మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది
నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే (కాంబే జల సంధి )వద్ద సముద్రం లో కలుస్తుంది .నర్మదా పరిక్రమ పద్దెనిమిది వందల మైళ్ళు .తొమ్మిది వందల మైళ్ళు తూర్పుగా ప్రవహించి ,తరువాత పడమరకు మళ్ళు తుంది .నడిచి ఈ యాత్ర చేయటానికి పూర్వం మూడేళ్ళు పట్టేది .నర్మదకు ‘’నర్మదా వాలీ ప్రాజక్ట్ ‘’వలన అనేక సమస్యలు ఎదురైనాయి .స్వామి ఓంకారానంద ‘’నర్మదా ప్రదక్షిణ యాత్ర ‘’పుస్తకం లో అన్నీ వివరించారు .మధ్యలో సీతా వాటిక తీర్ధం ఉన్నది .ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని ప్రతీతి .కుశ లవులకు సీతా దేవి ఇక్కడే వాల్మీకాశ్రమం లో జన్మ నిచ్చింది .వసిస్ట మహర్షి భార్య అరుంధతి తో ఇక్కడికి వచ్చి తల్లీ బిడ్డలను చూసి వెళ్ళాడు .సీత కు ఏ అపకారం జరగ కుండా రక్షించటానికి అరవై నలుగురు యోగినులు ,యాభై ఇద్దరు భైరవులు అనుక్షణం కాపలా కాసే వారట .సీతను దర్శించటానికి నర్మదా మాత ప్రత్యక్షమైన్దిక్కడ.ఇక్కడి జలపాతాలు సొగసుగా ఉండి సీతా ,లక్ష్మణ, రామ నామాలతో విలసిల్లాయి .ఇక్కడ తపస్సు చేస్తే యెంత మొండి వ్యాధి అయినా నివారింప బడుతుందనే నమ్మకం ఉంది .ప్రతి మూడు లేక నాలుగు మైళ్ళకు ఒక తీర్ధం ఉన్నట్లు ఆ పుస్తకం లో స్వామి ఓంకారానంద రాశారు. అమరకంటక కు నర్మదా నది చేరే లోపు 123,మొత్తం పరిక్రమ లో 481తీర్దాలున్నాయని స్వామి రాశాడు .
గంగ లాగే నర్మదా నది కూడా దివిజ గర్భయే.స్థానిక మహాత్య్మం లో నర్మద శివుని శిరస్సు నుండి భూమిపైకి దూకింది అని ఉంది .శివుడు తపస్సు చేశాడని ఆయన శరీర స్వేద జలమే నర్మదా ప్రవాహం అని కూడా కధలున్నాయి .గంగ శివుడి నెత్తి నెక్కి అర్ధాంగి పార్వతి సవతి అయితే నర్మద పవిత్ర బ్రహ్మ చారిణి గా ఉండి పోయిందని చెప్పుకొంటారు .శివుని స్వేద ధార లోంచి అందమైన నర్మదా దేవి జనించిందని ,ఆమె శివుని భక్తీ తో ఆరాదిన్చిందని ఐతిహ్యం .మెచ్చిన శివుడు వరాన్ని ప్రసాదిస్తానంటే నర్మద ‘’శివా !నీవు సృష్టిని ప్రళయకాలం లో తాండవ నృత్యం తో నాశనం చేసినప్పటికీ ,జీవుల పాపాలను పోగొట్టే నా శక్తి మాత్రం నాకు ఉండేట్లు అనుగ్రహించు. గంగకు ఉత్తరభారతం లో ఉన్న గౌరవాన్ని ,పవిత్రతను దక్షిణ భారతం లో నాకు కలిగించు .నాకు ,గంగకు వైరుధ్యంలేకుండా చూడు .మకర సంక్రాంతి నాడు నా జలాల్లో స్నానం చేసే వారికి దేశం లోని అన్ని తీర్ధాలలో చేసిన స్నాన పుణ్య ఫలితం దక్కేట్లు చూడు .నిన్ను అర్చిస్తూ నా తీరాలపై మరణించే వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించు . ‘’అని వరం కోరితే తధాస్తు అన్నాడు తాండవ శివుడు .నర్మదా ప్రవాహానికి దారి చూపాడు .అక్కడినుండి నర్మద ,జబల్పూర్ ,ఓంకారేశ్వర్ ,భారుచ్ ల మీదుగా ప్రవహిస్తూ రేవా దగ్గర సాగర సంగమం చేసింది .
