నిన్న సాయంత్రం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల నుంచి ఫోన్ చేసి ,తాను ఈమధ్య విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,ఆయనరాసి సరసభారతి ప్రచురించిన ”శ్రీ సువర్చలా వాయు నందన శతకం ”తనకు ఇచ్చారని ,ఇంకా రెండు శతకాలు కూడా రాయించి సరసభారతి ప్రచురించినట్లు దానిని బట్టి తమకు తెలిసిందనీ ,ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం సుమారు 300ఏళ్ళనాటిదని తెలిసి ఆనందించానని ,కృష్ణాజిల్లాలో ”పాశ్చాపురం ”లోనూ సువర్చలాన్జనేయ దేవాలయం ఉందని స్వామివార్ల ఫోటో వాట్సాప్ లో పంపిస్తానని చెప్పారు అప్పుడు నేను దర్శనీయ ఆన్జనేయదేవాలయాలురెండుభాగాలుగా 355దేవాలయాల గురించి రాసి ప్రచురించామని చెప్పాను . వారు భద్రాద్రిలోశ్రీరామనవమికి సీతారామకల్యాణం జరగటం లేదని రామనారాయణ కల్యాణం చేస్తున్నారని దానిపై తానూ పుస్తకం రాశాననీ చెప్పారు వారి వ్యాసాలూ బెజవాడ నుంచి శ్రీ లక్ష్మణరావు గారు ప్రచురించిన ”హనుమత్ప్రభ ”పత్రికలో చదివేవాడినని ఆయన ఒంగోలులో నిర్మించిన నవావతార హనుమాన్ దేవాలయం గురించి కూడా రాశానని ,శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు ఆయనగురించి చాలా గొప్పగా నాతో చెప్పేవారని అన్నాను వాట్సాప్ లోఅడ్రస్ పంపిస్తే పుస్తకాలు పంపుతానన్నాను వారు పంపటం నేను వారికి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీ మంకు శ్రీను గార్లు రాసిన శతకాలు ఆ౦జనేయ వైభవం హనుమత్ కదానిది ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు ,గీర్వాణ౦ -3 సిద్ధ యోగిపు౦గవులు మహిళామాణిక్యాలు, దైవ చిత్తం ,కొలచల సీతారామయ్య ,పుచ్చా వెంకటేశ్వర్లు -మొత్తం 13పుస్తకాలు నిన్న సాయంత్రమే కొరియర్ లో పంపగానే రోజు సాయంత్రమే అందినట్లు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అన్నదానం వారు పరాశర సంహిత .,ఆంజనేయ చరిత్రలపై సాధికారత ఉన్నవారు ఆంజనేయస్వామికి కల్యాణం ఎందుకు చేస్తారో పుస్తకం రాశారు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు వెలువరించి రేడియో టివి లలో ప్రసంగాలు చేసిన విద్వద్ వరేణ్యులు. అలాంటివారు నాకు ఫోన్ చేసి మాట్లాడటం మహదానందంగా ఉంది -దుర్గాప్రసాద్ -17-9-19
వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

