హీలియం అంటే…
ఒక రంగు, రుచి, వాసన లేని హానికరంగాని తటస్థమైన, ఒకే అణువు కలిగిన రసాయనిక మూలకమే హీలియం. అన్ని పరిస్థితుల్లోనూ ఇది వాయువుగానే ఉండటం దీని ప్రత్యేకత. 1868లో జాన్సన్ గుంటూరులో సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక స్పెక్ట్రమ్ లైన్‌ను కనుగొన్నాడు. అది హీలియం మూల కణాన్ని సూచించే స్పెక్ట్రం లైన్. సముద్రలోతుల్లో శ్వాస పీల్చడానికి, బెలూన్లను ఉబ్బించడానికి, సిలికాన్ వెఫర్స్ తయారు చేయడానికి, అర్క్ వెల్డింగ్‌లోనూ, ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాల్లోనూ ఈ హీలియం వాడతారు. క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే పరిశోధకులకు హీలియం ఉపయోగపడుతుంది.
హీలియంను ఎప్పుడు కనుగొన్నారు? ఎక్కడ కనుగొన్నారు?- ఈ ప్రశ్నలకు చాలా మంది రకరకాల దేశాల పేర్లు చెబుతారు. హీలియాన్ని మన గుంటూరులోనే ఒక విదేశీ శాస్త్రవేత్త కనుగొన్నాడనే విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా 1986లో ఇదే రోజున (ఆగస్టు 18వ తేదీన) హీలియాన్ని ప్రముఖ శాస్త్రవేత్త పియర్ జాన్సన్ కనుగొన్నాడు..
1868 ఆగస్ట్ 18న గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ గ్రహణం అనూహ్యంగా అసాధారణంగా దాదాపు 10 నిమిషాల సేపు ఉంది. ఆ రోజు ప్రముఖ శాస్త్రవేత్త పియర్ జాన్సన్ కూడా గుంటూరులోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆర్ అగ్రహారంగా అందరూ పిలిచే రామచంద్రాపుర అగ్రహారం అనే ప్రాంతంలోని ఒక చెరువు గట్టు మీద నుంచి ఈ సూర్యగ్రహణాన్ని తిలకించాడు. ఈ సూర్య గ్రహణాన్ని చూసిన తర్వాతే ఆయన హీలియం వాయువు గురించి తన ప్రతిపాదనను ప్రపంచానికి తెలియజేశాడు.
ఎవరీ జాన్సన్….?
పియర్ జాన్సన్ ప్యారిస్‌కు చెందిన వ్యక్తి. గణితం, భౌతిక శాసా్త్రలను అభ్యసించాడు. అదే విధంగా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్ విద్యనభ్యసించాడు. అయితే అతని దృష్టంతా పరిశోధనలపై ఉండేది. దీంతో అతను తొలిసారి ప్యారిస్ విడిచి 1857లో పెరూ వెళ్లారు. అక్కడ అయస్కాంత తరంగాలను వరుస క్రమంలో పెట్టడంలో కీలక భూమిక పోషించారు. అనంతరం 1861-62 నుండి 1864 వరకు ఇటలీ, స్విజ్జర్లాండ్ దేశాల్లో సూర్య తరంగాలపై అధ్యయనం చేశారు. ఆ తరువాత సూర్యగ్రహణం సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న వాయువులను కనుగొనేందుకు ఆయన మద్రాస్ రాషా్ట్రనికి వచ్చారు. అప్పుడు గుంటూరు జిల్లా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉంది. దీంతో సూర్యగ్రహణం గుంటూరు నుండి బాగా కనిపిస్తుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆయన 1868 ఆగస్ట్ నెలలో గుంటూరు వచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారనేది తెలియకపోయినా ఆగస్ట్ 18న గుంటూరు నుండే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని చుట్టూ హీలియం వాయువు ఉన్నట్లు గుర్తించారు.
రామచంద్రాపురం అగ్రహారం చరిత్ర
12వ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంత రాజు ఈ అగ్రహారాన్ని ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఆయన ఇక్కడి నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకుని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం ఆర్ అగ్రహారంలో ఉన్న ఓ శిలాఫలకంపై ఆ ఆలయం 12వ శతాబ్ధంలో నిర్మించినటు లిఖించి ఉంది. దీన్ని బట్టి గుంటూరు కన్నా ఈ రామచంద్రాపురం అగ్రహారం ఎంతో పురాతనమైనదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆర్ అగ్రహారం అని, ఏడు సందుల వీధి అని పిలుస్తారు. ఇక్కడ పలు ఆలయాలు ఉనాయి. ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి. దీనికి అనుకుని ఉన్న చెరువు కాల క్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది. ఇక్కడ చెరువు ఉందని, ఈ ప్రాంతంలోని రామనామ క్షేత్రంలోని రాముల వారి తెప్పోత్సవం ఇక్కడి చెరువులోనే జరిపించే వారని సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు.
ఫ ఆంధ్రజ్యోతి, గుంటూరు
వీక్షకులు
- 1,107,413 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