ఒక సారి పురూరవ మహా రాజు సభలో మానవుల పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది అని ప్రశ్నించాడు .ఎన్నో ఖర్చుతో కూడిన యజ్న యాగాదులు సూచించారట .సామాన్యులకు అందు బాటులో ఉండేది చెప్పమని మళ్ళీ అడిగాడు .అప్పుడు నర్మదా నదీ స్నానం సర్వ పాప హరణం మోక్ష దాయకం అని చెప్పారు .పురూరవుడు శివుని అర్చిస్తూ తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది ,ఆయన నర్మదను దివి నుండి భువికి దిగేట్లు చేయమన్నాడు . నర్మద అంగీకారం తీసుకొని తాను నర్మదను భరించగలనని ఎనిమిది పర్వతాలతోకూడిన వింధ్య పర్వతం చెప్పగా అక్కడికి నర్మదను దింపాడు అని మరో కధనం . .నర్మదా పరీవాహక ప్రాంతమంతా పరమ పవిత్రమైపోయింది .
ఇంకో కధనం –దేవతలు జనుల పాప భారాన్ని మోయ లేక పోతున్నామని విష్ణువుకు విన్న వించారు .ఆయన ‘’కేసు’’ని శివుడి దగ్గర పెట్టాడు .తన జట లో ఉన్న చంద్ర వంక ను తీసి ,అందులోని ఒక అమృత బిందువును నేల పై పడేట్లు చేశాడు .అందులోనుంచే నర్మద అనే అందమైన స్త్రీ జన్మించింది. శివుడికి నమస్కరించి తాను ఏమి చేయాలో సెలవు ఇవ్వమని కోరింది .ప్రవాహ శీలత ఆమెకు కల్పించి ,జీవుల పాప హరం చేయమని ,ఆ నదిలో దొరికే శిలలు పవిత్ర శిలలై మానవుల వ్యాధి నివారకాలవుతాయని చెప్పాడు . అందుకే ఓంకార క్షేత్రం లో బాణ లింగం అంతటి ప్రసిద్ధి చెందింది .నర్మదాజలాలలో అరిగి పోయిన శిలలు పవిత్రమై శివ స్వరూపాలై పూజ లందుకొంటాయి. లోకం లో ‘’నర్మద కంకర శివ శంకరమే ‘’ అనే సామెత వచ్చింది .నర్మదా నదిలోనే లోక ప్రసిద్ధ మైన అనేక రంగుల బాణ లింగాలు లభిస్తాయి .
ఇవాళ మన్య ప్రాంతమైన మైకాల పర్వతాలలో ఉన్న గోండు జాతుల నివాస భూమి అయిన అమర కంటక గొప్ప యాత్రా స్తలం అయింది .అక్కడి అరణ్యాన్ని ‘’అమ్మ వనం ‘’అని పిలుస్తారు .అక్కడున్న చిన్న బావి నుండి నర్మదా జలం జాలువారుతుంది .అక్కడి నుండి భూగర్భం లో ప్రవేశించి ,అక్కడ నర్మద ఉద్గారమవుతుంది .ఐక్కడే శివాలయం ఉంది .దీనికే నర్మదా మందిరం అని పేరు .అక్కడి సరస్సును ‘’కోటి తీర్ధం ‘’అంటారు .మందిరం లో సుందరమైన నల్ల రాయి నర్మదా దేవి విగ్రహం ఉంటుంది .శిరసుపై వెండికిరీటం ఉంటుంది. నీలి రంగు చీర ధరించి యెర్రని పుష్పమాలల తో ఆకర్షణీయం గా కని పిస్తుంది .ఇక్కడి శివుడిని ‘’అమరకంట మహా దేవ’’ అంటారు .చలువరాతి పార్వతి ,రామ ,సీత ,లక్ష్మణ విగ్రహాలు మందిరం లో ఉన్నాయి .నర్మదా జలధార వద్ద ‘’నర్మదేశ్వర్ ‘’అనే మరో శివ లింగం ఉంటుంది .ఇది సరస్సులో నీటిలో ఉంటుంది .ఇక్కడే గోముఖ కుండం ,త్ర్రివేణీ కుండం ఉన్నాయి .
