నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు
గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి లో శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్య 3-3- 1927 జన్మించారు .మద్రాస్ అన్నామలై యూని వర్సిటిలో చదివి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో నలభై ఏళ్ళు వివిధ హోదాలలో సేవలందించారు .రాష్ట్ర నీటిపారుదల సౌకర్యాలకు యెనలేని కృషి చేశారు .1989 లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు .భూ నీటి నిల్వహణ శిక్షణ పరిశోధన సంస్థ డైరెక్టర్ అయ్యారు .ముఖ్యమంత్రికి నీటి పారుదల సలహాదారుగా ,కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ అభి వృద్ధిమండలి గౌరవ సభ్యులుగా ఉన్నారు .కృష్ణా ,గోదావరి ,పెన్నా డెల్టా బోర్డ్ ల చైర్మన్ అయ్యారు ‘.
కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా దేశాలలో జరిగిన సదస్సులలో పాల్గొని భారత దేశ ఖ్యాతి ఇనుమడింప జేశారు .ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించింది ,శ్రీ కృష్ణదేవరాయ యూని వర్సిటి 1989 లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మా నించింది .1987 లో నేషనల్ హైడ్రాలజీ అవార్డ్ అందుకున్నారు క్రష్ణయ్యగారు .
అనతపురం జిల్లా రామక్రష్ణయ్యగారికి ఎంతో రుణపడి ఉంది .అక్కడ నీటిపారుదలకు విశేష కృషి చేసి అభివృద్ధి మార్గం లో ప్రవేశపెట్టారు .ఆయా ప్రాంతాల నైసర్గిక భోగోళిక ,వాతావరణ పరిస్థితులను అధ్యనంచేసి వాటిపై పరిశోధనలు సలిపి వీటికి అనుకూలంగా తగినట్లు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటం లో ఆయన అందెవేసిన చేయి .అంకితభావం తో ఇంతశ్రమ చేసేవారు ప్రజోపయోగ కార్యాలు నిర్వహించేవారు అరుదు .శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్యగారు హైదరాబాద్ లో 20-3- 2002 న 74 వ ఏట మృతి చెందారు.ఆయన రాసినవాటిలో ది స్టోరి ఆఫ్ పెన్నా బేసిన్ ,డ్రాట్ –రాయలసీమ ,ఎక్స్ ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ రాయలసీమ ,కా౦ప్ర హెన్సివ్ మాస్టర్ ప్లాన్ ఫర్ డ్రైనేజ్ ఇన్ కోస్టల్ బెల్ట్ ఆంద్ర ,యుటిలైజేషన్ ఆఫ్గోదావరి వాటర్ బై లిఫ్ట్ ..ఇర్రిగేషన్ ఇన్ ఏన్శేంట్ ఇండియా మొదలైనవి .
20 02 లో వీరి స్మారక ట్రస్ట్ ఏర్పడి విద్యావికాసానికి ,నీటిపారుదలకు ,పుస్తకప్రచురణకు సేవలందిస్తోంది .మార్చి 3 రామక్రిష్ణయ్యగారి జన్మదినాన్ని ఆయన గౌరవార్ధం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం’’ ఇరిగేషన్ డే’’గా నిర్వహిస్తోంది .
తైల సాంకేతిక, సాహిత్య నిపుణులు -శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు
జననం చదువు
కర్నూలు జిల్లా జోహరా౦పుర౦ లో మాధవ బ్రాహ్మణ కుటుంబం లో 1928 నవంబర్ 28న లో శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు జన్మించారు .తండ్రి నరసింగ రావు.తల్లి కృష్ణ వేణమ్మ. వీరి పూర్వీకుడువెంకన్న పంతులు ఆదోని నవాబు వద్ద మంత్రిగా పనిచేసి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం స్థాపనకు సహకరించాడు ఆదోని అనంతపురాలలో ప్రాధమిక ,ఉన్నత విద్య పూర్తి చేసి , తర్వాత అనంతపురం దత్తమండల కళాశాలలో చదివారు. ప్రముఖ పరిశోధకులు, పరిశోధక పరమేశ్వర శ్రీ చిలుకూరి నారాయణరావు గారికి శిష్యుడయ్యాడు .19 54 లో రాజస్థాన్ లోని పిలాని లోఉన్న బిర్లా ఇన్ స్టి ట్యూట లో చదివి ఎం.ఎస్ .సి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .
