అయో (య్యో )ధ్య
పురాణకాలం నుండి అయోధ్య ప్రసిద్ధి చెందింది. సరయూ నదీ తీరాన ఉన్న ఆ పట్టణం ఈ నాటి ఫైజా బాద్ కు దగ్గరలో ఉంది .సరయూ నది అత్యున్నత హిమాలయాలలోని కింద కైలాస పర్వతం వద్ద ఉన్న మానస సరోవరం నుండి జన్మించిందని కధనం .ఒకప్పుడు జన సంద్రం గా ఉన్న అయోధ్య అనేక రాజకీయ కారణాల వల్ల జనసాంద్రత తగ్గినపట్టణం అయింది .మురికి రోడ్లు ,పారిశుధ్యం లేకపోవటం ,విద్యుత్ సమస్యల తో కొట్టు మిట్టాడుతోంది .యత్రికులే ఎక్కువగా వస్తారు .పంచ క్రోశయాత్ర శ్రీరామ నవమి రోజుల్లో ఇక్కడ ప్రసిద్ధి చెందింది .చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి సాదారణం గా మార్చ్ ఏప్రిల్ నెలల్లో వస్తుంది .
భగీరధుని తండ్రి సగర చక్ర వర్తి కాలం నుండి దీని ప్రాధాన్యత ఉంది .భగీరధుడు దివి నుండి భువికి గంగను తెచ్చిన పుణ్యాత్ముడు .ఇక్కడ హిందువులతో పాటు శైవ ,వైష్ణవ బౌద్ధ ,జైనులూ కూడా ఉంటున్నారు .అయోధ్య చాల ప్రాచీనమైనదని మనకు తెలుసు .అయోధ్య లోని రామ కోట శిదిలాను పరీక్షించిన పురావస్తు శాస్త్రజ్ఞులు అది క్రీ పూ.ఏడవ శతాబ్దికి చెందినదని చెబుతున్నారు. కోసల దేశానికి అయోధ్య రాజధాని .బౌద్ధుల పుస్తకాలలో సాకేత నగరం అని ఉంది .బుధుడు ఈ నగరానికి వెంచేసినట్లు తెలుస్తోంది సాకేత నగరం జైనులకూ కేంద్రం గా ఉండేది .మొదటి జైన తీర్ధంకరుడు ‘’రిషభుడి’’ పుట్టుక స్థానం ఇదే .హిందువులకు రామ జన్మ భూమిగా సూర్య వంశ పాలనకు రాజధానిగా ఉన్నట్లు తెలుసు .అయోధ్య అంటే ‘’జయింప లేనిది ‘’అని అర్ధం .ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్రుడు దీనినే కేంద్రం గా చేసుకొని ధర్మ పరిపాలన చేశాడు .శ్రీ రాముని సంస్కృతీ క్రీ శ.పదకొండవ శతాబ్దం నుండి ఇక్కడ జరుగుతున్నట్లు చారిత్రిక పరిశోధకులు అంటున్నారు .
భక్తీ ఉద్యమం బల పడినప్పుడు శ్రీ కృష్ణసంస్కృతీ ప్రారంభమై పద్నాలుగో శతాబ్దం లో రామ ఆరాధన వచ్చిందని వారి అభిప్రాయం .కబీర్ ,తులసీదాస్ వంటి మహాను భావులైన రామ భక్తులు రామ కల్చర్ ను వ్యాప్తి చెందిన్చారని చారిత్రకాభిప్రాయం .హన్స్ రాజ్ బెకర్ అనే ఆయన అయోధ్య మహాత్మ్యాన్ని అనువదించి ఈ విషయాలు చెప్పాడు .అయోధ్యలో రామ పరిపాలనా పూజా ఎక్కువగా ఉన్నా ,శివారాధనా ఉండేది .రాముడి తో ‘’స్వర్గ ద్వారం ‘’ముడి పడి ఉంది .ఇది సరయు నదిలో ఉంది .ఇక్కడి నుండే శ్రీ రాముడు అవతార సమాప్తి చేశాడుకనుక స్వర్గ ద్వారం అనే పేరొచ్చింది .రాముని అంతఃపురం సీతా దేవి ‘’కనక భవనం ‘’,సీత వంట గది లను మహాత్మ్యంవివరించింది .
ఎన్నో శివసంబంధ ఘట్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి .అయోధ్య లో ముఖ్యమైన దేవుడు ‘’నాగేశ్వర నాదుడు ‘’.అంటే నాగులకు రాజైన వాడు .సరయు నదిలోని స్వర్గ ద్వారా ఘట్టం లో స్నానం చేసిన భక్తులు స్నాన ఘట్టానికి కుడివైపున ఉన్న శివాలయానికి వెళ్లి ముందుగా పూజ చేస్తారు .నాగేశ్వర నాధ శివుని దర్శించకుండా అయోధ్య యాత్ర పరిసమాప్తం కాదని అక్కడి పూజారులు యాత్రికులకు తెలియ జేస్తారు .ఈ శివ లింగాన్ని శ్రీరాముని కుమారుడు కుశుడు ప్రతిస్టించాడు .నాగేశ్వర నాధుడే అయోధ్యకు క్షేత్ర పాలకుడు .పురాతన ఉత్తర భారత దేశం లో నాగులు ,యక్షులు రక్షకులుగా ఉండేవారని తెలుస్తోంది . స్వర్గద్వార ఘాట్ లో యాత్రికులు సరయు నదిలో స్నానం చేసి క్షేత్రపాలకుడైన శివుడిని దర్శించి అయోధ్య యాత్ర ప్రారంభిస్తారు .అయోధ్యను అధ్యయనం చేసిన పీటర్ వాన్ డీర్ వీర్ అభిప్రాయం ప్రకారం అయోధ్య రాముని జన్మ భూమి కర్మ భూమి అయినా శివుడి లింగాలే అన్ని ఘాట్ల లోను దర్శనమివ్వటం ఇక్కడి ప్రత్యేకత .
