ఇండియా అంటే ?

ఇండియా అంటే ?

నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు Diana .L.Eck అనే ఆమె రాసిన ‘’India ,A sacred geography పుస్తకాన్ని ఆదరం తో నాకు 5-3-14న అందేట్లు పంపించారు .నేను 500పేజీలున్న దాన్ని 20-3-14నచదవటం ప్రారంభించి తాపీగా చదువుతూ 13-5-14 కు పూర్తీ చేశాను .అందులో నాకు తెలియని భారత్ యాత్రా విశేషాలను ఆమె స్వానుభవం తో చూసి చదివి తెలుసుకొని రాసింది .అవి అందరికి ఉపయోగ పడతాయని భావించి ఆ విశేషాలను మీ ముందుంచుతున్నాను .ముందుగా రచయిత్రి ఎక్ గురించి తెలియ జేస్తాను. ఆమె రిలీజియస్ స్కాలర్ .హార్వర్డ్ యూని వర్సిటి లో కంపారటివ్ రిలిజియన్స్ అండ్  ఇండియన్ స్టడీస్ లో  ప్రొఫెసర్ . లోవెల్ హౌస్ అనే సంస్థకు మాస్టర్ .హార్వర్డ్ వీకీ పీడియ లో ప్లూరలిజం ప్రాజెక్ట్ కు డైరెక్టర్ .5-7-1945లో అమెరికా లోని వాషింగ్టన్ దగ్గర టోకోమా లో జన్మించింది ..హార్వర్డ్ యూని వర్సిటి స్మిత్ కాలేజీలోను ,లండన్ లోని S.O.A.S. లోను చదివింది .అమెరికా ,కేనడాలలోని గుగ్గెన్ హీం ఫెలోషిప్ ను  హ్యుమానిటీస్ లో పొందింది .ఏ న్యు రెలిజియస్ అమెరికా ,దర్శన్ సీఇంగ్ ది డివైన్ , యెన్  కౌంటరింగ్ గాడ్,బనారస్ –సిటీ ఆఫ్ లైట్స్ మొదలైన పుస్తకాలు రాసింది .భారత దేశం అంతా ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి తీర్ధ యాత్రలో ఏ పరమార్ధం ఉందొ భౌగోళికం గా భారత దేశం లో తీర్ధ యాత్రకున్న ప్రాముఖ్యమేమిటో చాలా గొప్పగా అతి తేలిక భాషలో తెలుగులోనే చదువుతున్నామా అనే ట్లు రాసింది .ఆ విశేషాలే తెలియ జేస్తున్నాను .

భారత దేశ భౌగోళిక పరిస్తితి ని భారతీయులు రాసి ఉంచిన విషయాలను విధానాలను చూసి ప్రపంచ విజేత అలేక్సాందర్ బియాస్ నది ఒడ్డున సమీక్షించాడట .సైన్యాధ్యక్షులు సైనికులు ఇక జయించింది చాలు వెనక్కి తిరిగి వెళ్లి పోదామని గోల చేస్తున్నారు .అంతా విని ‘’అసలు ఇప్పుడు మనం యెక్క డున్నాం’’? అని అడిగాడు నియార్కాస్ అనే అతని చరిత్రకారుని ,మిగిలిన ఆఫీసర్లను .పంచ నదుల ప్రదేశం అయిన పంజాబ్ ను అలేక్సాండర్ ఈజిప్ట్ ఉత్తరమెట్ట ప్రాంతం అనుకోన్నడట .నైలు నదిని సమీపిస్తున్నామని భావించాడట .మధ్యధరా ప్రాంతం వెనుక ఉన్నామని తలచాడు .విజేత పోరపద్దాడని వారు గ్రహించి అసలు తాము ఎక్కడ ఉన్నామో అక్కడి నుండి ముందుకు అడుగు వేయటం యెంత కష్టమో వివరించారట .గ్రీకు చరిత్ర కారులు రాసినది తప్పు అని అర్ధమైంది .స్త్రాబో అనే చరిత్రకారుడు దీన్ని బయట పెట్టాడట .వాళ్ళు వర్ణించిన దాన్ని బట్టి గ్రీకు సైన్యం ఈజిప్ట్ లో లేదని దాన్ని దాటి ఏంతో దూరం వచ్చామని తెలుసుకొన్నాడు .