ఉద్యోగం –సంస్థకు అవార్డుల సాధన
,ఆయిల్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ఇంజనీర్ గా చేరారు .1962-69 కాలం లో డైరెక్టర్ ఇన్ చార్జి గా ,1974 లో డైరెక్టర్ గా ఉన్నారు .తనకిష్టమైన ఆయిల్ రిసెర్చ్ కొనసాగిస్తూనే ఉన్నారు .అనంతపురం లోనే తైల సాంకేతిక పరిశోధనా సంస్థ లో కెమిస్ట్ గా19 54 లో చేరి ,1983 లో రిటైరయ్యారు .ఈ సంస్థ వీరి నేతృత్వం లో కేంద్ర సంస్థ ఆయిల్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ నుంచి ఏటా ఉత్తమ పరిశోధనకు అందించే బంగారు పతాకాలను 5సార్లు ,,10 సార్లువెండి , కాంస్య పతాకాలను అందుకొన్నది ,ఇదంతా రావు గారి అనితరసాధ్య పరిశోధనా కృషి ఫలితమే .
ఫెలోషిప్ లు
ఆయిల్ టేక్నాలజిస్ట్ అసోసియేషన్ ,ఇండియన్ మెడికల్ సొసైటీ మొదలైన వి ఫెలో షిప్ ఇచ్చి సర్దేశాయ్ ని ప్రోత్సహించాయి .ఆయిల్ టెక్నాలజీ రంగం లో విశేష కృషి చేసి జాతీయ స్థాయిలో కీర్తి పొందారు .ముప్పై ఏళ్ళు తైల సాంకేతిక పరిశోధన చేసిన ఘనత ఆయనది .50 0 కు పైగా సాధికార పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు ..ఇవి జాతీయ అంతర్జాతీయ మేగజైన్స్ లోప్రచురింపబడి గౌరవ స్థానం పొందాయి .
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తమమేధస్సుకు పదునుపెట్టి తిరుమలరావు గారు పత్తిగింజలు ,బియ్యం, తవుడు, పొగాకు గోగు విత్తనాలనుండి నూనె తీసే ప్రక్రియకు ఆద్యులై విజయం సాధించారు .ఈ ప్రక్రియను అనేక విధాల అభి వృద్ధిపరచి ఖ్యాతి చెందారు .ఆయన కృషి ఫలితమే నేటి తవుడు నూనె ,,పత్తిగింజలనూనే .ఇవే కాక మల్లెపూలు మరువం దవనం మొదలైన వాటినుంచి పెర్ ఫ్య్యూమ్స్ తీసే పరిశాధనలోనూ అగ్రగాములయ్యారు .
పేటెంట్ ల పిత పురస్కార గ్రహీత
వేప నూనె ,కానుగ నూనె వంటి అఖాద్య తిలాలను ఖాద్య తిలాలతో ఆవిష్కరించారు ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది .తన పరిశోధనలవలన ఆయన తైల సాంకేతిక రంగాలలో 11 పేటెంట్ లను పొందారు .
వీరి సాంకేతిక నైపుణ్యానికి అమెరికన్ ఆయిల్ కేమిస్ట్స్ సొసైటీ ,పెన్ ఆయిల్ ఇండియా సెంటర్ ,ఇండియన్ అసోసియేషన్ ఫర్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ (ఉజ్జయిని )మొదలైన సంస్థలు గౌరవ పురస్కారాలు అందజేశాయి .1974 లో ప్రాణనారాయాణ మెమోరియల్ అవార్డ్ ,1976 లో ఇండియన్ ప్లాంట్ అసోసియేషన్ అవార్డ్ ,1968 లో ఇండియన్ ప్లాంట్ అసోసియేషన్ అవార్డ్ ,ఇన్ వెన్ష్షన్స్ అండ్ ప్రమోషన్ బోర్డ్ అవార్డ్ ,1977 లో ఆయిల్ టేక్నాలజిస్ట్స్ అసోసియేషన్ వారి గోల్డ్ మెడల్ అందుకున్నారు .మొత్తం మీద 3 స్వర్ణపతకాలు ,9 అవార్డ్ లు ఆయనపరిశోధనలకు దక్కాయి .సాహిత్య కృషికి ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’గౌరవ పురస్కారం లభించింది .
