‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్
పద్దెనిమిదవ శతాబ్దిలో బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన రాణి మంగై వేలునాచియార్ 1730లో మంగై మల్లార్ సెల్ల ముత్తు సేతురామన్ ,రామ నాద పురం రాజ్యానికి రాణి సాకంది ముతాల్ దంపతులకు జన్మించింది .రాజ వంశానికి ఏకైక గారాల పుత్రిక ఆమె .మగ సంతానం లేనందున వేలునాచియార్ యువరాజును పెంచిపోషించారు .గుర్రపుస్వారీ కత్తియుద్ధం కర్ర సాము ,విలు విద్య ,మొదలైన యుద్ధ విద్యలన్నీ నేర్చుకొన్నది .ఉపాధ్యాయులను ఏర్పరచి ఆమెకు రాజాన్తః పురం లోనే ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఉర్దూ భాషలను తలి దండ్రులు నేర్పించారు .ఈ విధం గా ఆమె అన్ని విద్యలలో ఆరి తేరింది .సకల విద్యా సరస్వతిగా ఖ్యాతిపొంది రామ నాడు రాజ్యాన్ని పరిపాలించే సమర్ధత పొందింది .
పదహారేళ్ళ వయసులో ఆమెను శివ గంగై మన్నార్ ముత్తు వడుగ నాదర్ కిచ్చి వివాహం చేశారు .1772లో ఆమె రాజ్యం పైకి బ్రిటిష్ సైన్యం దాడి చేసింది .భీకరం గా జరిగిన పోరులో ఆమె భర్త ,ముత్తు వడుగ నాదర్ కుమార్తె యువరాణి గౌరీ నాచియార్ కూడా కైలయార్ కోయిల్ యుద్ధం లో మరణించారు .ఈ యుద్ధం కాలియార్ కోయిల్ పాలస్ లో జరిగింది . అంతః పురాన్ని పురాన్ని లెఫ్టి నెంట్ కల్నల్ బోన్ జోర్ ముట్టడించాడు .ఆమె కలత చెంది బ్రిటిష్ వారి నెదుర్కొని బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొన్నది .దళవాయి తాండవ రాయ పిళ్లే ,ముత్తు సోదరులు తీవ్రం గా గాయ పడ్డారు .సంస్థానాన్ని ఎలాగైనా దక్కిన్చుకొంటామని వారు శపథం చేసి ముందుకురికారు .దళవాయి పిళ్లే శివ గంగ సంస్థానం లో అరివీర భయంకరుడైన పోరాట యోధుడు .తాండవ రాయకూడా లబ్ధ ప్రతిస్టూడైన పరిపాలకుడు ముగ్గురు రాజుల దగ్గర పని చేసిన అనుభవం ఉన్న వాడు వీర విధేయుడు కూడా .
వీరిద్దరూ వ్యూహం పన్ని రాణిని ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజులు ప్రదేశాలు తిరుగుతూ దాక్కోమని సలహా చెప్పారు .సుల్తాన్ హైదర్ ఆలి కి రాణి తరఫున దళవాయి బ్రిటిష్ వారిని ఎదిరించటానికి తమకు అయిదు వేల మంది సైనికులను అయిదు వేల మంది ఆశ్వికులను పంప వలసిందిగా ఒక విన్నపం తో కూడిన ఉత్తరం రాశాడు .దురదృష్ట వశాత్తు దళవాయి ముసలి తనం తో చనిపోయాడు .అప్పుడు రాణి అతని కొడుకు తో కలిసి మైసూర్ వెళ్లి హైదరాలిని చూడాలను కొని వెళ్లి కలిసింది .ఈస్ట్ ఇండియా కంపెనీ పెడుతున్న బాధలన్నిటిని ఉర్దూలో రాణి హైదరాలి కి స్పష్టం గా తెలియ జేసింది .తప్పని సరిగా సహాయం చేస్తానని హైదరాలి వాగ్దానం చేశాడు .రాణి పట్ల ఏంతో ,సానుభూతి,సహృదయత చూపించాడు ఆలి .
వెంటనే హైదర్ దిండిగల్ లో ఉన్న సయ్యద్ కర్కి కి సందేశం పంపి ఐదువేలమంది కాలి భటులను అయుదు వేల మంది ఆశ్విక దళాన్ని రాణికి అందజేయమన్నాడు .అతడు అలాగే ఏ ర్పాటు చేశాడు .ముత్తు సోదరుల బలం తో ఈ సైన్యం తో రాణి శివ గంగ వైపుకు దూసుకు పోతోంది .ఆర్కాట్ నవాబు రాణి ముందుకు వెళ్ళకుండా ఎన్నో అడ్డంకులు కల్పించాడు .హైదరాలి ఇచ్చిన సైన్యం ముత్తు సోదరుల సైన్యం తో బల పడిన రాణి సైన్యం అడ్డంకులు అన్నిటిని అదిగ మిస్తూ అప్రతి హతం గా సాగి పోయి శివ గంగ చేరింది .ఆర్కాట్ నవాబును యుద్ధం లో ఓడించి బందీగా పట్టుకొన్నది .శివ గంగ సంస్థానాన్ని హైదరాలీ సమకూర్చిన సైన్యం తో మళ్ళీ స్వాధీన పరచుకొంది .శివ గంగ సంస్థానానికి రాణి అయ్యి ‘’శివగంగ సింహం ‘’అని పించుకోన్నది రామనాధ పురం యువ రాణి .వేలు నాచియార్ బ్రిటిష్ ఇమ్పీరియలిజాన్ని ఎదిరించి పోరాడిన మొట్ట మొదటి రాణి .ఝాన్సి లక్ష్మి బాయి కంటే 85సంవత్సరాల ముందే రాణి మంగై వేలు నాచియార్ బ్రిటిష్ ప్రభుత్వం పై తిరగ బడి యుద్ధం చేసిన వీర వనిత అని చరిత్రకారులు రాశారు .ఆమెను ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’అనీ గౌరవం గా పిలుచుకొంటారు .
శ్రావణ పౌర్ణమి ,రక్ష బంధన్ శుభా కాంక్షలతో –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -10-8-14-ఉయ్యూరు

