‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2
ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన – బి అమ్మా అనే ఆబాది బేగం
’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది బానో బేగం 1852లో జన్మించింది . బ్రిటిష్ పాలనకు ముందు వెయ్యేళ్ళు మన దేశాన్ని పాలించిన ముస్లిం రాజ వంశీకురాలామే .1857మొదటి స్వాతంత్ర్య సమర కాలానికి ఆమెకు అయిదేళ్ళు .అందువల్ల స్కూల్ ,కాలేజి లలో ఆమె చదవ లేక పోయింది .కాని ముస్లిం మత పద్ధతుల్లో ,సంస్కారం లో ఆమె పెరిగి అలవర్చుకోన్నది .అల్లా అన్నా ఆయన అనుచరులన్న గొప్ప భక్తీ తో ఉండేది .ఇస్లాం కోసం సర్వం త్యాగం చేసే గుణం ఉన్నది .ఆమె క్రమ శిక్షణా జీవితాన్ని చూసి పెద్దలే ఆశ్చర్య పోయేవారు .చిన్న వారు ఆదర్శం గా గ్రహించేవారు .రాంపూర్ రాజ్యం లో ప్రముఖ అధికారి అబ్దుల్ ఆలీఖాన్ కిచ్చి ఆమె పెళ్లి చేశారు .వీరికి మౌలానా షౌకత్ ఆలి ,మహమ్మదాలీ, జుల్ ఫికర్ అలీ,నవాజిష్ ఆలి అనే నలుగురు కొడుకులతో బాటు ఒక అమ్మాయి పుట్టారు .నవాజిష్ ఆలి బాల్యం లోనే చనిపోయాడు .ముప్ఫై ఏళ్ళకే భర్త మరణించాడు .పిల్లల్ని పోషించి పెద్ద చేసే పెద్ద బాధ్యత ఆమె పై పడింది .
నవాజిష్ ఆలి చనిపోయినపుడు బంధువులు ,ప్రజలు ఆమెను ఓదార్చటానికి వస్తే ‘’భగవంతుడి దయ ఎలా ఉంటె అలా జరుగుతుంది .అయన ఏది ఇస్తే దాన్నే స్వేకరించాలి .మన కు ఆయనే దిక్కు ‘’అని, వచ్చిన వారినే ఓదార్చింది .ఆమె హాజ్ యాత్రకు మక్కా వెళ్ళినప్పుడు అక్కడి పవిత్ర శిలను స్పృశించి తన పిల్లలు యదార్ధ ముస్లిం లుగా ఎదిగేట్లు ఆశీర్వ దించమని ప్రార్ధించింది .ఆమె చదువుకోక పోయినా ఇండియా పాకిస్తాన్ ప్రాంతం లో ఉన్న ముస్లిం లందరూ విద్యా వంతులు కావాలని కోరుకొనేది. తన కొడుకుల్ని బాగా చదివించింది .చివరికొడుకు మహమ్మద్ ఆలి బుద్ధిలో హృదయం లో ఎన్నదగిన వాడని పించుకొన్నాడు .అన్నిటా దూసుకు పోయే స్వభాం అతనిది .అతని ప్రతిభ దేశ విదేశాలలో మారు మోగింది .ఒక సారి ఎవరో తల్లి వద్ద ఈ కొడుకు గొప్ప తనాన్ని పొగుడుతుంటే కొడుకు ను తీర్చిన తల్లి అని ఆమెను కీర్తిస్తుంటే ఆమె ‘’అల్లా ఎవరికి గౌరవం కల్పించాలో వారికి కల్పిస్తాడు అందులో నా ప్రమేయం లేదు .అంతా అల్లాదయ ‘’అంది నిగర్వం గా .
బ్రిటిష్ పాలనలో కొందరు ముస్లిం లు పాశ్చాశ్చ సంస్కృతి పట్ల వ్యామోహం చూపించారు .వారిని ‘’బిడ్డల్లారా ఆ వ్యామోహాన్ని వదలండి .మన పద్ధతిలో జీవించండి బ్రిటిష్ వారిచ్చే బిరుదులూ ,పదవులు తీసుకో వద్దు’’ అని హితవు చెప్పిన దేశ భక్తురాలు .1972లో జరిగిన ఆఖిల భారత ముస్లిం సమ్మేళనం లో 62ఏళ్ళ ఈ నానమ్మ (బి అమ్మ)పాల్గొని చరిత్రాత్మకమైన ఉపన్యాసం చేసి అందరికి దేశ భక్తిని రంగ రించి పోసి చిరస్మరణీయం గా నిలిచింది .ఆమెకుమారులు షౌకత్ ఆలి మహామ్మదాలి లు బ్రిటిష్ వారి ఏ ప్రలోభానికి లొంగకుండా నిర్దుష్ట జీవన విధానాన్ని సాగించి ఆదర్శం గా నిలిచారు .అల్లా కు తప్ప దేనికీ భయపడని ధీరో దాత్తులయ్యారు .ఇదంతా బిఅమ్మ ప్రభావమే .ఖలీఫా ను విధ్వంసం చేసే బ్రిటిష్ వారిపై ఈ సోదరులు జీవితకాలమంతా పోరాటం చేస్తూనే ఉన్నారు .వారిద్దరిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెట్టినప్పుడు ఆమె ఆశ్చర్యానందాలకు అవధుల్లేవు .జైలుకు వెళ్లి వారిని పరా మర్శిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కష్టాలకు ఓర్చుకొమ్మని ఒక వేళ అవసరమైతే జీవితాన్ని త్యాగం చేయటానికైనా సంసిద్ధులు గా ఉండమని బోధించిన మాత్రు మూర్తి ఆమె .
కొడుకులు జైలు లో ఉన్నప్పుడు ఖిలాఫత్ ఉద్యమ పగ్గాలు చే బట్టి అందరికి ప్రేరణ కల్గించింది .పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి ఉపన్యాసాలు చేసి ‘’ముస్లిం ఉమ్మా ‘’ సర్వాది కారాలను ఐక్యత తో కాపాడుకోమని ఉద్బోధించింది .ఆమె నినాదం ‘’ఖలాఫత్ కోసం మీ ప్రాణాలు త్యజించండి ‘’అన్నది ఒక మంత్రమై వ్యాపించింది .ఈ మంత్రమే కులమత వర్గ రహితం గా దేశమంతా వ్యాపించింది .1924మార్చ్ లో ఖిలాఫత్ ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .ఆ నవంబర్ పదమూడున లోనే నానమ్మ మరణించింది .కాని ఆమె ఉద్యమ దీప్తి ముస్లిం మహిళల పై గొప్ప ప్రభావం చూపి తిరుగు లేని బలాన్ని ప్రదర్శింప జేసింది .ఇంతటి ప్రభావ శీలి బి అమ్మ .ఖిలాఫత్ ఉద్యమ ఫలితం గా ముస్లిం సమైక్యత ఏర్పడి పాకిస్తాన్ దేశం ఏర్పాటు కావటానికి మార్గం సుగమం అయింది .ఇది బి అమ్మ ఖిలాఫత్ ఉద్యమ దీక్షా ఫలితమే .
మరో మహిళగురించి ఈ సారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-14-ఉయ్యూరు

