ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్
బావా -”నా హేపీ బర్త్ డే అని పేస్ బుక్ లో వాట్సాప్ లో పెట్టాను నీ నుంచి స్పందనే లేదు -బామ్మర్ది నన్న కనికరమూ నీకు లేదు”అన్నాడు బామ్మర్ది బ్రహ్మ0
నేను -అది సరేరా . మీరు పంపే బర్త్ డే లలో ”యు ఆర్ థింకింగ్ ఆఫ్ మై బర్త్ డే ”అని పెడుతున్నారు .నువ్వైతే నాకు తెలుసుకనక బానేఉంది .ప్రతి అడ్డమైన వాడు ఇలా పెడుతుంటే ,వాళ్ళందరి బర్త్ డే లు గుర్తుంచుకోటానికి ,వాళ్ళ బర్త్ డే గురించి ఆలోచించటానికి నాకేంట్రా పని ?”అన్నాను
వాడు-అదొక పధ్ధతి బావా .అది అంతే నువ్వేమీ వర్రీ కాకు
నేను -అలాకాక ఇవాళ నా బర్త్ డే .ఆశీర్వదించండి అనో ,శుభాకాంక్షలు తెలియజేయమనో ఏడవ్వచ్చుగా ?
వాడు -ఇది దొరలపద్ధతేమో బావా ?మక్కీకిమక్కీ మనోళ్లు ఫాలో ఐపోతున్నారు .నాకూ అదే జబ్బు అంటుకుంది
నేను -ఏడిశావు .మంచి వాటిని అనుకరించాలికానీ ఈ బానిస బుద్దు లేంట్రా ?
వాడు -బావోయ్ క్షమించి వదిలేయి . ఇక పంపిస్తే చెప్పుచ్చుకు కొట్టు -అన్నాడు
నేను -అది సరే బర్త్ డే తెలియ జేసేటప్పుడు ప్లీజ్ హెల్ప్ సేలిబ్రేటింగ్ బర్త్ డే అని అఘోరిస్తున్నారెందుకురా? వెళ్లి వాళ్ళ ఇంటికి ఏర్పాట్లు చూడమనా ?డబ్బు ఖర్చుపెట్టమనా ?కేకు కొని తెచ్చి కట్ చేసి నోట్లో కూరమనా ?బుగ్గలు వాచేట్లు బెలూన్లూది కట్టమనా ?
వాడు -ఓరినాయనోయ్ !వేలికేస్తే కాలికి ,కాలికేస్తే వేలికి లాగే ఈలాజిక్ ఎక్కడ పట్టావ్ బావోయ్ ?
నేను -లేకపోతె ఆ హెల్ప్ మాటకి కి పరమార్ధం ఏంట్రా ?
వాడు బాబూ ! అదీ పైనిన్చిదిగుమతైన సరుకే . ఇన్ని అర్దాలు౦టాయని ,నీలాంటోడు కోడిగుడ్డుపై ఈకలు లాగుతాడనీ ఊహించి ఉండరుబావోయ్అన్నాడు బుద్ధి వచ్చింది ఇక ఇలాంటివి నీకు చస్తే పంపించను క్షమించుబా అన్నాడు ..
నేను -ఇదెక్కడి దరిద్రపు కల్చర్ రా తలిదంద్రులకూ ఇలానే పెట్టి పంపిస్తున్నారు ?శుబ్రంగా ఫోన్ చేసి ఇవాళతన బర్త్ డే అనో తనభార్య భర్త్డే అనో ,పిల్లల బర్త్ డే అనో చెప్పి ఆశీర్వదించమని కోరచ్చుగా ?
వాడు -ఇంత చాదస్తం పనికిరాదు ఆదైనాపంపిస్తున్నందుకు సంతోషించాలి
నేను ఈ ధింకింగ్ ,ఈ హెల్ప్ పదాలు లేకుండా ఈ సారి పంపించు లేకపోతె మళ్ళీ తల౦టు తా ” పాపం యెంతో ఆశపడి గ్రీటింగ్స్నికోసం వచ్చావు ”అన్నాను
వాడు – ఇంకేం గ్రీటింగ్స్ బావోయ్ తలవాచిపోయింది అక్క ఇచ్చే కాఫీ తాగకపోతే తల పగిలిపోతుంది అంటూ లోపలి జారుకున్నాడు బామ్మర్ది బ్రహ్మం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్-16-9-19-ఉయ్యూరు