సాహితీ పరిమళ తైల శోధన
సర్దేశాయ్ తిరుమలరావు గారికి తైలం పిండటమేకాదు అక్షరం పిండటం లోనూ నైపుణ్యం ఉంది .ఆయనకు తెలుగు సాహిత్యం పై అత్య౦త మమకారమే కాదు , విమర్శపై ఆదిపత్యమూ ఉంది .ఆయనకు గురజాడ కన్యాశుల్కనాటకం , ఉన్నవవారి మాలపల్లి నవల ,గడియారం వారి శివభారత చారిత్రిక కావ్యం అత్యంత ప్రీతి పాత్రమైనవి .’1-’కన్యా శుల్క నాటకకళ –సాహిత్య తత్త్వం2-శివభారత దర్శనం అనే ప్రముఖ విమర్శ గ్రంథాలు రచించారు .౩ మాలపల్లిపై విమర్శ గ్రంధం మొదలు పెట్టి ,పూర్తి చేయకుండానే మరణించారు .ఇవి విమర్శకులమన్ననలు అందుకున్నాయి పాఠకులకు కరదీపికలయ్యాయి ఏది చెప్పినా అత్యంత సాదికారకతతో చెబుతారు కనుక వారి నిర్ణయాలు శిరోధార్యాలుగా ఉంటాయి .విమర్శమాత్రమేకాక సృజనాత్మక రచనలు కూడా చేశారు .అందులో ‘’పద్మావతీ చరణ చారణ చక్రవర్తి ‘,’’’పగ చిచ్చు’’ నాటికలు ‘’భూ సూక్తం ‘’అనే కథఉన్నాయి .అనేక చర్చా గోస్టులలో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించారు .మచ్చుకికొన్ని –
- బసవేశ్వరుడు కాయకమే కైలాసమనెనా? – ఆంధ్రపత్రిక దినపత్రిక
- భారత,రామాయణ,భాగవతముల ఆద్యంతముల ఆంతర్యము – ఆంధ్రప్రభ దినపత్రిక
- తిక్కన స్త్రీపర్వములోని ఛందోవైవిధ్యములోని ఆంతర్యము – ఆంధ్రప్రభ దినపత్రిక
- వేదవ్యాసుడు బ్రాహ్మణేతరుడా? – భారతి
- కన్యాశుల్కంలో అసభ్యత ఉన్నదా? – భారతి
- హిమలేహ్యం – శేషేంద్రజాలం – భారతి
- మినీకవిత – మాక్సీవ్యాఖ్య – భారతి
- తెలుగు మీద కన్నడ ప్రభావమెంత? – భారతి
- మాలపల్లి పై ఈస్టలిన్ ప్రభావం కలదా? – భారతి
వీరి విమర్శలను ‘’విమర్శ –ప్రతి విమర్శ ‘’పేరుతొ తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ రాచపాలెం చంద్ర శేఖరరెడ్డి సంపాదకత్వం లో ప్రచురించింది .పత్రికలలో వచ్చిన లేఖలు విమర్శలు సేకరించి కొడిహళ్లి మురళీమోహన్ ,నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో ‘’జ్ఞాన సింధు సర్దేశాయ్ తిరుమలరావు ‘’పుస్తకంగా వచ్చింది .
సాహితీ పురస్కారాలు
వీరి సాహిత్య కృషికి శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటి 1969 లో గౌరవ డాక్టరేట్ ఇస్తే ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 1989 లో తిక్కవరపు రామి రెడ్డి పురస్కారమిచ్చి గౌరవించింది .వీరి సాహితీవ్యాసాలు భారతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ,హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి .’’తి’’.,’’తిమ్మణ్ణ’’,పై,థాగరస్ మొ దలైన కలం పేర్లతో రాసేవారు .
.
ఆయన మనసు విజ్ఞాన శాస్త్రానికి , హృదయం సాహిత్యానికి అ౦కిత మయ్యాయి .సాంకేతిక సాహిత్య సవ్య సాచి శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు 1994 మే నెలలో 68 ఏళ్ళకే మరణించటం ఆరెండు రంగాలకు తీవ్రమైన లోటు .
సవ్య సాచి ఆజన్మ బ్రహ్మ చారి
సర్దేశాయిగారు ఆజన్మ బ్రహ్మ చారి అని తెలిస్తే అవాక్కౌతాం .పచ్చినిజం
. ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు లో పావుభాగ౦ వీకేపేడియాలొ సింహభాగం .
15-8-18 బుధవార౦ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-18 –ఉయ్యూరు
.
శ్రీ రామకృష్ణయ్య
—