గ్రీకు చరిత్ర కారులు  భారత భౌగోళిక శాస్త్రజ్ఞుల రచనలు చదివి ఇండియా అంటే ‘’రాంబాయిడ్ ‘’ఆకారం లో (అసమ చతుర్భుజం )ఆకారం లో ఉందని , పడమర సింధు నది ,ఉత్తరాన పర్వతాలు ,తూర్పు ,దక్షిణాలలో సముద్రం ఉంటుందని చెప్పారు .అది పదహారు వేల స్స్టాడియా అంటే 1838మైళ్ళ దూరం లో ఇండస్ నదికి పడమరలోను ,గంగానదికి తూర్పున అంతే దూరం లోను ఉంటుందని రాశారు .గంగా ముఖ ద్వారం నుండి తూర్పుకు మరో పదహారు వేల స్టాడియా లు దక్షిణాగ్రానికి దూరం లో ఉందని చెప్పారు   కన్యా కుమారి నుండి సింధు నది ముఖ ద్వారానికి పడమటి కనుమల గుండా దూరం 19,000స్టాడియాలు అంటే 2,193మైళ్ళు  సింధు నది ముఖ ద్వారం నుండి  పూర్తీ జల రాసి వరకు 13000స్టాడి యాలు –అంటే 1496మైళ్ళు .దేశంచాలా విశాలమైందని రాశారు .తర్వాత ఎప్పుడో మెగస్థనీస్ యాత్రికుడు ఇండియా  నాలుగు భాగాలలో ఉందని అందులో అతి పెద్ద భాగం విభజింప బడిన దక్షిణ ఆసియా అంత ఉంటుందని చిన్న భాగం యూఫ్రటిస్ నుంచి సముద్రం వరకు ఉన్న భూ భాగం అంత ఉన్న అతి పెద్ద దేశం అని ఉందని చెప్పారు  .అందుకే అలేక్సాండర్ బియాస్ నది ఒడ్డున  ఒలింపియన్ దేవతలకు పన్నెండు  స్మ్రుతి చిహ్నాలు నిర్మించి వెనుదిరిగాడు .

క్రీ పూ 321లో మౌర్య రాజ్య స్థాపనకు పూర్వం ఇండియా ను గురించి రాసినది,తర్వాత ఇరవై ఏళ్ళకు మెగస్త నీస్ రాసింది ,పాటలీ పుత్రం లోని చంద్ర గుప్తా మౌర్యుని ఆస్థానం లో ‘’నికటర్ ‘’గా ఉన్న సెల్యూకస వర్ణించింది అన్ని చూస్తె ఇండియా సుమారుగా చతుర్భుజా కారం గా ఉన్నదని అందరూ ఒప్పుకున్నారని తెలుస్తోంది .సింధు నది పొడవు ,సింధునది నుండి పాటలీ పుత్ర వరకు దూరం ,అక్కడి నుండి గంగానది ముఖ ద్వారం వరకు తూర్పు ,పడమటి తీరాల దూరం అన్ని ఖచ్చితం గా ఉన్నాయి .  మెగాస్థ నీసు కూడా మార్గాలలలో మధ్య మధ్య రాళ్ళ స్తంభాలు పాతి దూరాన్ని తెలియ జేశారని రాశాడు .రెండు వేల సంవత్సరాల తర్వాత 1871 లో రాయల్ ఇంజినీర్ల మేజర్ జెనరల్ ,ఆ తర్వాత ఆర్కిలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా కు డైరెక్టర్ అయిన  అలేక్సాండర్ కన్నింగ్ హాం మెగస్తనీస్ రాసిన దానికి అదో సూచిక (ఫుట్ నోట్స్)రాస్తూ ‘’అలేక్సాండర్ కు అతని అనుచరులు ఇచ్చిన దూరాలన్ని ఖచ్చితం గా సరిపోయాయని ,దీన్ని బట్టి భారత దేశ వైశాల్యం పూర్తిగా రుజువైందని ఏ ఆధారాలు యంత్రాలు లేని  కాలం లో భారతీయుల గణితం యెంత నిర్దుష్టం గా ఉందొ ,వారి దేశ సరిహద్దుల్ని ఎంత ఖచ్చితం గా చెప్పారో తెలుసుకొంటే ఆశ్చర్యం వేస్తుంది ‘’అని రాశాడు .

భారతీయుల భౌగోళిక శాస్త్ర విజ్ఞానం చిరస్మరణీయం .హిందువులకు చరిత్ర తెలియదు అనే వారికి ఇది చెంప దెబ్బ .వారి భౌగోళిక పరిజ్ఞానం అత్యంత విశ్వసనీయమైనది .దేశం లో రాజకీయ ఐక్యత లేని ఆ కాలం లో అలేక్సాండర్ కు ఇండియా అంతా అతి విశాలమైన అతి పెద్ద ఒకే దేశం అని అతని ఆఫీసర్లు తెలియ జెప్పారని రచయిత్రి ఏక్ అంటుంది .

మరిన్ని విశేషాలు మరోసారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.