికి వచ్చి తన అభిప్రాయాలను ఒక కరపత్రం ద్వారా తెలిపాడు ‘’పార్ల మెంటు బిషప్ లను హుందాగా ఉండమని కోరుతోంది .మాట్లాడేస్వేచ్చ లేక పొతే తీవ్ర పరిణామాలోస్తాయి .చర్చి అధిపతులు రాజు సలహాతో భగవంతుని సేవే లక్ష్యం గా పని చేయాలి .మనిషి బానిసత్వం నుండి బయట పడాలి .కనుక సమాజం లో స్వేచ్చ స్వాతాన్త్ర్యాలకోసం నేను నా శక్తి యుక్తుల్ని దారాపోయ టానికి నిర్ణ ఇంచుకోన్నాను ‘’అని తన మనో భావాలను బహిర్గతం చేశాడు .

రాజుకు అధికారం కావాలన్న  దాన్ని అడ్డం పెట్టుకొని క్రాం వెల్ నియంతలా  వ్యవహరించాడు .అతని వల్లనే సామాన్యుడి బతుకులు బాగు పడతాయని దానికి సమర్ధుడు అతనేనని మొదట మిల్టన్ అనుకొన్నాడు.. ఇప్పటిదాకా పోయెట్రీ మాత్రామే రాసిన మిల్టన్ తాన అభిప్రాయాలుప్రజలకు తెలియాలంటే ఫాం ప్లేట్స్  మాత్రమె సరిపోతాయని భావించి వచనం లో విజ్రుమ్భించాడు .స్వతంత్రం కోసం సర్వస్వాన్ని ఒడ్డి ప్రచారం చేశాడు .మనసులో ఒక గొప్ప ‘’ఎపిక్ ‘’రాయాలనే ఆలోచన సుడి తిరుగు తోంది .దానికి అనువైన వాతావరణం కావాలని ఆగాడు .సేనేకా రాసిన ఒక ఎపిగ్రం ను ఇంగ్లీష్ లోకి ‘’there can be slain –no sacrifice to God more acceptable –than an unrighteous and a wicked king ‘’గా తర్జుమా చేసి వదిలాడు .

అనుకోకుండా ఈ ముప్ఫై అయిదేళ్ళ ముదురు బ్రహ్మ చారి ‘’మేరీ పావెల్’ అనే పది హేడేళ్ళా పడుచును పెళ్ళాడే శాడు  .వారి వయసు రీత్యా ,కోరికల రీత్యా అది పొసగని దాంపత్యమే అయింది .జీవితం లో సెక్స్ హాయి అనుభవించలేక పోయానే అని తొందర పడ్డానని ఆయనే చేమ్పలేసుకొన్నాడు .తమది ‘’brutish congress ‘’అని చెప్పాడు .’’two carcasses chained un naturally together ‘’అని విచారించాడు .శరీరం సుఖం కోరుతోంది మనసు ఆధ్యాత్మకత వైపు చూస్తోంది .ఈ వైరుధ్యాన్ని భరించ లేక పోయాడు .ఇక ఈ ముసలాడితోలాభం లేదని ఆవిడే పెళ్లి అయిన ఒక నెలలోనే వదిలేసి వెళ్లి పోయి మిల్టన్ ను తాత్కాలికం గా  ను సంసార బంధం నుండి తప్పించింది ఒక రకం గా .ఎన్నో సార్లు రమ్మని కబుర్లు పంపాడు .రాలేదు .వచ్చి ఇంటి బాధ్యతా తీసుకోమని హుకుం లాంటి అభ్యర్ధన చేశాడు .సమాధానం .లేదు కోపం వచ్చింది .ఆవిడను వదలటానికి మనసొప్పటం లేదు. బాధ ,కోపం, వ్యధ అవమానం  లను రంగ రించి ‘’ది డాక్త్రిన్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ డై వొర్స్ ‘’అనే కరపత్రంరాసి  రాసి పురాణాల లో  భార్యా భర్తల అనుబంధాన్ని గూర్చి చెప్పిన వాటిని ఉదాహరించాడు

మిల్టన్ మామ గారు పావెల్ అల్లుడికి అయిదు వందల పౌండ్లు బాకీ ఉన్నాడు .కూతురినే  సపోర్ట్ చేశాడు. .మిల్టన్ విడాకుల పై రాసిన కరపత్రం ,క్రామ్వేల్ అధికారం చూసి ‘’అల్లుడు మామకు మొగుడు ‘’అని గ్రహించి మామ కూతురు  మేరీ ని లండన్ కు పంపాడు .ఆవిడ ఇంట్లోకిరాగానే భర్త కాళ్ళ  మీద పడి ఏడ్చింది .మోకాలి దండా వేసి క్షమించ మని కోరింది .మిల్టన్ ప్రేమగా ఆమెను చేర దీశాడు. హాయిగా ఆతర్వాత కాపురం చేసి ముగ్గ్గురు పిల్లల్ని కనీ నాల్గవ పిల్లను ప్రసవించిన వెంటనే  ఇరవైఆరవ ఏటనే చని పోయింది .ఈ పసి పిల్ల కొద్ది రోజుల్లోనే మరణించటం తో మిల్టన్ కు ముగ్గురు పిల్లలే మిగిలారు .

 

 

John-milton.jpg

సశేషం

మోడీ, చంద్ర బాబు విజయ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-16-5-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.