తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం )
తెలుగులో ప్రింటింగ్ -2
తెలుగులో మొదటి కరపత్రాలు (ట్రాక్స్)1809,1810లలో ఇక్కడినుంచే వెలువడినాయి .మద్రాస్ బైబిల్ సొసైటీ కోసం ‘’ఓల్డ్ టెస్ట్ మెంట్ ‘’ను ‘’వైజాగపట్నం’’ అని ఆనాడు పిలువబడిన విశాఖ పట్నం నుంచే ముద్రించారు .అందులో ఒక వెర్షన్ ను విశాఖకు 1810లో వచ్చిన , జాన్ గార్డెన్ ,1812లో వచ్చిన ఎడ్వర్డ్ పిచ్చెట్టీ లు తయారు చేశారు .ఐతే వీటిని మద్రాస్ లో 1818లో ముద్రించారు .మద్రాస్ కు ఉత్తరాన ఉన్న జెంటూ తెగలు మాట్లాడే జెంటూ భాషకు వ్యాకరణాన్ని 1810లో ప్రింట్ చేశారు. కాని రచయిత పేరు లేదు.దీనినే 1817లో పునర్ముద్రించారు .ఇప్పుడు రచయితపేరు విల్లియం బ్రౌన్ అని తెలియజేశారు .ఈయనే ‘’వొకాబ్యులరి ఆఫ్ జెంటూ అండ్ ఇంగ్లిష్ ‘’ను ఆధునిక జెంటూ భాషమాట్లాడే మధ్యతరగతి ,పైతరగతి వారి వ్రాత, భాషణల కోసం పదాలను తయారు చేసి అందుబాటులోకి తెచ్చాడు .హిందూ పేరే మారి జెంటూ అయి ఉండవచ్చు .కానీ 17వ శతాబ్ది మధ్య కాలానికి జెంటూ భాష తెలుగు భాషగా ,జెంటూ ప్రజలు తెలుగు ప్రజలుగా గుర్తి౦పబడ్డారు .
బళ్లారిలో 1815లో తయారైన ప్రింటింగ్ ప్రెస్ ను బళ్ళారి ట్రాక్ సొసైటీ 1825లో నెలకొల్పింది .ఇది వేలాది మతగ్రంథాలు, కరపత్రాలు ముద్రించింది .ఎ.డి.కాంప్ బెల్ రాసిన రెండు పుస్తకాలను మద్రాస్ లో ముద్రించారు .అందులో ఒకటి ‘’ది గ్రామర్ ఆఫ్ టెలుగూ లాంగ్వేజ్’’,‘’కామన్లి టెర్మెడ్ ది జెంటూ ,పర్టిక్యులర్ టు హిందూస్ ఇన్హాబిటింగ్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ ది ఇండియన్ పెనిన్సులా’’ (1816).రెండవది ‘’ఎ డిక్షనరీ ఆఫ్ టెలుగు లాంగ్వేజ్ కామన్లి టెర్మెడ్ ది జెంటూ ,పర్టిక్యులర్ టు హిందూ ఇన్హాబిటింగ్ ‘’(1821).1818లో ఏర్పడిన ‘’ది మద్రాస్ రెలిజియస్ ట్రాక్ సొసైటీ’’ఆ శతాబ్దం అంతానికి దాదాపు మిలియన్ ట్రాక్స్ తెలుగులో ప్రింట్ చేసి రికార్డ్ సృష్టించింది .
క్రిస్టియన్ సాహిత్యం ,వ్యాకరణం నిఘంటువులు ముద్రించటం తో ఆగిపోకుండా పాఠశాల పుస్తకాలను కూడా ముద్రించటం ప్రారంభించింది ఆ సొసైటీ .చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ మహాశయుడు రచించిన ‘’ది ప్రాసడి ఆఫ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎక్స్ ప్లైన్డ్ ‘’ను కూడా 1827లో ఈ సొసైటీ ప్రింట్ చేసింది .
ఈ విధంగాఇండియాకు వచ్చిన మొదటి మిషనరీ సంస్థలు ,బ్రిటిష్ సివిల్ ఉద్యోగులు తెలుగు ప్రింటింగ్ కు శక్తికొలది సాయం చేసి ,ముఖ్యభూమిక పోషించారు .రత్నగర్భ భారత దేశం లో అన్నపూర్ణ అయిన ఆంద్ర దేశం లో తెలుగులో వార్తాపత్రికలు మొలకెత్తటానికి తెలుగు సాహితీ మాగాణిని చక్కగా దున్ని ,పదును చేసి,పరిపక్వమైన పంటకు ఇతోధిక కృషి చేశారు .
ఆధారం ‘’–హిస్టరీ ఆఫ్ ది ప్రెస్’’ అనే 25 పేజీల ఆంగ్లవ్యాసం .


