అణు ఇంధన కల్పన పిత –డా.శ్రీ నిడమర్తి కొండలరావు
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం లో డా.శ్రీ నిడమర్తి కొండలరావు 15-7-1824 జన్మించారు .తండ్రి మంగయ్య గారు .బెనారస్ హిందూ యూని వర్సిటి లో మెటలర్జీ లో ఇంజనీరింగ్ చదివి పాసై ,పశ్చిమ జర్మని లని’’ఆషెం యూని వర్సిటి లో చదివి 1955 లో మెటలర్జీ లో డాక్టర్ ఇంజనీర్ ( డి .ఇంగ్)డిగ్రీ పొందారు .ఖనిజాలనుంచి లోహాలను తయారు చేసే విధానం కరతలామలకం చేసుకున్నారు .అంటే లోహ సంగ్రహణ శాస్త్ర వేత్తగా ప్రసిద్ధి చెందారు .బొంబాయి లోని దేవీ దయాళ్ మెటల్ ఇండస్ట్రీస్ లో 1948 నుండి ఒక సంవత్సరం పని చేశారు .బొంబాయి లోనే ఇండియన్ సెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కంపెనీ లో 1949 నుండి 19 53 వరకు నాలుగేళ్ళు పని చేశారు .
బొంబాయి నుంచి కలకత్తా వెళ్లి హిందూ స్థాన్ మోటార్స్ లో శాస్త్ర వేత్తగా 1955 నుండి ఒక ఏడాది ఉన్నారు .మళ్ళీ బొంబాయి వచ్చి ‘’ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ సైన్స్ ‘’అయిన డా .హోమీ జహంగీర్ భాభా చేత స్వయంగా సెలెక్ట్ కాబడి భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లో అటామిక్ ఫ్యుయల్ డివిజన్ హెడ్ గా పని చేశారు. దీన్ని బట్టి రావు గారి సర్వ సమర్ధత ఏమిటో అర్ధమౌతుంది ..ట్రా౦బే లోని CIRUS అణు రియాక్టర్ స్థాపన అంతా కొండలరావు గారి ఆలోచన అమలు తోనే జరిగింది .ఇది న్యూక్లియర్ ఎనర్జికి కావలసిన ఇంధనమూలకాల సప్లై కి బాగా ఉపయోగపడింది . న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎక్సి క్యూటివ్ గా 1972 లో ఉన్నారు .కోటా లోని రావత్ భటా రియాక్టర్ ‘’RAPSI’’కూడా రావు గారి నేతృత్వం లోనే ఏర్పడింది .దీనికే మొట్టమొదటి హాఫ్ చార్జి ఆఫ్ ఫ్యుయేల్ అందించారు .ఈ ఇంధనం తాము తయారు చేసిన ఇంధనంకంటే చాలా మెరుగైనది అని కెనడియన్ సైంటిస్ట్ లు ధృవీకరించారు .ఇదంతా రావు గారి మేధో విలసనమే . టంగ్ స్టన్ లోహపు పొడి తయారీ రంగం లో విశేష కృషి,పరిశోధనలు చేశారు .టా క్స్టేషన్ఎలక్ట్రాలిక్ కెపాసిటర్స్ ,ఫాబ్రికేషన్ అండ్ వెల్డింగ్ ఆఫ్ అల్యుమినం ,సిలికాన్ –నికెల్ ఎల్లాయ్ ట్యూబ్స్ మెటల్లర్జికల్ ప్రాబ్లెమ్స్ ఇన్ న్యూక్లియర్ మెటల్స్ మొదలైన అతి ముఖ్య మైన అంశాలపై విలువైన పరిశోధనలు అవిశ్రాంతంగా నిర్వ హించారు .ఆయన పరిశోధనా ఫలితాలను అనేక జాతీయ ,అంతర్జాతీయ పత్రికలు ప్రచురించి గౌరవించాయి .
హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ (NFC) ఏర్పరచటానికి ముఖ్య కారకులైన రావు గారు 1978 నుంచి 1984 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశారు .’’ఫ్యుయల్ ఫాబ్రికేషన్ టెక్నాలజీ’’లో ఆయన లోతులు తరచి ,అందులో ఎన్నో ఆవిష్కరణలు జరిపారు .రావు గారి కృషి ఫలితంగా భారత దేశం న్యూక్లియర్ ఫుయల్ లో స్వయం సమృద్ధి సాధించి ,ఈ విషయంలో ,ప్రపంచ దేశాలో సరి సమానమైన స్థాయి పొందింది .ఇదంతా కొండలరావు గారి పుణ్యమే అని విజ్ఞులు భావిస్తున్నారు .భాభా’’ అణుశాస్త్ర పిత ‘’,అయితే కొండలరావు గారు ‘’అణు ఇంధన కల్పన పిత ‘’ వ్యూహాత్మక ,వాణిజ్య పరమైన అనేక పదార్ధాల సీమ్లెస్ ట్యూబ్స్ ను NFC తయారు చేసి అంతర్జాతీయ ప్రామాణికత తో దూసుకు పోతోంది .ఇది రావు గారి అవిశ్రాంత కృషి మహత్యమే .
కొండలరావు గారు ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,మహారాష్ట్ర అకాడెమీ ఆఫ్ సైన్సెస్ మొదలైన ప్రేస్టేజియస్ సంస్థలనుండి తమ ప్రతిభకు తగిన ఫెలోషిప్ లు పొందారు .చాలా సంస్దలు వారికి గౌరవ సభ్యత్వమిచ్చి వారి అనుభవాలను విని యోగించుకోన్నాయి .అనేక సైంటిఫిక్ ,ఇంజనీరింగ్ సంస్థలు రావు గారి సేవలను అనేక విధాలుగా సద్విని యోగం చేసు కున్నాయి . ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ది పౌడర్ మెటలర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,ఇండియన్ వాక్యూం సొసైటీ లకు అధ్యక్షులుగా ఉన్నారు .ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెటల్స్ ,ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్ర క్టివ్ టెస్టింగ్ కు చైర్మన్ గా వ్యవహరించారు .విదుట్ స్టీల్స్ లిమిటెడ్ ,నాగార్జున సిమెంట్స్ ,గోల్కొండ అబ్రేసివ్ లిమిటెడ్ ,ఓడిం మెటల్ పౌడర్స్ లిమిటెడ్ ,నాగార్జున స్టీల్స్ ,రాసి సిమెంట్ ,ఎ.పి .స్టీల్ లిమిటెడ్ ,ఎనర్జీ ట్యూబ్స్ లిమిటెడ్ ,ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్స్, బ్రాస్కో మొదలైన సంస్థలలో కీలక బాధ్యత వహించారు .
రావు గారు నేషనల్ మెటలర్జిస్ట్ డే అవార్డ్ 1968 లోను ,డిస్టింగ్విష్డ్ ఆల్మనన్ అవార్డ్ బెనారస్ హిందూ యూని వర్సిటి అవార్డ్ లు పొందిన ఘనత ఆయనది .తెలుగు వెలుగు అవార్డ్ పొందారు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లో స్నేహపురి లో స్థిర పడ్డారు . మెటలర్జిస్ట్ ,న్యూక్లియర్ సైంటిస్ట్ గా విఖ్యాతులైనశ్రీ నిడమర్తి కొండలరావు గారు పదేళ్ళ క్రితం అక్టోబర్ 22 చనిపోయారని ఇప్పుడే వారబ్బాయికి ఫోన్ చేస్తే తెలియ జేశారు .రావు గారికి భార్య ,ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు
ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు లో ‘’గోరంత’’, వీకీ పీడియాలో ‘’కొండంత’’.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు . ,
—

