గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)
25-8-1947న యుపి లో మీర్జాపూర్ జిల్లా భైంసా లో జన్మించిన ప్రభునాథ ద్వివేది ఎంఏ,పిహెచ్ డి.కాశీ విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్ .27గ్రంథాలు రాశాడు .అందులో అంతర్ధ్వని కావ్య౦,శ్రీరామానంద చరిత్రం ,స్వేతదూర్వా ,కథా కౌముది ,మహాకవి హర్షవర్ధన ఉన్నాయి .సంస్కృత మహామహోపాధ్యాయ ,బాణభట్టపురస్కారం ,విక్రమ కాళిదాస అవార్డ్ ,కాదంబరి అవార్డ్ అందుకొన్న ప్రజ్ఞాశాలి .
504-సౌందర్య సప్తశతి కర్త –పండిట్ ప్రేమనారాయణ ద్వివేది (1922-2006)
పండిట్ ప్రేమనారాయణ ద్వివేది 5-6-1922న మధ్యప్రదేశ్ సాగర్ లో పుట్టాడు .ఆచార్య ,కావ్యతీర్ధ ఐన ద్వివేది గురుపరంపర లో ప్రొఫెసర్ రాంజీ ఉపాధ్యాయ ,ప్రొఫెసర్ బిఎం ఆప్టే ,ఆచార్య భయ్యాలాల్ శాస్త్రి ,న్యాయాచార్య భద్రం శాస్త్రి ఉన్నారు .సౌందర్య సప్తశతి,కవితావళి,శ్రీమద్రామ చరిత మానసం ,స్తుతికుసుమమాల ,కావ్య నిర్ఝర అనే అయిదు రచనలు చేశాడు .28-4-2006న 84వ యేట నారాయణ సన్నిధానం చేరాడు .తులసీదాసు తో సహా ప్రముఖ హిందీకవుల రచనలను సంస్కృతం లోకి అనువదించాడు .
505-మానవ నీతి వివేచనం కర్త –రాధేశ్యాం ధార్ ద్వివేది(1944)
ఏం ఏ పిహెచ్ డిఅయిన రాధేశ్యాం ధార్ ద్వివేది యుపి లో సాజాన్ డియోరియా లో 22-7-1944జన్మించాడు .వారణాసి డా సంపూర్ణానంద్ సంస్కృత కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ .గురువులు జగన్నాధ ఉపాధ్యాయ ,సి ఆర్ వి మూర్తి గార్లు .7పుస్తకాలు రాశాడు అందులో మానవ నీతి వివేచనం ఉన్నది
506-స్వరిత సందేశకావ్య కర్త –రహస బిహారీ ద్వివేది (1947)
అలహాబాద్ లో 2-1-1947జన్మించిన రహస బిహారీ ద్వివేది సాహిత్య రత్న ,విద్యా వాచస్పతి ,ఎంఏలిట్ . రాణి దుర్గావతి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ .సంస్కృతం లో 4పుస్తకాలు రాశాడు .అందులో రెండు సందేశకావ్యాలు .-స్వరిత సందేశం ,స్వాతి సందేశం ఉన్నాయి .మిగిలిన రెండు –అర్వాచీన సంస్కృతమహా కావ్యాను శీలనం ,సాహిత్య విమర్శ ,.సంస్కృత మహాకావ్యోం కా ఆలోచనాత్మక అధ్యయనం ,సంస్కృత వాజ్మయం మే విజ్ఞానం కూడా రాశాడు .సాహిత్య శాస్త్ర స్పెషలిస్ట్ .ప్రెసిడెంట్ అవార్డీ.
507-త్రిక దర్శన కర్త –రామచంద్ర ద్వివేది (1951-1993)
1951లో యుపి మణిపురిలో జన్మించి 42ఏళ్ళు మాత్రమె జీవించి 1993లో మరణించిన రామచంద్రద్వివేది యూనివర్సిటి ప్రొఫెసర్ .ముకున్దశాస్త్రి కిస్టే,గౌరీనాధ శాస్త్రి ,ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య అయ్యర్ లవద్ద చదువుకున్నాడు .తా౦త్రిక లోక ,త్రిక దర్శనం, జాతకమాల , ఈశ్వర ప్రత్యాభిజ్ఞ విమర్శిని ,అమర భారతి సంవాద గ్రంథాలు రాశాడు .1987-88లో రాష్ట్రపతి పురస్కారం ,మహారాణా మేవార్ ఫౌండేషన్ నుంచి ‘’హరిత ఋషి’’అవార్డ్ అందుకొన్నాడు
508-అలంకార సర్వస్వ సంజ్ఞాని కర్త –రాం చంద్ర ద్వివేది (1935)
15-6-1935న యుపి ఫరూకాబాద్ లో పుట్టిన రాం చంద్ర ద్వివేది ఎం.ఏ. పిహెచ్ డి ,డిప్లొమా ఇన్ ఫ్రెంచ్ .ఉన్నవాడు .సంస్కృత డిపార్ట్మెంట్ హెడ్ .ప్రోఫెసర్ సుబ్రహ్మణ్య అయ్యర్ ,ప్రొఫెసర్ బటుకా౦త శాస్త్రి లు గురువులు . అలంకార సర్వస్వ సంజ్ఞాని అనే ఒక ఒక పుస్తకం రాశాడు .సాహిత్య ,దర్శనాలలో నిష్ణాతుడు .
509-బౌద్ధ దర్శన తత్వ విమర్శ కర్త –రమేష్ కుమార్ ద్వివేది (1960)
బౌద్ధ విమర్శన తత్వ విమర్శ రాసిన రమేష్ కుమార్ ద్వివేది 23-7-1960న యుపి లోని దేవారియాలో జన్మించాడు .వారణాసి డా సంపూర్ణానంద్ సాస్కృత విశ్వవిద్యాలయప్రొఫెసర్, డీన్ .11పుస్తకాలు రాశాడు –అవి-.బౌద్ధ ధర్మ దర్శన ఏవం ధర్మనిరపేక్షత ,బౌద్ధ దర్శన ఔర మార్క్సవాద ,భారతీయ సంస్కృత ప్రవ్రాజిత నారినామ వదానం ,బౌద్ధ దర్శన తత్వ విమర్శ ,జ్యోతి స్మారికా.
510-శివ సమ్మోహన కావ్యకర్త –రాం కృపాల్ ద్వివేది (1934)
రాం కృపాల్ ద్వివేది 1934ఆగస్ట్ 15యుపి లోని బందా జిల్లా శివ లో పుట్టాడు .సాహిత్య కావ్యతీర్ధ ఐన రాం కృపాల్ ఇంటర్ కాలేజి టీచర్ .సాహిత్య స్పెషలిస్ట్ .నలదమయంతి నాటకం ,మయూర దూతం ,శివ సమ్మోహన కావ్య౦ రచించాడు .
సశేషం
రేపు 5-9-19 గురు సర్వేపల్లి రాధాకృష్ణన్జన్మదినం గురుపూజోత్సవ శుభాకాంక్షలు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-9-19-ఉయ్యూరు