సరయు పవిత్రస్నానం ,శివ దర్శనం తర్వాత భక్తులు అయోధ్య వీధుల్లో సంచరిస్తారు. ఈ నాడు అక్కడ ప్రత్యేకత కలిగింది హనుమాన్ కోట అనే ఆహానుమాన్ గర్హి .ఎక్కడో కొండమీద మీద నెలకొన్న హనుమంతుడిని భక్తులు అనేక మెట్లు ఎక్కి రొప్పుతూ రోజుతూ చేరి అక్కడ రామ భక్త హనుమాన్ విగ్రహాన్ని దర్శించటం మరో విశేషం.ఈ కొండపై ముఖ్య దైవం హనుమాన్ మాత్రమె . ఇక్కడా శ్రీరామునికి ఏమీ ప్రత్యేకత లేకపోవటం గమనించ దగిన విషయం .స్వామి విగ్రహం బంతిపూల దండలతో తులసి పేరులతో సర్వాంగ సుందరం గా అలంకరింప బడి ఉంటుంది .విగ్రహం అంతాగంధ సిందూర విలేపనం తో శోభాయ మానం గా కనిపిస్తుంది .వెండి కళ్ళు ,,వెండి విష్ణు నామం తో భక్త సులభుడిగా దర్శనమిస్తాడు హనుమ .ఆలయం చుట్టూ శ్రీరామ , సీత, లక్ష్మణ విగ్రహాఉంటాయి .ఇవాళ హనుమాన్ గర్హి అయోధ్యలో అతిముఖ్య దర్శనీయ స్థలమైంది .దీనికి కారణం శ్రీరాముడు సరయూ నదిలో అవతార సమాప్తి చేస్తూ అయోధ్య రక్షణ బాధ్యతను హనుమంతునికి అప్పగించి వెళ్ళాడట .అప్పటి నుంచి అయోధ్యకు హనుమంతుడేప్రభువు. . హనుమాన్ రామ శివులకు మంచి సంబంధం ఉంది .హనుమ శివకుమారుడని,సాక్షాత్తు శివ స్వరూపుడే నని పురాణాలు ఉద్ఘోషించాయి .శైవ భక్తులలో సన్యాసులలో హనుమ ఆరాధన ,ఆయన రామ భక్తీ వలననే ఏర్పడింది .గర్హి మహాత్మ్యం లో శివుడు ‘’హనుమంతుడు పదకొండవ రుద్రుడు ,నా అవతారమే హనుమ ‘’అని చెప్పాడు .అందుకే అయోధ్యలోనూ ,పరిసరాలలోనూ హనుమాన్ గర్హి ,నాగేశ్వర నాద శివులకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది .
అయోధ్యలో రామ జన్మ భూమి ప్రదేశంఉంది . ముసల్మాన్ చక్ర వర్తి బాబర్ 1526లో దర్శించటం వలన బాబరీ మసీద్ ను చిహ్నం గా నిర్మించారు .దీన్ని మీర్ బకి కట్టించాడు . అక్కడికి దేవదూతలు అవతరిస్తారని వారి నమ్మకం .విశ్వ హిందూ పరిషత్ ,బిజెపి ఆర్ ఎస్ ఎస్ కరసేవకులతో 1996డిసెంబర్ ఆరున ముట్టడించిన సంగతి అందరికి తెలుసు .ఇవాళ అయోధ్యలో ప్రతి చోట పోలీస్ బారి కేడ్లున్నాయి .దానితో యాత్రికుల సంఖ్య తగ్గింది. వివాదాస్పద మసీదు అద్రుశ్య మైన్దక్కడ .రాముడు జన్మించిన స్థలం లో ఒక ప్లాస్టిక్ టెంట్ కని పిస్తుంది .మిగతా ప్రదేశం అంటా రక్షణ కవచం గా మార్చేశారు. శ్రీ రాముడి చిన్న విగ్రహం ‘’రాం లాలా ‘’మాత్రం చూసి బాల రాముడిని చూశామన్న సంతృప్తి పొందాలి .పూర్వం సీతా దేవి వంట శాల ఉండేది .ఇప్పుడదికని పించదు. ఏమైందని ఎవర్ని అడిగినా సమాధానం రాదు .అందుకే ఇవాళ అయోధ్య ను చూసిన వారందరూ ‘’అయ్యో?ధ్య ‘’అని మనసులో బాధ పడుతున్నారు .
ram lalla
ram lalla

hanuman sarayu river hanuman garhi
ఈ విషయాలన్నీ డయానా ఎల్ ఎక్ ‘’ఇండియాఎ సేక్రేడ్ జాగ్రఫి ‘’పుస్తకం లో రాసినవే .
శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-14-ఉయ్యూరు
.