నర్మద ఉద్భవించిన ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరం లో సోనే నది ప్రారంభమవుతుంది. దీన్ని పురుష నదిగా భావిస్తారు .మరో పురుష నది బ్రహ్మ పుత్రానది అని చాలా మందికి తెలియదు .నర్మదా ,సోనే లు వ్యతిరేక దిశల్లో ప్రవహిస్తాయి .,వీటికి కొద్ది దూరం లో ‘’జ్వాల’’ అనే నదీ ప్రారంభమవుతుంది .ఇది కొంచెం దూరమే ప్రవహించి నర్మదలో కలిసి పోతుంది .ఈ రెండు నదుల ప్రారంభ స్థలాలు గొప్ప తీర్ధాలని మహా భారతం లో ,పురాణాలలోను ఉన్నది .ఇక్కడే నలభై ఏళ్ళు ఉన్న’’ జియోఫ్రి మా’’ అనే ఇంగ్లీష్ క్వేకర్ నాయకుడు ఒక ఆసక్తికర కధనాన్ని రాశాడు . నర్మదకు ‘’సోన్ ‘’అనే అతనితో తలిదండ్రులు వివాహం కుదిర్చారు .పెళ్లి కొడుకు ఎలా ఉంటాడోననే ఆదుర్దా తో నర్మద తన చెలికత్తె జ్వాలను చూసి రమ్మని పంపింది .ఆమె పెళ్ళికొడుకు దగ్గరకు రాగానే ఆమెయే పెళ్లి కూతురు అనుకోని పెళ్లి తతంగం ప్రారంభించమని ఆనతిచ్చాడుసోన్ .నర్మదా దేవికి విషయం తెలిసి తీవ్రం గా దుఖించింది .కోపంతో ,విపరీతమైన వేగం తో అక్కడినుండి కొండలు ,కోనలూ ,అడవులు దాటుకుంటూ మహా వేగం గా గంభీర ద్వనులతో తన అసమ్మతిని తెలియ జేస్తున్నట్లుగా ప్రవాహిస్తూ జలపాతాలను సృష్టించింది .ఇది తెలుసుకొన్న పెళ్ళికొడుకు సోన్ ఆగలేక పర్వత శిఖరం నుండి దూకి తూర్పుగా ప్రవహించి ,ఈశాన్యం వైపు తిరిగి చివరికి గంగా నదిలో కలిసి పోయి బంగాళా ఖాతం లో చేరిపోయాడు .
నర్మద జన్మ స్థానం నుంచి ,గుజరాత్ లోని చందూడ్ చేరి సముద్రం వైపు ప్రవహిస్తూ విపరీతమైన వెడల్పు, లోతు గల గల బ్రహ్మాండమైన నదిగా మారింది .ఇక్కడ కూడా నర్మదా దేవి విగ్రహం మందిరం ఉన్నాయి . ఈవిషయాలన్ని ‘ఇండియా ఏ సేక్రేడ్ జాగ్రఫీ ‘’పుస్తకం లోడయాన .ఎల్ ఎక్ రాసింది . నర్మదానది మధ్య భారత జీవన వాహిని .రేవా అనీ పిలుస్తారు ..
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-14-ఉయ్యూరు

