గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4
313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )
తెలంగాణాలోని మహబూబ్ నగరం జిల్లా అలంపురం కు చెందినకవి మ౦థాన భైరవుడు10 వ శతాబ్దం వాడు .పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర ఈయనను ‘’తొలి సంస్కృత కవి’’గా పేర్కొన్నది .జైనకవి .తంత్ర గ్రంథాలు ఎక్కువగా రాశాడు .ఈతడు రాసిన’’ భైరవ తంత్ర గ్రంథం’’ సంస్కృత రచన విమర్శకుల,పరిశోధకుల మెప్పు పొందింది . 22 పత్రాల తాళపత్ర గ్రంథం ఇది .సురవరం ప్రతాప రెడ్డిగారు కూడా గోలకొండ పత్రికలో ఈకవి ప్రస్తావన చేశారు .ప్రముఖ కవి పండితులు పరిశోధకులు మానవల్లి రామకృష్ణయ్యగారు తమ కుమార సంభవ పీఠిక లో ఈ గ్రంథాన్ని ప్రశంసించారు. ఈకవి ‘’ఆనంద కందకం ‘’అనే మరొక సంస్కృత రచనకూడా చేసినట్లు శేషాద్రి రమణకవులు తెలిపారు .పరిశోధక చతురానన శ్రీ ఆది రాజు వీరభద్రరావు గారు కూడా ఈకవి గురించి తమ రచనలో ప్రస్తావించారు .ఇందరు ప్రాసిద్ధ కవి విమర్శక పరిశోధకుల ప్రశంస పొందిన మంథన కవి ధన్యుడు .ఇప్పుడు ఈ కవి రచనా సౌభాగ్యం చూద్దాం .
భైరవ తంత్రం లో ప్రారంభ శ్లోకం –‘’శ్రీ హర మహా శాంతం భైరవం భీమ విగ్రహం –నమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాసనం ‘’.
చివరి శ్లోకం –‘’ఏతత్తంత్రం మయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః –ప్రియ శిష్యాయ దాతవ్యం పుత్రాయచ విశేషితః –ఇతి భైరవాగమే భూత తంత్రే సప్త వింశతి పటలః’’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-18 –ఉయ్యూరు

