-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
35-చిదంబర కవి-(16వ శతాబ్దం )
సూర్యనారాయణ యజ్వ మనవడు ,వేంకటాంబ ,అనంత రామయ్యలకుమారుడు చిదంబర కవి .16వ శతాబ్ది గొప్పకవి ,సాహిత్య శాస్త్ర వేత్త .తండ్రిగోదావరిజిల్లాలో పుట్టినా తమిళనాడుకు వలసవెళ్లి విజయనగర రాజుల ప్రాపకం సంపాదించాడు .శుద్ధ అద్వైతి అయిన చిదంబరం జీవితం చివర్లో తిరుపతి సందర్శించి ఒక్కసారిగా వీర వైష్ణ వుడయ్యాడు .వెంకటేశ్వర స్వామి పై 200 పైగా స్తోత్రాలు స్తుతులు రచించాడు .ఉత్తర ఆర్కాట్ లో ఉండే మాతామహుడు వేదపురీశ్వరుడు ‘’మార్గ సహాయ చరిత్ర ‘’రాశాడు .చిదంబర తల్లి తమిళ దేశీయురాలు తండ్రి ఆంధ్రావాలా .తమ్ముడు శ్రీనివాసుడు మేనమామ శివసూర్య .చిడంబరకవి తంజావూర్ జిల్లా పలయూర్ నివాసి .
రాఘవ యాదవ పాండవీయం అనే త్ర్యర్దికావ్యం ,చిదంబర విలాసం ,శ్లేష చింతామణి ,శబ్దార్ధ చింతామణి ,భాగవత చంపు ,పంచకల్యాణ చంపు రాశాడు .మొదటిదానికి ‘’కదా త్రయి ‘’అనే పేరూ ఉంది .మూడాశ్వాసాలకావ్యం .రామాయణ భారత భాగవత కదా.దీనికి అర్ధ ప్రదీపిక వ్యాఖ్య ఉంది.కావ్య ప్రారంభ శ్లోకం
‘’వాచం వో రచయతు స్సర్వదాంత రంగేగాంగేయ సరస నయోదయం దధానః –సత్యాప్తో బుధ కుల మౌళి బంధు రోజా శ్రీ రామ స్తుత గురుమానసాబ్జ హంసః ‘’.మూడవ ఆశ్వాసం లో తన వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .
చిదంబర విలాస కావ్యం లోరెండు కా౦ డలున్నాయి అర్ధ దీపిక పేర తానె వ్యాఖ్య రాశాడు .చాలా సంక్లిష్ట రచన –మచ్చుకి –
‘’నాద హ్రదా రామకే జానపద్యాః పారే వాసీ ఫాలయూ రగ్ర హారే –లీలా సేవ్యః శైల కన్యా సహాయః కైలాసేపి వ్యాప కాంక్షా౦ న దేవః ‘’
50వ శ్లోకం లో తానూ తంజావూర్ జిల్లా పాలయూర్ వాసినని చెప్పాడు
.శేష చింతామణి110శ్లోకాల కావ్యం .వ్యాఖ్యానం రాసుకొన్నాడు .కవి శ్లేష యమక చక్రవర్తి .-మొదటిశ్లోకం
‘’సవః శ్రేయో విభుస్తన్యా త్సువయః పున్గావద్భావః –కరీంద్ర వదనో ల్లాసీ కటకీకృత పన్నగః ‘’
శబ్ద రత్న చింతామణి రెండు సర్గలు రామాయణ భాగవతజోడుకధలు .కవి నికశోపల వ్యాఖ్య రాశాడు..పంచకల్యాణ చంపు గద్య ,పద్య కావ్యం .రామ ,కృష్ణ సుబ్రహ్మణ్య స్వాముల కళ్యాణ గాధ,కవి శిష్యుడు నంజుండ వ్యాఖ్యానం రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-15 ఉయ్యూరు

ఆర్యా!.మీరు చిదంబరం కవి గురించి వ్రాశారు.అవి ఏమైనా pdf రూపంలో దొరకగలవా?,
LikeLike